Search
  • Follow NativePlanet
Share
» »ఈ నగరాలు మ‌న దేశంలోని స్వ‌చ్ఛ‌మైన గాలికి చిరునామా

ఈ నగరాలు మ‌న దేశంలోని స్వ‌చ్ఛ‌మైన గాలికి చిరునామా

ఈ నగరాలు మ‌న దేశంలోని స్వ‌చ్ఛ‌మైన గాలికి చిరునామా

దేశంలో వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామికీకరణ కార‌ణంగా అనేక నగరాల పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఇది ప‌ర్యాట‌క ప్రాంతాల‌కూ వ్యాపించింది. ఆధునికీక‌ర‌ణ పేరుతో కొన్ని చోట్ల చేస్తోన్న విధ్వంశం ఆరోగ్య‌క‌ర‌మైన‌ ప‌ర్యావ‌ర‌ణాన్ని ప్ర‌శ్నార్థ‌కంగా మార్చేస్తోంది. అయినప్పటికీ, నేటికీ గాలి కాలుష్యం లేని నగరాలు చాలా ఉన్నాయి.

ఇలాంటి చోట ఏ భ‌యం లేకుండా మీరు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవచ్చు. మ‌రెందుకు ఆల‌స్యం కేర‌ళ నుంచి సిక్కిం వ‌ర‌కూ అత్యంత స్వ‌చ్ఛ‌మైన గాలి దొరికే ఏడు న‌గ‌రాల‌ను చూసొద్దామా?!

కిన్నౌర్, హిమాచల్ ప్రదేశ్

కిన్నౌర్, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్‌లోని కిన్నౌర్ నగరం స్వచ్ఛమైన గాలికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మీరు సెలవు కోసం కుటుంబ‌స‌మేతంగా విహారానికి వెళ్లాల‌నుకుంటే కిన్నౌర్ స‌రైన ఎంపిక‌. ఇక్క‌డి స్వ‌చ్ఛ‌మైన గాలితోపాటు స‌హ‌జ‌సిద్ధ‌మైన ప్ర‌కృతి అందాల‌ను మ‌న‌సారా ఆస్వాదించ‌వ‌చ్చు. కొండ కోన‌ల నడుమ కాలిన‌డ‌క‌న ట్రెక్ చేస్తూ ఆరోగ్య సూత్రాల‌ను పాటించేందుకు కిన్నౌర్ మీకు ఆహ్వానం ప‌లుకుతోంది.

కొల్లం, కేరళ

కొల్లం, కేరళ

దేశంలోనే అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో క‌లిగిన‌ వాడ‌రేవుగా ఈ న‌గ‌రం అలరారుతోంది. ఆహ్లాదాన్ని అందించే స్వ‌చ్ఛ‌మైన‌ గాలితోపాటు నాణ్య‌త క‌లిగిన నీటిని ఇక్క‌డ ఆస్వాదించ‌వ‌చ్చు. అత్యంత తక్కువ స్థాయి వాయు కాలుష్యం, అధిక గాలి నాణ్యత మరియు తాగునీటి నాణ్యతకు ప్రసిద్ధి చెందిన కొల్లాం నిస్సందేహంగా భారతదేశంలోని అత్యంత స్వచ్ఛమైన గాలిని కలిగి ఉన్న నగరాల్లో అగ్ర‌స్థానంలో నిలుస్తుంది. మీరు ఇక్కడ అందమైన బీచ్‌లు మరియు ప్రశాంతమైన బ్యాక్ వాటర్‌లను ఆస్వాదించవచ్చు.

పాండిచ్చేరి, తమిళనాడు

పాండిచ్చేరి, తమిళనాడు

పాండిచ్చేరి ప్రశాంతమైన ప్రదేశంగా పరిగణించబడుతోంది. ఇక్క‌డ సంద‌ర్శ‌కులు ప్ర‌తినిమిషం ఎంజాయ్ చేసేందుకు అవ‌కాశం ఉంది. సర్ఫింగ్, రుచికరమైన ఆహారం, ఒత్తిడిని తగ్గించే యోగా సెషన్‌లు, పగడపు బీచ్‌లలో డైవింగ్ చేయడంలాంటి అనేక కార్య‌క‌లాపాల‌కు ఇది నిల‌యమ‌నే చెప్పాలి. ప‌రిశుభ్ర‌మైన గాలితో పాండిచ్చేరి దేశంలోనే ఒక పేరుగాంచిన‌ గమ్యస్థానంగా ప్ర‌సిద్ధిగాంచిందన‌డంలో సందేహ‌మే లేదు.

భోపాల్, మధ్యప్రదేశ్

భోపాల్, మధ్యప్రదేశ్

భోపాల్‌ను సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ చిన్న‌, పెద్ద ప‌రిమాణాల‌లో చాలా స‌రస్సులు ప‌ర్యాట‌కుల‌ను క‌నువిందు చేస్తాయి. దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో భోపాల్ కూడా ఒకటి. ఇక్కడి స్వచ్ఛమైన గాలి మీ హృదయాన్ని రంజింపజేస్తుంది. మీరు ఇక్కడ రుచిక‌ర‌మైన వెరైటీ ఆహారాన్ని రుచి చేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

గాంగ్టక్, సిక్కిం

గాంగ్టక్, సిక్కిం

సిక్కింలో దాగిన ఒక కొండ పట్టణం గాంగ్ట‌క్‌. మీరు మంచుతో కప్పబడిన హిమాలయాలను ద‌గ్గ‌ర‌గా చూసే అనుభూతిని కోరుకుంటే వెంట‌నే ఇక్క‌డ అడుగుపెట్టండి. భారతదేశంలోని అతి తక్కువ కాలుష్య నగరాలలో గ్యాంగ్‌టక్ ఒకటి. ఇక్కడి ప్రకృతి సౌందర్యం మీ హృదయాన్ని గెలుచుకుంటుంది.

మధురై, తమిళనాడు

మధురై, తమిళనాడు

భారతదేశంలోని పురాతన నగరాలలో మధురై ఒకటి. చరిత్ర, పురాణాలు మరియు సంస్కృతి ఈ నగరంతో ముడిపడి ఉన్నాయి. ఈ నగరం WHOచే భారతదేశంలోని ఐదు అతి తక్కువ కాలుష్య నగరాల జాబితాలో చేర్చబడింది.

హసన్, కర్ణాటక

హసన్, కర్ణాటక

ఇది కర్నాటక రాష్ట్రంలోని ఒక జిల్లా. సహజమైన, పరిశుభ్రమైన పచ్చని ప్రకృతి అందించిన బ‌హ‌మ‌తిగా హ‌స‌న్‌ను చెప్పుకోవ‌చ్చు. పేదల ఊటీగా పేరుగాంచిన హసన్ మే 2016లో WHO చే భారతదేశంలోని అతి తక్కువ కాలుష్య నగరాల జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది.

Read more about: kinnaur himachal pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X