Search
  • Follow NativePlanet
Share
» »బేలూరు శిల్పాలు ... అద్భుత రూపాలు !!

బేలూరు శిల్పాలు ... అద్భుత రూపాలు !!

By Mohammad

బేలూర్ కర్ణాటకలో ప్రముఖ పర్యాటక ప్రదేశము. అనేక ఆలయాలకు నెలవైన ఈ పట్టణం హసన్ జిల్లా లో బెంగుళూర్ నుండి కేవలం 220 కి. మీ. ల దూరంలో ఉంది. ఇది యగాచి నది ఒడ్డున కలదు. దీని ప్రాచీనమైన, విశిష్టమైన దేవాలయల వలన దీనిని అందరు 'దక్షిణ కాశి' అంటారు.

దీని చారిత్రక ప్రాధాన్యత

బేలూర్ హొయసల సామ్రాజ్య రాజధానిగా ఉంది కనుక చారిత్రకంగా బేలూర్ విశిష్టమైనది. ఇక్కడికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హలేబిడ్ కూడా హొయసల రాజధానిగా ఉంది ఇది పురాతన నగరం. ఈ రెండు నగరాలు హొయసల నిర్మాణ ప్రతిభకు ప్రసిద్ధ ఉదాహరణలు - తరచుగా యాత్రికులు ఈ రెండు నగరాలను ఒకే సారి దర్శిస్తూ ఉంటారు.

ఇది కూడా చదవండి : గడగ్ లో తప్పక సందర్శించవలసిన ప్రదేశాలు !!

బేలూర్ లో అన్నిటికన్నా గొప్ప ఆలయ సముదాయం నిస్సందేహంగా చెన్నకేశవ ఆలయం. విష్ణు భగవానుడి కోసం నిర్మించిన ఈ ఆలయం గాలిగోపురం ఎత్తు ఎంతొ ప్రసిద్ధి చెందినది . ఈ ఆలయం లోని రక రకాల శిల్పాలు ఎంతొ సజీవంగా ఉన్నాయా అన్నంత బాగుంటాయి. ఆలయం దక్షిణ భారత నిర్మాణ శైలి లోని అందానికి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ సంక్లిష్టమైన కట్టడం నిర్మించడానికి ఒక శతాబ్దం కంటే ఎక్కువ కాలం పట్టింది.

తప్పక సందర్శించదగినది

తప్పక సందర్శించదగినది

బేలూర్ లోని అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఒకటైన చెన్నకేశవ దేవాలయం తప్పక సందర్శించదగినది. ఈ దేవాలయం మృదువైన సున్నపురాయిని ఉపయోగించి నిర్మించారు. ఈ ఆలయము, విష్ణువు యొక్క ఒక అవతారము ఐన చెన్నకేశవ స్వామికి అంకితం చేయబడినది.

చిత్రకృప : Ashok Prabhakaran

సువర్ణ చిత్రాలు

సువర్ణ చిత్రాలు

చోళులపై తన విజయానికి చిహ్నంగా హోయసల విష్ణువర్ధనుడు కట్టించాడు. పర్యాటకులు పురాణాల్లోని అనేక గాధలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాలలోని అనేక శిల్పాలను చూడవచ్చును. వీటితో పాటు నవ యవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి.

చిత్రకృప : Calvinkrishy~commonswiki

శిల్పాలు

శిల్పాలు

అంతేకాక ఆలయం వరండ లోపల అనేక ఇతర ఆలయాలు నిర్మించబడి ఉన్నాయి. ఈ దేవాలయలోని అనేక శిల్పాలలో అనేక రకాలైన ఆభరణాలు, పైకప్పులు, జంతువులు, పక్షులు, ద్వారాలు మరియు అనేక రకాలైన ఇతర చిత్రాలను చూడవచ్చును.

చిత్రకృప : native planet telugu

పుష్కరణి

పుష్కరణి

పర్యాటకులు ఆలయం యొక్క ప్రవేశద్వారం వద్ద ఒక పుష్కరణిని (మెట్లబావి) కూడా చూడవచ్చు. ఆలయం యొక్క అంతర్భాగంలోనే కప్పే చేన్నిగరాయ ఆలయం, మరియు లక్ష్మి దేవీకి అంకితం చేసిన ఒక చిన్న కట్టడము కూడా ఉన్నాయి.

చిత్రకృప : Madhava 1947

శిల్ప౦

శిల్ప౦

బేలూర్ దేవాలయములో ‘దర్పణ సుందరి'గా ప్రసిద్ది పొందిన శిల్ప౦ అందాన్ని సమయం దొరికితే తప్పక తిలకించాల్సిన ఆకర్షణలలో ఒకటి. ఈ శిల్పం ఈ ప్రఖ్యాత దేవాలయ గోడలపై చెక్కబడి ఉంది.

చిత్రకృప : Santhosh

ప్రధాన ప్రేరణ

ప్రధాన ప్రేరణ

పర్యాటకులు ఇక్కడ ఆధ్యాత్మిక, ఖగోళ చిత్రాలను, నృత్య , గానాలు చేస్తున్న మదనికల చిత్రాలను చూడవచ్చు. విష్ణువర్ధన రాజు భార్య రాణి శంతల దేవి అద్భుతమైన అందం ఈ శిల్పాలకు ప్రధాన ప్రేరణ అని నమ్ముతారు.

చిత్రకృప : Vijay S

హొయసల కాలంలో

హొయసల కాలంలో

ప్రయాణికులు తమ బేలూర్ విహారయాత్రలో కప్పు చేన్నగరాయ ఆలయం సందర్శించదగినది. శంతల దేవి ద్వారా హొయసల కాలంలో నిర్మి౦చిన ఈ చిన్న గుడి వీరనారాయణ ఆలయ సముదాయంలో ఉంది.

చిత్రకృప : Holenarasipura

ఆలయం అంతర్భాగంలో

ఆలయం అంతర్భాగంలో

పర్యాటకులు ఈ ఆలయం అంతర్భాగంలో అందమైన, ఆకర్షణీయమైన చిత్రాలను చూడవచ్చు. పర్యాటకులు అదే ఆవరణలో వీరనారాయ, సౌమ్యనాయకి, రంగనాయకి, శ్రీదేవి, భూదేవిల కోసం నిర్మించిన ఆలయాలను సందర్శించవచ్చు.

చిత్రకృప : PP Yoonus

సరస్సు

సరస్సు

పర్యాటకులు తమ బేలూర్ విహారయాత్రలో, సమయం అనుకూలిస్తే, విష్ణు సముద్రముగా ప్రసిద్ధి గాంచిన పెద్ద సరస్సును దర్శించవచ్చు. ఈ సరస్సు పద్మరాస పర్యవేక్షణలో నరసింహ రాయల కాలములో నిర్మించారు.

చిత్రకృప : Dineshkannambadi

టెంపుల్ ట్యాంక్

టెంపుల్ ట్యాంక్

ఈ ట్యాంక్ స్వర్ణ యుగం గా పిలవబడె, విజయ నగర రాజుల కాలములో నిర్మించబడినది . కృష్ణ దేవరాయల కాలంలో, ఉత్పతనహళ్లి కి చెందిన బసప్ప నాయక ఈ చతుర్శ్రాకారపు సరస్సు ఉత్తరపు మెట్లను నిర్మించి, మూడు వైపులా మరి కొన్ని మెట్లను జోడించారు.

చిత్రకృప : Pradam

తెప్పోత్సవం

తెప్పోత్సవం

ఈ మెట్ల సహాయంతో, ప్రజలు తేలిగ్గా క్రిందికి వెళ్లి రోజువారీ పవిత్ర కార్యాల కోసం పవిత్ర జలం ఉపయోగించుకుంటారు. అతను సత్రాలతో పాటు పవిత్ర తెప్పోత్సవం జరుపుకునేందుకు పుష్కరిణి మధ్యలో ఒక ద్వీప మంటపం కూడా నిర్మించాడు.

చిత్రకృప : Harsha K R

విహారయాత్రలో భాగంగా

విహారయాత్రలో భాగంగా

ప్రయాణికులు తమ బేలూర్ విహారయాత్రలో వీర నారాయణ లేదా లక్ష్మీ నారాయణ మూర్తికి అంకితమైన వీర నారాయణ దేవాలయం కూడా తప్పక సందర్శించదగ్గది.

చిత్రకృప : Shiva Shenoy

నారాయణ విగ్రహం

నారాయణ విగ్రహం

హొయసల సామ్రాజ్యం నిర్మించబడిన ఈ ఆలయం చేన్నకేశవ ఆలయమునకు పడమర దిక్కున ఉంది - దాని కళాత్మకమైన అంతర్గత, బాహ్య నిర్మాణాలు ప్రసిద్ధి చెందినవి.

చిత్రకృప : Shiva Shenoy

గరుడ విగ్రహం

గరుడ విగ్రహం

ఈ గుళ్ళో 37 స్తంభాలు ఉన్న మంటపానికి ఇరు వైపులా ఒక దానికి ఒకటి ఎదురుగా రెండు ఆలయాలు ఉన్నాయి.ఈ చిన్న ఆలయం ఒక ఎత్తైన వేదిక మీద ఉంచారు - దాని వెలుపలి గోడలపై వైష్ణవ సంప్రదాయమునకు చెందిన అందమైన శిల్పాలను చెక్కారు.

చిత్రకృప : Ananth H V

విష్ణు పాదముద్రికలు

విష్ణు పాదముద్రికలు

బయటి గోడ పశ్చిమం వైపు విజయ నారాయణ, చెన్నకేశవ, లక్ష్మీ నారాయణ వంటి మనోహరమైన దేవతా మూర్తులచే అలంకరించబడి ఉంటుంది. పర్యాటకులు భీమ, వినాయక, శివ, విష్ణు, బ్రహ్మ, సరస్వతి, పార్వతి, భైరవ మూర్తుల యొక్క 59 పెద్ద చిత్రాలను కూడా చూడవచ్చు.

చిత్రకృప : G41rn8

ఇతర గుళ్ళు

ఇతర గుళ్ళు

పర్యాటకులు వీర నారాయణ ఆలయం చేరువలో ఉన్నటువంటి సౌమ్యనాయకి, కప్పేచేన్నిగరాయ, అండాళ్ వంటి అనేక చిన్న ఆలయాలు కూడా దర్శించవచ్చు.

చిత్రకృప : Kunal Dalui

గ్రావిటీ పిల్లర్

గ్రావిటీ పిల్లర్

పర్యాటకులు తమ బేలూర్ యాత్రలో సమయం ఉంటె గ్రావిటీ పిల్లర్ తప్పక చూడాలి. మహాస్తంభం లేదా కార్తిక దీపోత్సవ స్తంభం అని పిలవబడే 42 అడుగుల ఈ స్తంభం చెన్నకేశవ ఆలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటి.

చిత్రకృప : Bikashrd

ఆశ్చర్యం

ఆశ్చర్యం

ఈ స్థూపం ఎటువంటి ఆధారం లేకుండా ఒకే రాతితో తయారు చేసిన వేదిక మీద నిలబడి ఉంది. ఈ స్థూపం దాని స్వంత బరువుపై మూడు వైపుల నిలబడి, నాలుగో వైపు నేలకు ఆనకుండ కాగితం ముక్కను దూర్చినా దూరే విధంగా ఖాళీ తో నిరాధారంగా నిలబడి ఉంచుతుంది.

చిత్రకృప : Ashwin Kumar

గ్రావిటీ పిల్లర్

గ్రావిటీ పిల్లర్

ఈ నిర్మాణము విజయనగర పాలన లోని వాస్తుశిల్పుల సమర్థతను, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ స్థిరంగా, ఎత్తుగా నిలిచిపోయింది.బేలూర్ వద్ద చూడదగిన ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో దొడ్డ గాదవల్లి లోని లక్ష్మీ దేవి ఆలయం. శ్రావణ బెలగోళ లో వున్న జైన్ స్మారక మందిరము ఉన్నాయి.

చిత్రకృప : Philip Larson

బేలూరు ఎలా చేరుకోవాలి ?

బేలూరు ఎలా చేరుకోవాలి ?

రోడ్: బెంగుళూర్, మైసూర్, మంగళూరు, మడికేరి , షిమోగా, చికమగలూరు, హస్సన్ వంటి అనేక ప్రధాన నగరాలతో బేలూర్ ప్రైవేటు, ప్రభుత్వ బస్సుల ద్వారా అనుసంధానించబడి ఉంది.

రైలు: హస్సన్ రైల్వే స్టేషన్ బేలూర్కు 40 కి.మీ. దూరంలో ఉన్న సమీపంలోని ముఖ్యకేంద్రం.

పర్యాటకులు ఈ రైల్వే స్టేషన్ నుండి బేలూర్ చేరుకోవడానికి బాడుగ కార్లు లేదా బస్సుసౌకర్యము కలదు.

వాయు మార్గం : మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం బేలూర్ సమీపంలోని విమానాశ్రయం. ఇది బేలూర్ కు 169 కిలోమీటర్ల దూరంలో దూరంలో ఉన్నది.

చిత్రకృప : Harsha K R

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more