• Follow NativePlanet
Share
» »ఉదయం కేరళలో మధ్యాహ్నం కర్ణాటకలో వెలిసిన మహిమగల దేవి !

ఉదయం కేరళలో మధ్యాహ్నం కర్ణాటకలో వెలిసిన మహిమగల దేవి !

Written By: Venkatakarunasri

ఆ మహిమాన్విత దేవి పార్వతీదేవి అవతారం అని చెప్పవచ్చను. ఆ తల్లిని శక్తి, దుర్గి, కాళి అని పిలుస్తారు. ఒక పురాణ గాధ ప్రకారం, ఈ దేవాలయంలో వెలసిన తల్లి కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయంలో భక్తులను అనుగ్రహించి తదనంతరం సాయంత్రం అవుతుందంటే కర్ణాటకలో వున్న తన పుట్టింటికి వచ్చి వెలిసే శక్తి ప్రదాయిని ఈ దేవి.

భక్తులు కర్ణాటక నుండి మాత్రమే కాక ఈ దేవత యొక్క దర్శనం కోసం కేరళ నుండి కూడా ఈ తల్లిని దర్శించడానికి వస్తారు. కేరళలో ప్రసిద్ధి చెందిన ఉత్తమ గాయకుడు, ఒక అద్భుతమైన సంగీతకారుడైనటువంటి కె.జె యేసుదాస్ కూడా దేవత యొక్క గొప్ప భక్తుడు. మరి ఆ ఆలయం ఏదయివుంటుందని ఆలోచిస్తున్నారా? ఇది పుణ్యక్షేత్రమే కొల్లూర్ లోని మూకాంబిక దేవి. కర్నాటకలోని ఉడుపి జిల్లాలోని కొల్లూరు ఒక ప్రసిద్ధ పుణ్య స్థలం. ఈ దేవాలయం కర్ణాటకలో చాలా ప్రజాదరణ పొందింది.

మూకాంబిక దేవాలయం

మూకాంబిక దేవాలయం

ఈ దేవాలయం కర్నాటక రాష్ట్రంలో ఉడుపి జిల్లాలోని కొల్లూరులో కలదు. ఇక్కడ మూకాంబికా దేవి వెలసియున్నది. సంవత్సరంలో ఈ దేవాలయానికి కర్నాటక మరియు కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు.

pc: syam

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

ఉడుపి జిల్లాలోని కుందాపూర్ తాలూకాలో వున్న కొల్లూర్ అనే ఒక చిన్న పట్టణంలో ఈ ఆలయం ఉంది. కుందాపూర్ తాలూకా నుండి సుమారు 38 కిలోమీటర్ల దూరంలో మరియు ఉడుపి పట్టణానికి సుమారు 75 కి.మీ.ల దూరంలో ఉంది. బెంగుళూరు నుండి 458 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగుళూరు నుండి మూకాంబిక రోడ్ కు బస్సులు అందుబాటులో ఉన్నాయి. బెంగుళూరు, ఉడుపి మరియు కుందాపూర్ ల నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి.

pc: vivek raj

శ్రీ చక్ర దేవి

శ్రీ చక్ర దేవి

ఇక్కడి విశేషం ఏమంటే దేవి మూకాంబిక శివలింగం రూపంలో వెలసియున్నది. ఈ శివ లింగం మహాశివుడు మరియు శక్తిని సూచిస్తుంది. అద్వైత గురు శ్రీ శంకరాచార్య శ్రీ చక్రంలో పంచలోహాలతో తయారుచేయబడిన మూకాంబికా దేవి విగ్రహాన్ని స్థాపించారు.

pc: wikimedia

ఇతర దేవతలు

ఇతర దేవతలు

ఈ దేవతను మూడు రూపాల దేవత అని చెప్తారు. అనగా మూడు రూపాలలో దర్శనమిస్తుంది. భక్తుల కోర్కేలను తొందరగా నెరవేర్చే శక్తిదాయిని. ఇక్కడ వివిధ ఇతర దేవతా విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చును.

pc: Iramuthusamy

స్థల పురాణం

స్థల పురాణం

శివుని వరం పొందిన కామాసురుడు కూడకాద్రి పర్వతం మీద చేరి, దేవతలను మునులను హింసించే వాడు. సప్తర్షులు వీడి పీడ ఎలా విరగడ అవుతుందా అని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ విషయాన్ని శుక్రాచార్యుడు వాడి చెవిన వేసి, వాడి చావు ఒక స్త్రీ వల్ల జరుగుతుంది అని చెప్పాడు. వెంటనే వాడు శివుని అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.

PC:GaneshSB

కామాసురుడి అంతం

కామాసురుడి అంతం

కామాసురుడికి శివుడు వరం ఇస్తే లోకకంటకుడు అవుతాడని భావించి వాగ్దేవి సరస్వతీ దేవి వాడి నాలుక పై చేరి మాట రాకుండా మూగ వాడిని చేసిందింది. మూగవాడై పోయినందువల్ల ఆ కామాసురుడు శివుడిని నోటిమాటతో ఏ వరమూ కోరకోలేక పోయాడు అప్పటి నుంచి వాడిని ‘'మూకాసురుడు'' అన్నారు. అప్పుడు ''కోల రుషి'' ఉపాయం మేరకు పార్వతీ దేవి సకలదేవతల శక్తులన్నిటిని కలిపి ఒక తీవ్రశక్తిగా సృష్టించింది. ఈమె మూకాసురునితో యుద్ధం చేసి సంహరించింది.

PC: Ashok Prabhakaran

దేవతలను సమాధానపరచిన సరస్వతీ దేవి

దేవతలను సమాధానపరచిన సరస్వతీ దేవి

వాడి ప్రార్ధన మన్నించి వాడికి కైవల్యం ప్రసాదించింది. మూకాసురుడిని దేవి సంహరించిన ప్రదేశాన్ని ''మారణ కట్టే'' అంటారు(మరణ గద్దె ). మూకాసురుడు అమ్మవారిని మూకాంబికగా తనపేర వెలసిల్లమని కోరుకొన్నాడు. వాడి కోరిక తీర్చి కొల్లూరులో మూకాంబిక నామంతో విరాజిల్లుతూ భక్తులకు కొంగుబంగారంగా ఉంది. ఈ ఆలయంలో మూకాంబికా దేవి పద్మాసనంలో ప్రశాంతంగా మూడు నేత్రాలతో దర్శన మిస్తుంది. శంఖం, చక్రం, గద ఆయుధాలను ధరించి ఉంటుంది.

PC:Vinayaraj

మూకాంబికా

మూకాంబికా

మూకాంబిక సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత చదువులు చదువుతారని, తెలివిగల వారై సంపన్నులు అవుతారని ప్రతీతి. అమ్మవారి సన్నిధిలో కాలభైరవుడి విగ్రహం ఉంది. సింహద్వారం గుండా లోపలికి ప్రవేశించగానే కుడివైపున కాలభైరవుడు దర్శనమిస్తాడు. కేరళవాసులు ఎక్కువశాతం ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

PC:Yogesa

మారణ కట్టే'

మారణ కట్టే'

శివుని వరం పొందిన కామాసురుడు కూడకాద్రి పర్వతం మీద చేరి, దేవతలను మునులను హింసించే వాడు. సప్తర్షులు వీడి పీడ ఎలా విరగడ అవుతుందా అని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ విషయాన్ని శుక్రాచార్యుడు వాడి చెవిన వేసి, వాడి చావు ఒక స్త్రీ వల్ల జరుగుతుంది అని చెప్పాడు. వెంటనే వాడు శివుని అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. కామాసురుడికి శివుడు వరం ఇస్తే లోకకంటకుడు అవుతాడని భావించి వాగ్దేవి సరస్వతీ దేవి వాడి నాలుక పై చేరి మాట రాకుండా మూగ వాడిని చేసిందింది.

PC:Yogesa

మారణ కట్టే'

మారణ కట్టే'

మూగవాడై పోయినందువల్ల ఆ కామాసురుడు శివుడిని నోటిమాటతో ఏ వరమూ కోరకోలేక పోయాడు అప్పటి నుంచి వాడిని ‘'మూకాసురుడు'' అన్నారు. అప్పుడు ''కోల రుషి'' ఉపాయం మేరకు పార్వతీ దేవి సకలదేవతల శక్తులన్నిటిని కలిపి ఒక తీవ్రశక్తిగా సృష్టించింది. ఈమె మూకాసురునితో యుద్ధం చేసి సంహరించింది. వాడి ప్రార్ధన మన్నించి వాడికి కైవల్యం ప్రసాదించింది. మూకాసురుడిని దేవి సంహరించిన ప్రదేశాన్ని ''మారణ కట్టే'' అంటారు(మరణ గద్దె ). మూకాసురుడు అమ్మవారిని మూకాంబికగా తనపేర వెలసిల్లమని కోరుకొన్నాడు. వాడి కోరిక తీర్చి కొల్లూరులో మూకాంబిక నామంతో విరాజిల్లుతూ భక్తులకు కొంగుబంగారంగా ఉంది. ఈ ఆలయంలో మూకాంబికా దేవి పద్మాసనంలో ప్రశాంతంగా మూడు నేత్రాలతో దర్శన మిస్తుంది. శంఖం, చక్రం, గద ఆయుధాలను ధరించి ఉంటుంది.

PC:Yogesa

వసతి

వసతి

కొల్లూరులో బస చేయటానికై లాడ్జీ లు, ఆలయ వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఉత్సవాలు, నవరాత్రి సమయాల్లో భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు కాబట్టి ఒక నెల ముందరగానే బుక్ చేయటం మంచింది. యాత్రికులందరికీ సరసమైన ధరకే రూములు అద్దెకు లభిస్తాయి.

PC:Yogesa

బ్రహ్మ లింగేశ్వర ఆలయం

బ్రహ్మ లింగేశ్వర ఆలయం

బ్రహ్మ లింగేశ్వర ఆలయం తూర్పు వైపుగా ఉండి, గర్భగుడి ఉత్తర దిశగా ఉంటుంది. వాత యక్షి, మళయాళ యక్షి ద్వారపాలకుల విగ్రహాలు ఆలయంలో ఉంటాయి. యాత్రికులు ఈ ఆలయాన్ని ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శించుకోవచ్చు.

PC:Yogesa

మస్తి కట్టే

మస్తి కట్టే

మస్తి కట్టే లో అడవి దేవతలు ఉంటారు. స్థానిక పూజారులే నిత్య పూజలు చేస్తుంటారు. ఇక్కడి దేవతలకు వ్యాధులను నివారించే మహిమలుంటాయని చెబుతారు. ఊయల, గాజులు, పూలు, గంటలు వంటివి దేవతలకు సమర్పిస్తారు.

PC:Vedamurthy.j

జీవితంలో ఒక్కసారైనా ...

జీవితంలో ఒక్కసారైనా ...

రకరకాల వ్యాధులకు గురైనవారు, మూగవారు, ఈ మూకాంబిక తల్లి దర్శనం చేసుకుంటే మాటలు వస్తాయని భక్తుల విశ్వాసం . అందువల్ల ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన క్షేత్రం ఈ "కొల్లూరు ".

PC:Yogesa

కొల్లూరు ఎలా చేరుకోవాలి

కొల్లూరు ఎలా చేరుకోవాలి

కొల్లూరు చేరుకోవటానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి

వాయు మార్గం

కొల్లూరుకు సమీపంలో అంటే 128 కి.మీ. ల దూరంలో మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. అక్కడి నుండివివిధ దేశాలకు, దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు విమాన రాకపోకలు కలవు. క్యాబ్ లేదా ఏదేని ట్యాక్సీ లను అద్దెకు తీసుకొని కొల్లూరు చేరుకోవచ్చు.

PC:youtube

రైలు మార్గం

రైలు మార్గం

కొల్లూరు కు కుందాపుర రైలు స్టేషన్ దగ్గరిదిగా షుమారు 40 కి.మీ. ల దూరంలో ఉంటుంది. కుందాపుర రైలు స్టేషన్ నుండి సమీప నగరాలకు, పట్టణాలకు రైళ్ళు కలవు. పర్యాటకులు టాక్సీలు లేదా బస్సులలో కొల్లూరు చేరవచ్చు.

PC:Diljeet Nair

బస్సు మార్గం

బస్సు మార్గం

కొల్లూరు క్షేత్రానికి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ వివిధ పట్టణాల నుండి, నగరాల నుండి బస్సులు నడుపుతుంది. మంగుళూరు, ఉడుపి, మరియు కుందాపూర్ నుండి నేరుగా ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సులు ఉన్నాయి.

PC:youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి