» »ముళబాగల్ నుండి తిరుపతికి ట్రావెల్ గైడ్

ముళబాగల్ నుండి తిరుపతికి ట్రావెల్ గైడ్

Posted By: Venkata Karunasri Nalluru

"ముళబాగల్" అనే పదం "ముదలబాగిలు" నుండి వచ్చింది. స్థానిక కన్నడ భాషలో "తూర్పు తలుపు" అని అర్ధం. ముళబాగల్ మైసూరు రాష్ట్రంలో తూర్పు సరిహద్దుగా ఉంది. అందువల్ల ఆ పేరు వచ్చింది. ముళబాగల్ విజయనగర సామ్రాజ్యంలో కూడా తూర్పు ద్వారంలో ఉంది.

ముళబాగల్ చరిత్రను "బెంజమిన్ లెవిస్ రైస్" రాసిన పుస్తకం "మైసూర్ గాజెట్టీర్" (1887) లో సంగ్రహించారు. ఆధునిక చరిత్రలో ముళబాగల్ మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధ సమయంలో అక్టోబర్ 4 వ తేదీ ,1768 సం.న ఏర్పడింది.

ముళబాగల్ నుండి తిరుపతికి గల దూరం :

ముళబాగల్ నుండి తిరుపతికి మార్గం:

ముళబాగల్ నుండి తిరుపతికి మార్గం:

ముళబాగల్ - పలమనేరు - చిత్తూరు - చంద్రగిరి - తిరుపతి

చిత్రకృప : Google Maps

ముళబాగల్ ఆంజనేయస్వామి దేవాలయం:

ముళబాగల్ ఆంజనేయస్వామి దేవాలయం:

ముళబాగల్ లో ట్రెక్కింగ్ హిల్స్ చాలా వున్నాయి. అందులో "క్షేత్ర పలక శ్రీ ఆంజనేయ ఆలయం" ఒకటి. ఆంజనేయ స్వామి ఆలయంఒక పురాణం ప్రకారం మహాభారత యుద్ధం తరువాత పాండవులలో ఒకరైన అర్జునుడు ఇక్కడ హనుమంత ఆలయం స్థాపించాడని తెలుస్తుంది. వశిష్ట మహర్షి యొక్క ప్రధాన దైవమయిన సీతారామ - లక్ష్మణ విగ్రహాలు మరియు శ్రీనివాసుని మరియు పద్మావతి కూడా ఇక్కడ ప్రతిష్టించారని తెలుస్తుంది.

విరూపాక్షుని ఆలయం:

విరూపాక్షుని ఆలయం:

విరూపాక్షుని ఆలయం కర్ణాటకలోని కోలార్ జిల్లాలో గల ముళబాగల్ తాలూకాలోని "విరూపాక్షపుర" అనే గ్రామంలో కలదు. ఈ దేవాలయంలో చాలా ప్రత్యేక శివుడు కొలువై వున్నాడు. పవిత్ర గర్భగుడి లో రెండు శివ లింగాలు ఉన్నాయి. అందులో ఒకటి శివుని ఆత్మలింగం. దీనిని విరూపాక్షుని ఆత్మలింగం అంటారు.

విరూపాక్షుని ఆలయంలోని శివలింగం విశిష్టత:
శివలింగం ప్రత్యేకత ఏమిటంటే రోజుకు మూడుసార్లు రంగులు మారుస్తుంది. ఈ ఆత్మ శివలింగం ఉదయం ఎరుపు రంగులో, మధ్యాహ్న సమయంలో తెలుపు మరియు సాయంత్రం తేనె రంగులో వుంటుంది. పవిత్ర గర్భగుడి ఆత్మ శివలింగం నుంచి శక్తివంతమైన వికిరణాలు విడుదలవుతాయని నమ్ముతారు.

కురుదుమలె గణేషుని ఆలయం:

కురుదుమలె గణేషుని ఆలయం:

కురుదుమలె గణేషుని ఆలయం:

ఈ ప్రదేశం ముళబాగల్ నుండి12 కి.మీ ల దూరంలో హొయసల రాజవంశం యొక్క రాజధానిగా ఉంది. పదమూడు నుంచి ఒకటిన్నర అడుగులు గల కురుదుమలె గణేశ మరియు సోమేశ్వర ఆలయం శిల్పాలు పరిసర రాష్ట్రాల నుంచి అనేక వేల మంది సందర్శకులను ఆకర్షిస్తోంది.

గణేషుని ఆలయం గురించి :
కురుదుమలె ఆలయం కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లాలో కలదు. ఇక్కడ ఒక ప్రముఖ వినాయక ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. ఈ దేవాలయం స్వర్గం నుండి దిగి వచ్చిందని నమ్ముతారు. కురుదుమలె లోని గణేశ దేవాలయం చాలా శక్తివంతమైనది. అనేక మంది ఏ కొత్త పని ప్రారంభించే ముందు గణేషుని యొక్క దీవెనలు తీసుకోవాలని ఇక్కడ వస్తారు. కురుదుమలె గణపతి ఆలయంనకు కొంచెం దూరంలో దగ్గరగా ప్రధాన దేవత శివుడు ఇక్కడ సోమేశ్వర దేవాలయంలో కొలువై వున్నారు. ఈ మందిరం ఒకే రాతితో నిర్మించబడి ఆసక్తికరంగా ఉంటుంది. కురుదుమలె ముళబాగల్ నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అవతరించింది.

కురుదుమలె ఆలయ నిర్మాణం:
కురుదుమలె ఆలయంను చోళ పరిపాలనా కాలంలో నిర్మిచారు. ఆలయ ప్రాంగణంలో నిర్మాణం వివిధ రకాలుగా ఆసక్తికరంగా ఉంటుంది.

శ్రీపాద రాజా మఠం :

శ్రీపాద రాజా మఠం :

శ్రీపాద రాజా ఒక హరిదాసుడు. ఇతనిని శ్రీపాద రాజా లేదా లక్ష్మీనారాయణ తీర్థ అని పిలుస్తారు. శ్రీపాద రాజా కర్నాటకలోని చెన్నపట్నం తాలూకా (ఆధునిక బెంగుళూర్ సమీపంలో) లో అబ్బూరులో జన్మించాడు. ఇతను ఒక గొప్ప పండితుడు మరియు కవి. ఇతను కన్నడలో అనేక భక్తి పాటలు ఆలపించాడు. ఇతను స్థాపించిన మఠాన్ని "శ్రీపాద రాజా మఠం" అని అంటారు.

పలమనేరులో గల కైగల్ జలపాతాలు:

పలమనేరులో గల కైగల్ జలపాతాలు:

కైగల్ నీటి జలపాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో కలదు. కైగల్ గ్రామంలో వుండటం వల్ల "కైగల్ జలపాతం" అని పేరు వచ్చింది. జలపాతం సహజంగా శాశ్వతంగా మరియు నీరు ఒక పెద్ద రాక్ నుండి సీజన్లతో సంబంధం లేకుండా 40 అడుగుల ఎత్తులో నుండి పడుతుంది. వర్షాకాలంలో ఏ జలపాతం చాలా అందంగా వుంటుంది. జలపాతం క్రింద అనేక సహజ చెరువులు ఉన్నాయి. ఈ అడవులలో పక్షులు, పొదలు, చెట్లు మరియు వన్యప్రాణులతో కూడిన సహజ పరిసరాలతో కూడి వుంటుంది.

చిత్తూరులో గల కౌండిన్య వైల్డ్ లైఫ్ సంక్చురి :

చిత్తూరులో గల కౌండిన్య వైల్డ్ లైఫ్ సంక్చురి :

కౌండిన్య వైల్డ్ లైఫ్ సంక్చురి ఒక వన్యప్రాణి అభయారణ్యం. ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. ఇది ఆసియాలో మరెక్కడా లేని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే గల ఏనుగుల అభయారణ్యం. ఈ అభయారణ్యం అధిక కొండలు మరియు లోతైన లోయలను కలిగి వుంది. ఇక్కడ పొడి ఆకురాల్చు అడవులతో పాటు చిన్న చెరువులు, ట్యాంకులు మరియు పాలార్ నదికి ఉపనదులైన కైండిన్యమరియు కైగల్ ఇక్కడ ప్రవహిస్తూ వుంది

గుర్రంకొండ ఫోర్ట్ :

గుర్రంకొండ ఫోర్ట్ :

గుర్రంకొండ ఫోర్ట్ 500 ఏళ్ల క్రితం నిర్మించినది. ఇది భారతదేశంలో చూడదగిన ప్రసిద్ధ ప్రదేశం. తిరుపతి నుండి 72 కి.మీ ల దూరంలో ఉన్నది. కోట వాస్తురీత్యా చాలా అందంగా ఉంది. దీనిని మొదట మట్టి మరియు రాళ్ళతో విజయనగర రాజ్య పాలనలో నిర్మించారు. తరువాత ఈ కోటను మరాఠాలు, టిప్పు సుల్తాన్ ఆక్రమించారు. తరువాత బ్రిటిష్ పాలన క్రింద వుంది. ఇది తప్పక సందర్శించవలసిన ప్రదేశం.

తిరుపతి :

తిరుపతి :

తిరుపతి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల చిత్తూరు జిల్లాలో ఒక పట్టణం. వరాహ పురాణం ప్రకారం, త్రేతా యుగం సమయంలో శ్రీరాముడు సీతా దేవి, లక్ష్మనుతో పాటు లంకాపురి నుండి తిరిగి వచ్చి ఇచ్చట నివశించారని తెలుస్తుంది. ఇక్కడ "గోవిందరాజుల స్వామి గుడి" చూడదగిన ఆలయం. శ్రీనివాసుని మ్యూజియం మరియు అలిమేలు మంగాపురంలోని పద్మావతి ఆలయం కూడా భక్తులు ఇక్కడ దర్శించుకోవచ్చు.

బాలాజీ ఆలయం :

బాలాజీ ఆలయం :

శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో తిరుమల కొండ మీద నెలకొని ఉన్న ఒక వైష్ణవ దేవాలయం.

కలియుగంలో అనేకసమస్యల నుండి మానవజాతిని రక్షించటానికి మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంగా ఇక్కడ అవతరించారు. శ్రీ వెంకటేశ్వరస్వామిని బాలాజీ, గోవిందా, శ్రీనివాస వంటి అనేక ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఇక్కడ ఏడు శిఖరాలు ఆదిశేషుని ఏడు తలలతో పోలుస్తారు. ఏడు శిఖరాలను వరుసగా శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి మరియు వెంకటాద్రి అంటారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన "తిరుపతి లడ్డు" తిరుమల ఆలయం వద్ద ప్రసాదంగా ఇవ్వబడుతుంది.

ఆంధ్రా భోజనం తినడానికి ప్రదేశాలు (హోటల్స్):

ఆంధ్రా భోజనం తినడానికి ప్రదేశాలు (హోటల్స్):

వాసుదేవా అడిగాస్ హోటల్ కోలారులోని నేషనల్ హైవే 4 మీద గల వడ్గూరు గెట్ కి దగ్గరలో కలదు. తిరుపతిలో హోటల్ మౌర్య, జోడియాక్, శ్రీ లక్ష్మి నారాయణ భవన్ మొదలైన హోటల్స్ అందుబాటులో వున్నాయి.

తిరుపతిలో గల వసతులు:

తిరుపతిలో గల వసతులు:

శ్రీనివాసం కాంప్లెక్స్ ( తిరుపతిలో ఆర్.టి.సి. బస్స్టాండ్ కు ఆపోజిట్ లో). ఇక్కడ నాన్ ఏ.సి. రూమ్స్ : రు. 200, ఏ.సి. రూమ్స్ : రు. 400, ఏ.సి. డీలక్స్ రూమ్స్ : రు. 600, ఇంకా మాధవన్ గెస్ట్ హౌస్, శ్రీ వెంకటేశ్వర ధర్మశాల ( తిరుపతి రైల్వే స్టేషన్ కు ఆపోజిట్) మొదలైనవి వున్నాయి.


తిరుమల ఆలయం దర్శనం టైమింగ్స్ గురించిన వివరాలు: సోమవారం నుండి శనివారం వరకు తెల్లవారి 2:30 am నుండి 1:30 am వరకు, శుక్రవారం మాత్రం 2:30 am నుండి 10:30 pm వరకు వుంటుంది.