Search
  • Follow NativePlanet
Share
» »వర్ష రుతువు ఆనందాలలో ఉదయపూర్ !

వర్ష రుతువు ఆనందాలలో ఉదయపూర్ !

ఇండియా లో పేరు ప్రతిష్టలు కల రాజపుత్ర రాజుల చారిత్రక రాజధాని పట్టణంగా ఉదయపూర్ విలసిల్లింది. ఇప్పటికి ఉదయపూర్ పట్టణం ఇండియాలో అతి సుందర పట్టణాలలో ఒకటిగా కొనసాగుతోంది. అతి శ్రమకోర్చి నిర్మించబడిన రాజ ప్రాసాద స్మారకాలు, మానవ నిర్మిత కృత్రిమ సరస్సులు, పచ్చటి ప్రదేశాలు అన్నీ కలసి ఉదయపూర్ ను మరల మరల సందర్సిన్చేలా చేస్తాయి. రాజస్తాన్ లో కల ఉదయపూర్ పట్టణం 'సరస్సుల నగరంగా పేరు పడింది. ఇక్కడ కల పిచోలా సరస్సు, ఫతే సాగర్ సరస్సు, ఉదయ సాగర్ సరస్సు మొదలైనవి పర్యాటకులు తమ పర్యటనలో తప్పక చూడదగినవి.

ఇక్కడ అనేక పాలస్ లు, దేవాలయాలు, తోటలు కూడా కలవు. జూన్ నుండి ఆగష్టు వరకు ఉదయపూర్ సందర్శన ఆహ్లాదకరంగా వుంటుంది. మాహారానా ఉదయ సింగ్ జి చే నిర్మించబడిన ఉదయపూర్ పాలస్ పిచోల సరస్సు ఒడ్డున హుందాగా నిలబడి వుంటుంది. ఈ రాజ ప్రాసాదంలో అనేక ప్రాంగణాలు, తోటలు, కలవు. వర్ష రుతువులు ఈ భావన అందాలు మరింత అధికం అవుతాయి. అద్భుతమైన మేవార్ చిత్ర కళ తో నిర్మించిన బాగోర్ కి హవేలీ ఉదయపూర్ లో తప్పక చూడదగిన ప్రదేశాలలో ఒకటి.

సౌత్ ఇండియా A to Z పర్యాటక ప్రదేశాలు ...ఇది కూడా చదవండి

ఉదయపూర్ ఎలా చేరాలి ?
ఉదయపూర్ ను రోడ్డు మార్గం లో ఢిల్లీ మరియు ముంబై నగరాల నుండి ప్రభుత్వ ప్రైవేట్ బస్సు లలో సుమారు 700 కి. మీ. ల ప్రయాణంలో చేరవచ్చు.

రైలు మార్గంలో ఉదయపూర్ దేశంలోని వివిధ పట్టణాలకు కలుపబడి వుంది. విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి ఉదయపూర్ లో విమానాశ్రయం కలదు. ఇది ఉదయపూర్ సిటీ కి సుమారు 20 కి. మీ. ల దూరంలో కలదు.

అందాల ఉదయపూర్ అద్భుత చిత్రాలలో...

ఉదయపూర్ హోటల్ వసతులకు క్లిక్ చేయండి

ఉదయపూర్ సిటీ పాలస్

ఉదయపూర్ సిటీ పాలస్

ఉదయపూర్ పర్యటనలో పర్యాటకులు అధికంగా చూసే రాజ ప్రాసాదం ఉదయపూర్ సిటీ పాలస్.

Photo Courtesy: Dennis Jarvis

ఉదయపూర్ సిటీ పాలస్

ఉదయపూర్ సిటీ పాలస్

అందమైన నగిషీల చే చెక్కబడిన టైల్స్ తో ఉదయపూర్ పాలస్ లోపలి ప్రాంగణాలు
Photo Courtesy: McKay Savage

ఉదయపూర్ పాలస్ మోర్ - చౌక్

ఉదయపూర్ పాలస్ మోర్ - చౌక్

మోర్ చౌక్ అనేది, నెమళ్ళ స్థావరం. దీనికి ఈ పేరు భవనంలోని గోడలపై వివిధ రకాల రంగుల గాజు పలకల పై కల డిజైన్ ల కారణంగా వచ్చింది.

Photo Courtesy: McKay Savage

ఉదయపూర్ పాలస్

ఉదయపూర్ పాలస్

ఉదయపూర్ పాలస్ లోని ఒక అందమైన రంగు రంగుల ఆకర్షణీయ విభాగం
Photo Courtesy: Josh Friedman

బాగోర్ కి హవేలీ

బాగోర్ కి హవేలీ

పురాతనమైనప్పటికి ఈ భవన అందాలు అద్భుతం.

Photo Courtesy: Manoj Vasanth

బాగోర్ కి హవేలీ

బాగోర్ కి హవేలీ

బాగోర్ కి హవేలీ లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు

Photo Courtesy: Arian Zwegers

మాన్సూన్ పాలస్

మాన్సూన్ పాలస్

రాచ కుటుంబ సభ్యులు ఈ భవనాన్ని వర్షాకాల నివాసం గా ఆనందించే వారు. ఇక్కడ నుండి ఉదయపూర్ సిటీ అందాలు, సరస్సులు కనపడతాయి.
Photo Courtesy: Tony Young

మాన్సూన్ పాలస్

మాన్సూన్ పాలస్

మంత్ర ముగ్ధులను చేసే మాన్సూన్ పాలస్ యొక్క ఒక దృశ్యం

Photo Courtesy: Justin Morgan

మాన్సూన్ పాలస్

మాన్సూన్ పాలస్

మాన్సూన్ పాలస్ నుండి అతి సుందరంగా కనపడే సూర్యాస్తమయ దృశ్యం
Photo Courtesy: Prashant Ram

ఫతే సాగర్ సరస్సు

ఫతే సాగర్ సరస్సు

దేశంలోని ప్రసిద్ధ కృత్రిమ సరస్సులలో ఫతే సాగర్ సరస్సు ఒకటి. స్వచ్చమైన నీటి సరస్సు సాయంత్రపు వెలుగులలో
Photo Courtesy: Maneesh Soni

సరస్సుల నగరం - సరదాల మయం !

సరస్సుల నగరం - సరదాల మయం !

సరస్సుల నగరంగా చెప్పబడే ఉదయపూర్ పట్టణం లో నాలుగు ప్రసిద్ధి చెందిన సరస్సులు కలవు.

Photo Courtesy: Girish Suryawanshi

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X