Search
  • Follow NativePlanet
Share
» »శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవాలయం, కోటప్పకొండ !!

శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవాలయం, కోటప్పకొండ !!

కొండమీదకు వెళ్ళడానికి మూడు విధాలఒన దారులు ఉన్నాయి. యాత్రీకులు సాధారణంగా శ్రీ రాలజమల్లు రాజు నరసింహరాయలు నిర్మించిన మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. ఈ కొండను ఏకోణం నుండి చూసినా మూడుశిఖరాలు కనపడతాయ

By Mohammad

కోటప్పకొండ గుంటూరు జిల్లా, నరసరావుపేట దగ్గర ఉన్న త్రికూటేశ్వరుని సన్నిధి. చేదుకో కోటయ్య మమ్మాదుకోవయ్యా!...... అంటూ, యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామివారి దేవాలయము ఎప్పుడూ నిర్జనంగా ప్రశాంతంగా ఉంటుంది. రోజువారీ భక్తులరాక పరిమితంగా ఉంటూ కేవలం మహాశివరాత్రి సమయంలో మాత్రం కాలు పెట్టే సందుకూడాలేనంతగా భక్తజనంతో నిండిపోతుంది.

ఇది కూడా చదవండి : తిరుపతి లో ఉన్న ఏకైక శివాలయం ఇదొక్కటే !!

కొండమీదకు పోవడానికి నిర్మించబడిన ఘాటు రోడ్డులో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆలయానికి చేరుకోవచ్చు. నిటారుగా ఉండే ఎలదారిలో కూడా యాత్రికులు ఆలయానికి చేరుకుంటారు. దారి మొత్తం విద్యుద్దీపాలను ఏర్పాటు చేసారు. మార్గమద్యంలో ఉన్న జింకలపార్కు కూడా అభివృద్ధి చేయబడింది. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది.
టెంపుల్ టైమింగ్స్ : ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7:30 వరకు.

మూడుశిఖరాలు

మూడుశిఖరాలు

కొండమీదకు వెళ్ళడానికి మూడు విధాలఒన దారులు ఉన్నాయి. యాత్రీకులు సాధారణంగా శ్రీ రాలజమల్లు రాజు నరసింహరాయలు నిర్మించిన మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. ఈ కొండను ఏకోణం నుండి చూసినా మూడుశిఖరాలు కనపడుతుంటాయి కనుక దీనికి త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు.

చిత్రకృప : T.sujatha

జ్జ్ఞానబోధ

జ్జ్ఞానబోధ

ఈ మూడు శిఖరాలు బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావించబడుతుంటాయి. పురాణకథనాలను అనుసరించి దక్షాయఙం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకుతాను చిన్నబాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో ఖఠిన తపమాచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్ధించి తమకు జ్జ్ఞానబోధ చెయ్యమని కోరాడు.

చిత్రకృప : T.sujatha

శివలింగం అడుగు ఎత్తు కలది

శివలింగం అడుగు ఎత్తు కలది

పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానం ఇస్థానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు. అంతట శివుడు ఈ త్రికూట్రాద్రిమధ్య శిఖరమున బిల్వవనాంతరమున వెలసి వారలకెల్లరకును బ్రహ్మోపదేశము చేసెను. లోపలి లింగము ఒక అడుగు ఎత్తుకలది. ఈ గుడి ఉన్న శిఖరమును రుద్ర శిఖరము అనబడుచున్నది. ఈ రుద్ర శిఖరము పక్కనున్నది విష్ణు శిఖరము.

చిత్రకృప : T.sujatha

గద్దలచోడు

గద్దలచోడు

దక్ష యజ్ఞమున హవిర్భాగములను స్వీకరించిన పాపము పొవుటకై విష్ణువీ శిఖరమున రుద్రిని గూర్చి తపము చేసెను. రుద్రుడు ప్రత్యక్షమై త్రిశూలముతో నేలమీద పొడిచెను. ఆ రంధ్రములనుండి వెంటనే జలము పైకి పొంగి ప్రవహించెను. ఆ జలమున స్నానము చేసి తన్ను ప్రార్ధించిన పాపము పోవునని రుద్రుడు చెప్పెను. విష్ణువట్లు చేసి పాపమును పోగొట్టు కొనెను. యాత్రికులు తొలుత ఈశిఖరమునకుఎక్కి ఇచ్చట తీర్ధమున స్నానమాడి, పాపవినాశనేశ్వరుడుని సేవించి తరువాత కొత్త కోటప్పకొండకు చేరుదురు.

చిత్రకృప : T.sujatha

బ్రహ్మశిఖరము

బ్రహ్మశిఖరము

రుద్ర శిఖరమునకు నైఋతి భాగమునున్న శిఖరమునకు బ్రహ్మశిఖరమనిపేరు. రుద్రవిష్ణుశిఖరములపై స్వయంభువులగు జ్యోతిర్లింగములు వెలయుటయు, ఈశిఖరముపై ఏమియు లేకపోవుటయుకని చింతిల్లి, బ్రహ్మ శివునిగూర్చి తపము చేసి శివుడిని లింగమును ఆవిర్భవింపజేసెను. ఇదియే బ్రహ్మశిఖరము. ఇచ్చట ఈదేవునకే శివరాత్రినాడు అతివైభవముతో తిరునాళ్ళు జరుపుచుందురు.

చిత్రకృప : T.sujatha

ప్రభల సంబరం

ప్రభల సంబరం

శివరాత్రికి ఇక్కడ జరిగే ప్రభల సంభరం అత్యంత పేరు కలిగినది, విశేషమైనదీను. చుట్టుప్రక్కల గ్రామాలనుండి చిన్నపిల్లల చేతులలో చిన్న చిన్న ప్రభలనుండి దాదాపు డెభై ఎనభై అడుగుల వరకూ ఎత్తు గలిగిన ప్రభలు కోటప్పకొండకు శివరాత్రి సంబరాలకు తీసుకొస్తారు. వీటిని ట్రాక్టర్లలో బండ్లలో డప్పులు, బ్యాండు, రికార్డింగ్ డ్యాన్సులతోనూ, పగటి వేషాల వంటి పలు కార్యక్రమములతోనూ తీసుకొస్తారు.

చిత్రకృప : Svpnikhil

కనువిందు

కనువిందు

ఒక్కొక్క ప్రభను ఒక్కొక్క రకంగా అలంకరించి కొండక్రింద పొలాల్లో ఉంచుతారు. ఇవి పెద్దవే వందల సంఖ్యలో ఉంటాయి. చిన్నవయితే లక్షల సంఖ్యలో కనుపిస్తూ, కొండ పైభాగమునుండి చూసేవారికి సముద్రంలో తెరచాపల్లా కనువిందు చేస్తూఉంటాయి.

చిత్రకృప : Pavuluri satishbabu 123

త్రికూట పర్వత దేవాలయము

త్రికూట పర్వత దేవాలయము

త్రికూట పర్వతంఅనే త్రికోటేశ్వరుని సన్నిది కల ఈ దేవాలయ శిఖరము మూడు భాగాలుగా ఉంటుంది.

ఈ క్షేత్రం మొదటి కొండపై ముసలి కోటయ్యగారిగుడి ఉంది. రెండవ కొండ త్రికోటేశ్వరస్వామివారి దేవాలయము కలది. ఇక్కడ ఎర్రగా ఉండే కోతులు ఒక ప్రత్యేకత. ఇక్కడ ఒక పెద్దపుట్ట, నవగ్రహముల దేవాలయము, ద్యాన మందిరము, దేవాలయపు వెనుక బాగమున వసతి గదులు ఉన్నాయి. మూడవ భాగమైన కొండ క్రింద బొచ్చుకోటయ్యగారి మందిరము మరియు కళ్యాణ కట్ట, సిద్ధి వినాయక మందిరములు ఉన్నాయి.

చిత్రకృప : Pavuluri satishbabu 123

పర్యాటక ఆకర్షణలు

పర్యాటక ఆకర్షణలు

కొండమీద ఒక చిన్న సరసును నిర్మించి దాని మద్యలో కాళీయమర్ధన శిల్పాన్ని నిరించి ప్రత్యేక కాంతిప్రసారం చేస్తుంటారు. ఇది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

కృత్రిమ జురాసిక్ పార్క్

కృత్రిమ జురాసిక్ పార్క్

కృత్రిమ జురాసిక్ పార్క్ మరొక పర్యాటక ఆఅర్షణగా ఉంది. ఇక్కడ స్థలమార్పిడి చేయగలిగిన పెద్ద జురాసిక్‌లను ఏర్పాటు చేసారు. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన నెమళ్ళు, పావురాళ్ళు, ఈమోలు మరియు చిలుకలు కూడా ఉన్నాయి. యాత్రీకుల సౌకర్యార్ధం 30 వసతి గదులు కూడా నిర్మించబడ్డాయి.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

ధ్యానమందిరం

ధ్యానమందిరం

యాత్రీక ఆకర్షణలలో మరొకటి ధ్యానమందిరం. ఇక్కడ హోమాలు నిర్వహించబడతాయి. ఇందులో విశాలమైన భోజనశాల కూడా ఉంది. వివిధ పర్యాటక కేంద్రాలను పర్యవేక్షించడానికి వీలుగా రోప్వే మరియు త్రవ్వకాలలో లభించిన అవశేషాలను బధ్రపరచిన మ్యూజియం పర్యాటక ఆకర్షణగా ఉన్నాయి.

వసతి సౌకర్యాలు

వసతి సౌకర్యాలు

కొండపై తిరుమల దేవస్థానమువారి సత్రము, గవర్నమెంటువారి రెస్ట్ హవ్స్ ఉన్నాయి. క్రింది భాగమున సామాన్యులకొరకై చాలా కాలముక్రితం నిర్మించిన బసవ మందిరము సేవలందిస్తూ ఉండెడిది. ఇప్పుడిప్పుడే కుల ప్రాతిపదికగా పలు సత్రములు నిర్మాణకార్యక్రమములలోనూ, అతి తక్కువగా పూర్తి అయినవీ ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

రవాణా సౌకర్యాలు

కోటప్పకొండకు దగ్గరలో కల నరసరావుపేట పాత బస్ స్టాండు, కొత్త బస్ స్టాండుల నుండి ప్రతి అరగంటకు ఇక్కడకు బస్సు ఉంది. ఇవేకాక ప్రవేట్ వాహనములు కూడా ఈ దారిలో ప్రయాణిస్తుంటాయి. కొండ పైకి వెళ్ళుటకు బస్సులు, జీపులు, ఆటోలు దొరకుతాయి.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X