Search
  • Follow NativePlanet
Share
» »పక్క చూపులు చూస్తున్న ‘స్వామి’ ఉన్న క్షేత్ర సందర్శనతో మీరు అలా పిలిపించుకొంటారు

పక్క చూపులు చూస్తున్న ‘స్వామి’ ఉన్న క్షేత్ర సందర్శనతో మీరు అలా పిలిపించుకొంటారు

స్తంభాద్రిగుట్ట నరసింహస్వామి దేవాలయం గురించి.

By Kishore

భారత దేశంలో ఒక్కొక్క దేవాలయానిది ఒక్కొక్క ప్రత్యేకత. ఆయా క్షేత్ర సందర్శనం వల్ల ఒక ప్రత్యేక మైన ప్రయోజనం ఉంటుంది. ఇటువంటి కోవకు చెందినదే తెలంగాణలోని ఓ ప్రముఖ దేవాలయం. ఈ దేవాలయం సందర్శన వల్ల సంతానం లేని వారి ఇంట గంపెడుసంతానం కలుగుతుందని చెబుతారు. తమ కోరిక నెరవేరడం కోసం కోసం ఇక్కడ ఉన్న రాతి స్తంభానికి దారంతో తమను తాము కొద్ది సేపు కట్టేసుకొని మొక్కు చెల్లించుకొంటారు. ఈ ఆలయంలోని విగ్రహం నుంచి ధ్వజస్తంభం వరకూ ప్రతి ఒకటీ ప్రత్యేకమే. ఇప్పుడిప్పుడే ఈ పుణ్యక్షేత్రం ప్రాచుర్యం పొందడానికి స్థానిక ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో.

నాకు అది చేయాల్సిందేనని హఠం చేసిన 'స్వామి' ఏమి తింటున్నాడో తెలుసానాకు అది చేయాల్సిందేనని హఠం చేసిన 'స్వామి' ఏమి తింటున్నాడో తెలుసా

1. లోకపాలకుడు

1. లోకపాలకుడు

P.C: YouTube

హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణువు లోక పాలకుడు. సాదుపరిరక్షణ, దుష్ట శిక్షణ కొరకు ఆయన ప్రతి యుగంలో ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు.

2. ముఖ్యమైనవి 21

2. ముఖ్యమైనవి 21

P.C: YouTube

అలాంటి అవతారాల్లో 21 ముఖ్య అవతారాలు ఉన్నాయి. వాటిని ఏక వింశతి అవతారాలు అంటారు. ఈ 21లో కూడా అతి ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అని పేర్కొంటారు.

3. నాల్గవ అవతారమే

3. నాల్గవ అవతారమే

P.C: YouTube

ఇక ఈ పది అవతారాల్లో నాల్గవ అవతారమే నారసింహావతారం. మహాలక్ష్మిని సంబోధించే శ్రీ పదాన్ని చేర్చి శ్రీనారసింహుడిగా ఈ అవతారమూర్తిని భక్తులు స్మరిస్తారు.

4. గుహలో వెలిసాడు

4. గుహలో వెలిసాడు

P.C: YouTube

శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో హిరణ్యకశిపుడనే రాక్షసుడిని సంహరించి ఆయన కుమారుడైన ప్రహ్లాదుడిని రక్షించిన విషయం తెలిసిందే. ఆ రోజు స్తంభం నుంచి ఉద్భవించిన స్వామి ఈ కొండ పై ఉన్న గుహలో వెలిసాడని చెబుతారు.

5. స్తంభాద్రి అనే పేరు కూడా

5. స్తంభాద్రి అనే పేరు కూడా

P.C: YouTube

అందుచేతనే కొండకు స్తంభాద్రి అనే పేరు వచ్చిందని చెబుతారు. అంతే కాకుండి ఈ కొండ మొత్తం ఒక స్తంభం ఆకారంలో ఉండటం వల్ల ఈ పట్టణానికి స్తంభాద్రి అనే పేరు వచ్చిందని చెబుతారు.

6. అనేక ప్రత్యేకతలు

6. అనేక ప్రత్యేకతలు

P.C: YouTube

మరోవైపు ఈ పట్టణాన్ని మొదట్లో కంభంమెట్టు అనే పేరు ఉండేది. ఇది కాలక్రమంలో ఖమ్మంగా వాడుకలోకి వచ్చిందని చెబుతారు. ఈ ఆలయం అనేక ప్రత్యేకతలకు నిలయం.

7. దక్షిణాభిముఖంగా

7. దక్షిణాభిముఖంగా

P.C: YouTube

సాధారణంగా తూర్పు లేదా ఉత్తరదిశలకు దేవాలయం ప్రధాన ద్వారాలు ఉంటాయి. అయితే ఇక్కడ నరసింహస్వామి గర్భగుడి దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఇలా దక్షిణాభిముఖంగా ఉన్న దేవాలయాలు చాలా అరుదుగా చూస్తాం.

8. స్వయంభువుడు

8. స్వయంభువుడు

P.C: YouTube

ఎతైన కొండ పై వెలిసిన నరసింహమూర్తి స్వయంభువుడిగా పేర్కొంటారు. అసలు ఆ రాయి ఏ రకానికి చెందినదన్న విషయాన్ని ఇప్పటి వరకూ ఎవరూ కనుగొనలేకపోయారు.

9. ప్రాచీన శిల్ప కళ

9. ప్రాచీన శిల్ప కళ

P.C: YouTube

అయితే అది భూమి నుంచి స్వయంగా పైకి వచ్చిందని ఇది జరిగి కొన్ని లక్షల సంవత్సరాలు అయ్యిందని మాత్రం చెబుతారు. ఆలయంలోని శిల్పశైలి కాకతీయుల శిల్పకళను కొద్దిగా పోలి ఉన్నప్పటికీ అంతకంటే చాలా పురాతనమైనదని కార్బన్ డేటింగ్ ద్వారా కనుకొనబడింది.

10. అంతే ఎత్తు

10. అంతే ఎత్తు

P.C: YouTube

సాధారణంగా ఏ దేవాలయంలోనైనా గర్భగుడికి ముందున్న ధ్వజస్తంభం చాలా ఎత్తుగా ఉంటుంది. అంతేకాకుండా గుండ్రంగా ఉంటుంది. అయితే ఈ ఆలయం లోని ధ్వజస్తంభం గర్భగుడి ఎంత ఎత్తుగా ఉంటుందో అంతే ఎత్తు ఉంటుంది.

11. గుండ్రంగా ఉండదు

11. గుండ్రంగా ఉండదు

P.C: YouTube

ఇక ధ్వజస్తంభం గుండ్రంగా కాకుడా నలుపలకలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ధ్వజస్తంభం మూలవిరాట్టుకు ఖచ్చితంగా ఎదురుగా ఉంటుంది. అయితే ఇక్కడ ధ్వజస్తంభం మూలవిరాట్టు విగ్రహానికి కొంత ఎడమవైపు ఉంటుంది.

12.ఓ వైపునకు చూస్తూ ఉండటం

12.ఓ వైపునకు చూస్తూ ఉండటం

P.C: YouTube

స్వామివారి చూపు నేరుగా కాక ఓ వైపునకు చూస్తూ ఉండటం వల్లే ధ్వజస్తంభాన్ని అక్కడ ఏర్పాటు చేశారని స్థానిక పూజారులు చెబుతారు. ఇదిలా ఉండగా గర్భగుడిలోని మూల విరాట్టుకు ఎదురుగా ఒక రాతి స్తంభం భూమిలో నిలువుగా పాతిపెట్టబడి ఉంది.

13.కోడె స్తంభం

13.కోడె స్తంభం

P.C: YouTube

దీనికి మధ్యలో ఒక గంట కూడా కనిపిస్తుంది. దీనిని మొక్కుబడులు తీర్చుకొనే కోడె స్తంభంగా పేర్కొంటారు. వివిధ కోర్కెలతో ముఖ్యంగా సంతానం కోసం పరితపించేవారు ఈ స్తంభానికి తమను తాము దారంతో కొంతసేపు కట్టేసుకొంటే ఫలితం ఉంటుందని చెబుతారు.

14.వారే ఎక్కువ

14.వారే ఎక్కువ

P.C: YouTube

అందువల్లే పెళ్లైన కొత్త జంటలు, సంతానం లేని వారు ఎక్కువగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. తద్వారా తమ కోర్కెలను స్వామి వారు మన్నించి సంతానం కలిగేలా దీవిస్తాడని భక్తుల నమ్మకం.

15.పానకంతో అభిషేకం

15.పానకంతో అభిషేకం

P.C: YouTube

ఖమ్మం గట్టు నరసింహస్వామికి పానకంతో అభిషేకం చేయడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితి. అత్యంత ఉగ్రరూపుడైన స్వామివారిని శాంతింపజేసేందుకు పానకంతో అభిషేకం చేస్తారని స్థానిక పూజారులు చెబుతున్నారు.

16.పార్కు ప్రధాన ఆకర్షణ

16.పార్కు ప్రధాన ఆకర్షణ

P.C: YouTube

దేవాలయం ఆవరణంలో ఉన్న విశాలమైన పార్కు ప్రధాన ఆకర్షణ. భక్తిభావంతోనే కాకుండా ప్రశాంత వాతావరణాన్ని అనుభవించేందుకు కూడా ఈ స్తంభశిఖరి అత్యంత అనుకూలమైన ప్రాంతం.

17. ఆంజనేయుడు

17. ఆంజనేయుడు

P.C: YouTube

దక్షిణాభిముఖంగా ఉన్న స్వామివారి ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి. అందువల్లే దీనిని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా చెబుతారు. ఇక ఇక్కడ ఉన్న గరుడ విగ్రహం కూడా చూడ ముచ్చటగా ఉంటుంది.

18. సర్పదోష నివారణ

18. సర్పదోష నివారణ

P.C: YouTube

ఈ ఆలయంలో స్వామివారికి పూజలు చేసి ముడపుగా సర్పశిలలు సమర్పిస్తే ఫలితం సర్పదోష నివారణ జరుగుతుందని భక్తులు నమ్ముతారు. అందువల్లే ఇక్కడ అటువంటి శిలలు ఎన్నో కనిపిస్తాయి.

19.ఇలా వెళ్లవచ్చు

19.ఇలా వెళ్లవచ్చు

P.C: YouTube

వివిధ ప్రాంతాల నుంచి ఖమ్మం పట్టణానికి రైలు, బస్సు సర్వీసులు ఉన్నాయిన. హైదరాబాద్ నుంచి ఈ క్షేత్రానికి 195 కిలోమీటర్లు కాగా విజయవాడ నుంచి 125 కిలోమీటర్లు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X