• Follow NativePlanet
Share
» »కింది చెరువు నుంచి పై చెరువుకు నీళ్లు...మధ్యలో కొండ ఏమిటి ఆ రహస్యం

కింది చెరువు నుంచి పై చెరువుకు నీళ్లు...మధ్యలో కొండ ఏమిటి ఆ రహస్యం

Written By: Beldaru Sajjendrakishore

రాజులు, రాచరికాలు చరిత్ర గర్భంలో కలిసిపోయినా వాటికి నిదర్శనాలైన కోటలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. అందులో ఒకటి చంద్రగిరి కోట. తిరుపతి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చంద్రగిరి కోట ప్రముఖ పర్యాటక కేంద్రంగా అలరిస్తోంది. ఇక ఈ కోట నిర్మాణంలో అప్పటి రాజులు చూపించిన వ్యూహాలు అబ్బుర పరుస్తాయి. అంతే కాకుండా సాంకేతికతకు హాట్స్ఆఫ్ చెప్పకుండా ఉండలేము. ముఖ్యంగా కొండ పై ఉన్న రెండు చెరువులకు కింద ఉన్న పెద్ద చెరువు నుంచి నీళ్లను ఎటువంటి యంత్రం, పైపుల సహాయం లేకుండా పంపించడం మనలను అబ్బుర పరుస్తుంది.

విగ్రహానికి చర్మం

పురుషులకు ఈ పుణ్యక్షేత్రల్లోకి ప్రవేశం నిషిద్ధం

వారికి ఈ పర్యటక ప్రాంతాలు అంటేనే ఎక్కువ ఇష్టం

1.శత్రు దుర్భేధ్యమైన కోట

1.శత్రు దుర్భేధ్యమైన కోట

Image source:

శత్రు దుర్భేధ్యమైన చంద్రగిరి కోటను అర్థ చంద్రాకారంగా ఉన్న కొండ పాదభాగంలో నిర్మించడం వల్ల దీనికి చంద్రగిరి కోట అనే పేరు వచ్చింది. ఈ కోట నిర్మాణంలో వాటిని సాంకేతిక ఇప్పటి అత్యాధునిక ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఏమాత్రం తీసిపోదని తెలుస్తోంది. ఇక ఈ కోట నిర్మాణంలో వాడిన వ్యూహాత్మత మూలంగా శత్రు రాజులు అంత త్వరగా ఈ కోటను జయించడానికి వీలు కాకుండా ఉంది.

2. కొండ పాద భాగంలో

2. కొండ పాద భాగంలో

Image Source:

ముఖ్యంగా కొండ పాదభాగంలో ఈ కోటను నిర్మించడం వల్ల ఒక వైపు కొండ సహజసిద్ధంగా రక్షణ కల్పించినట్లవుతుంది. ఈ వైపు నుంచి శ్రతురాజులు ఈ కోటలోకి ప్రవేశించడం దాదాపు అసాధ్యం. ఇక కొండ దగ్గరగా ఉండటం వల్ల ఈ కొండపైకి ఎక్కితే దూరంగా వచ్చే వారి కదలికలను కూడా సులభంగా గుర్తు పట్టవచ్చు. కోట చుట్టూ దాదాపు ఒకటిన్నర కిలోమీటరు మేర చాలా దృఢమైన గోడ ఉంటుంది.

3. ఎలా రాళ్లను వినియోగించారు?

3. ఎలా రాళ్లను వినియోగించారు?

Image Source:

చాలా పెద్ద పరిమాణంలో ఉండే రాళ్లను ఇందుకోసం వినియోగించాలరు. అంత ఎత్తు, పొడవు ఉండే కోట గోడకు పెద్ద పరిమాణంలో ఉన్న రాళ్లను వినియోగించడం సాంకేతిక పరంగా అంతగా ఎదగని ఆ కాలంలో ఎలా సాధ్యమయ్యిందన్న విషయం ఇప్పటికీ అంతుపట్టడం లేదు. ఇక కోట గోడను అనుసరిస్తు ఒక వైపునకు కందకం ఉంది. అప్పట్లో ఈ కందకంలో మొసళ్లను వదిలేవారని తెలుస్తోంది.

4. చాలా వ్యూహాత్మకంగా

4. చాలా వ్యూహాత్మకంగా

Image Source:

ఈ మొత్తం వివరాలన్నీ చదివితే మనకు అక్కడి స్థానిక పరిస్థితులను చక్కగా మలుచుకుని శత్రు దుర్భేధ్యమైన కోట నిర్మాణం చేయడమే కాకుండా శత్రు వర్గాల పై నిఘా కూడా వహించేలా రాజులు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు అర్థమవుతోందని చరిత్రకారులతో పాటు పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా వారు చూపిస్తున్నారు.

5. కృష్ణదేవరాయలు కాలంలో

5. కృష్ణదేవరాయలు కాలంలో

Image Source:

విజయనగర సామ్రాజ్యం ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ముఖ్యంగా కృష్ణదేవరాయలు కాలంలో చంద్రగిరి కోట ఒక వెలుగు వెలిగింది. కృష్ణదేవరాయలు తిరుమలను సందర్శించినప్పుడు ఇక్కడే విడిది చేసేవారు. క్రీ.శ 1585లో విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత దక్కన్ ప్రాంత ముస్లీం రాజుల సమాఖ్య చేతిలోకి వచ్చింది. ఆ సమయంలో విజయనగర రాజులు తమ రాజ్య రాజధానిని మొదట పెనుకొండకు అటు పై చంద్రగిరికి మార్చారు.

6. ఆయనే చివరి వ్యక్తి

6. ఆయనే చివరి వ్యక్తి

Image Source:

ఇందుకు సంబంధించిన చారిత్రాత్మక ఆధారాలు కూడా మనకు లభిస్తున్నాయి. ఇక చెన్నపట్నం అంటే ప్రస్తుతం మనం పిలిచే చెన్నైలో కోటను నిర్మించుకోవడానికి బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతి ఇచ్చినది విజయనగర రాజు పెద వేంకట రాయులు. ఈయనే చంద్రగిరి నుంచి విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన చివరి రాజు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇప్పటికీ మనం చంద్రగిరి కోటలో ఉన్నమ్యూజియంలో చూడవచ్చు.

7. అది అద్భుతమైనది

7. అది అద్భుతమైనది

Image Source:

ఇక ఈ కోటలో ఉన్న అద్భుతం గురించి తెలుసుకుందాం. కొండ పై భాగంలో రెండు చిన్న చెరువులు ఉంటాయి. అదే విధంగా కోట కింద భాగంలో అంటే కొండ కిందన ఒక పెద్ద చెరువు ఉంటుంది. సైనిక, రాణివాసపు అవసరాల కోసం కింది చెరువు నుంచి పైన ఉన్న చెరువుకు నీటిని పంపించే వారు. ఒక్క మాటలో చెప్పాలంటే గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఎత్తిపోతల పథకం అన్నమాట.

8. అతి గోప్యం అందుకే

8. అతి గోప్యం అందుకే

Image Source:

అయితే ఇందుకు సంబంధించిన సాంకేతికతను అతి గోప్యంగా ఉంచారు. ఈ విషయం ఇప్పటికీ మ్యూజియంలో ఉంది. బహుషా యుద్ధ సమయంలో శత్రు రాజులు నీటి సరఫరాను విచ్ఛిన్నం చేయకుండా సదరు సాంకేతికను అతి రహస్యంగా ఉంచి ఉంటారని పురాతన శాఖ అధికారులు చెబుతున్నారు. దీనితో పాటు యుద్ధ తంత్రాలకు సంబంధించిన అనేక విషయాలు కూడా ఇక్కడి శాసనాల్లో మనకు కనిపిస్తాయి.

9. రాణీ మహల్, రాజ్ మహల్

9. రాణీ మహల్, రాజ్ మహల్

Image Source:

ఇక కోటలో చూడదగినది రాణీమహల్, రాజ్ మహల్. రాణీ మహల్ రెండు అంతస్తులు కలిగి ఉంటే రాజ్ మహల్ మూడు అంతస్తులతో అందంగా కనిపిస్తుంది. రాణీ మహల్ నిర్మాణాన్ని అనుసరించి అది గుర్రపు శాల కావచ్చునని పురాతన శాఖ అభిప్రాయపడుతోంది. ఇందుకు సంబంధించిన బోర్డు కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. రాణీ మహల్ వెనుక వైపున కొంచెం దూరంలో ఒక దిగుడు బావిని కూడా మనం చూడవచ్చు.

10. మొదటి అంతస్తును మ్యూజియంగా

10. మొదటి అంతస్తును మ్యూజియంగా

Image Source:

దీని నుంచే అంత:పురం అవసరాలకు మంచినీటిని సరఫరా చేసేవారు. ఇందులోనికి నీరు వర్షంతో పాటు దగ్గర్లో ఉన్న చెరువువల నుంచి కూడా వచ్చి చేరేలా నిర్మాణం చేశారు. ఇక ఈ బావికి పక్కగా మరణ శిక్ష పడ్డ ఖైదీలకు ఉరిని అమలు చేసేవారు. అందుకు అనుగుణంగా ఆరు స్తంభాలను వాటికి ఉక్కు రింగులను కూడా మనం చూడవచ్చు. ఇక రాజమహల్ మొదటి అంతస్తును మ్యూజియంగా మార్చారు.

11. మిగిలిన శిల్పాలు

11. మిగిలిన శిల్పాలు

Image Source:

ముస్లీం పాలకులు నాశనం చేయగా మిగిలిన శిల్పాలను, చంద్రగిరి వైభవాన్ని తెలిపే శాసనాలను ఇక్కడ పొందుపరిచారు. పర్యాటకులు వీటిని నేరుగా చూసే అవకాశం కూడా ఉంది. ఇక రెండవ అంతస్తులో సింహాసనాలతో కూడిన రాజ దర్భారును మనం చూడవచ్చు. మూడవ అంతస్తులో అప్పటి కోట నమూనా, ప్రజల జీవన విధానం తదితరాలను పర్యాటకుల కోసం ప్రదర్శనగా ఉంచారు.

12. ఉద్యానవనాన్ని పెంచారు

12. ఉద్యానవనాన్ని పెంచారు

Image Source:

అదే విధంగా కోటలో కాళీగా ఉన్న ప్రదేశంలో చెట్లను పెంచారు. తద్వారా పర్యాటకుల మనస్సుకు ఆహ్లాదం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్ మహల్ వెనుక వైపున ఖాళీ ప్రదేశంలో పెద్ద ఓపెన్ థియేటర్ ను ఏర్పాటు చేశారు. ఇందులో సౌండ్, లైంటింగ్ , లేజర్ తదితర ప్రదర్శనలను ఏర్పాటు చేస్తుంటారు. ఈ ప్రదర్శనలో విజయనగర సామ్రాజ్యం, పెనుకొండ, చంద్రగిరి గత కాలపు వైభవాలు, వాటి పతనాన్ని పర్యాటకులు చూడవచ్చు.

13. తిరుపతి నుంచి 12 కిలోమీటర్ల దూరం

13. తిరుపతి నుంచి 12 కిలోమీటర్ల దూరం

Image Source:

చంద్రగిరి తిరుపతి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతికి వెళ్లినవారు ఇక్కడికి వెళ్లాలనుకుంటే ప్రతి పదినిమిషాలకు ఒక ప్రభుత్వ బస్సు సౌకర్యం ఉంటుంది. అదే విధంగా ప్రైవేటు వాహనాలు కూడా ఇక్కడ మనకు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంటాయి. చంద్ర గిరి కోట మొత్తం చూడటానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది.

14. చిత్తూరు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు

14. చిత్తూరు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు

Image Source:

ఇక ఇదే చిత్తూరు జిల్లాలో చంద్రగిరి కోటకు దగ్గరగా ఉన్న పర్యాక ప్రాంతాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఉబ్బలమడుగు జలపాతం. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు ఖండ్రిగ మండలంలో సిద్దుల కోన అనే అడవిలో ఉంది. ట్రెక్కింగ్ కు ఇది అనుకూల మైన ప్రాంతం. శ్రీకాళహస్తి నుంచి ఇది 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వర్షాకాలంలో అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకూ ఇక్కడ జలపాతం చూడటానికి కన్నుల పండుగగా ఉంటుంది.

15. కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ

15. కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ

Image Source:

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒకే ఒక ఏనుగుల సంరక్షణ కేంద్రం ఈ అభయారణ్యంలోనే ఉంది. మరో పర్యాటక కేంద్రం అయిన హార్సీలీ హిల్స్ నుంచి ఇక్కడకు దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక నుంచి ఇక్కడకు ఏనుగులు వలస వస్తుంటాయి. ఈ అభయారణ్యం పచ్చని చెట్లతో ఎతైన పర్వత శిఖారాలతో ఉండటం వల్ల ట్రెక్కింగ్ కు అనుకూలంగా ఉంది. అయితే గైడ్ ను తీసుకుని వెళ్లడం తప్పనిసరి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి