Search
  • Follow NativePlanet
Share
» »శివుడు అమరత్వం గూర్చి చెప్పిన ప్రదేశం !

శివుడు అమరత్వం గూర్చి చెప్పిన ప్రదేశం !

అమర్నాథ్ గుహలో శివుడు తన సహధర్మచారిణి ఐన పార్వతిదేవికి తన అమరత్వ రహస్యం గురించి వివిరించాడని హిందూ పురాణాల్లో పేర్కొనటం జరిగింది.

By Mohammad

అమర్నాథ్ యాత్ర ఎంత గొప్పదో అందరికీ తెలుసు. అమర్నాథ్ లో ఒక గుహ ఉంటుందని, అక్కడ శివుడు మంచు రూపంలో కొలువుదీరి ఉంటాడని, ఆ మంచు లింగాన్ని దర్శిస్తే సకల పాపాలు పోయి పుణ్యం లభిస్తుందని అంటారు. అమర్నాథ్ గుహలో శివుడు తన సహధర్మచారిణి ఐన పార్వతిదేవికి తన అమరత్వ రహస్యం గురించి వివిరించాడని హిందూ పురాణాల్లో పేర్కొనటం జరిగింది. కైలాసం లో ఉండాల్సిన శివపార్వతులు భూమి మీదకి ఎలా వచ్చారో? అమర్నాథ్ నే ఎందుకు ఎంచుకున్నారో ? తెలుసుకోవాలని లేదూ .. ! అయితే పదండి.

ఇది కూడా చదవండి : అద్భుత శివలింగాలు - ఆరాధ్య దైవాలు !

అమర్నాథ్ గుహ చరిత్ర

అమర్నాథ్ గుహ చరిత్ర

అమర్నాథ్ అంటే జరామరణములు లేనివాడు అని అర్థం. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు హిమవత్ పర్వత ప్రదేశంలో విహరిస్తుండగా, పార్వతీ దేవి శివునితో "స్వామీ ..! నాకొక సందేశం ఉంది తీర్చగలరా?" అంది. అప్పుడు శివుడు "చెప్పు దేవి తీర్చగలను" అన్నాడు.

చిత్ర కృప : Partha S. Sahana

అమర్నాథ్ గుహ చరిత్ర

అమర్నాథ్ గుహ చరిత్ర

పార్వతి "స్వామి ..! నేను తిరిగి తిరిగి జన్మిస్తుంటాను. కానీ మీరు అలాగే శాశ్వతంగానే ఎలా ఉండగలుగుతున్నారు, ఇది ఎలా సాధ్యం?" అని అడిగింది.

చిత్ర కృప : John Hoey

అమర్నాథ్ గుహ చరిత్ర

అమర్నాథ్ గుహ చరిత్ర

ఈశ్వరుడు "దేవి ఇది పరమ రహస్యమైనది కనుక ఏ ప్రాణకోటి లేని ప్రదేశంలో నీకు చెప్పాలి" అని చెప్పి ఆ ప్రదేశాన్ని వెతికాడు. చివరికి ఇప్పుడున్న అమర్నాథ్ గుహ కనిపించిది.

చిత్ర కృప : lucky bhogpur

అమర్నాథ్ గుహ చరిత్ర

అమర్నాథ్ గుహ చరిత్ర

రహస్యాన్ని పార్వతీదేవికి చెప్పడానికి గుహను ఎంచుకోక ముందు, శివుడు ఆ ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళతాడు. అలా అతను వెళ్ళే క్రమంలో ఒక్కొక్కరిని (పార్వతీదేవిని తప్పనిచ్చి) వదిలిపెట్టి వెళతాడు.

చిత్ర కృప : sandeepachetan.com travel photography

ఎవరెవర్ని ఎక్కడెక్కడ వదిలిపెడతాడు ?

ఎవరెవర్ని ఎక్కడెక్కడ వదిలిపెడతాడు ?

'నంది' ని పహల్గామ్ వద్ద, చంద్రున్ని చందన్ వారి వద్ద, మెడ లో ధరించే నాగుపామును శేషనాగ్ సరోవరం సమీపాన, మహాగుణ పర్వతం వద్ద తన పెద్ద కుమారుడైన గణేశున్ని మరియు రెండో భార్యగా భావించే గంగా నదిని పంచతరణి వద్ద శివ భగవానుడు వదిలిపెట్టి వెళతాడు.

చిత్ర కృప : Saad Akhtar

ఎవరెవర్ని ఎక్కడెక్కడ వదిలిపెడతాడు ?

ఎవరెవర్ని ఎక్కడెక్కడ వదిలిపెడతాడు ?

అంతే కాదు పంచ భూతాలైన అగ్ని, నీరు, భూమి, గాలి, ఆకాశాన్ని సైతం విడిచి పెట్టి పార్వతి దేవి గుహలోకి తీసుకెళతాడు.

చిత్ర కృప : ikshit sharma

అమర్నాథ్ గుహ చరిత్ర

అమర్నాథ్ గుహ చరిత్ర

గుహలో కాలాగ్నిని వెలిగించి అక్కడున్న ఇతర ప్రాణకోటి ని బయటకు పంపించివేస్తాడు. ఇక తన అమరత్వ రహస్యం గురించి చెప్పటానికి ఉపక్రమిస్తాడు శివుడు.

చిత్ర కృప : Jagadip Singh

అమర్నాథ్ గుహ చరిత్ర

అమర్నాథ్ గుహ చరిత్ర

అ గుహలో పావురాలు పెట్టిన రెండు గ్రుడ్లు ఉన్నాయి. అది గమనించిన శివుడు వాటికి జరామరణాలు ఉండవని చెప్తాడు. ఇప్పటికీ ఆ పావురాల జంట భక్తులకు దర్శనమిస్తుంటాయి.

చిత్ర కృప : SHIBA 007

'నంది' ని వదిలిపెట్టిన ప్రదేశం గురించి ..!

'నంది' ని వదిలిపెట్టిన ప్రదేశం గురించి ..!

శివుడు అమర్నాథ్ గుహ కు వెళుతూ నంది ని పహల్గామ్ వద్ద విడిచిపెడతాడు. ఇది సముద్రమట్టానికి 2740 మీటర్ల ఎత్తున, శ్రీనగర్ నుండి 94 కి. మీ. ల దూరంలో ఉంటుంది. ఈ స్థలం దట్టమైన అడవులు, అందమైన సరస్సులు, స్వచ్చమైన నీటి ప్రవాహాలు, రకరకాల పూల తోటలు, పచ్చికబయళ్ళ తో నిండి ఉంటుంది.

చిత్ర కృప : Partha S. Sahana

చందన్వారి

చందన్వారి

చందన్వారి సముద్రమట్టానికి 2923 మీ. ఎత్తులో, పహల్గామ్ నుండి 16 కి. మీ. ల దూరంలో ఉంటుంది. ఉత్కంత ను రేకెత్తించే ప్రకృతి సౌందర్యం, మంచుచే కప్పబడిన వంతెన, హిమానీనదాలు ఇక్కడి ఆకర్షణలు.

చిత్ర కృప : Rupak Sarkar

గంగను వదిలిన పంచతరణి

గంగను వదిలిన పంచతరణి

పంచతరణి ఐదు సెలయేర్ల సంగమం. ఈ స్థలం పహల్గామ్ కు 40 కి.మి. ల దూరంలో, శేష నాగ్ సరస్సు కు 13 కి.మి. ల దూరంలో ఉంటుంది. అమర్నాథ్ చేరుకోవటానికి ఇదే చివరి మజిలి. ఇక్కడి నుండి సన్నని మార్గం ద్వారా 6 కి.మి. ల దూరంలో ప్రయాణించి శివుని గుహ చేరుకోవచ్చు.

చిత్ర కృప : sandeepachetan.com travel photography

శేష నాగ్ సరస్సు

శేష నాగ్ సరస్సు

శేష నాగ్ సరస్సు సముద్రమట్టానికి 3658 మీటర్ల ఎత్తులో, పహల్గామ్ నుండి 27 కి. మి. ల దూరంలో ఉంటుంది. ఈ సరస్సు చుట్టూ 7 శిఖరాలు ఉంటాయి. భక్తులు రెండు రోజుల కాలినడక మార్గాన ఈ స్థలానికి చేరుకోవచ్చు. సరస్సు క్యంపైనింగ్ కు అనువైనది.

చిత్ర కృప : sandeepachetan.com travel photography

మహా గుణ పర్వతం

మహా గుణ పర్వతం

మహాగుణ పర్వతం సముద్ర మట్టానికి 4276 మీ. ఎత్తులో ఉంటుంది. ఇక్కడ మహాశివుడు తన పెద్ద కుమారుడైన వినాయకుణ్ణి వదిలిపెట్టి వెళ్ళాడు.

చిత్ర కృప : Rajeev Kashyap

మరో కథనం - గొర్రెల కాపరి

మరో కథనం - గొర్రెల కాపరి

ఈ గుహను మొదట చూసింది, కనిపెట్టింది, వెలుగులోకి వచ్చింది ఒక గొర్రెల కాపరి ద్వారా. గొర్రెల కాపరి పేరు బూటూ మాలిక్.

చిత్ర కృప : sandeepachetan.com travel photography

మరో కథనం - గొర్రెల కాపరి

మరో కథనం - గొర్రెల కాపరి

మాలిక్ రోజులాగే గొర్రెలను కాస్తుండగా, ఒక సన్యాసి తన వద్దకు వచ్చి బొగ్గు తో నిండిన సంచి ఇచ్చాడు. అతను అలాగే సంచిని ఇంటికి తీసుకెళ్ళాడు. తీరా సంచి విప్పిచూస్తే అందులో బంగారు కనిపించింది.

చిత్ర కృప : Nitin Badhwar

మరో కథనం - గొర్రెల కాపరి

మరో కథనం - గొర్రెల కాపరి

అంతే ఆ కాపరి వెనక్కు పరిగెత్తుకుంటూ వెళ్లి, ఆ స్వామీ కోసం వెతికాడు కానీ కనిపించలేదు ఒక్కటి మాత్రం కనిపించి అదే ఇప్పుడు మనం దర్శించుకుంటున్న హిమలింగం.

చిత్ర కృప : SearchOfLife Blog

ఇప్పటివరకు కూడా ..!

ఇప్పటివరకు కూడా ..!

ఇదెప్పుడో క్రీస్తుపూర్వం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అశేష భక్తులు లింగాన్ని దర్శించుకున్నారు ... దర్శించుకుంటున్నారు ... దర్శించుకుంటారు కూడా ..!

చిత్ర కృప : Paras Holidays

చివరగా

చివరగా

పైన పేర్కొన్న ఒక్కొక్క స్థలాన్ని దాటుకుంటూ వస్తే చివరగా అమర్నాథ్ గుహ వస్తుంది. ఈ అమర లింగేశ్వరరున్ని హిమ లింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గానీ ... ఈ హిమలింగాన్ని చూసే ఆదృష్టం రాదు ... ఒకవేళ వస్తే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదేమో ..!

చిత్ర కృప : lucky bhogpur

అమర్నాథ్ ఎలా చేరుకోవాలి ?

అమర్నాథ్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

శ్రీనగర్ విమానాశ్రయం అమర్నాథ్ కు సమీపాన ఉన్నది. ఢిల్లీ, జైపూర్ వంటి దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుండి ఎయిర్ పోర్ట్ కు విమాన సర్వీసులు ఉన్నాయి.

హెలికాప్టర్ సర్వీస్

శ్రీనగర్ నుండి అమర్నాథ్ కు సపరేట్ గా హెలికాఫ్టర్ సర్వీస్ ఉన్నది. ఇది రక్షణ రంగం(డిఫెన్స్) వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. వన్ వే ప్యాసింజర్ హెలికాప్టర్ సర్వీస్ ఒక్కొక్కరికి రూ. 4300 ఉండవచ్చు(ప్రస్తుతం).

రైలు మార్గం

శ్రీనగర్ రైల్వే స్టేషన్ అమర్నాథ్ కు సమీపాన ఉన్నది. దేశం నలుమూలల నుండి స్టేషన్ కు రైళ్ళు నడుస్తుంటాయి.

రోడ్డు / బస్సు మార్గం

జమ్మూ లోని అన్ని ప్రధాన నగరాల నుండి శ్రీనగర్ కు అలాగే పహల్గామ్ కు ఆ రాష్ట్ర బస్సు సర్వీసులతో పాటు ప్రవేట్ బసులు కూడా తిరుగు తుంటాయి. పహల్గామ్ వద్ద కు చేరుకొని క్యాబ్ లలో గాని లేదా కాలినడకన గానీ అమర్నాథ్ గుహ చేరుకోవచ్చు.

చిత్ర కృప : sandeepachetan.com travel photography

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X