Search
  • Follow NativePlanet
Share
» »'దేవతల నివాసం' గా చెప్పబడే హిమాచలప్రదేశ్

'దేవతల నివాసం' గా చెప్పబడే హిమాచలప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉత్తర భారత దేశం లో కలదు. ఇది ఒక గొప్ప పర్యాటక ప్రదేశం కాగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడ పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతోంది.

By Venkatakarunasri

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉత్తర భారత దేశం లో కలదు. ఇది ఒక గొప్ప పర్యాటక ప్రదేశం కాగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడ పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతోంది. జాతీయ ఆదాయానికి ఈ రంగం నుండి అధిక భాగం లభిస్తోంది. టూరిజం రంగం లోని ఈ అభివృద్ధి హిమాచల్ ప్రదేశ్ లో అనేక హోటళ్ళ మరియు రిసార్ట్ ల స్థాపనకు దోహదం చేసింది. పర్యాటకులకు మరింత ఆనందం మరియు చక్కని అనుభూతులను పంచుతోంది

భౌగోళికంగా పరిశీలిస్తే, ఈ రాష్ట్రం తూర్పు వైపు టిబెట్, పడమటి వైపు పంజాబ్, మరియు జమ్మూ & కాశ్మీర్ ఉత్తరం వైపు సరిహద్దులు గా కలిగి వుంది. దేవ భూమి లేదా దేవుళ్ళ భూమి గా చెప్పాబడే హిమాచల్ ప్రదేశ్ పర్యాటకులకు దాని లోని దట్టమైన పచ్చటి లోయలు, మంచు శిఖరాలు, మంచు కొండలు, అందమైన సరస్సులు, పచ్చని పచ్చిక మైదానాలతో ఒక స్వర్గాన్ని తలపిస్తుంది. వాతావరణం ప్రధానంగా, హిమాచల ప్రదేశ్ లో సంవత్సరం లో మూడు కాలాలు కలవు. అవి వసంత కాలం, శీతాకాలం మరియు వర్షాకాలం . వసంత కాలం ఫిబ్రవరి లో మొదలై ఏప్రిల్ మధ్య భాగం వరకూ వుంటుంది. శీతాకాలం అక్టోబర్ లో మొదలై, మార్చ్ చివర వరకూ వుండి సరైన పర్యటనకు అవకాశం కల్పిస్తుంది.

హిమాచల్ ప్రదేశ్ లోని 12 జిల్లాలలోని ప్రతి జిల్లాలోను అనేక ఆకర్షణా ప్రాంతాలు కలవు. సైట్ సీఇంగ్, మతపర ప్రదేశాలు, ట్రెక్కింగ్, పర్వతారోహణ, ఫిషింగ్, రివర్ రాఫ్టింగ్, స్కీయింగ్, పారా గ్లైడింగ్, ఐస్ స్కేటింగ్, గోల్ఫ్ వంటివి ఎన్నో కలవు. హిమాలయాల వెలుపలి భాగంగా చెప్పబడే ధౌళాధర్ సర్క్యూట్ డల్హౌసీ తో మొదలై బద్రినాథ్ తో ముగుస్తుంది. ఈ సర్క్యూట్ కాంగ్రా వాలీ నుండి బాగా కనబడుతుంది. సట్లేజ్ సర్క్యూట్ శివాలిక్ పర్వతాల దిగువ భాగ కొండలను చూపుతుంది. ఈ సర్క్యూట్ లో అందమైన పచ్చని ఆపిల్ తోటలు, పైన్ మరియు దేవదార్ అడవులు , సట్లేజ్ నది వంటివి పర్యాటకులకు ఆనందం కలిగిస్తాయి.

డ్రగ్స్ తీసుకుంటున్న దేవుళ్ళు నమ్మగలరా..?

దేవతల నివాసం

దేవతల నివాసం

'దేవతల నివాసం ' గా చెప్పబడే ఈ రాష్ట్రం లో అనేక హిందూ దేవాలయాలు కలవు. జ్వాలాముఖి, చాముండా, వజ్రేశ్వరి, చిన్తపుర్ని, వైద్యనాధ్, లక్ష్మినారయన్, చౌరాసి దేవాలయాలు వాటిలో కొన్ని. అనేక గురుద్వారాలు మరియు చర్చి లు కూడా రాష్ట్రం లోని వివిధ భాగాల లో కలవు.

ప్రకృతి ప్రేమికులు

ప్రకృతి ప్రేమికులు

ప్రకృతి ప్రేమికులకు గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, పిన్ వాలీ నేషనల్ పార్క్, రేణుక సంక్చురి , పాంగ్ డం సంక్చురి, గోపాల్పూర్ జూ, కుఫ్రి వంటివి ప్రసిద్ధ ప్రదేశాలు. కాంగ్రా ఫోర్ట్, జుబ్బల్ పాలస్, నగ్గర్ కేజల్, కమరు ఫోర్ట్, గోండ్లా ఫోర్ట్, క్రిస్ట్ చర్చి, చాప్స్లీ, వుడ్ విల్లా పాలస్, చైల్ పాలస్ వంటి ప్రదేశాలలో రాచరిక వైభవం చూడవచ్చు.

మ్యూజియం లు మరియు గేలరీలు

మ్యూజియం లు మరియు గేలరీలు

పురాతన రాజుల కాలం నాటి చరిత్రకు సంబంధించిన అనేక మ్యూజియం లు మరియు గేలరీలు కూడా కలవు. వాటిలో స్టేట్ మ్యూజియం, కాంగ్రా ఆర్ట్ గేలరీ, భూరి సింగ్ మ్యూజియం, రోరిచ్ ఆర్ట్ గేలరీ మరియు శోభా సింగ్ ఆర్ట్ గేలరీ లు ప్రధానమైనవి.

 అందమైన అనేక సరస్సులు

అందమైన అనేక సరస్సులు

ప్రశాంతం గా సమయం గడపాలనుకునే వారికి అందమైన అనేక సరస్సులు కలవు. వాటిలో ప్రశార్ లేక్, ఖజ్జాయర్ లేక్, రేణుక లేక్, గోవింద్ సాగర్ లేక్, దళ్ లేక్, పాంగ్ డాం లేక్, పండో లేక్, మని మహేష్ లేక్ మరియు బ్రిఘు లేక్ వంటివి కొన్ని.

ప్రతి ఏటా జరిగే వింటర్ కార్నివాల్

ప్రతి ఏటా జరిగే వింటర్ కార్నివాల్

హిమాచల్ ప్రదేశ్ అనేక ఉత్సవ వేడుకలు కు కూడా ప్రసిద్ధి చెందినది. ప్రతి ఏటా వింటర్ కార్నివాల్ శివరాత్రి, లాదర్చా ఫెయిర్, మిన్జార్ ఫెయిర్, మని మహేష్ ఫెయిర్, ఫులేచ్, కులు దసరా లావి ఫెయిర్, రేణుక ఫెయిర్ , ఐస్ స్కేటింగ్ కార్నివాల్, వంటివి ప్రసిద్ధి. బీర్, మనాలి, బిలాస్పూర్, రోహ్రు వంటి ప్రదేశాలు పర్యాటకులు అభిలషించే సాహస క్రీడలైన ఏరో క్రీడలు...పారా గ్లైడింగ్ మరియు హాంగ్ గ్లైడింగ్ లకు ప్రసిద్ధి.

డ్రగ్స్.. డ్రగ్స్.. డ్రగ్స్..

డ్రగ్స్.. డ్రగ్స్.. డ్రగ్స్..

రెండు తెలుగురాష్ట్రాలలోను కొంతకాలంగా హాట్.. హాట్.. టాపిక్ ఇది.మత్తులో ముంచెత్తిన వార్తలు, కధనాలు, విచారణలు, ప్రసారాలు, విమర్శలు, ఆరోపణలు, బాధితులెవరో,నిందితులేవరు,చట్టాలేమంటున్నాయి.అందాక వెళ్ళిపోయాయి మన కధలు.నిజంగా డ్రగ్స్ అనేది దేశంలో కొత్తేమీకాదు.

గసగసాలు

గసగసాలు

ఎప్పట్నుంచో వున్నదే.ఇప్పటికి చాలాచోట్ల ప్రభుత్వాలే చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటాయి.శివుడే గంజాయి తాగేవాడుకదా.యోగులు సైతం గంజాయి వాడటం లేదా?అసలు మనం వాడే గసగసాల సంగతేంటి?

సాంప్రదాయం

సాంప్రదాయం

పలు వుత్తరాది రాష్ట్రాలలో బంగ్ వాడకం సాంప్రదాయం కాదా.హోలీవంటి వేడుకలలో బహిరంగానే ఇంటిల్లిపాదీ బంగ్ పానకం సేవించరా.అని వాదించేవాళ్ళు బోలెడుమంది.అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకనుకుంటున్నారా?

వాటిస్థలం మహత్యం

వాటిస్థలం మహత్యం

మేటర్లోకొచ్చేస్తున్నాను.రెండు డ్రగ్స్ పుణ్యక్షేత్రాలు,వాటిస్థలం మహత్యమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎక్కడుంది?

ఎక్కడుంది?

హిమాచల్ ప్రదేశ్ లోని కులుమనాలి

దీనికి 60కి.మీ ల దూరంలో వున్న గ్రామం మలానా.ఆ గ్రామ జనాభా దాదాపు 1500ల దాకా వుంటుందేమో.అక్కడికీ భారతీయుల్నికూడా పెద్దగా రానివ్వరు.గ్రామానికి 700కి.మీల దూరంలోనే ఆపేస్తారు.

పుణ్యక్షేత్ర సందర్శన

పుణ్యక్షేత్ర సందర్శన

కేంద్రమే ఇక్కడ గంజాయిపంటను అనుమతించింది.అధికారికంగానే కొన్ని వందల ఎకరాల్లో పండిస్తారు. ప్రపంచంలోకెల్లా అత్యంత శ్రేష్టమైన నాణ్యమైన పంట అందుకే నెదర్లాండ్స్, ఆస్ట్రియా, జెర్మనీ, ఐలాండ్,జెకోస్లోవేకియా తదితర దేశాలకు చెందిన డ్రగ్స్ ప్రేమికులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించటానికి వస్తుంటారు.

పార్వతీనది

పార్వతీనది

మలానాలో ప్రవహించే పార్వతీనది పర్యాటనల పేరిట, టూరిస్ట్ ల పేరిట నెలలతరబడి తిష్టవేస్తారు.డ్రగ్స్.. డ్రగ్స్.. అదేపనే.అక్కడ మన చట్టాలు చట్టుబండలే.

 మరో పుణ్య క్షేత్రముంది.

మరో పుణ్య క్షేత్రముంది.

అది రాజస్థాన్ లోని అజ్మీరుకు 25కి.మీల దూరంలో వుంటుంది.దానిపేరు పుష్కర్.ఇవే కాదు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్, ఋషికేశ్ కూడా డ్రగ్స్ బాండాగారాలే.ఎప్పుడుచూసినా పుష్కర్ లోని సరస్సుకు రోజూ సూర్యోదయహారతి,సూర్యస్తమహారతి ఇస్తూవుంటారు.

విదేశీయాత్రికులు

విదేశీయాత్రికులు

అక్కడి ఆనవాయితీ అది.ఆ హారతి వీక్షణం పేరిట విదేశీయాత్రికులు వచ్చేస్తుంటారు.సరస్సుకు రెండువైపులా హార్మోనియం,తబలా, వయోలియన్ కూడా నేర్పిస్తుంటారు.

సంగీతసాధన

సంగీతసాధన

సంగీతసాధన పేరిట డ్రగ్స్ గందా ఇక ఇక్కడ బ్రహ్మదేవుని గుడి చాలా ఫేమస్.ఇక గోవా, ముంబై,చెప్పనక్కరలేదు.ఇవిడ్రగ్స్ యాత్రికులకు ప్రముఖపర్యటనాస్థలాలు.ఇక్కడ విదేశీయాత్రికులే ఎక్కువగా వుంటారిక్కడ.

సమీపంలో చూడవలసిన ప్రదేశాలు

సమీపంలో చూడవలసిన ప్రదేశాలు

హిమాచల్ స్టేట్ మ్యూజియం మరియు లైబ్రరీ, సిమ్లా

హిమాచల్ స్టేట్ మ్యూజియం లేదా సిమ్లా స్టేట్ మ్యూజియం స్కాండల్ పాయింట్ నుండి 3 కి.మీ.ల దూరంలో కలదు. ఈ మ్యూజియంను 1974లో స్థాపించారు. దీనిలో అందమైన పహారీ , మొఘల్, రాజస్థాని పెయింటింగ్ లు కలవు.

హిమాచల్ స్టేట్ మ్యూజియం మరియు లైబ్రరీ, సిమ్లా

హిమాచల్ స్టేట్ మ్యూజియం మరియు లైబ్రరీ, సిమ్లా

అనేక రాగి కళాకృతులు , ఫొటోగ్రాఫ్ లు, స్టాంపులు కూడా చూడవచ్చు. టూరిస్టులు ఇక్కడ గుప్తా శిలలు, స్టోన్ ప్రతిమలు, కుళ్ళు మాస్క్ లు చూడవచ్చు. లైబ్రరీ లో వివిధ చారిత్రాత్మక పుస్తకాలు, గ్రంధాలు కూడా కలవు. ఈ మ్యూజియం మంగళ వారం నుండి ఆదివారం వరకు ఉదయం 10 గం. నుండి సా. 5 గం. వరకు తెరచి వుంటుంది. సోమవారాలు సెలవు.

జక్కు టెంపుల్, సిమ్లా

జక్కు టెంపుల్, సిమ్లా

జక్కు టెంపుల్ జక్కు కొండపై కలదు. ఇది సముద్ర మట్టానికి 8048 అడుగుల ఎత్తున వుంది, చుట్టూ మంచు శిఖరాలు, లోయలుతో నిండి వుంటుంది. ఇక్కడ నుండి సిమ్లా టవున్ అద్భుతంగా చూడవచ్చు. రిజ్ ప్రదేశానికి సమీపం. ఇందులో లార్డ్ హనుమాన్ ఉంటాడు.

జక్కు టెంపుల్, సిమ్లా

జక్కు టెంపుల్, సిమ్లా

ఈ ప్రదేశం నుండి సూర్యోదయం మరియు సూర్యాస్తమయం అద్భుతంగా వుంటాయి. ఈ ప్రదేశం లో ఎన్నో కోతులు వుంటాయి. ఈ కొండకు ప్రభుత్వం ట్రెక్కింగ్, మౌన్తైనీరింగ్ క్రీడలు చేపడుతుంది. ట్రెక్కింగ్ మార్గం లో అందమైన పైన్ అడవులు చూడవచ్చు. పర్యాటకులు గుర్రాలపై టెంపుల్ చేరవచ్చు. జక్కు హిల్ చేరే వారికి, ట్రెక్కింగ్ చేసే వారికి ఇక్కడి దుకాణాలు చేతి కర్రలను ఇస్తాయి.

 క్రిస్ట్ చర్చి, సిమ్లా

క్రిస్ట్ చర్చి, సిమ్లా

ఇండియా లోని ఉత్తర భాగపు చర్చి ల లో క్రిస్ట్ చర్చి రెండవ పురాతనమైనది. దీనిని 1846 - 1857 లలో నిర్మించారు. రిజ్ ప్రదేశానికి సమీపం. దీనిని కల్నేల్ జే.టి బొలేఉ రూపొందించారు. 1860 లో ఈ చర్చి పై ఒక క్లోక్ టవర్ నిర్మించారు. బ్రిటిష్ పాలనలో అనేక మంది బ్రిటిష్ అధికారులు, ఆస్థాన కవులు ఇక్కడ ప్రార్ధనలు చేసేవారు.

ఎలావెళ్ళాలి?

ఎలావెళ్ళాలి?

హైదరాబాద్ నుండి హిమాచలప్రదేశ్ కు రోడ్డు మార్గం ద్వారా 2రోజులు పడుతుంది.విమానమార్గం ద్వారా 10గంలు పడుతుంది.

pc:google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X