Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు : మీకు తెలియని వారాంతపు విహార ప్రదేశాలు !

బెంగళూరు : మీకు తెలియని వారాంతపు విహార ప్రదేశాలు !

By Mohammad

మాన్సూన్ సీజన్ వచ్చేసింది. ఉదయం అయితే చాలు బెంగళూరు నగరం వర్షంతో తడిసి ముద్దవుతున్నది. బెంగళూరు వాతావరణం ఈ మాన్సూన్ సీజన్ లో మీకు కొన్ని జ్ఞాపకాలను, అనుభవాలను అందించగలదు. ఇక ఎందుకు ఆలస్యం, వీకెండ్ లో వెంటనే బ్యాగ్ సర్దుకొని బెంగళూరు కు ప్రయాణం అవుదాం పదండి.

బెంగళూరు సమీపంలో 100 కిలోమీటర్ల లోపు చూడటానికి ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇవన్నీ బెంగళూరు లో ఉన్న పర్యాటకులు తరచూ సందర్శించేవే! ఇవేం చూస్తారుగానీ, బెంగళూరులో ఎవ్వరూ చూడని, చాలా తక్కువ మందికి తెలిసిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడూ ఉండే నగర జీవితం నుండి కాసింత రిలాక్స్ అవటానికి ఈ ప్రదేశాలను వీలైతే మీ స్నేహితులతో సందర్శించండి.

పంచపల్లి

పంచపల్లి

పంచపల్లి, బెంగళూరు నుండి 85 కిలోమీటర్ల దూరంలో కలదు. పంచపల్లి సైలెంట్ గా, కామ్ గా ఉండే ప్రదేశం. ఇక్కడ ఎటువంటి అరుపులు వినిపించవు కేవలం ప్రకృతి చేసే చప్పుళ్ళు తప్ప. ఇక్కడ అంతగా పర్యాటకులు గుమిగూడి ఉండరు. పంచపల్లి లో డ్యాం చూడదగ్గది.

చిత్ర కృప : Rohit

పంచపల్లి

పంచపల్లి

పంచపల్లి లోని డ్యాం నిండుగా చూడాలంటే మాన్సూన్ సీజన్ సరైన సమయం. ఆ సమయంలోనే అందంగా కనపడుతుంది మరియు ఫోటోగ్రాఫర్ లు డ్యాం వద్ద చేరుకొని ఫోటోలు తీస్తుంటారు.

ఇది కూడా చదవండి : వారాంతపు విహారం - రంగనతిట్టు బర్డ్ సాన్క్చురి

చిత్ర కృప : Rohit

పంచపల్లి

పంచపల్లి

పంచపల్లి ఎలా చేరుకోవాలి ?

రైలు మార్గం

పంచపల్లి చేరుకోవాలంటే సమీపాన ఉన్న మారండహళ్లి రైల్వే స్టేషన్ చేరుకోవాలి. ఇక్కడి నుండి మీరు పర్సనల్ గా క్యాబ్ చేసుకొని పంచహళ్లి డ్యాం వరకు చేరుకోవచ్చు. డ్యాం కు స్టేషన్ కు మధ్య దూరం 15 కిలోమీటర్లు.

రోడ్డు మార్గం

బెంగళూరు నుండి డెన్కనికొట్టై వరకు బస్సులో ప్రయాణించాలి. అక్కడి నుండి ప్రవేట్ టాక్సీ ద్వారా 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచపల్లి డ్యాం చేరుకోవచ్చు.

చిత్ర కృప : Vijay Krishna

పంచపల్లి - ఇతర ఆకర్షణలు

పంచపల్లి - ఇతర ఆకర్షణలు

రోడ్డు మార్గాన చేరుకొనేటప్పుడు డెన్కనికొట్టై వద్ద ఉన్న బెట్టరాయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఇది 500 సంవత్సరాల పురాతన ఆలయం.

చిత్ర కృప : Subramanian Sundaram

మధుగిరి

మధుగిరి

మధుగిరి బెంగళూరు కి 100 కిలోమీటర్ల దూరంలో కలదు. 3,930 అడుగుల ఎత్తున ఉన్న ఈ శిఖరం, మోనోలిథిక్ శిలలతో ఏర్పడ్ద ఆసియా ఖండం లోనే రెండవ ఎత్తైన శిఖరం గా ప్రసిద్ధి చెందినది. శిఖరం పైకి ట్రెక్ చేయటం గొప్ప అనుభూతి కాగలదు. అలా చేరుకున్నాక కొండ శిఖరాన గోపాలస్వామి ఆలయం గమనించవచ్చు.

చిత్ర కృప : sarit

మధుగిరి

మధుగిరి

ఎలా చేరుకోవచ్చు ?

బెంగళూరు లోని మెజెస్టిక్ బస్ స్టాండ్ నుండి మధుగిరి కి డైరెక్ట్ గా ప్రభుత్వ / ప్రవేట్ బస్సు సౌకర్యం ఉన్నది. మీరు అక్కడ దిగి నడక మార్గాన చేరుకోవచ్చు.

ఇది కూడా చదవండి : నంది కొండల రహస్యం ఛేదిద్దాం రండి!

చిత్ర కృప : nagesh vg

మధుగిరి

మధుగిరి

ఎక్కడ స్టే చేయాలి ?

తుంకూర్ లోని రిసార్ట్ లు మధుగిరి వచ్చే యాత్రికులకు వసతి సౌకర్యాలను అందిస్తున్నాయి.

ది నవీన్ రీజెన్సీ హోటల్ - 0816-2213-337
వుడ్ లాండ్స్ హోటల్ - 0816-2281-555

చిత్ర కృప : R Eijaz

దరోజి బేర్ స్యాంక్చురీ

దరోజి బేర్ స్యాంక్చురీ

దరోజి బేర్ స్యాంక్చురీ బళ్లారి జిల్లాలో, బెంగళూరు నుండి 340 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడ ఇండియన్ ఎలుగు బంటీలు సంరక్షించబడుతున్నాయి. బళ్లారి నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్యాంక్చురీ కి లోకల్ గా బస్సులు తిరుగుతాయి. హంపి వచ్చే టూరిస్ట్ లకు ఇది చక్కటి విహార స్థలం.

చిత్ర కృప : Nagesh Kamath

దరోజి బేర్ స్యాంక్చురీ

దరోజి బేర్ స్యాంక్చురీ

సాధారమైనంత వరకు స్యాంక్చురీ ని మధ్యాహ్నం పూట సందర్శించండి. ఆ సమయంలోనే ఎలుగుబంటీలు నీరు తాగటానికి బయటికి వస్తాయి . మీకు ఒకేవేళ లక్ ఉంటే, ఆడ ఎలుగుబంటీ లతో చేసే సరసాలు చూడవచ్చు.

ఇది కూడా చదవండి : కర్ణాటక లోని వన్య జంతు అభయారణ్యాలు !

చిత్ర కృప : Paul Williams

దరోజి బేర్ స్యాంక్చురీ

దరోజి బేర్ స్యాంక్చురీ

బేర్ స్యాంక్చురీ లో ఇప్పటివరకు 150 ఎలుగుబంటీలను గుర్తించారు. ఇక్కడ పక్షులను చూడటానికి ప్రత్యేక వ్యూ పాయింట్ లు ఉన్నాయి. జంతు ప్రేమికులు, పక్షి ప్రేమికులు అందమైన ఫోటోలు తీస్తూ గడిపేయవచ్చు.

చిత్ర కృప : Prasad Natarajan

దరోజి బేర్ స్యాంక్చురీ

దరోజి బేర్ స్యాంక్చురీ

ఎలా చేరుకోవాలి ?

మీకు ఇక్కడికి సొంతంగా కానీ లేదా జంగల్ లాడ్జ్ ల ద్వారా నడపబడుతున్న సఫారీ ప్యాకేజి ట్రిప్ ల ద్వారా గానీ చేరుకోవచ్చు. మీరు ఇక్కడికి రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా వెళ్ళవచ్చు.

రోడ్డు మార్గం ద్వారా

బెంగళూరు నుండి 13 గుండా వెళితే మొదట చిత్రదుర్గ(199 KM ) ; ఆ తరువాత హొస్పెట్ వస్తుంది(135 KM). అక్కడి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కమలాపుర చేరుకుంటే 10 కిలోమీటర్ల దూరంలోనే స్యాంక్చురీ ఉంటుంది.

రైలు మార్గం ద్వారా

హొస్పెట్ సమీప రైల్వే స్టేషన్. బెంగళూరు నుండి హుబ్లీ నుండి తరచూ రైళ్లు వస్తుంటాయి.

చిత్ర కృప : phespirit

దరోజి బేర్ స్యాంక్చురీ

దరోజి బేర్ స్యాంక్చురీ

ఎక్కడ స్టే చేయాలి ?

జంగల్ లాడ్జ్ ల ద్వారా నడుపబడుతున్న స్లోత్ బేర్ రిసార్ట్ చక్కటి వసతి కలిగి ఉంటుంది. లేదా హంపి లో ఏదేని లాడ్జి లలో స్టే చేయవచ్చు.

ఇది కూడా చదవండి : హంపి పర్యాటక స్థలాలు !

చిత్ర కృప : Pixel Yatra

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X