Search
  • Follow NativePlanet
Share
» »విజయవాడ ... ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !!

విజయవాడ ... ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !!

విజయవాడ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ర తాత్కాలిక రాజధానిగా చెప్పబడుతుంది. ఇది కృష్ణా నది ఒడ్డున కలదు. విజయవాడ ఒక వాణిజ్య కేంద్రం. దీనిని 'బెజవాడ' అని కూడా అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క "వ్యాపార రాజధాని" గా పిలవబడుతుంది. అతి పరిశుభ్రమైన నగరంగా పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖచే గుర్తించబడినది. విశాఖపట్నం నగరం తర్వాత విజయవాడ రెండవ అతి పెద్ద నగరం గా పరిగనించబడుతుంది. ఈ నగరాన్ని "భవిష్యత్ గ్లోబల్ సిటీ"గా పేర్కొంటారు. ఇక్కడ ఇంద్రకీలాద్రీపై వెలసిన కనకదుర్గ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఎండాకాలంలో పచ్చళ్ళు వేసుకుంటామే!అదే నండి మామిడి కాయలు. ఆ...గుర్తువచ్చిందా? మామిడి కాయలకు ప్రసిద్ధి చెందిన నూజివీడు కూడా ఈ ప్రాంతానిదే!

దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రైలు, బస్సు మార్గాలు కలవు. విజయవాడకు స్థానిక విమానాశ్రయం కలదు. అతి పెద్ద రైల్వే జంక్షన్ కల ఈ నగరం రాజకీయంగా ఎల్లపుడూ చురుకుగాను, వ్యవసాయ పరంగా సమృద్ధి గానూ మరియు పారిశ్రామిక రవాణా కేంద్రంగానూ పేరు తెచ్చుకుంది. ఎల్లపుడూ రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన పాత్ర వహించే విజయవాడ పర్యాటక పరంగా కూడా ఇపుడిపుడే అభివృద్ధి చెందుతోంది. విజయవాడ నగరం చుట్టుపక్కల కల పర్యాటక ఆకర్షణలు పరిశీలిద్దాం.

కనకదుర్గ దేవాలయం

కనకదుర్గ దేవాలయం

కనకదుర్గ దేవాలయం ఇంద్రకీలాద్రి కోండలపై వెలసిన పవిత్ర హిందూ దేవాలయం. ఇది కృష్ణా నది ఒడ్డున కలదు. కనకదుర్గమ్మ తల్లి విశిష్ఠత, ఔనత్యం గురించి కాళికా పురాణం, దుర్గా సప్తసతి, వేదిక కాలం నాటి పుస్తకాలలో రాసారు. ఇక్కడ దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. రైల్వే స్టేషన్,బస్ స్టేషన్ నుంచి ఈ దేవాలయం కి రావాలంటే 10ని. సమయం మరియు ఎయిర్ పోర్టు నుంచి 20ని. పడుతుంది.

Photo Courtesy: vishwanad.b.k

ప్రకాశం బ్యారేజ్

ప్రకాశం బ్యారేజ్

విజయవాడలో మరొక చెప్పుకోదగిన పర్యాటక ప్రదేశం ప్రకాశం బ్యారేజ్.ఈ బ్యారేజ్ 1855 వ సం.లో బ్రీటీష్ కాలంలో ప్రారంభించబడినది.ఈ బ్యారేజ్ కి మూడు కాలువలు ఉన్నాయి. అందులో బకింగ్ హామ్ కాలువ ఒకటి. ఈ కాలువ విజయవాడకు నీటి సదుపాయం కల్పిస్తుంది. ఈ బ్యారేజ్ ప్రధాన నగరాలైన గుంటూరు,విజయవాడలను వేరుచేస్తుంది, అంతేకాదు రవాణా పరంగా ఉపయోగపడుతుంది.ఇది సుమారుగా 1.2 మిలియన్ ఎకరాలకు సాగు నీరు అందిస్తుంది.

Photo Courtesy: Chintohere

ఉండవల్లి గుహలు

ఉండవల్లి గుహలు

ఈ గుహలను క్రీ.శ. నాల్గవ,ఐదవ శతాబ్దం కాలంలో గుర్తించినారు. ఇది విజయవాడ నుంచి 6 కి.మీ.దూరంలో కలదు.ఈ గుహలు చరిత్ర పరంగా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ గుహలలో రాతితో చెక్కించబడిన విష్ణువు, ఆంజనేయుడు, బ్రహ్మ,తెలుగులో గోడలపై లిఖించబడిన శాశనాలు మరియు ఒకే రాయితో చుక్కించిన కట్టడాలు చూడవచ్చు.

Photo Courtesy: Arvind.vindhu

భవాని ఐస్లాండ్

భవాని ఐస్లాండ్

ఇది 133 ఎకరాలలో (54 హెక్టార్లు) కృష్ణా నది మధ్యలో,ప్రకాశం బ్యారేజ్ కి పై వైపున విస్తరించి ఉంది.ఇక్కడ ఎపి టూరిజం వారు పర్యటకులను ఆకర్షించడానికి క్రీడలు, రిసార్టులు,మ్యూజియం,రోప్ వే మొదలగునవి ప్రవేశపెట్టారు.

Photo Courtesy: Ashwin Kumar

అక్కన మరియు మాదన్న గుహలు

అక్కన మరియు మాదన్న గుహలు

అక్కన మరియు మాదన్న గుహలు17 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన అబ్దుల్ హసన్ తానాషా న్యాయస్థానం లో ఉన్న ఇద్దరు మంత్రుల పేర్లు పెట్టారు. గుహలను తొలచి రెండు శిలలను తయారు చేసారు.ఈ ఇద్దరు మంత్రులకు ఈ గుహలబొమ్మలతో సంబంధం కలిగి ఉంది.గుహలు 6 మరియు 7వ శతాబ్దాల కాలంలో ఉనికిలో వచ్చాయి.గుహలో కేవలం ఆలయం మాత్రమే కొండ క్రింద భాగంలో ఉంది.యాత్రికుల ప్రసిద్ధ కనక దుర్గ ఆలయం మార్గంలో ఈ ప్రదేశమును సందర్శించవచ్చు,మరియు కొండ పైన గుహలో హిందూ మతం ట్రినిటీ-బ్రహ్మగా,విష్ణు మరియు మహేశ్వర యొక్క పేరు లో నిర్మించబడింది ఒక రాక్ కట్ దేవాలయం.

Photo Courtesy: Adityamadhav

కొండపల్లి కోట

కొండపల్లి కోట

ఏడవ శతాబ్దములో నిర్మించిన మూడు అంతస్తుల కోటను కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ కోట ఎన్నో రాజ వంశాల పాలనలో ఉండేది. అంతేకాదు, ఇది ఒక వ్యాపార కేంద్రంగా కూడా ఉపయోగపడింది. బ్రిటిషు పాలకులు తమ సైన్యానికి రక్షణలో శిక్షణ ఇచ్చేందుకు ఈ కోటను వాడుకునేవారు. వనవిహారానికి ఇది చాలా అనువైనది.

Photo Courtesy: Quest prithvi

కొండపల్లి బొమ్మలు

కొండపల్లి బొమ్మలు

కొండపల్లి అనే పేరు చెప్పగానే ముచ్చటైన ముద్ధులొలికే చెక్కబొమ్మలు గుర్తుకు వస్తాయి. కళాకారులు చెక్కతో వివిధ రూపాల్లో అత్యంత అద్భుతంగా, అందంగా తయారు చేసిన ఈ బొమ్మలు దేశ విదేశాల్లో ఎందరినో ఆకట్టుకుంటోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పేరును ఖండాతరాలు దాటించిన విశేషాల్లో కొండపల్లి బొమ్మలకూ స్థానం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో గల ఇబ్రహీంపట్నం మండలంలో వెలసిన ఓ చిన్న గ్రామమే కొండపల్లి . కేవలం చేతితో కొన్ని రకాల పనిముట్లను ఉపయోగించి మాత్రమే కొండపల్లి బొమ్మలను తయారు చేస్తారు.

Photo Courtesy: Gopal Venkatesan

అమరావతి

అమరావతి

ఇది విజయవాడకు 68 కీ.మీ.ల దూరములో కృష్ణా నది దక్షిణపు ఒడ్డున ఉన్న చిన్నపట్టణము. అమరావతి దక్షిణభారతదేశములోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బౌద్ధారామం. క్రీ.పూ.3 లేదా 2 శతాబ్దాలలో ఆచార్య నాగార్జునుడు ఇక్కడ అతిపెద్ద స్థూపాన్ని నిర్మించాడు. కల్నలు మెకెన్జీ 1797 లో తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఇక్కడ కొన్ని శిల్పాలు బయటపడ్డాయి. ఇక్కడ దొరికిన పురావస్తు అవశేషాలు చాలావరకు మద్రాసు మరియు కోల్కతాలలో ఉన్న మ్యూజియములలో భద్రపరిచారు. ఇక్కడి ప్రాంతంవారు దీనిని దీపాల దిన్నె అని పిలిస్తారు. ఇక్కడ ఒక పురావస్తు మ్యూజియము ఉన్నది. అందులో అప్పటి నాణేలు, గాజులు, బోధి వృక్షము యొక్క శిల్పాలు, విరిగిన కమ్మీలు మొదలయినవాటిని చూడవచ్చు.

Photo Courtesy: Nandign

విజయవాడ ఎలా చేరాలి?

విజయవాడ ఎలా చేరాలి?

వాయు మార్గం:
విజమవాడకు చేరువలో గన్నవరం విమానాశ్రయం కలదు. ఇది నగరానికి 19 కి.మీ. దూరంలో ఉంది .ఇక్కడ నుంచి సిటి బస్సు సదుపాయం కూడా కలదు.ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు వెళ్ళవచ్చు.
రైలు మార్గం:
ఈ స్టేషన్ అత్యధిక రద్దీగా ఉంటుంది ఎందుకనగా హౌరా నుండి చెన్నై, చెన్నై నుండి ఢిల్లి వెళ్ళే రైళ్ళన్నీ ఈ స్టేషన్ మీదుగనే ప్రయాణిస్తాయి.ఇక్కడ రోజుకి సుమారు 320 రైళ్ళు పైగానే నడుస్తాయి.ఇక్కడ నుండి దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలకు ప్రయాణించవచ్చు.
బస్సు మార్గం:
ఇది దేశంలో కెల్లా నాల్గవ పెద్ద బస్టాండ్.ఇక్కడ నుంచి అన్ని ప్రధాన పట్టణాలకు బస్సు సదుపాయం కలదు.ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూర్, చెన్నై,వైజాగ్ తో పాటు అన్ని పట్టణాలతో రవాణా సదుపాయం కలదు.

Photo Courtesy: vijay chennupati

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X