Search
  • Follow NativePlanet
Share
» »శ్రీకాళహస్తీశ్వర లింగ రహస్యమేంటి ?

శ్రీకాళహస్తీశ్వర లింగ రహస్యమేంటి ?

By Venkatakarunasri

శ్రీకాళహస్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో ఒక పట్టణము మరియు ఒక మండలము. ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన మరియు పంచభూతలింగము లలో నాల్గవ దైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము.

ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలుగా, విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల యొక్క పనితనానికి కాణాచిగా నిలుస్తాయి. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం కూడా ప్రధాన ఆకర్షణే. కళంకారీ కళకు కాళహస్తి పుట్టినిల్లు.

శ్రీకాళహస్తీశ్వర లింగ రహస్యమేంటి ?

శ్రీకాళహస్తీశ్వరుడు

శ్రీకాళహస్తీశ్వరుడు

సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగము, లింగమునకెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశీ ' అని అంటారు.

pc: Krishna Kumar Subramanian

2. శ్రీకాళహస్తీశ్వరుడు

2. శ్రీకాళహస్తీశ్వరుడు

ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం.

pc: youtube

3. శ్రీకాళహస్తీశ్వరుడు

3. శ్రీకాళహస్తీశ్వరుడు

వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన దూర్జటి) వంటి వారి కథలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.

pc: youtube

4. శ్రీకాళహస్తీశ్వరుడు

4. శ్రీకాళహస్తీశ్వరుడు

కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు . అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడా నెత్తురు కారటం మొదలయింది.

pc: youtube

5. శ్రీకాళహస్తీశ్వరుడు

5. శ్రీకాళహస్తీశ్వరుడు

భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు. ఈ దేవాలయము చాలా పెద్దది, పై కప్పుపై రంగులతో చిత్రించిన అనేకములయిన చిత్రములు ఉన్నాయి.

pc: youtube

6. శ్రీకాళహస్తీశ్వరుడు

6. శ్రీకాళహస్తీశ్వరుడు

" మణికుండేశ్వరాఖ్య " అనే మందిరమువున్నది. కాశీ క్షేత్రములో వలె ఇక్కడ చనిపొయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారకమంత్రమును ఉపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకము.

pc: youtube

7. శ్రీకాళహస్తీశ్వరుడు

7. శ్రీకాళహస్తీశ్వరుడు

దేవాలయ ప్రాంతములోనే పాతాళ విఘ్నేశ్వరాలయము ఉంది. దేవాలయమునకు సమీపములోగల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయము రాజగోపురము యొక్క సింహద్వారము దక్షిణాభిముఖము. స్వామి వారు ఉత్తరాభిముఖులై వుంటారు.

pc: youtube

8. శ్రీకాళహస్తీశ్వరుడు

8. శ్రీకాళహస్తీశ్వరుడు

ఆదిశంకరులు ఇక్కడ శ్రీ చక్రము స్థాపించారు. ఈ క్షేత్రమునకు గల ఇతర నామములు దక్షిణకైలాసమనియు, సత్య మహా భాస్కరక్షేత్రమనియు, సద్యోముక్తిక్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనటం జరిగింది. మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది.

pc: youtube

9. శ్రీకాళహస్తీశ్వరుడు

9. శ్రీకాళహస్తీశ్వరుడు

శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం.

pc: youtube

10. శ్రీకాళహస్తీశ్వరుడు

10. శ్రీకాళహస్తీశ్వరుడు

పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు) గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది.

pc: youtube

11. శ్రీకాళహస్తీశ్వరుడు

11. శ్రీకాళహస్తీశ్వరుడు

కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగము, చిదంబరంలో ఆకాశలింగము). స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు.

pc: youtube

12. శ్రీకాళహస్తీశ్వరుడు

12. శ్రీకాళహస్తీశ్వరుడు

కరుణాసముద్రుడు, భాక్తపరాదీనుడు జగత్రక్షకుడు అయిన పరమేశ్వరుడు మూగజీవాలకి,మూగ భక్తికి ముక్తిని అనుగ్రహించిన క్షేత్రం శ్రీకాళహస్తి. ఆదిదేవునిలో ఐక్యమయిన సాలెపురుగు,పాము,ఏనుగుల పేరిట శ్రీకాళహస్తిగా ఇది జగత్ ప్రసిద్ధి పొందింది.

pc: youtube

13. శ్రీకాళహస్తీశ్వరుడు

13. శ్రీకాళహస్తీశ్వరుడు

సృష్టికర్త అయిన చతుర్ముఖేశ్వరుడు ఈ క్షేత్రంలోని పంచముఖేశ్వరుడిని ఆరాధించి తరించాడని ఐతిహ్యం.ప్రముఖ శివక్షేత్రాలలో ఒకటిగా శ్రీ కాళహస్తిని ఆరాధిస్తారు. శ్రీకాళహస్తిలోని స్వామి వారు స్వయంభూ.

pc: youtube

14. శ్రీకాళహస్తీశ్వరుడు

14. శ్రీకాళహస్తీశ్వరుడు

ఈ విధమైన లింగాకృతి మరెక్కడా లేకపోవటం విశేషం. మూగ జీవుల్ని తనలో ఐక్యంచేసుకున్న స్వామి వాటి రూపంలోనే ఇక్కడ వెలిసాడని అంటారు. ఈ కాలహస్తీశ్వర లింగానికి అడుగుభాగంలో శ్రీ అంటే సాలెపురుగు, పై భాగాన కాళం,అంటే 5 శిరస్సుల పాము, మధ్యభాగాన హస్తి అంటే ఏనుగు దంతాలు దర్శనమిస్తాయి.

pc: youtube

15. శ్రీకాళహస్తీశ్వరుడు

15. శ్రీకాళహస్తీశ్వరుడు

అభిషేక సమయాల్లో స్వామివారి నిజరూప దర్శనాన్ని దర్శించటం మోక్షప్రాప్తికి మూలమని భక్తులు విశ్వస్తిస్తారు. స్వామివారి లింగాకృతి మధ్యభాగంలో నవగ్రహ కవచం వుంది.ఇందులో సూర్యచంద్రాది 9 గ్రహాలు, అశ్వని,భరణి వంటి నక్షత్రాలు పొందుపరచి వుంటాయి.

pc: youtube

16. శ్రీకాళహస్తీశ్వరుడు

16. శ్రీకాళహస్తీశ్వరుడు

శ్రీకాళహస్తి క్షేత్రంలోనే పవిత్రలింగమూర్తిని దర్శిస్తే సర్వదోష నివారణ సంప్రాప్తమౌతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జ్ఞాన ప్రసూనాంబగా అమ్మవారు ఇక్కడ వెలిశారు.

pc: youtube

17. ప్రయాణ సౌకర్యాలు

17. ప్రయాణ సౌకర్యాలు

శ్రీకాళహస్తి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన తిరుపతికి ముఫ్ఫై ఎనిమిది కి.మీ.ల దూరంలో నెల్లూరుకు సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది.

18. బస్సు ప్రయాణం

18. బస్సు ప్రయాణం

తిరుపతి నుంచి ఇక్కడికి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని ముఖ్య పట్టణాల నుండి ప్రతిరోజు బస్సు సదుపాయం ఉంది.

pc: youtube

19. రైలు ప్రయాణం

19. రైలు ప్రయాణం

గూడూరు-తిరుపతి దక్షిణ రైలు మార్గంలో శ్రీకాళహస్తి రైల్వే స్టేషను ఉంది. గూడూరు చెప్పుకోదగ్గ జంక్షన్ కాబట్టి చాలా రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. గూడూరు రైల్వే స్టేషను నుంచి తిరుమలకు ప్రతి అర్థగంటకు ఒక బస్సు ఉంటుంది.

pc: youtube

20. విమాన ప్రయాణం

20. విమాన ప్రయాణం

ఇక్కడకి దగ్గరలోని విమానాశ్రయం తిరుపతి దగ్గరలోని రేణిగుంట. కానీ అక్కడకు విమానాలు ఇంకా ప్రతిరోజూ లేవు. కనుక చెన్నై, విజయవాడ లేదా బెంగళూరు లకు వచ్చి అక్కడ నుండి రోడ్డుమార్గములో రావచ్చు.

pc: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X