Search
  • Follow NativePlanet
Share
» »విజయవాడ కు 100KM లోపు పర్యాటక ప్రదేశాలు !

విజయవాడ కు 100KM లోపు పర్యాటక ప్రదేశాలు !

By Mohammad

పుష్కరాలకు విజయవాడ కు వెళుతున్నారా ? రెండు రోజులు అక్కడే ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారా ? అయితే, మీకు ఈ వ్యాసం తప్పక ఉపయోగపడుతుంది. పుష్కరాలకు వెళ్ళినవారు మొత్తం సమయాన్ని పుష్కర్ ఘాట్ కే వెచ్చించక సమీపంలోని ప్రదేశాలను చూసిరావచ్చు.

ఇది కూడా చదవండి : కృష్ణా పుష్కరాలు ఎక్కడెక్కడ ? ఎలా ?

ప్రస్తుత ఈ వ్యాసం విజయవాడ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను గురించి తెలుపుతుంది. మీరు పుష్కర స్నానాన్ని ఆచరించి, దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఈ ప్రదేశాలను చూసిరావచ్చు. ఇవన్నీ విజయవాడ పరిసరాలలోనే, చక్కటి రోడ్డురవాణా వ్యవస్థను కలిగివున్నాయి. కావున, పుష్కరాలకు వెళ్లేవారు వీటిని దృష్టిలో ఉంచుకొని మీ ప్రణాళికను సిద్ధంచేసుకోండి.

ప్రకాశం బ్యారేజ్

ప్రకాశం బ్యారేజ్

ప్రకాశం బెరేజ్ ప్రకాశం బెరేజ్ కృష్ణా నది పై నిర్మించబడినది. దీని పొడవు 1223.5 మీ. లు. ఈ బ్రిడ్జి, కృష్ణ మరియు గుంటూరు జిల్లాలను కలుపుతుంది. దీనికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట మొదటి ముఖ్య మంత్రి టంగుటూరి ప్రకాశం పెట్టారు. ఈ బ్రిడ్జి విజయవాడ లో ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. వీకెండ్ లో పిల్లలతో సేదతీరాలనుకొనేవారికి ఇదొక చక్కటి ప్రదేశం.

చిత్ర కృప : Amar Raavi

ఉండవల్లి గుహలు

ఉండవల్లి గుహలు

ఉండవల్లి గుహలు ఒకే కొండలో తొలచబడ్డాయి. పురాతన విశ్వకర్మ స్థపతి లకు ఒక సరైన ఉదాహరణలుగా నిలుస్తాయి. ఇవి విజయవాడకు పడమటి దిశగా 6 కి. మీ. ల దూరంలో కృష్ణా నది కి దక్షిణపు ఒడ్డున కలవు. గుంటూరు నగరానికి 22 కి. మీ. లు. దూరంలో కలవు.

చిత్ర కృప : SRIDHAR RAJASEKAR

కృష్ణవేణి మండపం

కృష్ణవేణి మండపం

కృష్ణ వేణి మండపం ను 'రివర్ మ్యూజియం' అని కూడా పిలుస్తారు. ఇది ప్రకాశం బరేజ్ కు సమీపంలో కలదు. ఈ మ్యూజియం లో కృష్ణా నది కి గల చరిత్ర ప్రదర్శించబడుతుంది. బ్యారేజ్ పక్కనే ప్రసిద్ధ కృష్ణమ్మనది దేవత విగ్రహం కూడా స్థాపించారు.

చిత్ర కృప : Bhaskaranaidu

రాజీవ్ గాంధి పార్క్

రాజీవ్ గాంధి పార్క్

రాజీవ్ గాంధి పార్క్ ను విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నిర్మించింది. ఆకర్షణీయమైన తోటల పెంపకంతో విజయవాడ ప్రవేశ ద్వారంగా కలదు. ఇక్కడే ఒక మినీ జూ మరియు ఒక మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ లు కూడా కలవు. ఈ పార్క్ మధ్యాహ్నం 2 గం. నుండి 8 గం వరకూ తెరచి వుంటుంది.

చిత్ర కృప : Kara Newhouse

గాంధి హిల్

గాంధి హిల్

గాంధి హిల్ పై భాగంలో మొట్టమొదటి గాంధి మెమోరియల్ ఏడు స్తూపాలతో కొండపై 150 మీ. ల ఎత్తున ఇక్కడ స్థాపించారు. ఈ స్తూపం పొడవు 16 మీ. లు. దీనిని అప్పటి భారత దేశ రాష్ట్రపతి డా. జాకీర్ హుస్సేన్, 6 అక్టోబర్, 1968 న ఆవిష్కరించారు. ఈ కొండపై గాంధి మెమోరియల్ లైబ్రరీ, మహాత్మా గాంధి జీవిత విశేషాలతో కల ఒక సౌండ్ అండ్ లైట్ షో మరియు ఒక ప్లానేటోరియం లు ఇతర ఆకర్షణలు.

చిత్ర కృప : Vivek prem tej.Pattabhi

విక్టోరియ జూబిలీ మ్యూజియం

విక్టోరియ జూబిలీ మ్యూజియం

పురావస్తు ప్రియులకు ఇది ఒక ఆసక్తి కర మ్యూజియం. దీనిలో అనేక పురాతన శిల్పాలు, పెయింటింగ్ లు, విగ్రహాలు, ఆయుధాలు, కట్లరి, మరియు శిలా శాశనాలు కలవు.

చిత్ర కృప : wikicommons

మొగలరాజపురం గుహలు

మొగలరాజపురం గుహలు

ఈకొండ గుహలను సుమారు క్రి. శ. 5 వ శతాబ్దంలో తవ్వి నట్లు తెలుస్తోంది. దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటిసారిగా కనుగోన్నబడిన గుహలు. ఇక్కడ శ్రీ నటరాజ, వినాయక మరియు అర్థనారీశ్వర విగ్రహాలు ఇక్కడ చెక్కబడ్డాయి.

చిత్ర కృప : Manfred Sommer

భవానీ ఐలాండ్

భవానీ ఐలాండ్

కృష్ణా నదిపై ఈ ద్వీపాలు అతి విస్తారమైనవి. నగరానికి సమీపంగా కలవు. ఈ ప్రదేశాన్ని ఆంధ్ర ప్రదేశ్ టూరిజం శాఖ సుమారు 133 ఎకరాలలో ఒక ఆకర్షణీయ పర్యాటక ప్రదేశంగా మరియు ఒక రివర్ ఫ్రంట్ రిసార్ట్ గా అభివృద్ధి చేసింది.

చిత్ర కృప : S Knuri

కొండపల్లి ఫోర్ట్

కొండపల్లి ఫోర్ట్

కొండపల్లి గ్రామం విజయవాడ నగరానికి సుమారు 16 కి. మీ. ల దూరంలో కలదు. ఈ కోట సుమారు 7 వ శతాబ్దం నాటిదిగా చెపుతారు. ఇక్కడ కల ఆకర్షణీయమైన మూడు అంతస్తుల రాక్ టవర్ ఈ ప్రాంతాన్ని పాలించిన అనేక రాజ వంశాల గొప్పతనం చాటుతుంది. ఈ కోటను రాజు కృష్ణ దేవరాయలు నిర్మించాడు.ఒక మంచి విహార కేంద్రం.

చిత్ర కృప : andhratourism

కొండపల్లి గ్రామం

కొండపల్లి గ్రామం

కొండపల్లి గ్రామం, ఇక్కడి అటవీ ప్రాంతంలో దొరికే చెక్క తో తయారు చేయబడిన తక్కువ బరువు కల అందమైన కొయ్య బొమ్మలు, ఇతర వస్తువుల తయారీకి ప్రసిద్ధి. ఇవి "కొండపల్లి బొమ్మలు" అనే పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి కెక్కాయి. వీలైతే కొనుగోలు చేయండి.

చిత్ర కృప : Adityamadhav83

కనక దుర్గ దేవాలయం

కనక దుర్గ దేవాలయం

కనక దుర్గ దేవాలయం ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న ప్రముఖ హిందూ దేవాలయం. కొండ పై నుండి దిగువన ఉన్న కృష్ణా నది చక్కగా కనిపిస్తుంది. కొండపై పోవటానికి దేవస్థానం బస్సులు నడుస్తుంటాయి. ఇక్కడ దసరా అత్యంత వైభవంగా జరిగే ఘట్టం. దేవాలయం చేరుకోవాలంటే బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్ నుండి 10 నిమిషాల సమయం, ఎయిర్ పోర్ట్ నుండి 20 నిమిషాల సమయం పడుతుంది.

చిత్ర కృప : Ashwin Kumar

అక్కన్న మాదన్న గుహలు

అక్కన్న మాదన్న గుహలు

విజయవాడ నుండి అక్కన్న మాదన్న గుహలు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. గుహలను తొలచి రెండు శిలలను తయారు చేసారు. గుహలు 6 మరియు 7వ శతాబ్దాల కాలంలో ఉనికిలో వచ్చాయి.గుహలో కేవలం ఆలయం మాత్రమే కొండ క్రింద భాగంలో ఉంది.

చిత్ర కృప : Adityamadhav83

మంగళగిరి

మంగళగిరి

మంగళగిరి, విజయవాడ కు 18 కిలోమీటర్ల దూరంలో కలదు. 'మంగళగిరి' అంటే అర్ధం పవిత్రమైన కొండ. నూలు వస్త్రాలకి అలాగే ఎన్నో ఆలయాలకి ఈ మంగళగిరి ప్రాంతం ప్రసిద్ది. ప్రఖ్యాతమైన లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం ఈ గ్రామంలోని కొండ మీద ఉంది. ఇక్కడ పానకాన్ని మాత్రమే నైవేద్యంగా పెడతారు కనుక స్వామి వారిని 'పానకాల స్వామి' అని కూడా పిలుస్తారు.

చిత్ర కృప : Gautam T

బీసెంట్ రోడ్డు

బీసెంట్ రోడ్డు

బీసెంట్ రోడ్డు విజయవాడ లోని ప్రముఖ వాణిజ్య కేంద్రం. హైదరాబాద్ లోని 'కోఠి'కి అటు ఇటుగా ఉంటుంది.

చిత్ర కృప : Srikar Kashyap

హజ్రత్ బల్ మసీద్

హజ్రత్ బల్ మసీద్

హజ్రత్ బల్ మసీద్ మహమ్మదీయుల ప్రార్థనా స్థలం. మహమ్మద్ ప్రవక్త యొక్క కేశాన్ని సంవత్సరం లో ఒకసారి పర్యాటకులకు చూపిస్తారు. కులమతాలకు అతీతంగా ముస్లిమేతరులు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతారు.

చిత్ర కృప : aptdc

గుణదల మేరీమాత చర్చి

గుణదల మేరీమాత చర్చి

గుణదల చర్చి, నగరం నుండి 2 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడ మొదట మేరీమాత ని ప్రతిష్టించి, ఆ తరువాత చర్చి ని నిర్మించారు. ప్రతి ఆదివారం చర్చి సందడిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది.

చిత్ర కృప : aptdc

జైన మందిరం

జైన మందిరం

మంగళగిరి లో నరసింహ స్వామి ఆలయం తర్వాత చూడవలసిన మరో ఆలయం జైన మందిరం. అద్భుత కళాఖండాలు ఈ ఆలయం పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో ఉన్న జైన ఆలయాలలో ఇదే అతి పెద్దది.

చిత్ర కృప : wikicommons

అమరావతి

అమరావతి

అమరావతి పట్టణం విజయవాడ కు 68 కోలోమీటర్ల దూరంలో ఉంటుంది. కృష్ణా నది ఒడ్డున గల ఈ ప్రదేశంలో ఆచార్య నాగార్జునుడు కట్టించిన స్థూపాన్ని, పురావస్తు మ్యూజియాన్ని దర్శించవచ్చు.

చిత్ర కృప : Jai Kishan Chadalawada

సత్య నారాయణ స్వామి ఆలయం

సత్య నారాయణ స్వామి ఆలయం

సత్యనారాయణ స్వామి ఆలయం విజయవాడ వాసులకు తీర్థం లాంటిది. బైపాస్ రోడ్డు కి సమీపాన ఉన్న గాంధీనగర్ లో ఈ ఆలయం ఉన్నది.

చిత్ర కృప : dilli acharya

మరకత రాజరాజేశ్వరి దేవాలయం

మరకత రాజరాజేశ్వరి దేవాలయం

విజయవాడ రైల్వే స్టేషన్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పడమట వద్ద మరకత రాజరాజేశ్వరి ఆలయం ఉన్నది. గుడి అద్భుత శిల్ప కళ కు తార్కాణం. అమ్మవారి మూర్తి విగ్రహం మరకత శిల తో అపురూపంగా చెక్కబడింది. వీలుంటే గణపతి ఆలయాన్ని కూడా సందర్శించండి.

చిత్ర కృప : Kara Newhouse

వెంకటేశ్వర స్వామి దేవాలయం

వెంకటేశ్వర స్వామి దేవాలయం

వెంకటేశ్వర స్వామి దేవాలయం విజయవాడ బస్ స్టాండ్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో లబ్బీపేట లో ఉన్నది. ఇంకా వివరంగా చెప్పాలంటే బందర్ రోడ్డు, వెటర్నటీ హాస్పిటల్, ఇందిరా గాంధీ స్టేడియం అని గుర్తుపెట్టుకోండి.

చిత్ర కృప : Vishy Kuruganti

త్రిశక్తి పీఠం

త్రిశక్తి పీఠం

త్రిశక్తి పీఠం విజయవాడ బస్ స్టాండ్ సమీపంలో ఉన్నది. ఆలయంలో శ్రీ మహా సరస్వతి దేవిని ఆవాహన చేశారు.

చిత్ర కృప : carrotbeast

రామలింగేశ్వర స్వామి దేవాలయం

రామలింగేశ్వర స్వామి దేవాలయం

విజయవాడ నుండి యనమలకుదురు 5 కిలోమీటర్ల దూరంలో, నగరంలో ప్రసిద్ధి గాంచిన రామలింగేశ్వర స్వామి ఆలయం కలదు. శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఇది చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు వస్తుంటారు.

చిత్ర కృప : Suresh Kumar

లెనిన్ విగ్రహం

లెనిన్ విగ్రహం

విజయవాడ నగరం పూర్వం కమ్యూనిస్ట్ ప్రాంతంలో ఉండేదని చెప్పటానికి లెనిన్ విగ్రహం ఉదాహరణ. అలాగే సమీపంలో 25 సంవత్సరాల క్రితం నాటి కార్ల్ మార్క్స్ విగ్రహం కూడా చూడవచ్చు.

చిత్ర కృప : wikicommons

ఇస్కాన్ ఆలయం

ఇస్కాన్ ఆలయం

విజయవాడ లో ఇస్కాన్ సంస్థ వారి అద్వర్యం లో నడుస్తున్న రాధాకృష్ణుల ఆలయం ఉన్నది.

అడ్రెస్ : వెంకట పాలెం, ఉండవల్లి గ్రామం, తాడేపల్లి మండలం, విజయవాడ

చిత్ర కృప : wikcommons

వినోదం మరియు ఆటలు

వినోదం మరియు ఆటలు

విజయవాడ లో వినోదాన్ని, ఆటలను అందించే కొన్ని పార్క్ లు ఉన్నాయి. అవి హాయ్ లాండ్(18 కిలోమీటర్ల దూరం) మరియు వీఎంసి డిస్నీ లాండ్ (7.8 కిలోమీటర్ల దూరం).

చిత్ర కృప : wikicommons

మచిలీపట్నం బీచ్

మచిలీపట్నం బీచ్

విజయవాడ నుండి 79 కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నం బీచ్ కలదు. ఇక్కడి బీచ్ లో ఇసుక బదులు నల్లటి మన్ను ఉంటుంది. బీచ్ వద్ద కూచి పూడి నేర్పిస్తుంటారు. తీరం ఆనుకొని ఆలయాలు కూడా ఉన్నాయి. మీరు బీచ్ లో దిగాలనుకుంటే కొద్ది లోతువరకు వెళ్ళవచ్చు.

చిత్ర కృప : Sree Harsha Koneru

కోటప్పకొండ

కోటప్పకొండ

కోటప్పకొండ విజయవాడ నగరానికి 95 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడ ఎంతో మంది దేవతామూర్తులకు, ఋషులకు జ్ఞానోపదేశం చేసినట్లు చెబుతారు. శివరాత్రి పర్వదినాన వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు.

చిత్ర కృప : విశ్వనాధ్.బి.కె.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X