Search
  • Follow NativePlanet
Share
» »చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు !

చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు !

హైదరాబాద్ లోని వాసులు అత్యంత భక్తితో కొలిచే దైవం చిలుకూరి బాలాజీ. హైదరాబాద్ శివార్లలో వుండే ఈ దేవాలయం ప్రతీరోజు భక్తులతో కళకళలాడుతుంటుంది.

 గోదావరి తీరాన ఆదిమానవుల జాడలు ! గోదావరి తీరాన ఆదిమానవుల జాడలు !

చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ కు చేరువలో .. మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో కలదు. హైదరాబాద్ కు చేరువలో ఉండటం, రవాణా సౌకర్యాలు కూడా చక్కగా అందుబాటులో ఉండటం వల్ల బాలాజీ ఆలయాన్ని దర్శించటానికి ప్రతిరోజూ వేలల్లో భక్తులు వస్తుంటారు. ప్రతి రోజూ 20 - 30 వేల మంది భక్తులు, సెలవుదినాలలో 30 -50 వేల మంది భక్తులు వేంకటేశ్వరుని దర్శిస్తుంటారు. విఐపి దర్శనాలు, టికెట్లు, హుండీలు లేని దేవాలయంగా చిలుకూరు ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఒకే ప్రాంగణంలో ఒకవైపు వెంకటేశ్వర స్వామి, మరోవైపు శివుడు పూజలందుకోవటం ఈ ఆలయ విశిష్టత.

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల మరొకటి తెలంగాణలోని చిలుకూరుగా ప్రతీతి. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలదు.

చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు !

టాప్ ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. శ్రీ వెంకటేశ్వరస్వామి

1. శ్రీ వెంకటేశ్వరస్వామి

ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడొకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్లివచ్చేవాడట. అయితే, కొంత కాలానికి ఆయన జబ్బుపడి తిరుపతికి వెళ్లలేకపోయాడట. దీంతో ఆయన బాధపడుతుండగా కలలో శ్రీ వెంకటేశ్వరస్వామి కనిపించి నీకు నేనున్నాను అని అభయమిస్తాడట.

pc: Youtube

2. శ్రీదేవి, భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి

2. శ్రీదేవి, భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి

ఒకప్పుడు స్వామి కలలో ఒక ప్రదేశం గురించి చెబుతాడట. అతను ఆ ప్రదేశం వద్దకు వెళ్లి తవ్వగా శ్రీదేవి, భూదేవి సమేతుడైన వెంకటేశ్వరస్వామి కనిపించాడట. దీంతో ఆ భక్తుడు అక్కడ శాస్త్రోక్తంగా విగ్రహాన్ని ప్రతిష్టించి మందిరాన్ని నిర్మించి తన భక్తిని చాటుకున్నాడట.

pc: Youtube

3. 11 ప్రదక్షిణలు

3. 11 ప్రదక్షిణలు

వెంకటేశ్వర స్వామి కోరిన కోర్కెలను తీర్చే కలియుగ వైకుంఠుడిగా ప్రసిద్ధి. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మొదటిసారి దర్శించి 11 ప్రదక్షిణలు చేసి కోర్కెలను కోరుకోవటం, పిమ్మట ఆ కోరిక నెరవేరిన తరువాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కును చెల్లించుకొనే పద్ధతి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది.

తిరుమలలో రహస్య వైకుంఠ గుహ ఎక్కడ వుందో మీకు తెలుసా ?

pc: Youtube

4. చిలుకూరి బాలాజీ విశిష్టత

4. చిలుకూరి బాలాజీ విశిష్టత

చిలుకూరు బాలాజీ ఆలయానికి వీసా గాడ్ అని కూడా పేరు. కొన్నేళ్ల క్రితం పై చదువులకు పశ్చాత్త్య దేశాలకు వెళ్లి చదువుకొనే విద్యార్థులకు వీసా దొరకక ఇబ్బందిపడేవారు. చిలుకూరి బాలాజీ విశిష్టత తెలుసుకొని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవటం .. ఆ కోరిక నెరవేరటం వెంటనే జరిగిపోయాయి. దాంతో ఇక్కడి స్వామి వారికి వీసా దేవుడిగా పేరొచ్చింది.

pc: Youtube

5. ప్రతీరోజు భక్తులతో కళకళలాడుతుంటుంది

5. ప్రతీరోజు భక్తులతో కళకళలాడుతుంటుంది

హైదరాబాద్ లోని వాసులు అత్యంత భక్తితో కొలిచే దైవం చిలుకూరి బాలాజీ. హైదరాబాద్ శివార్లలో వుండే ఈ దేవాలయం ప్రతీరోజు భక్తులతో కళకళలాడుతుంటుంది. 500సం.ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో అందరూ సమానం అనే రీతిలో దర్శనం చేసుకోవచ్చు. అన్ని దేవాలయాల్లో ఉన్నట్టుగా వి.ఐ.పి. దర్శనం, టిక్కెట్ దర్శనం అంటూ ఏమీ వుండదు.

pc: Youtube

6. దర్శనం

6. దర్శనం

ప్రధాన మంత్రి అయినా సరే మాములు దర్శనం చేసుకోవలసిందే. ప్రస్తుతం ఏ దేవాలయంలో చుసిన హుండీ తప్పనిసరిగా ఉంటుంది. ఈ దేవాలయంలో మాత్రం హుండీ ఉండదు.

pc: Youtube

7. చిలుకూరు బాలాజీ - వీసాల స్వామి

7. చిలుకూరు బాలాజీ - వీసాల స్వామి

ఇతర దేవాలయాలలో హారతి ఇచ్చినప్పుడు కానుకలు వేస్తారు. ఇక్కడ కానుకలు వేయరు. చిలుకూరు బాలాజీని కొంత మంది వీసాల స్వామి అంటారు. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు స్వామి వారిని వేడుకుంటే వెంటనే వీసా వస్తుందట.

pc: Youtube

8. రావి చెట్టు

8. రావి చెట్టు

ఈ దేవాలయం ప్రాంగణంలో 350 సంవత్సరాల చరిత్ర కలిగిన రావి చెట్టు ఉంది. దీన్ని తాకితే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.

24 గంటల్లో శ్రీశైలం - తిరుపతి దర్శనం ఎలా ?

చిత్ర కృప : Rail yatri

9. అభిషేకం

9. అభిషేకం

ఇక్కడ దర్శనం,అభిషేకం వంటి వాటికీ టిక్కెట్ ఉండదు. ఈ దేవాలయంలో కోరిక కోరుకొని 11 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది.


చిత్ర కృప : Rajesh Pamnani

10. దర్శనం

10. దర్శనం

హైదరాబాద్ నుంచే కాకుండా విదేశాల నుండి కూడా చిలుకూరి బాలాజీని దర్శించుకోవటానికి వస్తూ ఉంటారు.టెంపుల్ ఆధ్వర్యంలో ఒక పత్రిక నడుస్తుంది. ఈ పత్రిక ద్వారా వచ్చే ఆదాయంతో ఆలయ నిర్వహణ జరుగుతుంది.

చిత్ర కృప : jitendra_hassija

11. వీసా దేవుడు

11. వీసా దేవుడు

అమెరికా, ఆస్ట్రేలియాల్లాంటి దేశాల్లో ఐటీ రంగంలో ఉద్యోగవకాశాలు పెరిగిన తరుణంలో ఇంజినీరింగ్‌ పూర్తైన విద్యార్థులు ఎంతో మంది విదేశాలకు వెళ్లడానికి వీసాలు రాక ఇబ్బంది పడేవారు. ఆ సమయంలోనే చిలుకూరు బాలాజీని దర్శించుకుని మొక్కుకుంటే వీసా వస్తుందనే నమ్మకం ఏర్పడింది.

pc:youtube

12. వీసా గాడ్‌

12. వీసా గాడ్‌

అప్పట్నుంచి ఈ స్వామికి ‘వీసా గాడ్‌'గా దేశవ్యాప్తంగా పేరొచ్చింది. ఏటా బాలాజీకి నిర్వహించే బ్రహ్మోత్సవాల సమయంలో గరుత్మంతుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని సంతానం లేని మహిళలు స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కల్గుతుందనే నమ్మకమూ ప్రాచుర్యంలో ఉంది.

pc:youtube

13. భక్తుల నమ్మకం

13. భక్తుల నమ్మకం

ఇక్కడి బాలాజీ ఆలయం ప్రాంగణంలో శివాలయం కూడా ఉంది. ఈ మందిరం దగ్గరున్న రావిచెట్టు కింద 450 ఏళ్ల కిందట ఓ మహర్షి తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడట. ఈ చెట్టును తాకి శివ దర్శనం చేసుకుంటే మనసులోని కోరికలు తీరతాయనేది భక్తుల నమ్మకం.

ఈ ఆలయాల సంపద ఎంతో తెలుసా ?

pc:youtube

14. చిలుకూరు బాలాజీ స్వామి వారి దర్శనం

14. చిలుకూరు బాలాజీ స్వామి వారి దర్శనం

చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఉదయం 5 గంటల నుండి రాత్రి 7 :45 వరకు భక్తుల దర్శనార్ధం తెరిచే ఉంచుతారు. దర్శనం టికెట్లు, ప్రత్యేక పూజ టికెట్లు వంటివి ఏమీ ఉండవు. ఎంతటివారైనా క్యూలైన్ లో వెళ్ళవలసిందే!

pc:youtube

15. రవాణా సౌకర్యాలు

15. రవాణా సౌకర్యాలు

హైదరాబాద్ నగరం నుండి చిలుకూరు బాలాజీ ఆలయానికి చక్కటి రోడ్డు రవాణా సదుపాయాలూ కలవు. మెహదీపట్నం నుండి ప్రతి 5 నిమిషాలకొకసారి 222D నెంబరు గల బస్సు బయలుదేరుతుంది.

తిరుమలతో ముడిపడి ఉన్న వెంకటేశ్వర ఆలయాలు !

pc:youtube

16. బస్సు సర్వీసులు

16. బస్సు సర్వీసులు

ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, కూకట్ పల్లి నుండి కూడా సిటీ బస్సు సర్వీసులు కలవు. లంగర్ హౌస్ నుండి ఆటోల్లో ఎక్కి వీసా గాడ్ వద్దకు చేరుకోవచ్చు. హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల నుంచి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.

pc:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X