• Follow NativePlanet
Share
» »ఈ ప్రాంతాలకు వెళితే టైం మిషన్ లో అప్పటి కాలానికి వెలుతారు?

ఈ ప్రాంతాలకు వెళితే టైం మిషన్ లో అప్పటి కాలానికి వెలుతారు?

Written By: Kishore

'వారి'అందాలను చూడాలంటే మీరు...

ఇక్కడ మీ అందాలను మీరే ఆరబోస్తారుఆ' సుఖాలను పొందుతామని తెలిస్తే

'ఆ' సుఖాలను పొందుతామని తెలిస్తే ఇక్కడ చనిపోవడానికి మీరు సిద్ధమవుతారు

రామాయణం కొందరి నోటి ఇది పుక్కిట పురాణం గా చెప్పబడుతుంది. మరికొందరి నోట ఒక మహాపురుషుడు జీవిత కథ. మరి కొందరు ఏమో రామాయణం జరిగినది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని కేవలం ఇది ఒక చరిత్ర మాత్రమేని వారు వాదిస్తారు. రాముడు దేవుడు కాదని ఒక సాధారణ మానవుడేనని చెబుతారు. మరికొందరు మాత్రం దేవుడంటే ఎవరో కాదని మంచి పనులు చేసే ప్రతి ఒక్కరూ దేవుడితో సమానమని ఈ లెక్కన రాముడు దేవుడే అనేది వారి వాదన. అయితే గర్భవతి అని కూడా చూడకుండా ఎవరో నింద వేశారని సీతను అడవులకు పంపిన రాముడు దేవుడెలా అవుతాడని మరికొందరు చెబుతారు. ఎవరెన్నీ చెప్పిన సదరు రామయణంలోని ప్రముఖ పాత్రలైన రాముడు, లక్ష్మణుడు, సీత, రావణుడు, విభీషనుడికి సంబంధించిన కొన్ని ప్రాంతాలు ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలుగా, పర్యాటక స్థలాలుగా మారిపోయాయి. అక్కడకు వెళితే అక్కడి స్థలాలు, కట్టడాల పై ఉన్న శిల్పాల వల్ల టైం మిషన్ అన్నది నిజంగా ఉంటే రామాయణం జరిగిన కాలానికి వెళ్లినట్టు అనిపించక మానదు.

1. గంగోత్రీ

1. గంగోత్రీ

Image Source:

గంగోత్రి, ఇది ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 3750 మీ. ఎత్తున, హిమాలయాల పర్వత శ్రేణులలో ఉన్నది. ఈ ప్రదేశం భగిరథి నది ఒడ్డున ఉన్నది.
రాముడి ముందు తరాల వ్యక్తి భగీరథుడు గంగను భూమి పైకి దింపిన స్థలం ఇదే.

2. కపిల మహర్షి ఆశ్రమం - గంగాసాగర్

2. కపిల మహర్షి ఆశ్రమం - గంగాసాగర్

Image Source:

శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి కుమారులు 60,000మంది కాలి బూడిదైన స్థలం. గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించింది ఇక్కడే మకర సంక్రాంతి రోజున వేలాది మంది యాత్రికులు ఇక్కడికి వచ్చి గంగ్సాగర్ మేళా లేదా వేడుక లో పాల్గొంటారు. ఇక్కడే సాగర్ మెరైన పార్క్ మరియు కపిల మహర్షి ఆశ్రమం అనే రెండు ప్రదేశాలు ఉన్నాయి. కపిలమహర్షి, భగీరథుడు రాముడు ముందు తరాలకు చెందిన వారిగా తెలుస్తుంది.

3. గోకర్ణ

3. గోకర్ణ

Image Source:

కర్ణాటక గోకర్ణ కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. రామాయణంలో విలన్ గా పేర్కొనబడే రావణుడు శివుడి ద్వారా ఆత్మలింగాన్ని పొందడం దానిని దేవతలు ఉపాయంగా తిరిగి చేజిక్కించుకోవడం ఇదే ప్రదేశంలో జరిడింది. టూరిస్ట్ స్పాట్ గా కూడా విరాజిల్లుతోంది.

4. సీతాదేవి భూమిలో లభించిన చోటు

4. సీతాదేవి భూమిలో లభించిన చోటు

Image Source:

సీతా దేవి అయోజనిని అని తెలుసు కదా. అంటే ఆమె తల్లి, తండ్రులు ఎవరన్న విషయం తెలియదు. పెంచిన తండ్రి జనకుడకు భూమిని తవ్వుతున్న సమయంలో సీతా దేవి భూమిలో దొరికింది. ఆ ప్రాంతం ప్రస్తుతం సీతామర్హి గా పిలువబడుతోంది. బీహార్ రాష్ట్ర జిల్లాలలో సీతామర్హి ఒకటి. ప్రస్తుతం సీతామర్హి ప్రముఖయాత్రా స్థలంగా మారింది.

5. శ్రీరాముని జన్మస్థలం

5. శ్రీరాముని జన్మస్థలం

Image Source:

సరయు నది ఒడ్డున ఉన్న హిందువుల ప్రఖ్యాత పుణ్య క్షేత్రం అయోధ్య. శ్రీ రాముడు జన్మించింది ఇక్కడే అని చెబుతారు. దీనితో పాటు బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం, శ్రీరాముడు అవతారం చాలించే సమయంలో సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలంగా కూడా దీనిని అభివర్ణిస్తారు.

6.రాముడు భూమిని వదిలింది ఇక్కడే

6.రాముడు భూమిని వదిలింది ఇక్కడే

Image Source:

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ గంగా నదికి చిన్న ఉపనది అయిన ఘఘ్రా నది ఒడ్డున ఉంది. గుప్తర్ ఘాట్ హిందువులకు అపరిమితమైన గౌరవంతో కూడిన విలువ కలిగిఉంది, ఎందుకంటే శ్రీరాముడు భూమిని వదిలి జలసమాధి చెందిన తరువాత విష్ణుమూర్తి అవతారంలో కలిసిపోయింది ఇక్కడేనని మరికొంత మంది నమ్ముతారు.

7. తాటక వధ జరిగిన ప్రదేశం

7. తాటక వధ జరిగిన ప్రదేశం

Image Source:

బక్సర్ పురాతన చరిత్రలో బక్సర్ ప్రాతం గురించి రామాయణ కావ్యంలో ప్రస్తావించబడింది. శ్రీరాముని గురువైన విశ్వామిత్రుడు 8 వేలమంది సన్యాసులతో గంగాతీరంలో నిర్మించిన పవిత్ర ఆశ్రమప్రాంతం ఇదని విశ్వసిస్తున్నారు. శ్రీరాముడు ఈ ప్రాంతంలో శ్రీరాముడు రాక్షసి తాటకిని వధించాడని భావిస్తున్నారు. శ్రీరాముడు లక్షణునితో ఇక్కడ గురూపదేశం పొందాడని భావిస్తున్నారు. బక్సర్ పట్టణానికి 6కి.మీ దూరంలో ఉన్న అహిరౌలి అహల్య శాపవిమోచనం పొందిన ప్రాంతమని భావిస్తున్నారు.

8. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు

8. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు

Image Source:

రామాయణంలో రాముడు అరణ్యవాసం చేసే సమయంలో ఒక నదిని దాటాల్సిన సమయంలో గుహడనే ఓ బెస్తవాడు రాముడు, లక్షణుడు, సీతాదేవికి సహాయం చేస్తాడు. ఆ ప్రాంతం శృంగబేరిపురం. ప్రస్తుతం ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ సమీపంలో ఉంది.

9.దండకారణ్యం

9.దండకారణ్యం

Image Source:

చత్తీస్ ఘడ్ రామాయణకథలో కనిపిస్తున్న దండకారణ్య ఆవిర్భావ ప్రస్తావన పద్మపురాణంలో ఉంది. శ్రీరాముడు అరణ్యవాసానంతరం పట్టాభిషిక్తుడైన తర్వాత ఆ అరణ్యప్రాంతానికి వెళ్ళినప్పుడు అగస్త్యుడు శ్రీరాముడికి ఆ అరణ్యం పూర్వాపరాలను వివరించి చెప్పాడు.

10. సీతారామలక్ష్మణులు వనవాసం చేసిన చోటు

10. సీతారామలక్ష్మణులు వనవాసం చేసిన చోటు

Image Source:

చిత్రకూటం పేరు వినగానే ఆ ప్రదేశంలో జరిగిన రామాయణ సన్నివేశాలు కళ్ళ ముందర కదలాడతాయి. ఉత్తరప్రదేశ్ సరిహద్దులకు దగ్గరగా మధ్య ప్రదేశ్ అడవులలో ఈ ప్రాంతం కనిపిస్తుంది. సీతారాములు అరణ్యవాసం సమయంలో ఎక్కువ సమయం ఇక్కడే తిరిగాడారని చెబుతారు. ప్రస్తుతం ఇది పర్యాటక కేంద్రంగా ఉంది.

11. శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం

11. శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం

Image Source:

పంచవటి. ఒక రకంగా రామ, రావణ యుద్ధం జరగడానికి కారణం ఇక్కడే అని చెప్పవచ్చు. వనవాసం సమయంలో లక్ష్మణుడు శూర్ఫనఖ ముక్కు, చెవులు కోసింది ఇక్కడేనని చెబుతారు. ఇక్కడ కూడా రాముడు, లక్ష్మణుడు తిరిగాడిన ఎన్నో ప్రదేశాలను మనం చూడవచ్చు.

12. శబరి ఆశ్రమం

12. శబరి ఆశ్రమం

Image Source:

రామలక్ష్మణులు ఒక నాడు అడవిలో కలియ తిరుగుతుండగా వారికి ఒక సరోవరం కనిపిస్తుంది. అదే పంపా సరోవరం. ప్రస్తుతం ఇది కర్నాటకలోని హంపి వద్ద ఉంది. ఈ సరోవరం చాలా ప్రశస్తి చెందినది. ఇక్కడే శబరి అనే రామ భక్తురాలు నివసించేదని చెబుతారు. శబరిని కలుసుకున్నతర్వాత రాముడు ఆమె ఎంగిలి చేసి ఇచ్చిన పళ్లను తిన్నది ఈ సరోవరం దగ్గరే అని చెబుతారు.

13.హనుమాన్ హళ్లి

13.హనుమాన్ హళ్లి

Image Source:

హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్లి. ప్రస్తుతం ఇది కొప్పల్ పట్టణం లోని హనుమాన్ హళ్ళి బెంగుళూరుకు 300 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి దేవాలయాలు ఇసుక శిలలతో నిర్మించబడి ఉన్నాయి.

14. హనుమంతుడి జన్మస్థలం - ఆంజనేయ పర్వతం

14. హనుమంతుడి జన్మస్థలం - ఆంజనేయ పర్వతం

Image Source:

తుంగభద్ర నదీతీర ప్రాంతం కిష్కింద వాలి మరియు సుగ్రీవులు అనే కవల సోదరులు పరిపాలించిన వానరుల రాజ్యం. ఇది పంపానది తీరమున కలదు. ఇక్కడే హనుమంతుడు జన్మించిన ప్రదేశం అయిన ఆంజనేయ పర్వతం కలదు. ఈ ప్రదేశం కర్నాటకలోని తుంగభధ్ర నదీ తీరాన ఉన్న హంపికి కొద్ది దూరంలోనే ఉంది.

15. విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం

15. విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం

Image Source:

ధనుష్కోడి ఒక చిన్న గ్రామం . ఇది తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం లో కలదు. ఒక ఇతిహాసం మేరకు రావణుడి సోదరుడైన విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం. విభీషణుడి సహకారం వల్ల రాముడు రావణున్ని సంహరిస్తాడు.

16. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు

16. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు

Image Source:

శ్రీ లంకలో రావణుడి కోటలో సీతాదేవి ఉందని తెలుసుకున్న రాముడు అక్కడికి చేరడానికి సముద్రం పై వంతెన నిర్మించాలని భావిస్తాడు. ఇందుకు అవసరమైన పనులు రామేశ్వరం నుంచే మొదలయ్యాయని చెబుతారు. అంతే కాకుండా బ్రాహ్మణోత్తముడైన రావణుడిని సంహరించిన తర్వాత పాప పరిహారం కోసం కైలాసం నుంచి శివలింగాన్ని తెచ్చి రామేశ్వరంలో ప్రతిష్టించి పూజించాలని రాముడు భావిస్తాడు. అయితే లింగం తీసుకురావడాని వెళ్లిన హనుమంతుడు సమయానికి తిరిగా రాలేదు. దీంతో సీతాదేవి స్వహస్థాలతో చేసిన ఇసుక లింగమును శ్రీరాముడు రామేశ్వరంలో ప్రతిష్టించి పూజిస్తాడు. ఇప్పటికి ఈ లింగం రామనాథస్వామి ఆలయంలో చూడవచ్చు.

17. సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం

17. సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం

Image Source:

బితూర్ అనే ప్రదేశం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలో ఉంది. ఈ ప్రదేశంలోనే వాల్మీకి ఆశ్రమం ఉంది. ఇక్కడే సీతా దేవి లవ కుశలను జన్మనిచ్చిన ప్రదేశంగా దీనిని పేర్కొంటారు. అంతే కాకుండా ఇక్కడే సీతాదేవి భూదేవిలో ఐక్యమైనది.

18. సీతా రామ లక్ష్మణులు నడియాడిన ప్రదేశం

18. సీతా రామ లక్ష్మణులు నడియాడిన ప్రదేశం

Image Source:

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఒక చిన్న గ్రామం. రాముడు తన వనవాసం సమయంలో సీతా మరియు లక్ష్మణుల తో కలిసి ఇక్కడ కొంత కాలం నివసించాడు. అందువల్లే ఈ ప్రదేశాన్ని సీతా రామ లక్ష్మణులు నడియాడిన ప్రదేశం గా ప్రసిద్ధి చెందినది. ఇక్కడున్న భద్రాద్రి రాముడికి ప్రభుత్వ లాంఛనాలతో ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుతారు.

19. సీతమ్మవారి దాహాన్ని రాముడు తీర్చిన ప్రదేశం - ఒంటిమిట్ట

19. సీతమ్మవారి దాహాన్ని రాముడు తీర్చిన ప్రదేశం - ఒంటిమిట్ట

Image Source:

సీతమ్మవారి దాహాన్ని రాముడు తీర్చిన ప్రదేశం గా ఒంటిమిట్టను పేర్కొంటారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఉంది. ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధము ఉంది సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడినది. ఈ దేవాలయంలో ఆంజనేయుడు ఉండడు.

20. రామగిరి

20. రామగిరి

Image Source:

సీతారామలక్ష్మణులు సంచరించినట్లు చెప్పబడుతున్న రామగిరి రామాయణంలోని కొన్ని ఘట్టాలను కళ్లకు కట్టే రామగిరి ఖమ్మం జిల్లాలో ఉంది. వనవాసం సమయంలో శ్రీరాముడు రామగిరిపై కొద్దిరోజులు కుటీరం ఏర్పరుచుకొని ఉన్నట్లు చెబుతారు. ఈ ఖిల్లాపై సీతారామలక్ష్మణులు సంచరించినట్లు చెప్పబడుతున్న కొన్ని ఆనవాళ్ళు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఖిల్లాపైన గల బండరాతిపై శ్రీరాముని పాదాలు ఉన్నాయి.

21. వానర సైన్యం నాలుగు భాగాలుగా విడిపోయిన ప్రదేశం

21. వానర సైన్యం నాలుగు భాగాలుగా విడిపోయిన ప్రదేశం

Image Source:

సీతమ్మవారి అన్వేషణకుగాను బయలుదేరిన వానర సైన్యం నాలుగు భాగాలుగా విడిపోయిన ప్రదేశంగా ప్రకాశం జిల్లాలోని చదలవాడగా పేర్కొంటారు. ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే శ్రీరాముని విగ్రహానికి కుడి వైపున సీతాదేవి విగ్రహం ఉంటుంది. సహజంగా స్వామి వారికి ఎడమవైపున సీతాదేవి వుండటం చూస్తుంటాం. ఇక్కడ ఈ విధంగా ప్రతిష్టించడానికి కారణం ఆగస్త్యమహాముని.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి