» »భారతదేశంలో ఉన్నారా ? తస్మాత్ జాగ్రత్త !

భారతదేశంలో ఉన్నారా ? తస్మాత్ జాగ్రత్త !

Written By: Venkatakarunasri

ఈ యొక్క ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం టూరిజం ని నిరుత్సాహపరచడం పరచడం కొరకు కాదు. పర్యాటకులు ఈ ప్రదేశాలను సందర్శిస్తున్నపుడు కాస్త జాగ్రత్త వహించండి అని హెచ్చరించడం మాత్రమే. యాత్రికులు సంచరించని, వెళ్ళటానికి మొగ్గు చూపని ప్రదేశాలు సైతం మన భారత దేశంలో కొన్ని ఉన్నాయని చెప్పడానికే ఈ వ్యాసాన్ని ప్రచురించడం జరిగింది. మన భారత దేశం ఎన్నో వైవిధ్యభరితమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఆధ్యాత్మికత కు సంబంధించినవి, సాహసాలకు సంబంధించినవి, ప్రకృతి కి సంబంధించినవి ... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మన ఇండియాలో వెళ్ళకూడని ప్రదేశాలు ఉన్నాయంటే నమ్మశక్యం కాదేమో ..! భారత దేశ పౌరులమైన మనం దేశంలో ఎక్కడికైనా పాస్‌పోర్ట్, వీసా అవసరం లేకుండా పర్యటించవచ్చు కానీ కింద పేర్కొన్న ప్రదేశాలలో మాత్రం పర్యటించడానికి అనుమతులు తీసుకోవాలి అందుకే ఈ ప్రదేశాలను చూడటానికి ఎవ్వరూ కూడా సాహసించారు. ఇంతకు ఎంటా ప్రదేశాలు? ఎక్కడ ఉన్నాయి ??

ఆక్సై చిన్, జమ్మూకాశ్మీర్

ఆక్సై చిన్, జమ్మూకాశ్మీర్

ఆక్సై చిన్ జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నది. ఇది ఇండియాలోనే ఉన్నా మిమ్మల్ని మాత్రం అనుమతించరు ఎందుకో తెలుసా ఇప్పటికీ ఈ ప్రాంతం తమదంటే తమదని ఇండియా, చైనా గొడవ పడుతున్నాయి. ఈ వివాదాస్పద ప్రదేశం జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో తూర్పువైపున ఉన్న చిట్టచివరి ప్రాంతం. ఎల్ ఏ సి అని పిలువబడే సరిహద్దు భారత్, చైనా లను వేరు చేస్తున్నది.

చిత్ర కృప : ngaire hart

సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, కేరళ

సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, కేరళ

కేరళ రాష్ట్రంలోని సైలెంట్ వ్యాలీ జాతీయ పార్క్ లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదం వల్ల, అటవీ అధికారులు పర్యాటకులను లోనికి అనుమతించరు. ఈ పార్క్ ఆకుపచ్చని చెట్ల పొదలతో దట్టంగా అలుముకొని అడవిలో ఉంటుంది. పర్యాటకులను లోనికి వెళ్తే ముంపుపొంచి ఉంటుందని అటవీ అధికారులు హెచ్చరికల బోర్డ్ లను కూడా పెట్టారు.

చిత్ర కృప : Vinod Ellamaraju

చంబల్ రివర్ బేసిన్ , మధ్య ప్రదేశ్

చంబల్ రివర్ బేసిన్ , మధ్య ప్రదేశ్

మధ్య ప్రదేశ్ లో ప్రవహించే చంబల్ నది పరివాహ ప్రాంతం ఒకప్పుడు టూరిస్టులకు, సినిమా షూటింగ్ లకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం గా ఉండేది. ఎన్నో బాలీవూడ్ సినిమా షూటింగ్ లు, ఇతర భాషల సినిమా వారు వచ్చి ఇక్కడ చిత్రీకరణ లు జరిపేవారు. కానీ ప్రస్తుతం ఏమైందో సడన్ గా లోనికి అనుమతి ఇవ్వడం లేదు దీంతో ఇప్పటి తరం వారికి లోన ఉన్న ప్రకృతి దృశ్యాలు తెలీటం లేదు.

చిత్ర కృప : Jangidno2

మానస్ జాతీయ పార్క్, అస్సాం

మానస్ జాతీయ పార్క్, అస్సాం

భారత దేశంలో బాగా పేరుపొందిన మానస్ జాతీయ పార్క్ అస్సాం లోని గువాహటి(గౌహతి) లో ఉన్నది. 2011 వ సంవత్సరంలో 6 మంది డబ్లు డబ్లు ఎఫ్ ఆఫీసర్‌ లు బోడో మిలిటెంట్ ల చేత మానస్ నేషనల్ పార్క్ లో కిడ్నాప్ కాబడ్డారు. దీంతో పర్యాటకులు ఈ పార్క్ లోనికి రావటానికి జంకుతున్నారు. ప్రభుత్వాలు ఈ పార్క్ మీద ఉన్న అపోహాలను తొలగించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నది.

చిత్ర కృప : Sougata Sinha Roy

తుర, మేఘాలయ

తుర, మేఘాలయ

తుర మేఘాలయ రాష్ట్రం లోని వెస్ట్ గారో హిల్స్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం. పచ్చని పొదలతో, ఉవ్వెత్తున ఎగిసిపడే జలపాతాలతో, లైమ్ స్టోన్ తో ఏర్పడిన గుహలతో ఈ ప్రదేశం చూపరులను ఆకట్టుకుంటున్నది. కానీ భాధాకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రదేశం ఉగ్రవాదుల దాడిలో గాయపడింది. ఎప్పుడు ఏ ముప్పు వస్తుందో తెలీని ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి పర్యాటకులు భయపడుతారు.

చిత్ర కృప : loveleen momin

హఫ్లాంగ్, అస్సాం

హఫ్లాంగ్, అస్సాం

అస్సాం రాష్ట్రంలో పర్యాటకులను మంత ముగ్ధులను చేసే ఏకైక పర్వత ప్రాంతం హఫ్లాంగ్. దీనికి తూర్పు స్విజర్లాండ్ అని ముద్దు పేరు. ఈ ప్రదేశంలో కూడా ఉగ్రవాద కదలికలు జరుగుతున్నాయని భావించిన పర్యాటకులు ఇటువైపు రావడానికి భయపడిపోతున్నారు.

చిత్ర కృప : Zahid Tapadar

బస్తర్, చత్తీస్ ఘర్

బస్తర్, చత్తీస్ ఘర్

చత్తీస్ ఘర్ రాష్ట్రంలోని బస్తర్ ఒక అందమైన అటవీ ప్రాంతం. ఈ ప్రాంతంలో అందమైన జలపాతాలు, దేవాలయాలు మరియు సహజ సిద్ధమైన ప్రకృతి పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నక్సలైట్ లు సంచరిస్తున్నారు. పర్యాటకులు అటువైపు వెళ్ళటానికి మొగ్గు చూపటం లేదు.

చిత్ర కృప : f.slezak

ఫుల్బని, ఒరిస్సా

ఫుల్బని, ఒరిస్సా

ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ కి 200 కి. మీ. దూరంలో ఉన్న ఫుల్బని జాలువారే జలపాతాలు, చూడచక్కని పొదళ్లు, చుట్టూ కొండలతో అలరారుతున్నది. రెడ్ జోన్ పరిధిలో వచ్చే ఈ ప్రదేశంలో మావోయిస్ట్ లు తమ కార్యకలాపాలకు నిర్వహించుకుంటున్నారు.

చిత్ర కృప : Sushobhanroy

నికోబార్ దీవులు

నికోబార్ దీవులు

పర్యాటకులకు అండమాన్ దీవులకు తప్పనిచ్చి నికోబార్ దీవులకు వెళ్ళటానికి అనుమతి ఉండదు. ఈ దీవులలో బయటి సమాజంతో సంబంధం లేని ట్రైబల్ ప్రజలు, ఆటవిక జాతుల ప్రజలు నివసిస్తున్నారు. చూట్టూ దట్టమైన అడవి, నాలుగు వైపులా బంగాళాఖాత సముద్రం తో ఈ ద్వీపం ఉన్నది. ఎవ్వరినైనా లోనికి రానివ్వరు కానీ, పరిశోధనలకై వచ్చేవారిని అదికూడా ఉన్నతాధికారుల అనుమతితో లోనికి రాణిస్తారు.

చిత్ర కృప : Dr. S.N.H. Rizvi

బారెన్ ద్వీపాలు, అండమాన్ దీవులు

బారెన్ ద్వీపాలు, అండమాన్ దీవులు

అండమాన్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ కు 84 మైళ్ళ దూరంలో బారెన్ దీవి కలదు. మనిషి పర్యటనలకై చేసే అంతులేని ప్రయత్నాలే బారెన్ దీవిని ఒక అద్భుత పర్యాటక ప్రదేశంగా కనుగొన్నాయి. పేరుకు తగినట్లుగానే ఈ దీవి నిర్మానుష్యంగా ఉంటుంది. కొన్ని రకాల వన్య జీవులు మాత్రం సంచరిస్తూంటాయి. బారెన్ లో అగ్నిపర్వత పేలుళ్లు సంభవిస్తుంటాయి కనుక ఇక్కడికి రావటానికి పర్యాటకులు, సాహసికులు ధైర్యం చేయరు.

చిత్ర కృప : Nishimoto M