Search
  • Follow NativePlanet
Share
» » మైసూర్ లో మైసూర్ ప్యాలెస్ తో పాటు ఈ అందమై ప్రదేశాలు చూడటం మర్చిపోకండి!

మైసూర్ లో మైసూర్ ప్యాలెస్ తో పాటు ఈ అందమై ప్రదేశాలు చూడటం మర్చిపోకండి!

హెరిటేజ్ సిటి ఆఫ్ ఇండియా మరియు కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ కర్ణాటకలో మైసూర్ ముడొవ అతిపెద్ద నగరం. కర్ణాటక రాష్ట్రానికి సాంస్కృతిక రాజధాని. సౌత్ ఇండియాలో సుసంపన్న రాచరిక ప్రాధాన్యతలున్న పట్టణం. అందుకే ఈ ప్రద

హెరిటేజ్ సిటి ఆఫ్ ఇండియా మరియు కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ కర్ణాటకలో మైసూర్ ముడొవ అతిపెద్ద నగరం. కర్ణాటక రాష్ట్రానికి సాంస్కృతిక రాజధాని.
సౌత్ ఇండియాలో సుసంపన్న రాచరిక ప్రాధాన్యతలున్న పట్టణం. అందుకే ఈ ప్రదేశాన్ని రాజప్రసాదాల నగరంగా పిలుస్తారు. గందపు చెక్కల సువాసనలు, గులాబీల గుభాళింపులతో మైసూర్ నగరానికి 'శాండిల్ వుడ్' అనే పేరు వచ్చింది.

మైసూర్ అనగానే దసరా ఉత్సవాలకు ప్రసిద్ది. ఈ ఉత్సవాలకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. మైసూర్ పర్యాటకులకు మైసూర్ ప్యాలెస్ తో పాటు అనేక వారసత్వ భవనాలు, చల్లని నీడనిచ్చే రహదారులు మరచిపోలేని అనుభూతులు. మైసూరులో అనేక మైసూర్ ప్యాలెస్ లాంటి అనేక ప్యాలెస్ లు కొలువు తీరి ఉండటం వల్ల మహాసౌదాల నగరంగా పిలవబడుతున్నది. క్లీన్ సిటి ఆఫ్ ఇండియాగా పిలవబడుతున్న మైసూర్, పర్యాటకులకు ఇండియాలోనే అత్యంత ఆకర్షణీయ ప్రదేశాలల్లో ఒకటిగా ఉంది.

మైసూర్ లో అనేక తోటలు, సరస్సులు, బటర్ ఫ్లై పార్క్, పట్టు చీరలకు మరియు చందనం తోటలకు ఇక్కడ ప్రసిద్ది. గొప్ప రాజప్రాసాదాలు మరియు ఆధునిక జీవనశైలిలో సులభంగా కలగసిన సౌందర్యంతో, సంస్కృత సౌరభాల నిలయంగా ఉన్న మైసూర్‌ను మరియు మైసూర్ చుట్టు చూడాల్సిన మరికొన్ని ఉత్తమ స్థలాలను అలా చుట్టొద్దాం రండి!

1. చాముండేశ్వరి ఆలయం :

1. చాముండేశ్వరి ఆలయం :

చాముండేశ్వరి దేవాలయం మైసూరు నగరానికి సుమారు 13 కిమీ దూరంలో ఉన్న చాముండి కొండలపైన ఉంది. ఈ ఆలయం శక్తి పీఠంగా మరియు భారతదేశంలోని 18 మహా శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
Photo Courtesy: Sanjay Acharya

2. శ్రీ రంగనాథ స్వామి ఆలయం:

2. శ్రీ రంగనాథ స్వామి ఆలయం:

శ్రీరంగపట్నంలోని రంగనాథ స్వామి దేవాలయంను హిందు దేవుడైన రంగనాథకు అంకితం చేయబడింది. కర్ణాటకలోని 5 అతి ముఖ్యమైన యాత్రా స్థలాలలో ఒకటి కావేరి నది. కావేరీ నది ఒడ్డును నిర్మింపబడిన ఈ ఆలయానికి ఎత్తైన గోపురం ఉన్నది.

Photo Courtesy: Alende Devasia

3. మైసూర్ ప్యాలెన్స్

3. మైసూర్ ప్యాలెన్స్

మైసూరు ప్యాలెస్ నగరం నడిబొడ్డున ఉన్నది మరియు భారతదేశంలో అత్యంత సందర్శించే స్మారక ప్రదేశాలలో మైసూర్ ఒకటి. అద్భుతమైన చారిత్రాత్మక భవనం ఇప్పుడు భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా ఉంది.
Photo Courtesy: Ramnath Bhat

Most Read:హైదరాబాద్ లో ఉండి ఈ ఫేమస్ టెంపుల్ చూడకపోతే ఎలా..?Most Read:హైదరాబాద్ లో ఉండి ఈ ఫేమస్ టెంపుల్ చూడకపోతే ఎలా..?

4. లలితా మహాల్ :

4. లలితా మహాల్ :

లలితా మహాల్ మైసూర్ నగరంలో రెండవ అతి పెద్ద రాజభవనం, ఇది ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన హోటళ్ళుగా నడపబడుతున్నది. చాముండి హిల్స్ కు దగ్గరలో లలితా మహాల్ ఉంది. ఇది మైసూర్ నగరంలో ఉన్న గంభీరమైన నిర్మాణాలలో ఒకటి.
Photo Courtesy: Curt Smith

5. జగన్మోహన్ ప్యాలెస్

5. జగన్మోహన్ ప్యాలెస్

మైసూర్ రాచరిక నగరంలో మరొక అందమైన భవనం జగన్మోహన్ ప్యాలెస్, ప్రస్తుతం ఇది ఒక ఆర్ట్ గ్యాలరీ మరియు ఒక ఫంక్షన్ హాల్ గా మార్చబడింది. ఈ రాజప్రాసాదం మైసూర్ రాయల్ సిటీలో ఉన్న ప్రసిద్ది చెందిన ఏడు ప్యాలెస్లలో ఒకటి.

6. సెయింట్ ఫిలోమోనా చర్చి

6. సెయింట్ ఫిలోమోనా చర్చి

సెయింట్ ఫిలోమోనా చర్చి ఒక కాథలిక్ చర్చ్ మరియు భారతదేశంలోని పురాతన చర్చిలలో ఒకటి. మైసూర్ యొక్క ప్రసిద్ధ చర్చి ఆసియాలో రెండవ అతిపెద్ద చర్చిగా పరిగణించబడుతుంది.
Photo Courtesy: Karthik sripal

Most Read: బంగారు గనులు తవ్విన ప్రదేశం ఇది, ఇప్పటికీ బంగారం కోసం...Most Read: బంగారు గనులు తవ్విన ప్రదేశం ఇది, ఇప్పటికీ బంగారం కోసం...

7. తలకాడు

7. తలకాడు

తాలకాడ్ ఎడారి లాంటి పట్టణం, ఇది కావేరీ ఎడమవైపున మైసూర్ నగరానికి 45 కి.మీ. ఆగ్నేయంగా ఉంది. మైసూర్ లో ఉన్న హిందూ దేవాలయాలలో ఒక మధురమైన స్థలం, సాంస్కృతిక పరంగా ముఖ్యమైన మైసూర్ నగరానికి సమీపంలో సందర్శించడానికి చాలా చారిత్రక ప్రదేశం.
PC: wikimedia.org

8. మేల్కోటే:

8. మేల్కోటే:

తిరునరాయణపురం అని కూడా పిలువబడే మేలుకోటే కర్నాటకలో పవిత్ర స్థలాలలో ఒకటి, ఇక్కడ యోగ నరసింహ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది, ఇది యోగనరసింహ రాతి కొండలపై నిర్మించబడింది. ఈ ప్రదేశం మైసూర్ నుండి సుమారు 51 కి. మీ. ల దూరంలో ఉంది. అలాగే ఈ ఆలయానికి దగ్గరలో చెల్లువారాయన స్వామి ఆలయం ఉంది.
PC: sai sreekanth mulagaleti

9. బైలనకుప్పే

9. బైలనకుప్పే

బైలపుప్ప మైసూర్ కు పశ్చిమాన ఉన్న నమ్డ్రోలింగ్ మొనాస్టరీకి ఒక చిన్న పట్టణం. బైలుకుప్పె పట్టణంలోని ప్రధాన ఆకర్షణలు నమ్డ్రోలింగ్ మొనాస్టరీ లేదా స్వర్ణ దేవాలయం మరియు మైసూర్ జిల్లాలోని అతిపెద్ద ఇంగలేకెరే సరస్సు ప్రధాన ఆకర్షణలు.
PC: Ashwin Kumar

Most Read: మీరు ప్రేమించినవారు మీకు దక్కేలా చేసే దేవాలయం ఇది !Most Read: మీరు ప్రేమించినవారు మీకు దక్కేలా చేసే దేవాలయం ఇది !

10. నంజన్ గూడ్

10. నంజన్ గూడ్

నంజన్ గూడ్ పట్టణం కపిల నది ఒడ్డున ఉంది మరియు శ్రీకంఠేశ్వర దేవాలయంకు ప్రసిద్ది చెందింది. ఈ నగరంను దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు మరియు ఈ ప్రదేశం భారతదేశంలోని వివిధ రకాల అరటి పండ్లకు ప్రసిద్ది మరియు కబిని నదిపై ఒక పురాతనమైన వంతెన ప్రసిద్ధి చెందింది.
Suraj T S

11. శివన సముద్ర ఫాల్స్ :

11. శివన సముద్ర ఫాల్స్ :

శివన సముద్ర జలపాతం కావేరి నది ఒడ్డున మైసూరు నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విభజన జలపాతం 98 మీటర్ల ఎత్తు కలిగి ఉంది మరియు ఈ ప్రదేశం ఆసియాలోనే మొదటి జల విద్యుత్తు పవర్ స్టేషన్లలో ఒకటిగా ప్రసిద్ది చెందినది.
PC: Ashwin06k

12. కృష్ణ రాజా సాగర డ్యామ్

12. కృష్ణ రాజా సాగర డ్యామ్

కృష్ణ రాజా సాగర డ్యామ్ మరియు రిజర్వాయర్ మైసూర్ లో కావేరి నదిపై ఉన్న సరస్సు మరియు ఆనకట్ట పేరు. మైసూర్ లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి కృష్ణ రాజా సాగర డ్యామ్ మరియు భారతదేశంలోని 10 ప్రధాన ఆకర్షణలు కలిగిన డ్యాంలలో ఒకటి.
Photo Courtesy: Ashwin Kumar

Most Read: ఏపీ లో అంతుపట్టని ఆలయ రహస్యం !!Most Read: ఏపీ లో అంతుపట్టని ఆలయ రహస్యం !!

13. బృందావన్-గార్డెన్స్-మైసూర్

13. బృందావన్-గార్డెన్స్-మైసూర్

కృష్ణరాజసాగార ఆనకట్టపై ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం బృందావన్-గార్డెన్స్ మరియు దక్షిణ భారతదేశంలో అత్యంత అందమైన ప్రదేశం బృందావన్-గార్డెన్స్. శ్రీరంగపట్నంలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి బృందావన్-గార్డెన్స్ . దీన్ని సంవత్సరానికి రెండు మిలియన్ల పర్యాటకులను ఆకర్షిస్తున్నది.
Joe Ravi

14. చాముండి హిల్స్ నంది

14. చాముండి హిల్స్ నంది

మైసూర్ లోని చాముండి కొండల ఎగువన అతి పెద్ద నంది విగ్రహం ఉంది. ఇది ఏకశిలా విగ్రహం. ఈ విగ్రహం నగరంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా ప్రసిద్ది చెందినది. భారతదేశంలో ఉన్న నంది విగ్రహాలల్లో అతి ఎత్తైన విగ్రహం చాముండి హిల్స్ నంది.
Spiros Vathis

15. కార్యసిద్ది హనుమాన్

15. కార్యసిద్ది హనుమాన్

మైసూర్ నగరంలో మైసూర్ ఆశ్రమంలో అతి ఎత్తైన కార్యసిద్ధి హనుమాన్ విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎత్తు 41 అడుగులు ఉంటుంది. భారతదేశంలోని హనుమాన్ విగ్రహాలలో ఎత్తైనది కార్యసిద్ధి హనుమంతుడి విగ్రహం ఒకటి.
PC: youtube

16. కరంజిలేక్:

16. కరంజిలేక్:

కరంజి సరస్సు మైసూర్ నగరంలో కలదు, ప్రకృతి సీతాకోక చిలుకల ఉద్యానవనం, మ్యూజియం మరియు భారతదేశంలో అతిపెద్ద నడక-మార్గదర్శిని యాత్రీయం. కరంజి సరస్సులో ఉన్న ఒక చిన్న ద్వీపంలో ఈ సీతాకోక చిలుక పార్క్ న్యాచురల్ గా క్రియేట్ చేయబడినది మరియు ఇబిస్, గ్రే పెలికాన్, కామోర్రెంట్ మరియు ఇగ్రెట్ వంటి వలస నీటి పక్షులు ఇష్టమైన సరస్సులలో ఒకటి కరంజి.
Photos Courtesy : www.itslife.in

Most Read: ఆంజనేయ స్వామిని వెలేసిన ఊరు !Most Read: ఆంజనేయ స్వామిని వెలేసిన ఊరు !

17. మైసూర్ జూ:

17. మైసూర్ జూ:

మైసూర్ జూ లేదా చామరాజేంద్ర జులాజికల్ గార్డెన్ ను మైసూర్ ప్యాలెస్ కు సమీపంలో ఉంది. ఇది అతి పురాతనమైన , ఇండియాలో ప్రసిద్ది చెందిన అత్యంత ప్రాచుర్యం పొందిన జంతుప్రదర్శనశాల. ఈ జంతుప్రదర్శన శాల మైసూర్లో అత్యంత ప్రసిద్ధ ఆకర్షణలలో ఒకటిగా ఉంది.
Photo Courtesy: Punithsureshgowda

18. బండీపుర్ నేషనల్ పార్క్:

18. బండీపుర్ నేషనల్ పార్క్:

బండీపూర్ నేషనల్ పార్క్ కర్నాటకాలో ఉన్న పది ప్రసిద్ద జాతీయ పార్కులలో ఒకటి. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ నిర్జన ప్రాంతాలలో ఒకటిగా కూడా పిలువబడుతుంది. బండిపూర్ జాతీయ ఉద్యానవనం దక్షిణాసియాలో అడవి ఏనుగులకు అతిపెద్ద నివాసంగా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X