Search
  • Follow NativePlanet
Share
» »రుద్రప్రయాగ, జోషీమఠ్ పుణ్యక్షేత్రాల దర్శనం !

రుద్రప్రయాగ, జోషీమఠ్ పుణ్యక్షేత్రాల దర్శనం !

రుద్రప్రయాగ, జోషీమఠ్ పుణ్యక్షేత్రాల దర్శనం ! రుద్రప్రయాగ తో పాటు సమీపంలో ఉన్న మరొక పుణ్య స్థలం ఆదిశంకరాచార్యుల మఠం. ఇది రుద్రప్రయాగ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో జోషీమఠ్ ప్రదేశంలో కలదు.

By Mohammad

రుద్రప్రయాగ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక చిన్ పట్టణం మరియు హిందువుల ఆరాధ్య దైవం మహాశివుని నివాస స్థలం. శివుడి మరో రూపమైన రుద్రుడు పేరు మీద ఈ ప్రదేశానికి ఆ పేరొచ్చింది. పురాణాల మేరకు బ్రహ్మ కుమారుడైన నారద మహర్షి శివుని ఆశీర్వచనాలు కోసం ఇక్కడికి వచ్చాడని, శివుడు ఆశీర్వదించాడని చెబుతారు. ఈ టవున్ అలకనందా, మందాకినీ నది మధ్య కలదు.

చూడామణి ఆలయం : వింత ఆచారం !

రుద్రప్రయాగ తో పాటు సమీపంలో ఉన్న మరొక పుణ్య స్థలం ఆదిశంకరాచార్యుల మఠం. ఇది రుద్రప్రయాగ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో జోషీమఠ్ ప్రదేశంలో కలదు. ఆది శంకరాచార్య స్థాపించిన నాలుగు మఠాలలో ఇది ఒకటి. ఇక్కడే ఆది గురువు ధ్యానం చేసిన 'కల్పవృక్ష' చెట్టు ఉన్నది. రుద్రప్రయాగకు వెళ్ళివచ్చే యాత్రికులు తప్పక జోషీమఠ్ ను కూడా సందర్శించండి!

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

180 కిలోమీటర్ల దూరంలో డెహ్రాడూన్ ఎయిర్ పోర్ట్, 24 కిలోమీటర్ల దూరంలో రిషికేష్ రైల్వే స్టేషన్ లు కలవు. ఇక్కడి నుండి టాక్సీ లేదా క్యాబ్ లలో ప్రయాణించి రుద్రప్రయాగ చేరుకోవచ్చు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఎయిర్ పోర్ట్ కు, రైల్వే స్టేషన్ కు చక్కటి కనెక్టివిటీ ఉంది. ఢిల్లీ నుండి బద్రినాథ్ వెళ్ళే బస్సులన్నీ రుద్రప్రయాగ వద్ద ఆగుతాయి.

చిత్రకృప : Shainy Omer

కాళీ మఠ్

కాళీ మఠ్

భారతదేశంలోని సిద్ధ మఠాలలో కాళీ మఠ్ ఒకటి. ఇక్కడ కాళీ మాతకు అంకితం ఇవ్వబడిన మందిరం కలదు. నవరాత్రి ఉత్సవాలు తిలకించటానికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు.

చిత్రకృప : Aloak1

కార్తికేయ స్వామి

కార్తికేయ స్వామి

రుద్రప్రయాగ కు 38 కిలోమీటర్ల దూరంలో కార్తికేయస్వామి కొలువై ఉన్నాడు. సముద్రమట్టానికి 3048 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే పోఖ్రి మార్గం లో కల చౌరీ గ్రామం నుండి 3 కి.మీ.లు నడవాలి. ఇక్కడ స్వామి వారిగా చెప్పబడే ఎముకలు భద్రంగా ఉన్నాయి.

చిత్రకృప : Sumita Roy Dutta

త్రియుగినారాయణ్ దేవాలయం

త్రియుగినారాయణ్ దేవాలయం

త్రియుగినారాయణ్ ఒక పవిత్ర ప్రదేశం. ఇక్కడ శివపార్వతుల వివాహం సత్యయుగంలో జరిగిందని చెబుతారు. దానికి సాక్ష్యంగా హవాన్ కుండ్ జ్యోతి ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఇక్కడే సమీపంలో విష్ణు దేవాలయం చూడదగ్గది. దీని శిల్పశైలి కేదార్నాథ్ గుడిని పోలి ఉంటుంది.

చిత్రకృప : Paritoshr

రుద్రప్రయాగ్ టెంపుల్

రుద్రప్రయాగ్ టెంపుల్

అలకనంద, మందాకినీ నదుల సంగమ ప్రదేశం వద్ద రుద్రప్రయాగ్ టెంపుల్ కలదు. ఇక్కడ ప్రధాన దైవం రుద్రుడు. శివుని మరో అవతారమైన రుద్రుడు నారదమహర్షిని ఇక్కడే దీవించారని ప్రతీతి. ఇక్కడ జగదాంబ దేవి ఆలయం కూడా దర్శించదగ్గదే!

చిత్రకృప : Vvnataraj

చంద్రశిల శిఖరం

చంద్రశిల శిఖరం

చంద్రశిల శిఖరం సముద్రమట్టానికి 4000 మీటర్ల ఎత్తులో హార్వాన్ హిమాలయ శ్రేణులలో కలదు. ఈ ప్రదేశంలో రావణుడిని చంపిన తర్వాత శ్రీరాముడు కొంత కాలం తపస్సు చేసాడని, చంద్రుడు కూడా తపస్సు చేసాడని చెబుతారు. యాత్రికులు ట్రెక్కింగ్ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

చిత్రకృప : Alok

తుంగనాథ్

తుంగనాథ్

తుంగనాథ్ ఆలయం సముద్రమట్టానికి 3680 మీటర్ల ఎత్తులో చంద్రశిల శిఖరం పై కలదు. ఆలయంలో శివలింగం పాటు, రెండున్నర అడుగుల ఎత్తుగల శంకరాచార్య విగ్రహం కలదు. చొప్త వెళ్ళే రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

చిత్రకృప : Ekabhishek

మానస దేవి గుడి

మానస దేవి గుడి

మానస దేవి ఆలయం ను శ్రీ శంకరాచార్యుల కాలంలో స్థాపించారు. ఈ టెంపుల్ శిల్ప శైలి బాగుంటుంది. రుద్రప్రయాగకు 6 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి కలదు. దే ఒరియా సరస్సు ఇక్కడి మరో ప్రధాన ఆకర్షణ.

చిత్రకృప : Vvnataraj

రుద్రప్రయాగ చుట్టూ ఉన్న మరికొన్ని ప్రదేశాలు

రుద్రప్రయాగ చుట్టూ ఉన్న మరికొన్ని ప్రదేశాలు

ఖిర్సు, రుద్రనాథ్ ఆలయం, అగస్త్యముని, గౌరీకుండ్, సూర్యకుండ్, విష్ణుకుండ్, రుద్రకుండ్, బ్రహ్మకుండ్ మొదలుగునవి చూడదగ్గవి. బ్రహ్మ, విష్ణు, రుద్ర కుండ్ లకు మూలస్థానం సరస్వతి కుండ్. స్థానికుల నమ్మిక మేరకు ఈ నీరు విష్ణు నాభి నుండి వస్తుందని చెబుతారు.

చిత్రకృప : Rajborah123

జోషీమఠ్

జోషీమఠ్

జోషీమఠ్ కు రుద్రప్రయాగ నుండి ప్రభుత్వ బస్సులలో లేదా టాక్సీ లలో ఎక్కి ప్రయాణించవచ్చు. సులభంగానే వాహనాలు దొరుకుతాయి (సీజన్ కానప్పుడు). రుద్రప్రయాగ కు మరియు జోషీమఠ్ మధ్య దూరంలో 100 కిలోమీటర్లు.

చిత్రకృప : christian0702

కల్పవృక్ష

కల్పవృక్ష

కల్పవృక్ష ఒక పురాతన చెట్టు మరియు జోషీమఠ్ లో ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఈ చెట్టు దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశంలోని పురాతన చెట్లలో ఒకటి. పురాణం ప్రకారం, ఆది గురువు శ్రీ శంకరాచార్య ఈ చెట్టు కింద ధ్యానం చేసారు. ఈ పురాతన చెట్టు ఇప్పటికి పువ్వులు మరియు పళ్లు ఇస్తుంది. ఇక్కడే ఆయన నివసించటానికి ఉపయోగించిన గుహ కూడా ఉన్నది.

చిత్రకృప : Raji.srinivas

నందా దేవీ నేషనల్ పార్క్

నందా దేవీ నేషనల్ పార్క్

యునెస్కో చేత గుర్తించబడిన నందా దేవీ నేషనల్ పార్క్ జోషీమఠ్ నుంచి 24 కి.మీ దూరంలో ఉన్న ఒక పర్యాటక హాట్ స్పాట్ గా చెప్పవచ్చు. 630 చుట్టూ చదరపు విస్తీర్ణంలో వ్యాపించింది. పార్క్ మంచు చిరుత, ఎలుగుబంట్లు, రూబీ గొంతు, భరల్, లంగూర్, గ్రోస్ బెక్స్ మరియు హిమాలయ కస్తూరి జింకలు చూడటానికి అవకాశం అందిస్తుంది.

చిత్రకృప : Michael Scalet

నరసింఘ్ ఆలయం

నరసింఘ్ ఆలయం

భగవానుని నరసింఘ్ హిందూ మత దేవుడైన విష్ణువు యొక్క 4 వ అవతారం. శ్రీ బద్రీనాథ్ శీతాకాలంలో ఈ ఆలయంలో ఉంటారని నమ్ముతారు. ఇక్కడి విగ్రహం రోజురోజుకీ కొద్దిగా సన్నబడుతుందట !

చిత్రకృప : Sumita Roy Dutta

చీనాబ్ సరస్సు

చీనాబ్ సరస్సు

చీనాబ్ సరస్సు ఒక చిన్న గ్రామం డాంగ్ వద్ద ఉన్న ఒక అందమైన సరస్సు. ఈ సరస్సు ఒక చదును చేయబడని రోడ్ ద్వారా కాలినడకన చేరుకోవచ్చు.

చిత్రకృప : christian0702

వంశినరయన్ కల్పేశ్వర్

వంశినరయన్ కల్పేశ్వర్

వంశినరయన్ కల్పేశ్వర్ జోషిమత్ నుండి 12 కి.మీ దూరంలో ఉన్న ఒక అందమైన లోయ . ఇది కల్పేశ్వర్ అందమైన గుహగా ప్రసిద్ధి చెందింది. కల్పేశ్వర్ కేవ్ ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది.

చిత్రకృప : Vvnataraj

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X