Search
  • Follow NativePlanet
Share
» »ఇన్ని లక్షల కోట్ల రుపాయలు ఇక్కడ ఏమి చేస్తున్నారు? అవి నాకే దొరికితే

ఇన్ని లక్షల కోట్ల రుపాయలు ఇక్కడ ఏమి చేస్తున్నారు? అవి నాకే దొరికితే

భారత దేశంలో అత్యంత ధనిక దేవాలయాల గురించి కథనం.

By Kishore

ఈ దేవాలయకు వెళితే ప్రసాదంతో పాటు ఆ 'యాంగిల్స్'పై నాలెడ్జ్ కూడా ఫ్రీఈ దేవాలయకు వెళితే ప్రసాదంతో పాటు ఆ 'యాంగిల్స్'పై నాలెడ్జ్ కూడా ఫ్రీ

ఇక్కడ ఆ పందిరి వేస్తే...ఇక్కడ ఆ పందిరి వేస్తే...

భారత దేశంలో కొన్ని వేల ఇంకా చెప్పాలంటే లక్షల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. అన్ని దేవాలయాల్లో వివిధ పేర్లతో, రూపాల్లో దేవుడు కొలవై ఉన్నాడు. అయితే కొన్ని దేవాలయాలకు మాత్రమే భక్తులు ఎక్కువ సంఖ్యలో వెలుతుంటారు. ఇందుకు ప్రధాన కారణం అక్కడ దేవుడు పరమ పవిత్రమైనవాడని నమ్మకం. అక్కడికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటే పాపాలన్నీ పోతాయని, పుణ్యం వస్తుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని ఇలా ఎవరి నమ్మకం వారిది. ఈ దైవ దర్శనం సమయంలో కొంతమంది కానుకలు సమర్పిస్తుంటారు. ఈ కానుకలు కేవలం డబ్బు రూపంలోనే కాకుండా బంగారం, వెండి రూపంలో కూడా ఉంటాయి. మొత్తంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం ఒక కారణమైతే, వారు సమర్పించే కానుల మరో కారణం వల్ల తిరుపతి వెంకటేశ్వర దేవాలయం, అనంతపద్మనాభస్వామి దేవాలయం వంటి గుళ్లు అత్యంత ధనికమైన దేవాలయాలుగా పేరుగాంచినవి. ఒక్కొక్కసారి అంతటి సొమ్ము నాకే దొరికితే అనే చిలిపి ఆలోచన కొంతమందికి వస్తుంది. అయితే మనకు దొరకదు. ఎందుకంటే మనం మనుష్యులం కదా? ఏమంటారు. ఆ సొమ్ముతో అనేక ధార్మిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంటే వాటిలో కొంత పక్కదారి పడుతోంది అనుకొండి అది వేరే విషయం.

1. శబరిమల

1. శబరిమల

Image Source:

అయ్యప్ప సన్నిసాధానం శబరిమల. హిందువులు పరమ పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాల పర్యటనల్లో ఈ శబరిమల యాత్ర కూడా ఒకటి. ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమలలో కనబడే దివ్య జ్యోతి దర్శనం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తారు.

2. ఏడాది మొత్తం తెరిచి ఉండరు

2. ఏడాది మొత్తం తెరిచి ఉండరు

Image Source:

అన్నట్టు మిగిలిన దేవాలయాల మాదిరి ఏడాది మొత్తం భక్తుల రాక కోసం ఆలయ ద్వారాలు తెరిసి ఉండవు. కేవలం కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే ఆలయం తలుపులు ఇక్కడ తెలురుస్తారు. అయినా కూడ భారత దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో శబరిమలలోని అయ్యప్ప దేవాలయం పదో స్థానంలో నిలుస్తుంది.

3. అమర్నాథ్ గుహ

3. అమర్నాథ్ గుహ

Image Source:

జమ్ము కాశ్మీర్ లోని ఈ గుహాలయం పరమశివుడు కొలువై ఉంటాడు. అమర్ నాథ్ గుహాలయం గురించి పురాణాల్లో కూడా ఉంది. సృష్టి రహస్యాన్ని పరమశివుడు ఇక్కడే పార్వతీ దేవికి చెప్పాడని పురాణ కథనం. హిమాలయ పర్వత ప్రాంతాల్లోని ఈ దేవాలయంలో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.

4. వేసవిలో

4. వేసవిలో

Image Source:

ముఖ్యంగా వేసవిలో మాత్రమే ఈ లింగం రూపం మనకు కనబడుతుంది. భారత దేశంలో అత్యంత సపన్నమైన దేవాలయాల్లో అమర్ నాథ్ దేవాలయం తొమ్మిదో స్థానంలో ఉంది.

5. కాశీ విశ్వనాథ దేవాలయం

5. కాశీ విశ్వనాథ దేవాలయం

Image Source:

కాశీ విశ్వనాథ దేవాలయం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉంది. వారణాసినే కాశీ అని కూడా పిలుస్తారు. 12 జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం శివుడు ఆసియా ఖండంలో ప్రజలు నివశిస్తున్న అత్యంత పురాతన దేవాలయాల్లో వారణాసి మొదటి స్థానంలో ఉంటుంది. జలయ ప్రళయం కూడా ఈ నగరాన్ని ఏమీ చేయలేదని చెబుతారు. ఈ దేవాలయం గంగానది తీరంలో ఉంటుంది.

6. గంగా హారతి

6. గంగా హారతి

Image Source:

ఇక్కడ ప్రతి రోజు నిర్వహించే గంగా హారతిని చూడటానికి విదేశఆల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ స్వామివారిని పూజించే సాత్మిక భక్తులతో పాటు తాంత్రిక శక్తులను వశం చేసుకోవడానికి వినూత్న పూజలు నిర్వహించే అఘోరాలు కూడా మనకు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ కనబడుతారు. ఈ దేవాలయం భరత దేశంలో అత్యంత సంపన్న దేవాలయంలో ఎనిమిదోస్థానంలో ఉంది.

7. పూరి జగన్నాథ దేవాలయం

7. పూరి జగన్నాథ దేవాలయం

Image Source:

ఒరిస్సాలోని పూరి పట్టణంలో ఉన్న జగన్నాథ దేవాలయం హిందువలకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఛార్ దామ్ యాత్రలో భాగంగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొంటూ ఉంటారు. ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు జగన్నాథుని రూపంలో కొలువై ఉన్నాడు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కాని తీర్థయాత్రల పుణ్యఫలం దక్కదని పురణాల్లో వర్ణించబడినట్లు పెద్దలు చెబుతారు.

8. రథయాత్ర చాలా ప్రాచూర్యం పొందింది

8. రథయాత్ర చాలా ప్రాచూర్యం పొందింది

Image Source:

ఇక్కడ జరిగే రథయాత్రను తిలకించడానికి లక్షల సంఖ్యలో భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తారు. వీరిలో దాదాపు 10 శాతం విదేశీయులు కూడా ఉండటం గమనార్హం. ఈ దేవాలయం అత్యంత సంపన్న దేవాలయాల్లో ఏడో స్థానంలో ఉంది.

9. మధురై మీనాక్షి దేవాలయం

9. మధురై మీనాక్షి దేవాలయం

Image Source:

మీనాక్షి దేవాలయం తమిళనాడులోని మధురైలో ఉంది. ఈ దేవాలయాన్ని ప్రతి రోజు కనీసం 70 వేల మంది దర్శించుకుంటూ ఉంటారు. కానుకల రూపంలో ఎక్కువ సంఖ్యలో నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను కూడా భక్తులు అందజేస్తుంటారు. అందువల్లే ఈ దేవాలయం భారత దేశంలోని సంపన్న దేవాలయాల్లో ఆరో స్థానంలో ఉంది.

10. ముంబైలోని సిద్ధి వినాయక దేవాలయం

10. ముంబైలోని సిద్ధి వినాయక దేవాలయం

Image Source:

తమ జీవితంలో మహత్తరమైన నిర్ణయాన్ని తీసుకునే ముందు ముంబైలోని చాలా మంది వ్యక్తులు నగరంలో ఉన్న సిద్ధి వినాయకుడి దేవాలయానికి వెలుతారు. ముఖ్యంగా బాలివుడ్ నటీనటులు ఈ దేవాలయానికి ఎక్కువ సంఖ్యలో వెళ్లడమే కాకుండా భారీగా కానుకలు కూడా అందజేస్తుంటారు.

11. బంగారం రూపంలో

11. బంగారం రూపంలో

Image Source:

ఈ దేవాలయానికి బంగారం రూపంలో ఎక్కువ మొత్తంలో కానుకలు వస్తుంటాయి. కష్టం వచ్చినప్పుడు ఈ గణపతికి మొక్కుకుంటే వెంటనే ఆ కష్టాలు తీరిపోతాయని నమ్ముతారు. అందువల్లే ఈ దేవాలయం సంపన్న దేవాలయాల్లో ఐదో స్థానంలో ఉంది.

12. వైష్ణోదేవి దేవాలయం

12. వైష్ణోదేవి దేవాలయం

Image Source:

భారత దేశంలోని పవిత్ర క్షేత్రాల్లో ఒకటైన వైష్ణోదేవి దేవాలయం జమ్ము కాశ్మీర్ లోని త్రికూట పర్వతం పై సముద్రమట్టానికి దాదాపు 1700 మీటర్ల ఎత్తులో ఉంది. జమ్ము కాశ్మీర్ లోని కట్రా పట్టణానికి 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం పైకి వాహనాలు వెళ్లవు. దేవాలయానికి దాదాపు 16 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలిచి పోతాయి. అక్కడ నుంచి కాలి నడకన లేదా గుర్రాల పై వెళ్లాల్సి ఉంటుంది.

13. గుహాలయం

13. గుహాలయం

Image Source:

ఇది ఒక గుహాలయం. ఇక్కడ అమ్మవారు సరస్వతి, లక్ష్మీ, సరస్వతి రూపాల్లో ఉంటుంది. సతీదేవి కుడిచేయి పడిన ప్రాంతమే వైష్ణోదేవాలయంగా రూపాంతంర చెందిందని భక్తులు నమ్ముతారు. ప్రతి ఏడాది సుమారు 8 మిలియన్ల మంది భక్తులు వైష్ణోదేవిని సందర్శించుకొంటూ ఉంటారు. అందువల్లే అత్యంత సంపన్న దేవాలయల్లో ఇది నాలుగో స్థానంలో ఉంది.

14. శిరిడీ దేవాలయం

14. శిరిడీ దేవాలయం

Image Source:

మహారాష్ట్రలోని శిరిడీ గ్రామంలో ఉన్న ఈ దేవాలయానికి దేశ విదేశాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రతి రోజు సుమారు 20 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు.

15. పండుగలు వారాంతాల్లో ఎక్కువ

15. పండుగలు వారాంతాల్లో ఎక్కువ

Image Source:

పండుగలు, వారాంతాలు, పుణ్యదినాల్లో ఈ సంఖ్యల లక్షకు చేరుతుంది. ఇక్కడ ఆలయానికి బంగారం రూపంలో ఎక్కువగా కానుకలు వస్తుంటాయి. అందువల్లే సంపన్న దేవాలయాల్లో ఇది మూడో స్థానంలో ఉంది.

16. తిరుపతి

16. తిరుపతి

Image Source:

ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల వేంకటేశ్వర దేవాలయం ఆదాయంలో రెండోస్థానంలో ఉంది. అతి పురాతన కాలం నుంచి ఇక్కడ దేవాలయం ఉంది. ఇక్కడ హుండీ ఆదాయం ఒక్కక్కసారి ఒక రోజులోనే రూ.3 కోట్లకు పైగా ఉంటుందంటే కానుకల రూపంలో వచ్చే ఆదాయం ఎంతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

17. భక్తుల సంఖ్యలో మొదటి స్థానంలో

17. భక్తుల సంఖ్యలో మొదటి స్థానంలో

Image Source:

భారత దేశంలో ఒక రోజులో భక్తులు ఎక్కువ సంఖ్యలో దైవ దర్శనం చేసుకొనే దేవాలయాల్లో తిరుమల వేంకటేశ్వర దేవాలయం మొదటి స్థానంలో ఉంటుంది.

18. అనంత పద్మనాభస్వామి దేవాలయం

18. అనంత పద్మనాభస్వామి దేవాలయం

Image Source:

కేరళలోని తిరువనంతపురం లో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ నేలమాళిగల్లో కూడా లక్షల కోట్ల రుపాయలు విలువచేసే వజ్రాలు, వైడ్యూర్యాలతో పాటు బంగారం నగలు కూడా ఉన్నాయి.

19. నాగబంధం

19. నాగబంధం

Image Source:

ఇక్కడ ఉన్న ఒక గదికి నాగబంధం ఉండటం వల్ల ఈ గది తలుపులు తీయడానికి వీలు కావడం లేదు. ఈ గది తలుపులు తీస్తే మరింత సంపద బయటపడవచ్చునని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X