Search
  • Follow NativePlanet
Share
» »వాగామోన్ ప్రదేశంలో ఏమి చూడాలి ?

వాగామోన్ ప్రదేశంలో ఏమి చూడాలి ?

వాగామోన్ కేరళ లోని కొట్టాయం మరియు ఇడుక్కి జిల్లాల సరిహద్దులో కల ఒక హిల్ స్టేషన్. అక్కడ కల పచ్చటి మైదానాలు, బ్లూ హిల్స్, పొంగి పొరలే నదులు, జలపాతాలు, తాజా గాలి, ఆహ్లాదకర వాతావరనంలా కారణంగా ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా రూపు దిద్దుకొంది.

ఈ చిన్న పట్టణానికి తన్గాల్ హిల్, మురుగన్ హిల్, కురిసుమల అనే మూడు కొండలు సహజ అందాలు తెచ్చి పెట్టాయి. పర్యాటకులు ఇక్కడ రాక్ క్లైమ్బింగ్, ట్రెక్కింగ్, మౌన్తైనీర్ ఇంగ మరియు పారా గ్లైడింగ్ వంటి సాహస క్రీడలు ఆచరించవచ్చు. మీరు సాహసికులు కాకుంటే, విశ్రాంతి పొందుతూ ఆహ్లాదకర వాతావరణం అనుభవించవచ్చు.

వాగామోన్ ప్రదేశాన్ని అక్కడ కల ఆహ్లాదకర వాతావరణం కారణంగా 'స్కాట్ ల్యాండ్ అఫ్ ఆసియా' అని కూడా వ్యవహరిస్తారు. వాగామోన్ పర్యటనలో టూర్ చేయవలసిన ప్రదేశాలు పరిశీలించండి.

కేరళ హోటల్ వసతులకు క్లిక్ చేయండి

ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?

వాగామోన్ కు సమీప ఎయిర్ పోర్ట్ కోచిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. ఎయిర్ లో రెండు గంటల ప్రయాణం. ఈ ఎయిర్ పోర్ట్ దేశంలోని అన్ని మెట్రో నగరాలకు కలుపబడి వుంది. సమీప రైలు స్టేషన్ కుట్టికానం. బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ ల నుండి బస్సు లు కూడా కలవు. Photo Courtesy: vishwaant avk

కురిసుమాల హిల్

కురిసుమాల హిల్

కురిసుమాల హిల్ ను " హోలీ క్రాస్ పర్వతం" అని కూడా అంటారు. క్రిస్టియన్ లకు ఇది ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రదేశంలో అనేక తేయాకు తోటలు, పచ్చటి దట్టమైన అడవులు కలవు. సమీప, దూర ప్రదేశాల నుండి ఇక్కడి ట్రెక్కింగ్, కేమ్పింగ్, పారా గ్లైడింగ్ లకు అనేక మంది వస్తారు.

Photo Courtesy: Visakh

కురిసుమాల ఆశ్రమం

కురిసుమాల ఆశ్రమం

కురిసుమాల ఆశ్రమం కురిసుమాల కొండపై కలదు. ఈ క్షేత్రానికి అన్ని మతాలు, కులాల వారూ వస్తారు. ఇక్కడ గుడ్ ఫ్రీ డే మంచి అట్టహాసంగా జరుగుతుంది. ఈ పర్వ దినాన యాత్రికులు ఒక పవిత్ర చెక్క శిలువను పట్టుకొని కొండను ఎక్కుతారు. ఈ ఆశ్రమంలో ప్రతి రోజూ అన్నదానం జరుగుతుంది.

Photo Courtesy: Anisha Nair

మురుగన్ పారా

మురుగన్ పారా

మురుగన్ పారా వాగామోన్ హిల్ స్టేషన్ కు ఎనిమిది కి. మీ. ల దూరం లో కలదు. మురుగన్ పారా అంటే, కొండలో తొలచిన ఒక మురుగా ప్రభువు యొక్క టెంపుల్. ఇది కురిసుమల హిల్ కు తూర్పు భాగంలో కలదు. ప్రతి సంవత్సరం, ఇక్కడకు వందలాది భక్తులు వస్తారు. కొన్ని చారిత్రక ఆధారాల మేరకు ఇక్కడి చెక్కడాలు రాతి యుగం నాటివిగా భావిస్తారు.

Photo Courtesy: Vanischenu

సూయి సైడ్ పాయింట్

సూయి సైడ్ పాయింట్

వాగామోన్ లో కల సూయి సైడ్ పాయింట్ ను మూన్ పారా అని కూడా అంటారు. ఈ ప్రదేశం ఒక వి ఆకారంలో వుంది అందమైనడిగా వుంటుంది. ఇక్కడ నుండి లోయలోకి పూర్తిగా చూడవచ్చు. సూయి సైడ్ పాయింట్ కు ట్రెక్కింగ్ కొంచెం కష్టమే అయినప్పటికీ, అక్కడకు చేరిన తర్వాత చూసే ప్రదేశ అందాలు మీ శ్రమను మరపింప చేసి, మధురానుభూతులు కలిగిస్తాయి. ఈ ప్రదేశం యొక్క పేరు ను గురించి చింతించ కండి.

Photo Courtesy: Prasanths

తంగళ్ పారా

తంగళ్ పారా

వాగామోన్ లో తంగళ్ పారా ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది ముస్లిం ల యాత్రా స్థలం. ఇక్కడ ఒక పెద్ద కొండపై షేక్ ఫరీదుద్దీన్ టూంబ్ కలదు. ప్రతి సంవత్సరం ఉర్సు ఫెస్టివల్ కు వేలాది భక్తులు వస్తారు. ఈ ప్రదేశ అందాలు ప్రతి ఒక్కరిని ముగ్ధులను చేస్తాయి.

Photo Courtesy: Vanischenu

వాగామోన్ జలపాతాలు

వాగామోన్ జలపాతాలు

వాగామోన్ జలపాతాలు చిన్న సైజువి. ఇక్కడ కల ఒక సరస్సు నుండి పుడతాయి. దీని మార్గం ట్రెక్కింగ్ లో వుంటుంది. చిన్నవి అయినప్పటికీ జలపాతాలు అద్భుత అందాలు కలిగి వుంటాయి.

Photo Courtesy: Anisha Nair

వాగామోన్ సరస్సు

వాగామోన్ సరస్సు

వాగామోన్ సరస్సు ప్రదేశం ఎంతో సుందరంగా వుంటుంది. నేపధ్యం లో కల కొండలు ఈ సరస్సు అందాలను మరింత పెంచాయి. ఈ సరస్సు లో బోటు విహారం చేయవచ్చు. లేదా ప్రదేశం అంతా తిరిగి ప్రకృతి అందాలు ఆస్వాదించవచ్చు. పిక్నిక్ లకు, విహారాలకు పూర్తి విశ్రాంతికి ఈ ప్రదేశం సూచించ దగినది.

Photo Courtesy: Anisha Nair

మరిన్ని కేరళ ఆకర్షణలకు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X