Search
  • Follow NativePlanet
Share
» »ఎడారి రాష్ట్రంలో అందమైన సరస్సుల నగరం...సందర్శిస్తే మనస్సు ఆహ్లాదమే...

ఎడారి రాష్ట్రంలో అందమైన సరస్సుల నగరం...సందర్శిస్తే మనస్సు ఆహ్లాదమే...

By Beldaru Sajjendrakishore

భారత దేశంలో రాజస్థాన్ కు ఎడారి రాష్ట్రమన్న పేరు ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలో అందమైన సరస్సులు ఉన్న ఉదయపూర్ కూడా ఉంది. ఈ ఉదయపూర్ ను సిటీ ఆఫ్ సన్ సెట్ (సూర్యాస్తమయ నగరం) మరియు సరస్సుల నగరం (సిటీ ఆఫ్ లేక్) అని కూడా పిలుస్తారు. స్థానికులు దీనిని శ్వేత నగరం అని కూడా అంటారు. ఇది ఉదయపూర్ జిల్లా ప్రధానకేంద్రము. రాజపుత్రులు ఏలిన మేవార రాజ్యానికి ఉదయపూర్ రాజధానిగా ఉండేది. క్రీ.పూ 600 నుండి ప్రస్తుత కాలం వరకు ఈ ప్రదేశం పరాకాంతం కాలేదు. రాజపుత్రుల చరిత్ర, సంస్కృతి మరియు విజ్ఞాన ప్రదేశాలు ఉదయపూర్ ఇప్పటికీ విశదీకరిస్తుంది.

వినాయకుడు పుట్టిన ప్రదేశం...సందర్శిస్తే సంతానభాగ్యం, అపారతెలివితేటలు సొంతం

అనేక రాజమందిరాలు విలాసవంతమైన వసతిగృహాలుగా మార్చబడ్డాయి. ఈ ఉదయపూర్ ను తూర్పు వెనిస్ నగరం, ప్రేమ నగరం అనే పేర్లతో కూడా పిలుస్తారు. భారతదేశంలో ఉదయపూర్ ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణ కలిగిన నగరం. ఊదపూర్ నగరం సరసులు, రాజభవనాలు, సంస్కృతి మరియు ప్రజా జీవన విధానం వంటి వాటితో స్వదేశీ మరియు విదేశీ పర్యాటకులను ఆకర్షింస్తుంది. ఇది పలు చలనచిత్ర నటీ నటులకు, ప్రముఖ వ్యాపారులకు, రాజకీయనాయకులకు ప్రముఖ చెందిన వివాహ వేదికగా ఉంది. వీరు ఇక్కడ వివాహ వేడుకలు, విందులు జరుపుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నగరాన్ని మనం కూడా చూసొద్దాం

1. రెండవ ఉదయసింఘ్

1. రెండవ ఉదయసింఘ్

Image source:

ఉదయపూర్ 1159లో రెండవ ఉదయసింఘ్ చేత నిర్మింపబడి మేవార రాజ్యానికి ప్రథమ మరియు ఆఖరి రాజధానిగా స్థిరపరిచారు. ఈ నగరం నాగ్డా నగరానికి ఆగ్నేయంగా బణా నదీతీరంలో నిర్మించబడింది. చరిత్రననుసరించి రెండవ ఉదయ సింఘ్ ఆరావళీ పర్వతపాద ప్రాంతంలో వేటాడే సమయంలో ఒక తపస్వి చెంతకు వెళ్ళాడు. ఆ తపస్వి రాజును ఆశీర్వదించి అక్కడ ఒక రాజభవనం నిర్మించమని సలహా ఇచ్చాడు.

2. అలా ఉదయపూర్ కొనసాగుతూనే ఉంది

2. అలా ఉదయపూర్ కొనసాగుతూనే ఉంది

Image source:

అలా నిర్మిస్తే అది సురక్షితంగా ఉంటుందని రాజుకు నమ్మకంగా చెప్పాడు. ఫలితంగా రెండవ ఉదయ సింఘ్ ఆ ప్రదేశంలో తన నివాస స్థలంగా భవన నిర్మాణం చేసాడు. 1568లో మొగల్ చక్రవర్తి అక్బర్ చిత్తోఢ్ కోటను స్వాధీనపరచుకున్నాడు. ఉదయ సంఘ్ తన రాజధానిని తన నివాసిత ప్రాంతానికి మార్చుకున్నాడు. అది ఉదయపూర్ నగరం అయింది. అప్పటి నుంచి తన ప్రస్తానాన్ని ఈ ఉదయపూర్ కొనసాగిస్తూనే ఉంది.

3. ఊదయపూర్ సిటీ ప్యాలెస్

3. ఊదయపూర్ సిటీ ప్యాలెస్

Image source:

1559లో పిచోల సరస్సు తీరంలో ఈ ఉదయపూర్ సిటీ ప్యాలెస్ సముదాయం ఉంది. ఈ సరస్సుకు ఒకతీరంలో జగ మందిర్ అనే ఫైవ్ స్టార్ హోటెల్ మరొక వైపు ఉదయపూర్ నగరం ఉంది. మూడు ఆర్చులు కలిగిన త్రిపోలియా అనే ద్వారం 1725లో నిర్మించబడింది.

ఈ ద్వారం ద్వారా వెలితే వరుసగా బహిరంగ ప్రదేశాలు, తోటలు, భవన గోపురాలు, మందిరాలు వసారాలు చేరుకోవచ్చు. ఇక పాత సిటీ ప్యాలెస్, శివ్ నివాస్ ప్యాలెస్ మరియు ఫ్యాచ్ ప్రకాష్ ప్యాలెస్ ఇప్పుడు అయిదు నక్షత్రాల హోటెల్స్ గా మార్చబడ్డాయి.

4. పాలరాతి రాజభవనం

4. పాలరాతి రాజభవనం

Image source:

1743-1746లో పిచోలా సరసుమధ్యలో ఉన్న జాగ్ నివాస్ ద్వీపంలో పాలరాతి రాజభవనం ఇది. ఇది రాజకుంటుంబం వేసవి విడిదిగా ఉపయోగించడానికి నిర్మించబడిది. ఇప్పుడది ది తాజ్ హోటెల్స్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్ సంస్థ క్రింద ఫైవ్ స్టార్ హోటల్‌గా మార్చబడింది. పిచోలా సరసులో జగ్ మందిర్ మరొక ద్వీపము. ఇక్కడ షాజహాన్ తన తండ్రి మీద తిరుగుబాటు చేసిన కాలంలో కొంతకాలం నివసించాడు.

5. సమ్మర్ ప్యాలెస్...

5. సమ్మర్ ప్యాలెస్...

Image source:

అప్పట్లో మహారాజులకుకు ఇది మరొక వేసవి విడిది. కొండ శిఖరం మీద నిర్మించబడిన ఈ భవనం నుండి చుట్టూ ఉన్న సరసుల సుందర దృశ్యం కనిపిస్తుంది. ఈ రాజభవనంలో వర్షపు నీటిని సేకరించి సంవత్సరమంతా అవసరాలకు వాడడానికి అనువైన నిర్మాణం చేయబడి ఉంది. ఉదయపూర్ ను సందర్శించిన వాళ్లు తప్పక ఈ సమ్మర్ ప్యాలెస్ ను చూసి తీరాల్సిందే. ఇక్కడి చుట్టు పక్కల ప్రాంతాలు నయనానందకరంగా కనిపిస్తాయి.

 6. జగదీష్ ఆలయం

6. జగదీష్ ఆలయం

Image source:

ఉదయపూర్ నగర మధ్యలో ఉన్న పెద్ద ఆలయం జగదీష్ మందిర్. ఈ అలయం క్రీ.శ 1651లో మొదటి మహారాణా జగత్ సింగ్ చేత నిర్మించబడింది. సింధు-ఆర్యన్ శిల్పకళతో నిర్మించబడిన నిర్మాణాలకు ఇది ఒక ఉదాహరణ. ఈ ఆలయం గొప్ప శిల్పకళావైభవానికి, చిత్రాలకు ప్రసిద్ధి చెందినది. నగరంలో ఉన్న పర్యాటక సందర్శనా ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ రాజస్థనీ దుస్తులు, చిత్రాలు మొదలైనవి లభ్యమౌతాయి కనుక నగరంలోని పర్యాటకులక ఆకర్షణీయ ప్రాంతాలలో ఇది ఒకటి.

7. పిచోలా

7. పిచోలా

Image source:

పిచోలా సరసులో రెండు ద్వీపములు ఉన్నాయి. ఒకటి జగ్ నివాస్ మరియు జగ్ మందిర్. ఈ సరసు 4 కిలోమీటర్ల పొడవు 3 కిలోమీటర్ల వెడల్పు ఉంటుయంది. ముందుగా దీనిని రెండవ మహారాణా ఉదయ సింగ్ నిర్మించాడు. ఈ సరసులో స్నానం చెయ్యడానికి మరియు బట్టలు ఉతకడానికి పలు ఘట్టాలు ఉన్నాయి. ఉదయపూర్ లోని బాన్సి ఘాట్ నుండి బోట్లు లభ్యం ఔతాయి. సరసు కేంద్రములో లేక్ ప్యాలెస్ ఉంటుంది. మంచి వర్షాలు పడినప్పుడు సరసు నీటితో నిండి పోతుంది అలాగే ఒక్కోసారి కరువు కాలంలో ఇది ఎండి పోతుంది.

8. సహేలియోంకి బారి

8. సహేలియోంకి బారి

Image source:

సహేలియోకి బారి అనేది రాజోద్యానవనము. దీనిని మహారాణితో పంపబడిన 48 మంది చెలికత్తెలు కొరకు ఉదయపూర్ రాజుల చేత నిర్మించబడింది. ఫతే సాగర్ సరసు తీరంలో ఈ ఉయానవనం నిర్మించబడింది. ఈ సరసులో తామర కొలనులు, ఏనుగు ఆకార ఫౌంటెన్లు (జలయంత్రాలు) ఉన్నాయి. ఈ ఫౌంటెన్లు సరసులో ఉన్న నీటి పరిమాణం ఆధారంగా పనిచేస్తుంటాయి.

9. చేతితో రాసిన పుస్తకాలు

9. చేతితో రాసిన పుస్తకాలు

Image source:

రజభవనం సమీపంలో పిచోలా సరసు తూర్పు దిక్కున మహారాణా సాజన్ సింగ్ చేత ఒక ఉద్యాన వనం నిర్మించబడింది. ఈ ఉదయానవనంలో ఉన్న గ్రంథాలయంలో చేతితో రాసిన పుస్తకాలు భద్రపరచబడ్డాయి. సత్యార్ధ్ ప్రకాష్ చేత వ్రాయబడిన వ్రాతలలో కొం త భాగం ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. ఈ ఉద్యానవనంలో సత్యార్ధ్ ప్రకాష్ స్థూపం ఒకటి ఉంది. ఉద్యానవనంలో ఉన్న జంతుప్రదర్శనశాలలో పులులు, చిరుతపులులు, పక్షులు, కృష్ణ జింక మరియు ఇతర కృరమృగాలు ఉన్నాయి.

10. చూడముచ్చటైన విగ్రహం

10. చూడముచ్చటైన విగ్రహం

Image source:

ఎ రాక్ అండ్ ఫౌంటెన్ ఉద్యానవనం మరియు సూర్యాస్తమయ దృశ్యం పిచోలా సరసు నుండి చూసి ఆనందించ వచ్చు. కార్ని మాతా ఆలయం నుండి ఇక్కడికి చేరుకోవడానికి రోప్‌వే కూడా ఉంది. అదే విధంగా ఫతే సాగర్ నుండి కనిపించే మోతీమా గిరి శిఖరం మీద రాజపుత్ ప్రియత నాయకుడు మహారాణా ప్రతాప్ సింగ్ తన అభిమాన ఆశ్వం అయిన చేతక్‌తో కలసి నడుస్తునడుస్తున్నట్లు ఉన్న కంచువిహ్రహం ప్రతిష్ఠించబడి ఉంది.

11. బొహరా గణేశ్ జీ...

11. బొహరా గణేశ్ జీ...

Image source:

ఈ ఆలయం పాత రైల్వే స్టేషను మరియు ఎమ్ ఎల్ ఎస్ విశ్వవిద్యాలంయం వద్ద ఉంది. పురాతనమైన గణేష్ ఆలయంలో నిలబడి ఉన్న వినాయకుడు దర్శనమిస్తాడు. అత్యంత శక్తివంతుడైన దైవంగా భావించి భక్తులు ఇక్కడకు ప్రతి బుధవారం వచ్చి స్వామిని దర్శించుకుంటారు. అదేవిధంగా బగోర్ కి హవేలి ఈ భవనం పిచోలీ సరసు ఒడ్డున గంగోరీ ఘాట్ వద్ద నిర్మించబడింది. ఈ భవనంలో ప్రస్తుతం రాజస్థానీ సాంస్కృతిక సంగీతం మరియు నృత్యాలు ప్రదర్శించబడుతున్నాయి.

12. నెహ్రూ ఉద్యానవనం...

12. నెహ్రూ ఉద్యానవనం...

Image source:

ఫతే సాగర్ సరసు మధ్యలో ఉపస్థితమై ఉన్న ఈ పార్క్ 41 చదరపు ఎకరాలు (170,000 చదరపు మీటర్లు). ఈ ఉద్యానవనంలో సంపెగ కొలను మరియు పూల తోటలు ఉన్నాయి. భారతదేశపు తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఉద్యానవనం ప్రారంభించబడింది. ఈ ఉద్యానవనం నుండి మహారాణా ప్రతాప్ మోతీ మహల్ మరియు ఆరావళి పర్వతాలు దర్శనం ఇస్తాయి.

13. అహర్ మ్యూజియమ్...

13. అహర్ మ్యూజియమ్...

Image source:

ఉదయపూర్ నగరానికి 2 కిలోమీటర్ల దూరంలో మేవార్ రాణాల సమాధుల సమూహం ఉంది. ఇక్కడ 19 రాణాల సమాధులు ఉన్నాయి. 1597-1620 మధ్య కాలంలో మేవార్‌ను పాలించిన మహా రాణా అమర్ సింగ్ సమాధి కూడా ఇక్కడ ఉంది. దీనికి సమీపంలో అహర్ మ్యూజియం ఉంది. ఇక్కడ కొన్ని అతి అపురూపమైన మట్టి పాత్రలు ఉన్నాయి అలాగే కొన్ని శిల్పాలు ఇతర వాస్తు నిర్మాణాలు ఉన్నాయి. కొన్ని శిలా ఖండాలు క్రీ.పూ 1700 సంవత్సరాల నాటివి. 10వ శతాబ్ధపు బుద్ధుడి కంచు శిల్పం ప్రత్యేక ఆకర్షణ.

14. ఒకే ఒక సోలార్ అబ్జర్వేటరీ

14. ఒకే ఒక సోలార్ అబ్జర్వేటరీ

Image source:

ఉదయపూర్ వాయవ్యంలో హస్తకళల గ్రామం ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ హస్థకళా వస్తు సంత జరుగుతుంటుంది. ఇది భారతదేశంలో అతి పెద్ద హస్థకళా సంతగా భావించబడుతుంది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలు ఇక్కడ తాత్కాలిక దుకాణాలు ఏర్పరచుకుని తమ హస్థకళా ఖండాలను విక్రయిస్తుంటారు. ఉదయపూర్ లోని మరోప్రత్యేకత సోలార్ అబ్జర్వేటరీ. ఆసియాలో ఉన్న ఒకే ఒక సోలార్ అబ్జర్వేటరీ ఇది. ఈ అబ్జర్వేటరీ ఫతే సాగర్ సరసు లోని ద్వీపములో ఉంది.

15. నీమాచ్ మాతా ఆలయం...

15. నీమాచ్ మాతా ఆలయం...

Image source:

ఉదయపూర్ లోని పచ్చని కొండల మీద దీవాలీ ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి చేరడానికి మెట్లదారి, 800 మీటర్ల పొడవున ఏటవాలు దారి కూడా ఉన్నాయి. ఈ ప్రదేశానికి దిగువగా భురానీ నగర్ పేరిట ఒక భోరా కాలనీ, భురానీ మసీదు పేరిట ఒక కొత్త మసీదు ఉన్నాయి. అతి ప్రశాంతమైన ఈ ప్రదేశానికి చేరువగా దిగువన షహేలియోంకి బాడి మరియు ఫతే సాగర్ సరసు ఉన్నాయి.

16. అతి పెద్ద విగ్రహం...

16. అతి పెద్ద విగ్రహం...

Image source:

ఆసియా లోనే అతి పెద్దది అని భావించబడుతున్న భారతీయ రైల్వే శిక్షణా కేంద్రం అతి పెద్ద పచ్చని మైదానంలో ఉంది. నిరాడంబరంగా అలాగే చూపరులను ప్రభావితులని చేసే ఆర్చ్ ఆకార భవనం మరియు ప్రశాంతమైన ప్రహరీలతో ఈ ప్రదేశం సరసుల నగరమైన ఊదయపూర్‌కు మరింత శోభను కూరుస్తున్నది . అదే విధంగా ఉదయపూర్ మరియు చొత్తోర్ మార్గమధ్యంలో ఉన్న సుందరమైన మెనార్ గ్రామం వద్ద బ్రమ్ సాగర్ సరసు తీరంలో ఉన్న శివుడి విగ్రహం ఈ గ్రామస్తులకు ఆశీర్వాదాలు అందిస్తూ ఉంది.

17. సినిమాల షూటింగ్ లకు...

17. సినిమాల షూటింగ్ లకు...

Image source:

ఉదయపూర్ నగరం ప్రపంచంలోనే ఉత్తమ నగరమని త్రావెల్ లీషర్ పత్రికలో ప్రచురితమైనది. ఉదయపుర్ నగరాన్ని వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ మరియు కాష్మీర్ ఆఫ్ ది రాజస్థాన్ అని కూడా పిలుస్తారు. షాజహాన్ చేత నిర్మించబడిన తాజ్ మహల్ ప్రేరణతో ఊదయపూర్ లో నిర్మించబడిన జాగ్ మందిర్ కారణంగా ఈ పేరు వచ్చింది. ఈ ఉదయపూర్ లో అనేక ఇంగ్లీషు, హిందీతో పాటు పలు దక్షిణ భారత రాష్ట్రాలకు చెందిన సినిమాలకు కూడా షూట్ చేషారు.

18. ఇలా చేరుకోవాలి...

18. ఇలా చేరుకోవాలి...

Image source:

ఉదయపూర్ కు దగ్గర్లోనే అంటే సుమారు 20 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉంది. దేశంలోని వివిధ నగరాల నుంచి ఇక్కడకు విమానయాన సర్వీసులు ఉన్నాయి. ఇక భారత దేశంలోని జైపూర్, ఢిల్లీ, కొలకత్తా తదితర నగరాల నుంచి ఉదయపూర్ కు రైలు సౌకర్యం ఉంది. భారత దేశంలో అత్యంత విలాసవంతమైన రైలు ప్రయాణంగా చెప్పబడే ప్యాలెస్ ఆన్ వీల్ కూడా ఉదయపూర్ లో ఆగుతుంది. అదే విధంగా దేశంలోని వివిధ నగరాల నుంచి ఉదయపూర్ కు బస్సు సౌకర్యం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more