» »సుమారు 300 కోట్ల సంవత్సరాల ప్రాచీన బండ!!!

సుమారు 300 కోట్ల సంవత్సరాల ప్రాచీన బండ!!!

Written By: Venkatakarunasri

పురాతనమైనది అంటే ఎవరికి కుతూహలముండదు చెప్పండి? ఏ కాలానిది, ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, దాని విశిష్టత ఏమి? అనే అనేకమైన ప్రశ్నలు మన మెదడుకి వస్తాయి. అటువంటి దానిలో 300 కోట్ల సంవత్సరాల ప్రాచీనమైన బండ కర్ణాటకలో వుంటే ఆశ్చర్యమే కదా.

ఆ ప్రాచీన బండ వుండేది మహానగరం బెంగుళూరులో అనేది ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి. పెద్ద పెద్ద అంతస్థులు కలిగిన ఇండ్లు, వృక్షాలను కొట్టి నిర్మించిన మాల్స్ మధ్య 300 కోట్ల ఇతిహాసమున్న ప్రాచీనమైన బండనా? అని ఆశ్చర్యపడటం సర్వ సామాన్యమైన విషయం.....

ఆ ప్రకారంగా ఒక విజ్ఞాని "పెనిన్సులార్ నెన్స్" అనే పదాన్ని అత్యంత ప్రాచీనమైన బండ రచనకు ఆవిష్కరించాడు, ఆ ప్రకారంగా భారతదేశం మొత్తంమీద అలాంటి బండలు కేవలం 26 మాత్రం వున్నాయంట. వాటిలో బెంగుళూరులో 2 పెనిన్సులార్ నెన్స్ రచనలో బండలు చూడవచ్చును. అట్లయితే ఆ బండ ఏది?ఎక్కడుంది? అనేదాని గురించి ప్రస్తుత వ్యాసం మూలంగా తెలుసుకుందాం.

సుమారు 300 కోట్ల సంవత్సరాల ప్రాచీన బండ!!!

హృదయ భాగం

హృదయ భాగం

బెంగుళూరులోని హృదయ భాగంలో ఒక అందమైన స్థలమేదంటే అది బసవనగుడి. బసవనగుడి బెంగుళూరులోని అత్యంట ప్రాచీనమైన స్థలాలలో ఒకటి. ఇక్కడున్న పురాతనమైన దాని గురించి దగ్గరనుంచి చూసినవారికి మాత్రమే తెలుసు.

సాంప్రదాయం

సాంప్రదాయం

బసవన గుడిలో ముఖ్యంగా దేవాలయాలు, సాంస్కృతిక భవనాలు చూడవచ్చును. అదే కాదు ఏకశిలలో చెక్కిన బసవణ్ణుని ప్రతిమ మరియు దొడ్డ గణపతిని కూడా ఇక్కడ ప్రసిద్ధమైన ఆకర్షణగా వుంది.

అతి పురాతనమైనది

అతి పురాతనమైనది

దొడ్డ బసవనగుడి చిన్నదైన ఒక కొండమీద వెలసింది, ఆ కొండే "పెనిన్సులార్ నెన్స్" రచన అయ్యింది. అంటే భూమి తనకుతానే రూపాంతరంచెందిన సమయంలో నిర్మాణమైన అత్యంత పురాతనమైన బండలలో ఇది కూడా ఒకటి.

బ్యూగల్ రాక్

బ్యూగల్ రాక్

ప్రస్తుతం ఆ కొండవున్న స్థలంలో ఒక ఉద్యానవనం నిర్మించబడినది,అదే బ్యూగల్ రాక్ ఉద్యానవనం అని పిలుస్తారు. బహుశా మీరు అక్కడికి వెళ్తే అది భారతదేశంలోనే 26 "పెనిన్సులార్ నెన్స్"లలో ఇది ఒకటి అని ఎప్పటికీ కూడా వూహించడానికేకాదు కదా?

కథ

కథ

ఇక్కడ కెంపెగౌడర్ బెంగుళూరి యొక్క బాధ్యతను తీసుకున్న తర్వాత ఈ బండయొక్క కొండ మీద వీక్షించటానికి గోపురంఒక దానిని నిర్మించి అక్కడే కాపలా కాయుటకు కాపలా కాసేవారిని ఒకరిని నియమించాడంట.

 కాపలా కాసేవారు

కాపలా కాసేవారు

ఏదైనా అపాయసమయంలో సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో కాపలా కాసేవారు ఆయా సందర్భంలలో బిగ్గరగా ట్రంపెట్ ను గట్టిగా ఊది ప్రతిఒక్కరికీ సందేశాన్ని ఇస్తారు.

బ్యూగల్ బండ

బ్యూగల్ బండ

ఈవిధంగా ట్రంపెట్ ను ఊదే బండకే కాలక్రమేణ ఆంగ్లభాషలో బ్యూగల్ రాక్స్ అనే పేరు వచ్చింది. ఇంకా భూవిజ్ఞానం విషయానికి వస్తే ఈ రాయి బండలు అత్యంత పురాతనమైన శిలా రచనయై వుంది.

500 మిలియన్

500 మిలియన్

విజ్ఞానుల ప్రకారం ఈ శిలా రచనలు ఎంత పురాతనమైనది అంటే సుమారు 500 మిలియన్ సంవత్సరానికన్నా ప్రాచీనమైనది.

మరొక

మరొక "పెనిన్సులార్ నెన్స్"

బెంగుళూరిలో మరొక "పెనిన్సులార్ నెన్స్" వుండేది వేరెక్కడా కాదు బెంగుళూరిలోని ప్రఖ్యాత లాల్ బాగ్ ఉద్యానవనంలో. లాల్ బాగ్ లోని దక్షిణ ద్వారంలో ఒక రాయి మీ కళ్ళకు కనిపించివుండవచ్చను. అదే ఆ ప్రాచీనమైన 2 వ శిలా రచనఅయినది.

Muhammad Mahdi Karim

క్రమం తప్పకుండా సందర్శన

క్రమం తప్పకుండా సందర్శన

ప్రతీరోజూ భారీ సంఖ్యలో పర్యాటకులు, సందర్శకులు సందర్శించడానికి ఇక్కడకు వస్తారు. ఇక్కడి మరొక ఆకర్షణ అంటే కెంపెగౌడ వీక్షణా గోపురం.ఇది సందర్శకులకు దృష్టిని ఆకర్షిస్తుంది.

Polytropos-Commons

Please Wait while comments are loading...