Search
  • Follow NativePlanet
Share
» »రుద్ర ప్రయాగ... పవిత్ర పుణ్య క్షేత్రం!!

రుద్ర ప్రయాగ... పవిత్ర పుణ్య క్షేత్రం!!

రుద్ర ప్రయాగ ఉత్తరాఖండ్ రాష్ట్రం లో ఒక చిన్న పట్టణం. దీనికి ఈ పేరు హిందువుల ఆరాధ్య దైవమైన శివుడి మరొక అవతారం అయిన రుద్రుడి పేరు మీదుగా వచ్చింది. పురాణాల మేరకు ఈ ప్రదేశంలో నారద మహర్షి శివుడిచే ఆశీర్వదించబడ్డాడని తెలుస్తుంది. ఈ పట్టణం మందాకినీ మరియు అలకనంద నదుల సంగమంలో కలదు.ఈ ప్రదేశం ప్రసిద్ది చెందినది మరియు మహిమగలది అయినందున యాత్రికులు అధిఖా సంఖ్యలో వస్తుంటారు.

రుద్రప్రయగ ఆలయం

అలకనంద మరియు మందాకినీ అనే రెండు నదుల సంగమంలో కల రుద్రప్రయాగ టెంపుల్ ప్రధాన మతపర ప్రదేశం. శివుడు కల ఈ గుడికి ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు వస్తారు. ఇక్కడ సంగీతంలో సాధన పట్టు కొరకు తపస్సు చేస్తున్న నారదుడిని శివుడు రుద్రుడి అవతారంలో వచ్చి దీవించాడని పురాణాల కథనాలు వివరిస్తున్నాయి. ఇక్కడ కల జగదంబ దేవి ఆలయం కూడా ఒక ఆకర్షణ.

రుద్ర ప్రయాగ... పవిత్ర పుణ్య క్షేత్రం!!

ఆలయంలో శివలింగం

Photo Courtesy: jigisha

త్రియుగ నారాయణ్ ఆలయం

రుద్ర ప్రయగలో కల త్రియుగి నారాయణ్ ఒక పవిత్ర ప్రదేశం. ఇది హిమవత్ కు రాజధానిగా చెపుతారు. ఇక్కడ శివ పార్వతుల వివాహం సత్యయుగంలో జరిగింది. ఇప్పటికి ఇక్కడ వెలుగుతున్న హవాన కుండ్ జ్యోతి సమక్షంలో వారి వివాహం జరిగిందని చెపుతారు. ఈ అగ్ని బూడిద భక్తుల వివాహ జీవితాలను ఆశీర్వదిస్తుందని చెపుతారు. ఈ ప్రదేశ సమీపంలో ఒక విష్ణు ఆలయం ఉంది. దీని శిల్పశైలి కేదార్ నాథ్ ఆలయాన్ని పోలి వుంటుంది. ఈ ప్రదేశం చూసే పర్యాటకులు రుద్రకుండ్, విష్ణు కుండ్ మరియు బ్రహ్మ కుండ్ లు తప్పక చూడాలి. ఈ మూడు కుండ్ లకు సరస్వతి కుండ్ మూల స్థానం. స్థానికుల నమ్మిక మేరకు ఈ కుండ్ నీరు విష్ణు నాభి స్థానం నుండి వస్తుందని చెపుతారు. ఈ నీరు మహిళల సంతానవిహీనతను లేకుండా పోగొడ్తుందని విశ్వసిస్తున్నారు.

రుద్ర ప్రయాగ... పవిత్ర పుణ్య క్షేత్రం!!

ఆలయం వద్ద భక్తులు

Photo Courtesy: Shaq774

రుద్రనాథ దేవాలయం

రుద్రప్రయాగ లో ఉన్న ఈ దేవాలయం సముద్ర మట్టానికి 2286 మీ. ఎత్తులో ఉన్నది. ఈ దేవాలయాన్ని హిందువుల దైవమైన, త్రిమూర్తులలో ఒకరైన శివునికి అంకితం చేశారు. ఈ ఆలయం లో శివున్ని నీలకంఠేశ్వరుని గా పూజిస్తారు. మహాభారత యుద్ధం తరువాత, పాండవులు ఇక్కడకు వచ్చి క్షమించమని శివభగవానున్ని వేడుకొన్నారని, కానీ శివుడు నంది రూపంలో అక్కడినుంచి తప్పించుకున్నడని పురాణాలు చెబుతున్నాయి.శివుని యొక్క శరీర భాగాలను గర్హ్వల్ ప్రాంతంలో, 5 వేర్వేరు ప్రదేశాలలో కనుగొన్నారు దీనిని పాంచ్ కేదర్ అని పిలుస్తారు. రద్రనాథ్ దేవాలయం తన ముఖం పడిన ప్రదేశంలో నిలుస్తుంది. టెంపుల్ నుండి హతి పర్వత, నంద దేవి, నంద ఘుంతి, త్రిశూల్ మంత్రముగ్దులను చేస్తుంది. పవిత్ర కొలనులు సూర్య కుండ్, చంద్ర కుండ్, మరియు మన కుండ్ లు టెంపుల్ సమీపంలో ఉన్నాయి.

రుద్ర ప్రయాగ... పవిత్ర పుణ్య క్షేత్రం!!

రుద్రనాథ ఆలయ ముఖచిత్రం

Photo Courtesy: rolling on

ఎలా వెళ్ళాలి??

వాయుమార్గం

రుద్రప్రయాగ కు సమీప ఎయిర్ పోర్టు సుమారు 183 కి. మీ. ల దూరం లోని డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం. ఈ ఎయిర్ పోర్టు నుండి రుద్రప్రయగ్ కు టాక్సీ లు లభిస్తాయి.

రైలు మార్గం

రుద్రప్రయాగ కు ఋషి కేష్ రైలు స్టేషన్ సమీపం. ఇక్కడకు కొన్ని రైళ్లు మాత్రమే వస్తాయి. అయితే 24 కి.మీ. ల దూరం లో కల హరిద్వార్ రైలు జంక్షన్ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు కలవు.

రోడ్డు మార్గం

రుద్రప్రయాగ నేషనల్ హై వే 58 మార్గం లో అంటే ఢిల్లీ నుండి బద్రీనాథ్ మార్గం లో కలదు. కనుక బస్సు సేవలు బాగా వుంటాయి. వేసవిలో న్యూఢిల్లీ నుండి బద్రీనాథ్ వెళ్ళే బస్సు లు రుద్రప్రయాగ్ మీదుగానే వెళతాయి. రిషికేశ్ నుండి రుద్రప్రయాగ్ కు రెగ్యులర్ బస్సులు కలవు.

రుద్ర ప్రయాగ... పవిత్ర పుణ్య క్షేత్రం!!

మరి ఎప్పుడు వెళుతున్నారు రుద్రప్రయగకి??

Photo Courtesy: Vvnataraj

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X