» »మహారాష్ట్రలోని ఈ మూడు ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించి పాపపరిహారం చేసుకోండి

మహారాష్ట్రలోని ఈ మూడు ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించి పాపపరిహారం చేసుకోండి

Posted By: Venkata Karunasri Nalluru

LATEST: భారతదేశంలో పచ్చదనంతో కూడిన పరిశుభ్రమైన పది పచ్చని నగరాలు ఏవేవో మీకు తెలుసా ?

పంఢరాపురాన్ని మహారాష్ట్రీయులు దక్షిణకాశీగా పిలుస్తారు. ఇక్కడి స్వామి వారిని విఠోభా, పాండు రంగ, పంఢరానాధ్, విఠల్, విఠల్ నాథ్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. షిర్డీ ఒక గొప్ప పుణ్యక్షేత్రం కావడం వలన షిర్డీకి ప్రతిరోజు అధిక సంఖ్యలో యాత్రికులు వస్తారు. తిరుపతి తర్వాత అత్యంత ప్రసిద్ధమైన ఆలయం షిర్డీ. గురుపౌర్ణమి పర్వదినాన భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది.

శని శింగనాపురంలో ఉన్న ఈ ఆలయం శని దేవుని యొక్క ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలోని మహారాష్ట్రలో వుంది. శని శింగనాపురం షిరిడికి, ఔరంగాబాద్ కి మధ్యలో ఉంది.

ఎలా చేరాలి

షిర్డీ నుంచి శని శింగనాపురంకి బస్సు ద్వారా 1 గం. 38ని.లు పడుతుంది.

బస్సు ద్వారా: పండరపురం నుంచి షిర్డీ చేరుకోవడానికి ఈ మార్గంలో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సులు అందుబాటులో వున్నాయి.

సోలాపూర్ - ధూలే ఎన్ హెచ్ మార్గం అయితే : కారు ద్వారా - 5 గం.ల 36 ని.ల సమయం పడుతుంది. 274 కి.మీ.ల దూరం పడుతుంది. బస్సు ద్వారా : 10 గం.ల 26 ని పడుతుంది.

పంఢరా పురం గురించి

పంఢరా పురం గురించి

పంఢరాపురము మహారాష్ట్రలోని షోలాపూర్ అనే జిల్లాలో కలదు. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రము. ఇది భీమా నది ఒడ్డున కలదు. ఇక్కడ పాండురంగ విఠలుడు రుక్మిణీ దేవి సమేతంగా వెలసి యున్నాడు. హిందువులు శ్రీకృష్ణుని యొక్క మరొక అవతారంగా భావిస్తారు.

PC : Parag Mahalley

దక్షిణకాశీగా పిలవబడుతున్న పంఢరాపురము

దక్షిణకాశీగా పిలవబడుతున్న పంఢరాపురము

13 నుండి 17 శతబ్దాల మధ్యకాలంలో మహారాష్ట్రకు మరియు కర్ణాటకకు చెందిన వైష్ణవ భక్తులు ధ్యానేశ్వర్, నామ్ దేవ్, ఏక్ నాథ్, తుకారాం, పురంధర దాసు, విజయ్ దాస్, గోపాల్ దాస్, జగన్నాథ్ దాస్ మొదలైనవారు పాండురంగఠలుని ఎంతో భక్తిగా కొలిచి తరించారు. ఈ దేవాలయానికి ఆరు ద్వారాలున్నాయి. పంఢరాపురాన్ని మహారాష్ట్రీయులు దక్షిణకాశీగా పిలుస్తారు. ఇక్కడి స్వామి వారిని విఠోభా, పాండు రంగ, పంఢరానాధ్, విఠల్, విఠల్ నాథ్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.

PC : Malathi Manjunath

పండరి నాధుని దీక్ష

పండరి నాధుని దీక్ష

కొందరు భక్తులు దీక్షలు వహిస్తారు. అలాంటి దీక్షలలో ముఖ్యమైనది అయ్యప్ప దీక్ష. అలాగే వేంకటేశ్వరస్వామి దీక్ష, శివ దీక్ష, దుర్గమ్మ దీక్ష భవానీ దీక్ష చేపట్టి కొన్ని రోజులు నియమ నిష్టలతో దీక్ష సాగించి ఒక రోజున ఆయా దేవాలయాలకు యాత్రగా కాలినడకన బయలుదేరుతారు. ఆలాంటి దీక్షకు పండరి నాధుని దీక్షకూడ ఒక మంచి ఉదాహరణ.

PC: Balkrishna Kulkarni

ఏకాదశి నాడు జరిగే ఉత్సవాలు

ఏకాదశి నాడు జరిగే ఉత్సవాలు

ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నాడు జరిగే ఉత్సవాలకు జనం లక్షల సంఖ్యలో వస్తారు. పక్కనున్న నదీ ప్రాంతమంతా కోలాహలంగా వుంటుంది. కాలినడకన వెళ్ళాలనుకు ఆ రోజుకు అక్కడికి చేరుకునేటట్లు తమ ప్రయాణాన్ని నిర్ణయించుకుంటారు.

షిర్డీ గురించి

షిర్డీ గురించి

శ్రీ షిర్డీ సాయిబాబా పుణ్యక్షేత్రం మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లాలో వున్నది. షిర్డీ అహ్మద్ నగర్ నుండి 83 కి.మీ. మరియు మోపర్గాం నుండి 15 కి.మీ. దూరంలో ఉంది.

Image Courtesy : Brunda Nagaraj

షిర్డీకి ప్రతిరోజు అధిక సంఖ్యలో యాత్రికులు

షిర్డీకి ప్రతిరోజు అధిక సంఖ్యలో యాత్రికులు

షిర్డీ ఒక గొప్ప పుణ్యక్షేత్రం కావడం వలన షిర్డీకి ప్రతిరోజు అధిక సంఖ్యలో యాత్రికులు వస్తారు. తిరుపతి తర్వాత అత్యంత ప్రసిద్ధమైన ఆలయం షిర్డీ. గురుపౌర్ణమి పర్వదినాన భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది.

Image Courtesy : Photographer in Shirdi

భక్తుల కోసం సాయి బాబా

భక్తుల కోసం సాయి బాబా

దేశంలో అన్ని ప్రధాన నగరాలలోనూ సాయిబాబా మందిరాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో అనేక నగరాలలోను, పట్టణాలలోను, చాలా గ్రామాలలోను సాయి మందిరాలున్నాయి. భక్తుల కోసం సాయి బాబా గురించి అనేక పుస్తకాలు ఇక్కడ లభిస్తుంది. హిందువుల యాత్రా స్థలాలలో షిరిడీ ఒకటి.

Image Courtesy : Brunda Nagaraj

శని శింగనాపురం గురించి

శని శింగనాపురం గురించి

శని శింగనాపురంలో ఉన్న ఈ ఆలయం శని దేవుని యొక్క ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలోని మహారాష్ట్రలో వుంది. శని శింగనాపురం షిరిడికి, ఔరంగాబాద్ కి మధ్యలో ఉంది. ఇక్కడి దేవుడు భూమి నుండి స్వయంగా ఉద్భవించినాడు. ఈ రాతి విగ్రహం నల్లగా గంభీరంగా వుంటుంది. గొర్రెల కాపరి పదునైన చువ్వతో రాతిని ముట్టుకొనగా దానినుంచి రక్తం కారడం ప్రారంభమైంది. దీనితో గొర్రెల కాపరులు దిగ్భ్రాంతి చెందారు. వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతాన్ని చూచేందుకు గుమికూడింది.

Image Courtesy : wikimedia.org

శనీశ్వర స్వామి

శనీశ్వర స్వామి

ఆ రాత్రి ఆ గొర్రెల కాపరి కలలో శనీశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు. తాను "శనీశ్వరుడి"నని చెప్పెను. అద్వితీయముగా కనిపించుచున్న ఆ నల్లరాయి తన రూపమేనని కుడా ఆయన చెప్పినాడు. ఒక ఆలయం నిర్మించమని చెప్పెను. ప్రతిరోజూ పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా 'తైలాభిషేకం' చేయమని ఆయన గొర్రెల కాపరికి చెప్పెను. అంతేకాక మొత్తం పల్లెకి బందిపోటుల లేదా కన్నములు వేసే వారు లేదా దొంగల భయం ఉండదని మాట ఇచ్చెను. అందుచే ఈరోజు వరకు కూడా శనీశ్వర స్వామిని ఎటువంటి కప్పు లేకుండా ఆరు బయట చూడవచ్చును.

Image Courtesy : wikimedia.org

శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజు

శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజు

ఈ రోజు వరకు ఏ ఇంటికి, దుకాణముకు, ఆలయముకు కూడా తలుపులు ఉండవు. తపాలా కార్యాలయానికి కూడా తలుపులు, తాళాల ప్రసక్తి లేకపోవడం మనం చూసి నమ్మవచ్చు. శని శింగనాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడి జరగలేదు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకుని చనిపోయారు.శనీశ్వరుని కృపకు పాత్రులు కావాలనుకునే వేలమంది భక్తులు ప్రతిరోజూ ఈ శని శింగనాపూర్‌ను దర్శిస్తారు. శనివారములలో ఈ స్థలం చాల రద్దీగా ఉంటుంది. శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది.

Image Courtesy : wikimedia.org