• Follow NativePlanet
Share
» »ఈ గుడిలోని మట్టితో మీ జబ్బులని నయం చేసుకోవచ్చు తెలుసా...!

ఈ గుడిలోని మట్టితో మీ జబ్బులని నయం చేసుకోవచ్చు తెలుసా...!

నంజన్ గూడ్ లోని శివాలయం కర్ణాటక రాష్ట్రంలోనే కాక, దక్షిణ భారతదేశంలో ప్రశస్తి గాంచినది. ఈ చిన్న పట్టణం మైసూర్ నగరానికి కేవలం 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కనుక యాత్రికులు ఈ ప్రదేశాన్ని కూడా సందర్శించటానికి వస్తుంటారు. ఇక్కడ శ్రీ కంఠేశ్వరస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయంలో ఉన్న శివుణ్ణి "నంజున్దేశ్వరస్వామి" గా భక్తులు కొలుస్తారు. ఈ దేవుని పేరు మీదనే ఈ ఊరికి ఆ పేరు వచ్చింది.

అక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానం !

అక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానం !

చరిత్ర

నంజన్ గూడ్ ను మొదట గంగ వంశీయులు పాలించారు. ఆతరువాత హొయసలు, మైసూరు ఒడయార్లు దీనిని పాలించారు. శ్రీరంగపట్నం ను పాలించిన హైదర్ అలీ మరియు టిప్పుసుల్తాన్ కు ఈ ప్రాంతంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

చిత్రకృప : Dineshkannambadi

అక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానం !

అక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానం !

శ్రీకంఠేశ్వరస్వామి దేవాలయం

నంజన్ గూడ్ లో ప్రధాన దర్శనీయ స్థలం శ్రీకంఠేశ్వరస్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని 'శ్రీకంఠేశ్వర' అని కూడా పిలుస్తారు. ఇందులో ప్రధాన దైవం ఆ శివుడే. ఈయనను భక్తులు "నంజున్దేశ్వరస్వామి" అని పిలుస్తారు. ఎక్కడ పిలిచినా, ఎలా కొలిచినా భక్తులను ఆశీర్వదించటానికి వచ్చేది ఆ శివ భగవానుడే. శ్రీకంఠేశ్వరస్వామి దేవాలయం ద్రావిడ శైలి లో నిర్మించబడినది. అందమైన గోపురం, ముందున్న మండప రాతి స్తంభాలపై చెక్కిన ఏనుగులు బొమ్మలు, మైసూర్ ఒడయార్లు గర్భగుడిలో ప్రతిష్టించిన లింగాలు దాని చుట్టూ నయనారులు దివ్య ప్రతిమలు, శివలీల విగ్రహాలు, పార్వతీ నారాయణ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు చూడదగ్గవి. నెమలి వాహనంపై కూర్చున్న శరవణ భవుని తలపై నాగు పాము పడగవిప్పు ఉండటం ఇక్కడి విశేషం. ఇక్కడ ప్రాచీన కాలం నుండి శివభగవానుడు నివాసం ఉన్నట్లు చెబుతారు. శ్రీకంఠేశ్వరస్వామి దేవాలయం గోపురం కర్ణాటక రాష్ట్రంలోని అతిపెద్ద గోపురాలలో ఒకటి.

చిత్రకృప : Barry Silver

అక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానం !

అక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానం !

ఇక్కడి మట్టి ఔషధం తో సమానం. టిప్పు సుల్తాన్ ఇక్కడి మట్టి విశిష్టతను, గొప్పతనాన్ని తెలుసుకొని తన గుడ్డి ఏనుగుకు ఆ మట్టీ ని పట్టీగా వెయింగ్ చూపు తెప్పిస్తాడు. అందుకే టిప్పు ఈ దేవునికి 'హకీం నం జున్దేశ్వర 'అని భక్తిగా పిలిచేవాడట. ఆవిధంగా ఈ దేవాలయానికి జబ్బులను నివారించే శక్తి లేదా మహిమ ఉందని చెబుతారు. ఇక్కడికి ఎక్కువగా నేత్ర సమస్యలతో బాధపడేవారు వస్తుంటారు. టిప్పుసుల్తాన్ తండ్రి హైదర్ అలీ స్వామివారికి పచ్చల హారాన్ని బహుకరించాడని చెబుతారు. అప్పటి నుండి ఈ మట్టిని చర్మరోగ నివారిణి అని కూడా అంటారు. ఆలయ సందర్శన సమయం : ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరుస్తారు. శని, ఆది వారాలలో మరియు ప్రత్యేక దినాలలో సాయంత్రం 6 నుంజి రాత్రి 8 : 30 వరకు తెరుస్తారు.

చిత్రకృప : Apoorva Ramesh

అక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానం !

అక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానం !

ఉత్సవాలు

శ్రీ నీలకంఠేశ్వరస్వామి గుడిలో ఏటా రెండుసార్లు రథోత్సవాలను నిర్వహిస్తారు. వాటిని పెద్ద జాతర, చిన్న జాతర గా జరుపుకుంటారు. ఆ సమయంలో బెంగళూరు, మైసూర్ ప్రాంతాల నుంచే గాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు, యాత్రికులు వస్తుంటారు. రథోత్సవంలో భాగంగా గణపతి, పార్వతి, శ్రీకంఠేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర మరియు చండికేశ్వర స్వామి విగ్రహాలను పురవీధుల్లో ఊరేగిస్తారు.

చిత్రకృప : Prof tpms

అక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానం !

అక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానం !

నంజన్ గూడ్ లో చూడవలసిన ఇతర దర్శనీయ స్థలాలు

కపిల నది, కౌండిన్య నది, చూర్ణావతి నది నదులు కలిసే చోట ఉంది పరుశురామక్షేత్రం. పరుశురాముడు తల్లిని సంహరించిన తరువాత ప్రాయచ్చిత్తం చేసుకోవటానికి ఈ ప్రాంతానికి వచ్చి నదీస్నానం చేసాడని చెబుతారు. గొడ్డలిని శుభ్రపరుచుకొనే క్రమంలో అది శివునికి తాకడం ... పరుశురాముడు వేడుకోవటం ... అందుకు శివుడు ఆలయాన్ని నిర్మించమని అడగటం ... ప్రస్తుతం ఉన్న నంజుండేశ్వరుడు స్థానంలో ఆలయాన్ని నిర్మించడం జరిగిపోతాయి. శ్రీరాఘవేంద్రస్వామి బృందావనం, అయ్యప్పస్వామి దేవాలయం, నంజుంగూడ్ వంతెన మొదలగునవి ఇక్కడి ఇతర సందర్శనీయ స్థలాలు.

చిత్రకృప : Raod07

అక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానం !

అక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానం !

అరటిపండ్లు

నంజుంగూడ్ లో దేవస్థానాలకే కాక అరటిపండ్లను ప్రసిద్ధి. ఇక్కడ లభించే అరటిపండ్లను 'రసబాళె' అని పిలుస్తారు. కేంద్ర ప్రభుత్వం దీనికి భౌగోళిక గుర్తింపునిచ్చింది.

అక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానం !

అక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానం !

వసతి సౌకర్యాలు

నంజుంగూడ్ లో వసతి సౌకర్యాలు - దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే సత్రాలు. ఇక్కడ ప్రవేట్ కాటేజీలు, లాడ్జీలు లు కూడా ఉన్నాయి. అయినా యాత్రికులు మైసూర్ లో స్టే చేయటానికి మొగ్గుచూపుతారు.

చిత్రకృప : Prof tpms

అక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానం !

అక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానం !

రవాణా సౌకర్యాలు

మైసూర్ లో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. మైసూర్ నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంజుంగూడ్ కు సులభంగా చేరుకోవచ్చు. నంజుంగూడ్ లో కూడా స్టేషన్ ఉంది. అయినా ప్రయాణీకులు మైసూర్ కే ప్రాధాన్యత ఇస్తారు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి