» »ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి మీకు తెలియని రహస్యాలు..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి మీకు తెలియని రహస్యాలు..

Written By: Venkatakarunasri

LATEST: రాత్రి అయితే భైరవకోనలో ఏం జరుగుతుంది ?

ఇండియాలో రాబోతున్న టాప్ 6 మెగా టెంపుల్స్ ఏవేవో తెలుసా?

ఆ ఊరంతా చేతబడి చేసేవాళ్ళే - క్షుద్రమాంత్రికులు మటుకే ఉండే ఊరు !

అమరావతి ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లాలో కృష్ణా నదీతీరానికి కుడి వైపున ఉన్న ఒక పుణ్యక్షేత్రము. ఈ పట్టణము వేల సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉంది. ప్రాచీన శాసనాల ప్రకారము ఈ పట్టణానికి ధాన్యకటకము అనే పేరు ఉన్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని పంచారామాలలో ఒకటైన అమరేశ్వరాలయము పేరు మీదుగా అమరావతి పేరు వచ్చింది.

అమరావతి ... ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని !!

ఈ పట్టణము జైన, బౌద్ధ మతాలకు కూడా ప్రసిద్ధమైనది. శాతవాహనులలో ప్రసిద్ధుడైన గౌతమీపుత్ర శాతకర్ణి మూలముగా క్రీ.శ. ఒకటవ శతాబ్దములో ధాన్యకటకము ప్రసిద్ధిచెందినది. చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్ ఈ పట్టణములో నివసించి అచటి వైభవము గురించి ప్రశంసించాడు.

ఇది కూడా చదవండి: అమరావతి - సన్ రైజ్ స్టేట్ నూతన రాజధాని !!

అమరలింగేశ్వర స్వామి (శివుడు) పుణ్య క్షేత్రం ఈ పట్టణములో కృష్ణానదీ తీరాన యున్నది. ఆంధ్ర ప్రదేశ్ లోని పంచారామాలలో ఇది ఒకటి. వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజులు తరతరాలుగా ఈ స్వామివారిని దర్శించుకుని తరించారనడానికి తగిన ఆధారాలు ఉన్నాయి.

విజయవాడ వెళ్ళారా ... హాయ్ లాండ్ చూసారా ?

కన్నడాంధ్ర ప్రభువైన శ్రీకృష్ణదేవరాయలు అమరావతిని సందర్శించి ఇక్కడి అమరేశ్వరునికి నైవేద్య మహాపూజలు నిర్వహించినట్టు, పెదమద్దూరు గ్రామ పంటభూముల్ని ఆలయానికి దానమిచ్చినట్టుగా ఇక్కడ ఉన్న రాజశాసనం తేటతెల్లం చేస్తోంది.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

కుమారస్వామి

కుమారస్వామి

త్రిపురాసుర సంహారసమయంలో కుమారస్వామిచేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు వివరిస్తున్నాయి.

PC:Bharath chandra.y

అమరావతి

అమరావతి

పురాణాల్లో క్రౌంచతీర్థంగా పేర్కొనబడింది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించి అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్టు స్థలపురాణం తెలియజేస్తుంది. దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించడని. అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.

PC:Miline

ప్రపంచవ్యాప్తంగా

ప్రపంచవ్యాప్తంగా

ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్ర రాజధానిగా అమరావతిని ఎంచుకున్నారు.అయితే అమరావతికి చారిత్ర్యక నేపథ్యం చాలా ఉంది. ఇది మంచి బౌద్ధ పుణ్యక్షేత్రం. కృష్ణానది పక్కనే వుంది. అమరావతిని సందర్శించేందుకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బుద్ధిస్టులు వస్తూవుంటారు.

PC:Dey.sandip

2000 నాటి స్తూపం

2000 నాటి స్తూపం

2000 నాటి స్తూపం, ధాన్యకటక స్తూపం, చిన్న మ్యూజియం వున్నాయి. అమరావతి పలు మతాల సంగమం అని చెప్పవచ్చును.

ఆంధ్ర ప్రదేశ్ లో పంచరామ క్షేత్రాలు !

PC:Ramarajugelli

డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్

డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్

విజయవాడ దక్షిణానికి ౩౦కి.మీల దూరంలో వుంటుంది. అమరావతికి దగ్గరలో వున్న డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ విజయవాడ. అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ హైదరాబాద్. హైదరాబాదుకు వచ్చి అక్కడినుంచి విజయవాడకు వెళ్లి అటు నుంచి అమరావతి వెళ్తూంటారు.

PC:Nbsubbaiah

అమృతలింగం

అమృతలింగం

పురాణాల ప్రకారం తారకాసురుడు దేవతలపై యుద్ధాన్ని ప్రకటించాడు. అతడి నుంచి కాపాడాలని దేవతలు మొరపెట్టుకున్నారు. వారికి సైన్యాధిపతిగా కుమారస్వామి తారకాసురునిపై దండెత్తి అతని కంఠంలో వ్రేలాడుతున్న అమృతలింగాన్ని చేధించాడు.

అమృతలింగం

అమృతలింగం

దాంతో అమృతలింగం 5ప్రదేశాల్లో పడింది. వాటిల్లో పెద్ద ముక్క పడిన ప్రదేశమే అమరావతి. ఇక్కడ స్వర్గాలోకాధిపతి ఇంద్రుడు లింగాన్ని ప్రతిష్టించడంతో దానికి అమరారామంగా, ఆయన రాజధాని అయిన అమరావతిగా పేరు వచ్చింది.

ప్రకాశంలో అద్భుత జల 'కోన' !!

PC:Michael Gunther

ధాన్యకటకం

ధాన్యకటకం

అమరావతి ప్రసిద్ధ క్షేత్రం.క్రీ.శ. 2వ శతాబ్దంలో ఇది ఆంధ్రుల రాజధానిగా విలసిల్లింది. ధాన్యకటకం పేరుతో శాతవాహనుల చివరి రాజైన గౌతమీ పుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి దక్షిణ భారతదేశాన్ని పాలించాడు.

PC: Soham Banerjee

ఆంధ్రుల రాజధాని

ఆంధ్రుల రాజధాని

అమరావతి పైన పురాణ గాథలు కూడా వున్నాయి. అమరావతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాత్రమే కాదు. ప్రపంచ పర్యాటక కేంద్రం కూడా.క్రీ.శ. 2 వ శతాబ్దంలో ఇది ఆంధ్రుల రాజధానిగా విలసిల్లింది. కృష్ణా నది తీరం ఒక విహార ప్రదేశంగా వేలాది పర్యాటకులని ఆకర్షించే ఈ పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ నుండి చేరుకోవడానికి నేరుగా బస్సులున్నాయి.

PC: youtube

 ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?

32 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటకశాఖ విజయవాడ నుండి అమరావతికి మోటర్ పడవ సౌకర్యం కల్పించింది. అయినప్పటికీ ఇప్పుడే జలమార్గంలో బోటు సేవలు లభ్యం కావడం లేదు.

ఆంధ్ర ప్రదేశ్ లో బౌద్ధ మతం ఎలా ఏర్పడింది ?

PC: google maps

విమానాశ్రయం

విమానాశ్రయం

అందుకు కారణం ఈ ప్రయాణానికి నాలుగు గంటల సమయం పట్టడం. వర్షాకాలంలో మాత్రమే బోట్లు నడపగలిగిన జలమార్గంలో మిగిలిన సమయంలో ఇసుకదిబ్బలు. రాళ్ళు అడ్డుగా ఉండడమే ఇదుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. దీనికి సమీప విమానాశ్రయం విజయవాడ.

మహాశివరాత్రి ....లింగాకార ఆవిర్భావం

PC:Nikhil0000711

పర్యాటకులని కూడా ఆకర్షిస్తోంది

పర్యాటకులని కూడా ఆకర్షిస్తోంది

ఈ ప్రదేశం సంవత్సరం పొడవునా ఉష్ణమండల వాతావరణం కలిగి, వేసవులు అధిక వేడి, పొడి గాని, చలి కాలాలు చలి గాను వుంటాయి. ఎన్నో ఆకర్షణలు కల ఈ ప్రదేశం, చారిత్రకులనే గాక పర్యాటకులని కూడా ఆకర్షిస్తోంది.

కోటి వేల్పుల అండ ... కోటప్పకొండ !!

PC: youtube

శాతవాహనుల రాజధాని

శాతవాహనుల రాజధాని

శాతవాహనుల రాజధానిగాను,ప్రపంచ ప్రఖ్యాత బౌద్దారామం గాను,అమరావతికి అంతర్జాతీయంగా ప్రఖ్యాతివుంది.

అమరావతి

అమరావతి

ఇక్కడ పలు మతాలకు చెందిన స్తూపాలు, శిల్పాలు వున్నాయి. అమరావతి గుంటూరు జిల్లాలో వుంది. ఇది గుంటూరుకు 35కి.మీ ల దూరంలో వుంది.

PC: Vivek rachuri

అమరారామం

అమరారామం

పంచారామాలలో ఒకటైన అమరారామం (అమరావతి) కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం.

PC:Ambrose Dudley

Please Wait while comments are loading...