Search
  • Follow NativePlanet
Share
» »శైవగణం నివసించే ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసే ధైర్యం మీకుందా? ఉంటే మీ కోసమే ఈ కథనం

శైవగణం నివసించే ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసే ధైర్యం మీకుందా? ఉంటే మీ కోసమే ఈ కథనం

హిమాలయ పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్ మార్గాలకు సంబంధించిన కథనం.

హిందూ పురాణాలను అనుసరించి హిమాలయ పర్వతాల్లో పార్వతీ, పరమేశ్వరుడితో పాటు శైవగణం మొత్తం నివశిస్తూ ఉంటుందని చెబుతారు. ఇందుకు సంబంధించిన కథలు ఎన్నో మన అష్టాదశ పురాణాల్లో ఉన్నాయి. ఇక ఈ హిమాలయాల్లోని చాలా మార్గాలు ట్రెక్కర్స్ ను ఆకర్షిస్తున్నాయి. అయితే వీటిలో ఒక్కొక్కమార్గం ఒక్కొక్క కాలంలో ట్రెక్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో మంచు కొద్దిగా కొద్దిగా కరుగుతూ అరుదైన పూలు విరబూసే ఈ జూన్ నెలలో కొన్ని మార్గాలు ట్రెక్ కు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో ట్రెక్కర్స్ కు ఈ హిమాలయ ట్రెక్కింగ్ మార్గాలు మరుపురాని అనుభూతిని మిగులుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా స్వచ్ఛమైన నీటితో జాలువారే జలపాతాలు మీకు కనువిందును కలిగిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. శరీరక, మానసిక దడత్వాన్ని అందించే ఈ ట్రెక్ మార్గాల సమహారం ఈ కథనం. ఇందులో ట్రెక్ మార్గం ఎలా సాగుతుంది, సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంటుంది, ట్రెక్ కఠినత్వం తదితర వివరాలన్నీ మీ కోసం మీ కోసం...

హంపతా పాస్

హంపతా పాస్

P.C: You Tube

ఈ ట్రెక్ మార్గం చాలా వరకూ చిన్నచిన్న కుగ్రామాల నుంచి వెలుతుంది. అందువల్ల అక్కడి గ్రామీన సంస్క`తి, సంప్రదాయాలను కూడా మనం చూడవచ్చు.

ట్రెక్ వివరాలు

సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తు.... 4227మీటర్లు అంటే 14600 అడుగులు

ఎన్ని రోజులు ప్రయాణం....8 నుంచి 9 రోజులు

ఉష్ణోగ్రత......12 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్

ప్రయాణం సాగేది ఇలా....మనాలీ-పండు రూప-చిక్క-బాలు కా గిరా-చత్రూ

ఎలా చేరుకోవాలి...జోగిందర్ రైల్వే స్టేషన్, కులీమనాలీ ఎయిర్ పోర్ట్, మనాలికి బస్సు సర్వీసులు బాగానే ఉన్నాయి.

కఠినత్యం....మధ్యస్థంగా ఉంటుంది. ట్రెక్ లో ఇప్పటికే కొంత అనుభవం ఉన్నవారు ఈ మార్గాలను ఎంచుకొంటే బాగుంటుంది.

బారాబంగాల్

బారాబంగాల్

P.C: You Tube

హిమాలయాల్లో ఉన్న ట్రెక్ మార్గాల్లో అత్యంత కఠినమైన ఇది కూడా ఒకటి. ప్రొఫెషనల్ ట్రెక్కర్స్ మాత్రమే ఈ మార్గంలో ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారు.

ట్రెక్ వివరాలు

సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తు.... 4227మీటర్లు అంటే 14600 అడుగులు

ఎన్ని రోజులు ప్రయాణం.... 9నుంచి 10 రోజులు

ఉష్ణోగ్రత......12 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్

ప్రయాణం సాగేది ఇలా....మనాలి-లామా డంగ్-రియాలి థాచ్-బేస్ ఆఫ్ కాలీ హనీ పాస్-దేవి కి మహ్రీ-దాల్ మహ్రీ-బారా బంగాల్ మహ్రీ-థమ్ సార్ పాస్-ప్లాచక్-బిల్లింగ్-ధర్మశాల

ఎలా చేరుకోవాలి...కత్కోడామ్ రైల్వేస్టేషన్, లేదా హరిద్వార్ రైల్వే జంక్షన్, జాలీ ఎయిర్ పోర్ట్ ద్వారా

ఎలా చేరుకోవాలి...మనాలి, ధర్మశాలకు రోడ్డు మార్గం బాగుంది. ఢిల్లీ నుంచి నేరుగా బస్సు సర్వీసులు ఉన్నాయి. జోగిందర్ రైల్వే స్టేషన్, కులు ఎయిర్ పోర్ట్ కు విమానయాన సేవలు అందుబాటులో ఉంటాయి

కఠినత్యం.... చాలా కఠినంగా ఉంటుంది. ట్రెక్ లో ఇప్పటికే బాగా అనుభవం ఉన్నవారు ఈ మార్గాలను ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

డియో డిబ్బా

డియో డిబ్బా

P.C: You Tube

ఈ మార్గంలో ఫొటోగ్రాఫర్లు పండుగ చేసుకోవచ్చు. తెల్లటి మంచు పర్వతాలు, పచ్చటి పర్వత శిఖరాలు ఒకటేమిటి ప్రక`తిలో ఉన్న అందాలన్నింటిని ఒక చోట చేర్చిన ట్రెక్ మార్గం డియో డిబ్బా ట్రెక్.

ట్రెక్ వివరాలు

సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తు....3,900మీటర్లు అంటే 17792 అడుగులు

ఎన్ని రోజులు ప్రయాణం.... 12 రోజులు

ఉష్ణోగ్రత......12 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 18 డిగ్రీల సెంటీగ్రేడ్

ప్రయాణం సాగేది ఇలా....మనాలి-ప్రిని-పాండ్రూప- సేథన-చిక్కా-మహ్రీ-ప్రియాగ్నీరు-రౌరి కౌధి-జోగీ దుర్గ్-తిల్గాన్

ఎలా చేరుకోవాలి...మనాలికి రోడ్డు మార్గం బాగుంది. ఢిల్లీ నుంచి నేరుగా బస్సు సర్వీసులు ఉన్నాయి. జోగిందర్ రైల్వే స్టేషన్, బుందార్ ఎయిర్ పోర్ట్ కు విమానయాన సేవలు అందుబాటులో ఉంటాయి

కఠినత్యం....మధ్యస్థంగా ఉంటుంది. ట్రెక్ లో ఇప్పటికే కొంత అనుభవం ఉన్నవారు ఈ మార్గాలను ఎంచుకొంటే బాగుంటుంది.

కాశ్మీర్ గ్రేట్ లేక్

కాశ్మీర్ గ్రేట్ లేక్

P.C: You Tube

కాశ్మీర్ లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సులో ఒకటిగా ఈ సరస్సుకు పేరు. ఈ మార్గం గుండా ప్రయాణించే ట్రెక్కర్స్ జీవితంలో మరిచిపోలేని అనుభవాలను సొంతం చేసుకొంటారు.

ట్రెక్ వివరాలు

సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తు.... 4191 మీటర్లు అంటే 13,750 అడుగులు

ఎన్ని రోజులు ప్రయాణం.... 8 నుంచి 9 రోజులు

ఉష్ణోగ్రత......15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్

ప్రయాణం సాగేది ఇలా....శ్రీనగర్-సోనామార్గ్-షేక్ దూర్-నిచినాయ్- విషాన్సర్ లేక్-గాడ్ సర్-సాత్ సర్-గంగాబాన్ ట్విన్ లేక్స్-నరాంగ్

ఎలా చేరుకోవాలి...జమ్ము రైల్వే స్టేషన్, శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ లు ఈ మార్గానికి దగ్గరగా ఉంటాయి.

కఠినత్యం....మధ్యస్థంగా ఉంటుంది. ట్రెక్ లో ఇప్పటికే కొంత అనుభవం ఉన్నవారు ఈ మార్గాలను ఎంచుకొంటే బాగుంటుంది.

రూప్ కుండ్

రూప్ కుండ్

P.C: You Tube

రూప్ కుండ్ సరస్సులో దాదాపు 600 మంది అస్థిపంజారాలను మనం చూడవచ్చు. ఇంత మంది మానవ అస్థిపంజరాలు ఇక్కడకు ఎలా వచ్చాయన్న విషయం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం.

ట్రెక్ వివరాలు
సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తు.... 5029 మీటర్లు అంటే 16499.34 అడుగులు

ఎన్ని రోజులు ప్రయాణం....8 నుంచి 10 రోజులు

ఉష్ణోగ్రత......4 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్

ప్రయాణం సాగేది ఇలా....ఢిల్లీ-గ్వాల్దమ్-లోహార్జంగ్-డిడ్నావిలేజ్-ఆలీ బుగ్నాల్-బెడ్నీ బుగ్నాల్-బగ్వాబాసా-రూప్ కుండ్ లేదా ఢిల్లీ-రిషికేష్-కరన్ ప్రాగ్-వీన్-బెడ్నీ బుగ్నాల్-బంగుబాస్-రూప్ కుండ్

ఎలా చేరుకోవాలి...కత్కోడామ్ రైల్వేస్టేషన్, లేదా హరిద్వార్ రైల్వే జంక్షన్, జాలీ ఎయిర్ పోర్ట్ ద్వారా

కఠినత్యం....మధ్యస్థంగా ఉంటుంది. ట్రెక్ లో ఇప్పటికే కొంత అనుభవం ఉన్నవారు ఈ మార్గాలను ఎంచుకొంటే బాగుంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X