» »శివరాత్రికి కోలార్ లో దర్శించవలసిన దేవాలయాలు

శివరాత్రికి కోలార్ లో దర్శించవలసిన దేవాలయాలు

Posted By: Venkata Karunasri Nalluru

శివరాత్రి పర్వదినాన్ని అనుసరించి బెంగుళూర్ నుండి వారాంతంలో చూడగల ప్రదేశాలలో గోల్డ్ మైన్స్ గల "కోలార్" నగరం ప్రముఖమైనది. ఇది బెంగుళూర్ నుండి 69 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగుళూర్ లో కెంపెగౌడ బస్సు టెర్మినస్ నుండి ప్రైవేటు లేదా స్థానిక బస్సులు ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

బెంగుళూర్ నుండి ఒక రోజు ప్రయాణాల గురించి మరింత తెలుసుకోవాలంటే :

Temples To Visit In Kolar For Shivaratri

కోలార్ యొక్క చరిత్ర :

పశ్చిమ గంగా రాజవంశంలో రాజధాని నగరంగా కోలార్ వున్నప్పుడు దీనిని "కొలహలపుర" అని పిలిచేవారు. దీని యొక్క ఉనికిని తెలిపే పురాతన కథలు చాలా ఉన్నాయి.

కోలార్ నగరంలో మహాభారతంలో గల పరశురాముడు మరియు భీముడుకు సంబంధించిన చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. ఈ నగరం పశ్చిమ గంగా రాజవంశ స్థాపకుడైన "కొంగనివర్మన్ మాధవ" నిర్మించారు.

శివరాత్రి పండుగకు కోలార్ లో దర్శించవలసిన దేవాలయాలు:

కోలారమ్మ ఆలయం :

Temples To Visit In Kolar For Shivaratri

PC : Hariharan Arunachalam ( NIC )

చోళులు నిర్మించిన వెయ్యి ఏళ్ల ఆలయం కోలారమ్మ దేవాలయం. ఇది ఒక అద్భుతమైన నిర్మాణం. పార్వతీదేవి ఇక్కడ కోలారమ్మగా పూజలందుకుంటోంది. కోలార్ ను కాపాడే దేవతగా ఈ తల్లిని పూజిస్తారు. కోలారమ్మ ఆలయంలో గల పార్వతీ దేవి మరొక రూపమైన చేలమ్మ (తేలు) గా పూజలందుకుంటోంది. చేలమ్మతల్లికి ప్రార్ధనలు జరిపితే తేలు యొక్క విషం కాటు నయం అవుతుందని నమ్ముతారు. ఆలయం కోలార్ బస్సు స్టాండ్ నుండి 1.6 కి.మీ దూరంలో ఉంది.

అంతరాగంగె గుహలు :

Temples To Visit In Kolar For Shivaratri

PC : Vedamurthy J

ప్రధాన బస్ స్టాండుకు 4 కి.మీ దూరంలో ఉన్న "అంతరాగంగె గుహలు" కోలార్ లో తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రదేశం ట్రెక్కింగ్ ప్రియులను చాలా ఆకర్షిస్తుంది అంతేకాకుండా తరచుగా ఇక్కడ రాత్రిపూట కూడా ట్రెక్కింగ్ చేస్తారు.

ఈ ప్రదేశం శతశృంగ పర్వతాల మీద కలదు మరియు ఇక్కడ ఒక అందమైన దేవాలయంను కూడా సందర్శించవచ్చును. ఈ మార్గం అందంగా నిటారుగా ఉంటుంది. ఇక్కడ ఆలయంలో అద్భుతమైన రీతిలో వున్న ఒక కొలను ఉంది. ఈ కొలనులో నందీశ్వరుని నోటి నుండి నీరు నిరంతరంగా ప్రవహిస్తూ వుంటుంది. ఈ ఆలయం చుట్టూ అనేక ఇతర గుహలు కూడా కలవు. గ్రానైట్ రాళ్ళ పర్వతాలు చూపరులను మంత్రముగ్దులను చేస్తుంది.

సోమేశ్వరాలయం :

Temples To Visit In Kolar For Shivaratri

PC : Dinesh Kannambadi

విజయనగర సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం విజయనగర కళాకారుల యొక్క అద్భుతమైన నైపుణ్యానికి చిహ్నం. ఇక్కడ శివుడు సోమేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. పురావస్తు శాఖ సర్వే విభాగం, ఈ ఆలయంలో గల విగ్రహాన్ని జాతీయ ప్రాముఖ్యత గల విగ్రహంగా పేర్కొంది.

ఆలయ దర్శన సమయం: ఉదయం 7 గం. నుండి 11 గం. సాయంత్రం 5 గం. నుండి 8 గం. వరకు. ఈ సమయంలో భక్తులు ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

కోటిలింగేశ్వరాలయం :

Temples To Visit In Kolar For Shivaratri

PC : Visurao4all

ఈ ఆలయం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుండి 6 కి.మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన విషయమేమిటంటే కొన్ని లక్షల శివలింగాలు ఇక్కడ ప్రతిష్టించబడినది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం. ఈ శివలింగం 108 అడుగుల పొడవు వున్నది. నంది (బుల్) ఇక్కడ 35 అడుగుల పొడవు వుంది. ప్రధాన శివలింగం, నంది, వివిధ పరిమాణాలలో గల అనేక ఇతర శివ లింగాలు ఇక్కడ వున్నాయి. కాబట్టి ఇక్కడ శివునికి "కోటిలింగేశ్వరుడు" అనే పేరు వచ్చింది. ప్రధాన ఆలయంలో 11 ఇతర దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి.

అవని :

Temples To Visit In Kolar For Shivaratri

PC : Dineshkannambadi

అవని గొప్ప చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న ఒక ప్రదేశం. ఇది కోలార్ నుండి 32 కి.మీ. దూరంలో ఉంది.

పురాణాల ప్రకారం, ఇక్కడ సీతా దేవి రామాయణం జరుగుతున్న సమయంలో ఇక్కడ జీవించిందట. అందుకే ఈ ప్రదేశాన్ని సీతాదేవికి అంకితం చేయబడినది. అంతేకాకుండా మీరు అవనిని దర్శించినప్పుడు సీతా దేవి ఈ ఆలయంలో లవకుశలకు జన్మనిచ్చిన గదిని చూడవచ్చును. రామాయణం రచించిన వాల్మికీ మహర్షి కూడా ఇక్కడ నివసించినట్లు తెలుస్తుంది. ఈ ప్రదేశాన్ని "దక్షిణ దేశపు గయా" అని పిలుస్తారు. అంతేకాకుండా అవని "రాక్ క్లైంబింగ్" ప్రసిద్ధి చెందిన ప్రదేశం.

కోలార్ పర్యటన సందర్భంగా మీరు సందర్శించవలసిన కొన్ని ఇతర ప్రదేశాలు: శ్రీ శ్రీపాద మఠం, కైవార కొండలు, మార్కండేయ కొండలు, మొదలైనవి. కాబట్టి మీరు ఈ శివరాత్రికి కోలార్ చుట్టూ గల ఆలయాలు దర్శించి ఈశ్వరుని అనుగ్రహాన్ని పొందవచ్చును.

కోలార్ కు ఎలా చేరుకోగలం?