Search
  • Follow NativePlanet
Share
» »మంత్రముగ్ధులను చేసే పహల్గాం పర్యటన !

మంత్రముగ్ధులను చేసే పహల్గాం పర్యటన !

పహల్గాం ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది జమ్మూ & కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా లో కలదు. సముద్ర మట్టానికి 2740 మీ. ల ఎత్తున కలదు. ఈ ప్రదేశంలో దట్టమైన అడవులు, అందమైన సరస్సులు, స్వచ్చమైన జలపాతాలు, మైదానాలు, పూల ప్రదేశాలు మొదలైనవి పర్యాటకులను ముగ్ధులను చేస్తాయి.

ఇక్కడ నుండి ట్రెక్కింగ్ లో చాన్దివార్, ఆరు వల్లే మరియు కోహ్లి గ్లేసియర్ లకు చేరవచ్చు. మట్టాన్, తర్సార్ సరస్సు, శికర్గా, సన్ టెంపుల్, ఆయుష్ ముకం, మొదలైనవి కొన్ని ప్రసిద్ధ ఆకర్షణలు.

సుందరమైన ప్రదేశాలు కల పహల్గాం అనేక హిందీ చిత్రాల షూటింగ్ లకు నిలయంగా కూడా వుంది. మరి ఇంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం ఐన పహల్గాం సమీపంలోని మరికొన్ని ఆకర్షణలు కూడా తెలుసుకొందాం.
పహల్గాం హోటల్ వసతులకు క్లిక్ చేయండి

ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?

పహల్గాం చేరాలంటే, సమీప విమానాశ్రయం శ్రీనగర్ లో కలదు. శ్రీనగర్ నుండి పహల్గాం 95 కి. మీ. ల దూరం. టూరిస్ట్ లు టాక్సీ లేదా బస్సు లలో ఎయిర్ పోర్ట్ నుండి పహల్గాం చేరవచ్చు. పహల్గాం కు సమీప రైలు స్టేషన్ శ్రీనగర్ రైల్ స్టేషన్. ఇక్కడ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. రోడ్డు మార్గంలో ప్రయానించాలంటే, ఢిల్లీ కి 828 కి. మీ. ల దూరంలో పహల్గాం కలదు. శ్రీనగర్ కు 95 కి. మీ. లు. కాశ్మీర్ లోని ఈ లోయ ప్రాంతం చేరేందుకు పర్యాటకులు నేషనల్ హై వే 1 ఎ ద్వారా ప్రయాణించాలి.

Photo Courtesy: Philip Cotsford

ఆయుష్ ముకం

ఆయుష్ ముకం

ఇది ఒక చిన్న కొండపై నిర్మించిన ఒక పుణ్య క్షేత్రం.దీనిని బాబా జైనా ఉద్ దిన్ వాలి అనే ఒక సూఫీ ప్రవక్త గౌరవార్ధం నిర్మించారు.ఇది శ్రీనగర్ కు 86 కి. మీ. ల దూరంలో కలదు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇక్కడ ఒక ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులలో ప్రవక్త శిష్యులు వెలిగించిన కాగడాలు పట్టుకొని నృత్యాలు చేస్తారు. ప్రవక్త యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. ఇస్లాం మతం ఆచరించే వారు అనేకులు ఇక్కడకు వచ్చి ఈ పుణ్య క్షేత్రం సందర్శిస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగే జూల్ అనే ఈ పండుగను అట్టహాసంగా చేస్తారు.

ఆరు వాలీ

ఆరు వాలీ

ఆరు వాలీ పహల్గం కు 11 కి. మీ. ల దూరంలో సముద్ర మట్టానికి 2408 మీ. ల ఎత్తున కలదు. ఇక్కడ నుండి అద్భుతమైన లోయ దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడ నుండి సోనామార్గ్ కు మూడు రోజుల ట్రెక్కింగ్ లో చేరవచ్చు.

Photo Courtesy: Irfanaru

బైసరన్

బైసరన్

బైసరన్ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 2500 మీ. ల ఎత్తున కలదు. ఇది ఫల్గాం కు 5 కి. మీ. ల దూరం లో కలదు. అందమైన దృశ్యాలు, దట్టమైన వృక్షాలు, విస్తారమైన మైదాన ప్రాంతాలు బైసరన్ ను ఒక ప్రసిద్ధ ఆకర్షణగా తీర్చి దిద్దాయి. కొండల పై నుండి లిద్దర్ రివర్ వాలీ మరియు పహల్గాం వాలీ లు చూడవచ్చు.

బెతాబ్ వాలీ

బెతాబ్ వాలీ

బెతాబ్ వాలీ అక్కడ కల సుదర దృశ్యాలకు పేరు గాంచినది. ఇక్కడ అనేక హిందీ సినిమా చిత్రాల షూటింగ్ లు జరుగుతాయి. ఈ ప్రదేశం ఫల్గాం నుండి 7 కి. మీ. ల దూరంలో కలదు. దీనిని శేశానాగ్ సరస్సు యొక్క నోటి భాగంగా చెపుతారు. మంచు చే కప్పబడిన పర్వత శిఖరాలు, దేవదారు , పైన వృక్షాలు, స్వచ్చమైన జలపాతాలు, వెచ్చటి సూర్య రశ్మి మొదలైనవి ఈ ప్రదేశాన్ని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా చేశాయి.

Photo Courtesy: Nandanupadhyay

చందన్ వారి

చందన్ వారి

చందన్ వారి ప్రదేశం పహల్గాం కు 16 కి. మీ. ల దూరం కలదు. ఇది సముద్ర మట్టానికి సుమారు మూడువేల మీటర్ల ఎత్తున కలదు. మంచు చే కప్పబడిన శిఖరాలు, సుందర దృశ్యాలు పర్యాటకులకు విస్మయం కలిగిస్తాయి. హిందువుల యాత్రాస్థలం అమర్నాథ్ వెళ్ళే మార్గం లో ఈ ప్రదేశం కలదు.

Photo Courtesy: Dr. Partha S. Sahana

హాజన్

హాజన్

హాజన్ లో ఎక్కువగా బాలి వుడ్ చిత్రాల షూటింగ్ నిర్వహిస్తారు. ఇది పహల్గాం కు సమీపంలో జమ్మ్లు & కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో కలదు. టూరిస్ట్ లు సముద్ర మట్టానికి 1556 మీటర్ల ఎత్తున కల ఈ ప్రదేశంలో అనేక సుందర దృశ్యాలు చూడవచ్చు.

కోలాహో గ్లసియర్

కోలాహో గ్లసియర్

కోలాహోయ్ గ్లసియర్ ను హంగింగ్ గ్లేసియర్ అని కూడా అంటారు. ఇది లిద్దేర్ వాలీ లో కలదు. ఈ గ్లేసియర్ ను టూరిస్ట్ లు కుడివైపు నుండి చూడాలి. ఎందుకంటే, ఈ వైపు మంచు గడ్డలు విరిగిపడటం తక్కువగా వుంటుంది. ఎడమవైపు సురక్షితం కాదు. ఈ గ్లాసీ ను ట్రెక్కింగ్ లో మాత్రమే చేరవలసి వుంటుంది. కనుక ట్రెక్కింగ్ అనుబవం లేని వారు ఈ ప్రదేశానికి వెళ్ళటం మంచిది కాదు.

Photo Courtesy: Irfanaru

శేష నాగ సరస్సు

శేష నాగ సరస్సు

శేష నాగ సరస్సు పహల్గాం కు 27 కి. మీ. ల దూరంలో సముద్ర మట్టానికి 3658 అడుగుల ఎత్తున కలదు. ఈ ప్రదేశం ఏడూ శిఖరాలచే చుట్టుముట్టబడి వుంటుంది. హిందూ పురాణాలలోని ఏడూ తలల పాము పేరు పై దీనికి ఈ పేరు పెట్టారు. పహల్గాం నుండి రెండు రోజుల ట్రెక్కింగ్ లో ఈ ప్రదేశం చేరవచ్చు. అమర్ నాథ్ యాత్ర కు వెళ్ళే పర్యాటకులు వేసవిలో ఈ ప్రదేశం తప్పక సందర్శిస్తారు. కేమ్పింగ్ కు ఇది సరైన ప్రదేశం.
Photo Courtesy: Akhilesh Dasgupta

తులియన్ సరస్సు

తులియన్ సరస్సు

సముద్ర మట్టానికి సుమారు 4000 మీ. ల ఎత్తున కల తులియన్ సరస్సు పహల్గాం కు 15 కి. మీ. ల దూరం లో కలదు. దీనిని తర్సీర్ సరస్సు అని కూడా అంటారు. ఆరు నుండి రెండు రోజుల ట్రెక్కింగ్ లో ఈ ప్రదేశం చేరవచ్చు. ఈ సరస్సు సంవత్సరం పొడవునా ఘనీభవించి వుండటం ఒక విశేషం. కేమ్పింగ్ మరిఉ పిక్నిక్ లకు ఇది ఒక ప్రసిద్ధ స్థలం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X