Search
  • Follow NativePlanet
Share
» »వేసవి విహారానికి సిద్దమా: వేసవిలో ఈ ప్రదేశాలు చూడటం ఆహ్లాదకరం

వేసవి విహారానికి సిద్దమా: వేసవిలో ఈ ప్రదేశాలు చూడటం ఆహ్లాదకరం

వేసవి సెలవులు వచ్చాయంటే చాలు అందరికీ గుర్తొచ్చేవి పర్యాటక ప్రదేశాలే. పిల్లలకు పరీక్షలు అయిపోగానే అసలు కథ మొదలవుతుంది. ఈ వేసవి సెలవులకు ఎక్కడి వెళ్ళాలి? కొంత మంది సొంత ఊర్లకు, అమ్మమ్మ, నానమ్మ గార్ల ఇల్లకు వెళుతుంటారు. కొంత మంది వెళ్ళిన ఊర్లకే వెళ్ళడం ఇష్టం ఉండదు. మరికొంత మందికి వేసవి సెలవులు అనగానే ఏ ఊటికో, కొడైకెనాల్, గోవాకు వెళ్ళాలనుకోవడం సహజం అయితే కొంత మంది బడ్జెట్ పరంగా ఖర్చు చేయలేని వారి కోసం ప్రకృతి అందాలు.. పరవశింపజేసే జలపాతాలు ఎన్నో మన రాష్ట్రం లోనూ ఉన్నాయి. ఈ వేసవిని మన రాష్ట్రంలో ఉన్న ప్రకృతికి అంకితం చేద్దామా? అలాగని మీరు ఇతర ప్రదేశాలకు వెళ్లొకూడదని కాదు. ఎంత చెట్టుకు అంత గాలన్నట్లు ఆర్థిక వెలుసుబాటును బట్టి తెలంగాణ మట్టి పరిమళాలను ఆస్వాదిస్తూ కాశ్మీరు హిమగిరులనూ తాకేద్దాం...

ఎండాకాలం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేవి పర్యాటక ప్రాంతాలే. వేసవి విడిది అంటే ఎక్కడో దూరాన ఉన్న ఊటీ, కొడైకెనాల్, గోవాలే అనుకోవడం సహజం. కానీ అంతకు మించి.. ప్రకృతి అందాలు.. పరవశింపజేసే జలపాతాలు ఎన్నో మన రాష్ట్రం లోనూ ఉన్నాయి. అందుకే ఈ వేసవిని మన చుట్టూ ఉన్న ప్రకృతికి అంకితం చేద్దామా? అలాగని ఇతర ప్రాంతాలకు వెళ్లొద్దని కాదు. ఎంత చెట్టుకు అంత గాలన్నట్లు ఆర్థిక వెసులుబాటును బట్టి తెలంగాణ మట్టి పరిమళాలను ఆస్వాదిస్తూ కాశ్మీరు హిమగిరులనూ తాకేద్దాం.

హైదరాబాద్

హైదరాబాద్

మొగలలు, నవాబుల పాలనతో చరిత్రకెక్కిన మహానగరం మన హైదరాబాద్. భాగ్యనగరంలో ఎన్నెన్నో పురాతన , ఆధునిక, యాంత్రిక అద్భుతాలకు, చారిత్రక ప్రదేశాలకు నెలవు. కుతుబ్‌షాలు, అసఫ్‌జాహీల కాలం నాటి చారిత్రక కట్టడాలెన్నో దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ మహానగరంలో చార్మినార్, మక్కామసీదు, గోల్కొండ, చౌమహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా, ట్యాంక్‌బండ్ హుస్సేన్‌సాగర్‌లతో పాటు అడుగడుగునా ఓ ఉద్యానవనం కనిపిస్తాయి. లుంబినీ పార్కు, కేబీఆర్ పార్కు, సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సాలార్జంగ్, స్టేట్ మ్యూజియం, జీఎస్‌ఐ, నెహ్రూ జూపార్కు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. దేశం నలుమూలల నుంచి, అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు బస్సు సౌకర్యం ఉంది. నగరంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి సిటీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి.

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి

నల్గొండ ప్రాంతంలో బౌద్ధమతం వెల్లువిరిసిన నేలా...నరసింహుడు నడయాడిన నేల. భువనగిరి, యాదాద్రి జిల్లాలలో పురాతన దేవాయలయాలు, బౌద్దారామాలు పర్యాటకులను మంత్రముగ్దులని చేస్తాయి. నాగార్జున సాగర్ ఆసియాలోనే అతి పెద్ద మానవ నిర్మిత ఆనకట్ట. వేసవి సీజన్ లో ఈ నాగార్జున సాగర్ లో బోటింగ్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. సాగర్ నుండి శ్రీశైలం వరకు విస్తరించిన రిజర్వు ఫారెస్ట్ జలాశయం మధ్యలో ఉన్న ద్వీపంపై మ్యూజియం చూడవచ్చు. అలాగే మరో ప్రత్యేక ఆకర్షణ చంద్రవంక జలపాతం . ఎత్తి పోతలకు క్రింది బాగన 11 కిలోమీటర్ల దూరంలోని పచ్చిన కొండలపై 215కిలో నుండి దూకే ఈ నీటి ప్రవాహాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.

హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ 153 కి.మీ దూరంలో ఉంది. ఇక యాదాద్రికి జూబ్లీ, ఎంజీబీఎస్ బస్టాండ్ల నుంచి ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్ సౌకర్యం ఉంది.

PC- Adityamadhav83

మెదక్:

మెదక్:

ఆసియాలోనే అతి పెద్ద చర్చి మెదక్ పట్టణంలో ఉంది. ఇది వాటికన్ సిటి తరువాత ప్రపంచంలోనే పెద్ద చర్చి. తెల్లని గ్రానైట్‌తో నిర్మితమైన గోపురాలు ప్రత్యేక ఆకర్షణ. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ప్రాంతాలలో ఎన్నో చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, అటవీ సంపద, నదీ జలాలు కనువిందు చేస్తున్నాయి. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి కాలంలో నిర్మించిన మెదక్‌కోట కాకతీయుల నిర్మాణ కౌశలానికి ప్రతీక. మంజీర నది ఒడ్డున ఏడుపాయల కనకదుర్గ దేవాలయం ఉంది. కొండాపూర్‌లోని పురావస్తు సంగ్రహాలయంలో బౌద్ధ నిర్మాణాలు, శాతవాహనుల కాలం నాటి అవశేషాలు ఎన్నో దర్శనమిస్తాయి. మెదక్‌కు15 కిలోమీటర్ల దూరంలోని పోచారం అభయారణ్యం, విశాలమైన చెరువు, సింగూరు డ్యాం సందర్శించవచ్చు.

మైదరాబాద్ నుంచి మెదక్ 101 కి.మీ. దూరంలో ఉంది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లే బస్సులుకూడా సిద్దిపేట మీదుగా వెళతాయి. అనేక ప్రైవేటు వాహనాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.

Photo Courtesy:David Marchant

ఓరుగల్లు

ఓరుగల్లు

తెలంగాణా రాష్ట్రంలో గొలుసు కట్టు చెరువులు తవ్వించి బంగారు పంటలు పండేలా కృషి చేసిన పాలకులు కాకతీయులు. కాకతీయుల రాజధానిగా రెండు శతాబ్దాల పాటు వెలుగొంది వెయ్యేళ్ల సుదీర్ఘ చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న జిల్లా ఇది. ప్రకృతి రమణీయతకు, చారిత్రక కట్టడాలకు, అపురూప శిల్ప సంపదకు నెలవు. ఇక్కడి కాకతీయ కళాతోరణం నేటి ప్రభుత్వ ముద్రలో భాగమైంది. రామప్ప దేవాలయం.. వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప చెరువు, పాకాల చెరువు, లక్నవరం, రుద్రసముద్రం, ఉదయ సముద్రం, సమ్మక్క సారక్క తదితర పర్యాటక ప్రాంతాలను జిల్లాలో సందర్శించవచ్చు. జిల్లాల విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడిన ప్రొ. జయశంకర్ జిల్లాలో కాళేశ్వరం దేవాలయం. ఇక్కడే త్రివేణి సంగమం ఉన్నాయి.

హైదరాబాద్ నుంచి వరంగల్ 145 కి.మీ దూరంలో ఉంది. ఇమ్లిబన్, జూబ్లీ బస్‌స్టేషన్‌ల ప్రత్యేక బస్సులు ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి కాజీపేట, వరంగల్‌లకు రైలు సౌకర్యం ఉంది. వరంగల్ నుంచి ఆయా ప్రాంతాలకు బస్సు ఇతర ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.

 అదిలాబాద్

అదిలాబాద్

అదిలాబాద్ జిల్లా అనగానే తెలంగాణ కాశ్మీరంగా పేరు గాంచిందన్న విషయం గుర్తుకు వస్తుంది. కొమురం భీం నిర్మల్ వంటి జిల్లాల్లో పర్యాటక ప్రదేశాలెన్నో ఉన్నాయి. ఒకవైపు ఆదివాసీ సంస్కృతి, మరోవైపు ఆధునిక అలవాట్లతో భిన్న సంస్కృతులకు పుట్టినిల్లు అదిలాబాద్. ఈ ప్రాంతాన్ని మొఘలాయిలు, మౌర్యులు, చాళుక్యులు, శాతవాహనులు పరిపాలించినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. నిర్మల్ పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో బాసర పుణ్యక్షేత్రముంది. ఇంకా కుంతాల జలపాతం ప్రకృతి చెక్కిన మరో పర్యాటకం. నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్లే దారిలో నేరడికొండకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. గాయత్రి జలపాతం కూడా ఇక్కడే ఉంది. పొచ్చెర జలపాతం బోథ్ మండలానికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి 6.కిమీ దూరంలో నిర్మల్‌కు 37 కి.మీ, ఆదిలాబాద్‌కు 47 కి.మీ. దూరంలో ఉంది. అదిలాబాద్ అభయారణ్యం మరో పర్యాటక ప్రాంతం. బుగ్గ, కడెం ప్రాజెక్టు, నిర్మల్ బొమ్మల తయారీ ఇలా పలు ప్రాంతాలను సందర్శించవచ్చు.

హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ 305 కి.మీ. దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, బెల్లంపల్లి, నిర్మల్. మంచిర్యాలకు బస్సు సౌకర్యం ఉంది. నాంపల్లి, సికింద్రాబాద్‌ల నుంచి రైలు సౌకర్యం కూడా ఉంది.

 పాలమూరు

పాలమూరు

అటు అటవీప్రాంతం ఇటు రెండు జీవనదులు ప్రవహిస్తున్న నేల పాలమూరు. జిల్లాలో విశాల నల్లమల అటవీ ప్రాంతం ఉంది. ఇటు కృష్ణా నది, అటు నల్లమల నడుమ కొల్లాపూర్ సంస్థానం ఉంది. ఇక్కడ జోగులాంబ వంటి అనేక చారిత్రక దేవాలయాలు, చెరువులు కనిపిస్తాయి. కృష్ణ, తుంగభద్ర నదులు పాలమూరు నుంచి ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదుల మధ్యలో గద్వాల సంస్థానం. 17వ శతాబ్దంలో నిర్మించిన గద్వాల కోట ఎన్నో చారిత్రక విశేషాలను చెబుతుంది. కోయిల్ సాగర్ ప్రాజెక్టు దేవరకద్ర మండలంలో ఉంది. నగరం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో గల ఈ ప్రాజెక్టు చుట్టూ ప్రకృతి అందాలు పర్యాటకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో గల పిల్లలమర్రికి 700 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మహావృక్షం దాదాపు 5 ఎకరాలలో విస్తరించి ఉంది. అమ్రాబాద్ అటవీ ప్రాంతంలోని మల్లెల తీర్థం ఎంతో రమణీయ ప్రాంతం. ఆత్మకూరు మండలంలోని గుండాల గ్రామ సమీపంలో గుండాల జలపాతం ఉంది. ఇక్కడ ఎత్తైన బండరాళ్లపై నుంచి కృష్ణనది ప్రవహించడం వల్ల జలపాతం ఏర్పడింది.

హైదరాబాద్ నుంచి పాలమూరు జిల్లా కేంద్రం 103 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడి నుంచి అయా ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.

శిలా సంపదకు నిలయం నిజామాబాద్

శిలా సంపదకు నిలయం నిజామాబాద్

3 వేల ఏళ్లనాటి మానవ ఆనవాళ్లు కలిగిన ప్రాంతంగా నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాలు గుర్తింపు పొందాయి. అద్భుత శిలా సంపదకు ఈ ప్రాంతం నెలవు. కాకతీయులు, చాళుక్యుల కా లం నాటి చారిత్రక కట్టడాలు, అటవీ సంపద ఈ జిల్లాల ప్రత్యేకత. అందమైన శిలలు, ఉద్యానవనాలతో అశోక్ సాగర్ అలరిస్తుంది. జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో లింబాద్రి గుట్ట ముఖ్యమైంది. సారంగపూర్ హనుమాన్ దేవాలయం, కంఠేశ్వర్ నీలకంఠుడు, బడాపహాడ్, డిచ్‌పల్లి రామాలయం జిల్లా చారిత్రక వైభవాన్ని చాటుతున్నాయి. దోమకొండ కోట, సిర్నాపల్లి, కౌలాస్ కోటలు ప్రసిద్ది చెందాయి. సిర్నాపల్లిలో సిర్నాపల్లి జలపాతం ఉంది. నిజాంసాగర్, శ్రీరాంసాగర్, పోచారం, ఆలీసాగర్ ముఖ్యమైన ప్రాజెక్టులు.

హైదరాబాద్ నుంచి నిజామాబాద్ 176 కి.మీ. దూరంలో ఉంటుంది. జిల్లా కేంద్రం నుంచి కొత్త జిల్లాలకు ఇతర పర్యాటక స్థలాలకు బస్సు సౌకర్యం ఉంది.

PC-Ananth Naag Kaveri

రాములోరి భద్రాద్రి

రాములోరి భద్రాద్రి

ఇక్కడి ప్రధాన పర్యాటక ప్రాంతం భద్రాచలం. దేశంలోనే సుప్రసిద్ధ రామాలయం ఇది. గోదావరి నదీ ఒడ్డున గల ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఏటా లక్షలాది మంది వస్తుంటారు. భద్రాచలం నుంచి 36 కిలోమీటర్ల దూరంలో గల పర్ణశాలలో రామాయణ కాలం నాటి చారిత్రక ఆధారాలు చూడవచ్చు. కిన్నెర సాని అభయారణ్యం, పాపికొండలు ప్రత్యేకమైనవి.

భద్రాచలం దగ్గర పేరంటాల పల్లినుంచి పాపి కొండలకు లాంచీలో దాదాపు 12 గంటలు పచ్చని అడవి మధ్యలోంచి నదీ ప్రయాణం చేయడం ఓ మధురానుభూతి. జిల్లాలో మరో ప్రముఖ పర్యాటక ప్రాంతం నేలకొండపల్లి బౌద్ధస్థూపం. ఖమ్మం పట్టణానికి 21 కిలో మీటర్ల దూరంలో గల ఈ ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో బౌద్ధ స్తూపాలు దర్శనమిస్తాయి. ఖమ్మం పట్టణ నడిబొడ్డున గల ఖిల్లా ప్రత్యేకమైన నిర్మాణ కౌశలంతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ఈ జిల్లా ప్రత్యేకత. జిల్లాలోని వాజేడు మండలంలో బోగత జలపాతం ఉంది. కొండ కోనల నుంచి జాలువారే నీటిపొంగు బోగత జలనిధిగా సాక్షాత్కరిస్తుంది.

హైదరాబాద్ నుంచి భద్రాద్రి 311 కి.మీ. దూరంలో ఉంటుంది. ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. అనేక ప్రైవేటు వాహనాలు 24 గంటలూ ఉంటాయి. భద్రాచలం రోడు వరకు రైలు సౌకర్యం కూడా ఉంది.

చారిత్రక సంపద ఎలగందల్ కోట

చారిత్రక సంపద ఎలగందల్ కోట

ఉత్తర తెలంగాణలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలుగా కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్లాలు వెలుగొందుతున్నాయి. దక్షిణకాశిగా పిలిచే వేములవాడ సిరిసిల్లా జిల్లాలో ఉంది. ఇంకా ధర్మపురి, మంథని, కొండగట్టు, బిజ్గిర్ షరీఫ్ ప్రధాన పర్యాటక ప్రాంతాలు. కరీంనగర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో మానేరు తీరంలో ఉన్న ఎలగందల్ కోట పురాతన కట్టడం. దిగువ మానేరు రిజర్వాయర్ సమీపంలో 30 ఎకరాల వైశాల్యంలో రాజీవ్ డీర్ పార్కు ఉంది. కరీంనగర్ పర్యాటక ఆకర్షణలో ఇది ఒకటి. ఎల్లారెడ్డిపేటలో పురాతన రాజ భవనాలు, జక్కుల చెరువు, సొరంగ మార్గం వంటి అనేక విశేషాలను తిలకించవచ్చు. పెద్దపల్లి జిల్లాలో సబిత గ్రామంలో గుండాల జలపాతం ఉంది. 40 అడుగుల ఎత్తునుండి రెండు పాయలుగా కిందికి జాలువారుతూ అందంగా ఉంటుంది. జేగురురంగు రాతిబండలు, తెల్లని నీరు త్రివర్జాలు కలసి అద్బుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి.

హైదరాబాద్ నుంచి కరీంనగర్ 164 కి.మీ. దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు అక్కడి నుంచి ఆయా పర్యాటక ప్రాంతాలకు బస్సుల సౌకర్యాలు ఉంటాయి. వరంగల్ నుంచి రోడ్డు, రైలు మార్గాలున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రైలు సౌకర్యం ఉంది.

గండి కోట

గండి కోట

చూడవలసినవి గండికోట జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున ఉన్న గ్రామం. ఇక్కడి ఎర్రమల కొండల లోయల మధ్యలో ప్రవహించే పెన్నా నది దృశ్యం మనోహరంగా ఉంటుంది. కొండ మీద ఉన్న కోట, కోట లోని రంగనాథ ఆలయం, మాధవరాయ ఆలయం ఇక్కడ చూడదగినవి. కడపలో ప్రసిద్ధి చెందిన పర్యాటక స్థలాలు !

చిత్ర కృప : andhratourism

పాపి కొండలు

పాపి కొండలు

పాపి కొండల ప్రాంతాన్ని ఆంధ్రా కాశ్మీరం అని పిలుస్తారు. ఇక్కడి వాతావరణం ఎండాకాలం, వానా కాలం, చలికాలం అనే తేడా లేకుండా చల్లగానే ఉంటుంది. పాపి కొండల్లో బోట్ విహారం, గుడిసెలు, గోదావరి నదిలో ప్రయాణిస్తూ అల్పాహారం,భోజనం చేయటం వంటివి మారుపురానివి. రాజమండ్రి లో దిగి ప్రవేట్ సంస్థలను ఆశ్రయిస్తే వారే అన్ని చూపిస్తారు.

పాపాపి కొండలు చేరుకొను మార్గం పాపి కొండలు చేరుకోవటానికి రాజమండ్రి ప్రధాన కూడలి. ఇక్కడి నుండి బస్సుల్లో రేవుల వద్దకి వెళితే అక్కడి నుండి బోట్ ప్రయాణం మొదలవుతుంది.

చిత్ర కృప : Vamsi Mohan Reddy Pulagam

 కొండారెడ్డి బురుజు,

కొండారెడ్డి బురుజు,

కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు నగరం నడి బొడ్డున ఉన్న కొండారెడ్డి బురుజు ఒక స్మారక చిహ్నం. ఇది హైదరాబాద్ నగరానికి 210 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నగరానికి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కర్నూలు నగరంలో ఎక్కడి నుంచైనా చేరుకొనే విధంగా ఈ కట్టడం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో హేరిటేజ్ సంపదగా గుర్తించబడ్డ కొండారెడ్డి బురుజు ఇప్పటికీ ధృడమైన కోటగా, బలంగా ఉన్నది. ఈ కోటను అచ్యుతదేవరాయల వారు నిర్మించినారు. ఈ కోటలో దుర్భేధ్యమైన కారాగారం సైతం ఉన్నది. చిత్ర కృప : Prasad Addagatla

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more