Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి ఇదే..ఈ గుడి వెనుక రహస్యాలు మీకు తెలుసా !

ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి ఇదే..ఈ గుడి వెనుక రహస్యాలు మీకు తెలుసా !

దేవాలయాలు అనగానే పవిత్రత గుర్తొస్తుంది. పవిత్రత అంటే అసలు అక్కడ ఎలాంటి తప్పులు జరగనిది అని అర్ధం. మద్యం సేవించటం అనేది అపవిత్రత కిందికి వస్తుంది.

By Venkatakarunasri

 </a></strong><a href=శ్రీకాళహస్తీశ్వర లింగ రహస్యమేంటి ?" title=" శ్రీకాళహస్తీశ్వర లింగ రహస్యమేంటి ?" loading="lazy" width="100" height="56" /> శ్రీకాళహస్తీశ్వర లింగ రహస్యమేంటి ?

దేవాలయాలు అనగానే పవిత్రత గుర్తొస్తుంది. పవిత్రత అంటే అసలు అక్కడ ఎలాంటి తప్పులు జరగనిది అని అర్ధం. మద్యం సేవించటం అనేది అపవిత్రత కిందికి వస్తుంది. కానీ కొన్ని దేవాలయాలలో మద్యం కూడా దేవుడికి కానుకగా సమర్పిస్తారు. కారణం అవి వాళ్ళ నమ్మకాలు.

బ్రహ్మ దేవుడి టెంపుల్ చాలావరకు మనం ఎక్కడ చూసివుండము. అందుకే బ్రహ్మ దేవుడికి ఎక్కడ టెంపుల్ లేదు అని కొందరు ఫిక్స్ అయ్యారు అలాంటి వాళ్ళ కోసమే ఈ టెంపుల్.బ్రహ్మ దేవుడికి భూమి పైన దేవాలయం లేదని చెపుతూ వుంటారు.

ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి ఇదే

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

1. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం లోని అజ్మీరు జిల్లాలోని ఒక ఊరు పుష్కర్. అది అజ్మీరు జిల్లాకు వాయవ్యంలో 14 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 510 (1673) అడుగుల ఎత్తుగా ఉపస్థితమై ఉంది. ఉత్తర భారతదేశంలో ఉన్న ఐదు పవిత్రధామములలో (హిందువుల పవిత్ర తీర్ధాలు) ఇది ఒకటి. ఇది తీర్ధరాజ్ అని హిందువులతో గౌరవించబడుతుంది.

PC: LRBurdak

2. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

2. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

పుణ్యక్షేత్రాలలో చక్రవర్తి అయిన ఈ క్షేత్రము విదేశీ భక్తులకు ఒక లక్ష్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని పురాతన నగరాలలో పుష్కర్ ఒకటి. పుష్కర్ సరస్సును చుట్టి విస్తరించి ఉన్న ఈ నగరనిర్మాణము ఎప్పడు మొదలైందో ఎవరికీ అంచనా లేదు.

PC:wikimedia.org

3. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

3. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

అయినా పురాణ కథనాలను అనుసరించి ఈ నగరానికి రూపకర్త బ్రహ్మదేవుడని చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు ఇక్కడ 60,000 సంవత్సరాల కాలం విష్ణుమూర్తిని దర్శించడానికి యజ్ఞముచేసాడని ప్రతీతి. పుష్కర్‌లో అనేక ఆలయాలు ఉన్నాయి. వీటిలో అనేకం పురాతనమైనవి కాదు. ముస్లిమ్ దండయాత్రలలో అనేకం ధ్వంసం చేయబడ్డాయి. ధ్వంసం చేయబడిన ఆలయాలు పునరుద్ధరించబడ్డాయి. తరువాతి కాలంలో ధ్వంసం చేయబడిన ఆలయాలు పునర్నిర్మించబడ్డాయి. బ్రహ్మాలయానికి చెందిన అనేక దేవాలయాలు క్రీశ 14వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి.

PC:Adityavijayavargia

4. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

4. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

ప్రపంచంలో అతి కొన్ని బ్రహ్మదేవుని ఆలయాలు మాత్రమే ప్రస్తుతం జీవించి ఉన్నాయి. మిగిలిన బ్రహ్మదేవుని ఆలయాలు ఉత్తరప్రదేశ్ లోని బిదూరులో ఒకటి, భారతదేశంలో రాజస్థాన్ లోని బర్మర్ జిల్లా సమీపంలోని బలోత్రా అనే పల్లెటూరులో ఒకటి, మదర్ టెంపుల్ ఆఫ్ బిసాకిహ్ ఒకటి మరియు ఇండోనేషియా లోని యోగ్యకర్త లోని ప్రంబనన్ ఒకటి.

PC:Sudiptorana

5. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

5. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

పుష్కర్6లో 52 ఘాట్లు భక్తుల స్నానార్ధము ఉన్నాయి. పుష్కర్‌లో ఏటా జరిగే ఒంటెల జాతర ప్రపంచ ప్రసిద్ధి పొందింది. దేశదేశాల నుండి పర్యాటకులు పుష్కర్ కెమేల్ ఫెయిర్ అనే ఈ ఉత్సవానికి విచ్చేయడం ఒక ప్రత్యేకత.

PC:K.vishnupranay

6. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

6. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

కొన్ని దశాబ్ధాలుగా పుష్కర్ యొక్క సహజ వాతావరణ కాలుష్యం కలత చెందవలసిన విధంగా పెరిగిందని భావించబడుతుంది. పర్యాటకుల సౌకర్యార్ధం అడవులను నరికివేయడం ఇందుకు ప్రధాన కారణమని భావించబడుతుంది.

PC:SolReyes

7. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

7. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

కానీ బ్రహ్మదేవుడికి ప్రపంచం మొత్తంలో రాజస్థాన్ లోని పుష్కర్ లో కల దేవాలయం ఒకటి కలదు.ఈ టెంపుల్ ను ఒక పెద్ద నాలుగు తలల విగ్రహంతో 14వ శతాబ్దంలో నిర్మించారు.

PC:Vberger

8. బ్రహ్మదేవుడు ప్రధాన దైవంగా పూజింపబడే ఏకైక ఆలయం

8. బ్రహ్మదేవుడు ప్రధాన దైవంగా పూజింపబడే ఏకైక ఆలయం

పుష్కర్ ప్రత్యేక ఆకర్షణ త్రిమూర్తులలో ఒకడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఆలయం. బ్రహ్మదేవుడు ప్రధాన దైవంగా పూజింపబడే ఏకైక ఆలయం ఇది. ఆలయంలో బ్రహ్మదేవుడి సంపూర్ణ ఆకారం ప్రతిష్ఠించబడింది.

PC:Vberger

9. బ్రహ్మ కొలువైన చోటు...

9. బ్రహ్మ కొలువైన చోటు...

విష్ణు, మహేశ్వరులకు ఉన్నట్టుగా ప్రపంచంలో బ్రహ్మదేవుడికి విరివిగా దేవాలయాలు లేవు. కారణాలు ఏవైనా మన దేశంలో ఒకే ఒక ప్రాంతంలో బ్రహ్మదేవుడికి ఆలయం ఉంది.

PC:User:Quashid

10. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

10. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

అదే పుష్కర్! రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మ నిత్య పూజలతో విరాజిల్లుతున్నాడు.

PC:Pablo Nicolás Taibi Cicaré

11. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

11. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

గాయత్రీ, సరస్వతీ దేవేరులతో నాలుగు ముఖాలతో గల బ్రహ్మ మూర్తిని చూడటానికి రెండూ కళ్లు చాలవు.

PC:Rameezm raza

12. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

12. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

అజ్మీర్‌కు చేరుకోవడానికి రెండు రోజులు పట్టింది. అజ్మీర్ చాలా పెద్దపట్టణం. అక్కడ ప్రఖ్యాతి గాంచిన దర్గాకు బయల్దేరాం.

PC:Rashmi.parab

13. మతసామరస్యానికి ప్రతీక...

13. మతసామరస్యానికి ప్రతీక...

సూఫీమత సన్యాసి దివంగతుడయ్యాక సమాధి చేసినదే ఈ దర్గా. అజ్మీర్ దర్గాగా దేశవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం ఉంది.

PC:wikimedia.org

14. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

14. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

దేశం నలుమూలల నుంచి వచ్చే హిందువులూ ఈ దర్గాను సందర్శించుకుంటారు. మొఘలుల కాలం నాటి శిల్ప కళ ఈ దర్గా గోడల మీద కనిపిస్తుంది.

PC:K.vishnupranay

15. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

15. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

దర్గా సందర్శన తర్వాత అజ్మీర్‌కు22 కి.మీ దూరంలో గల పుష్కర్‌కు బస్సులో వెళ్ళవచ్చును.

PC:Diego Delso

 16. ఆహ్లాదకరమైన సరస్సు

16. ఆహ్లాదకరమైన సరస్సు

పుష్కర్ అనేది పెద్ద సరస్సు పేరు. ఆ సరస్సు పేరే ఆ ప్రాంతానికీ వచ్చింది. చుట్టూ ఆవాసాలు.. మధ్యలో సరస్సు... సరస్సు పక్కనే బ్రహ్మ ఆలయం.. అద్భుతంగా అనిపిస్తుంది.

PC:Rameezm raza

17. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

17. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

ద్వాపరయుగంలో వజ్రనాభుని వధించడానికి బ్రహ్మ తన ఆయుధమైన తామరపుష్పాన్ని ప్రయోగించగా కొన్ని తామర రేకలు భూమిమీద పడ్డాయట. ఆ రేకలు పడిన ప్రదేశమే పుష్కర సరస్సుగా చెబుతారు.

PC:Hardik Dayal

18. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

18. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

ఈ ప్రాంతంలోనే బ్రహ్మ యజ్ఞం చేశాడనీ, అందుకే పుష్కర్‌కు అంత ప్రాధాన్యత వచ్చిందని చెబుతారు. ఆలయానికి సమీపంలో హంస వాహనం, గర్భ గుడి ఎదురుగా వెండి తాబేలు ఉంది.

PC:Mythos miara

19. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

19. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

బ్రహ్మదేవుడు నాలుగు తలలతో, ఎడమవైపున గాయత్రీదేవి, కుడివైపున సరస్వతీ దేవీతో కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయం 2000 ల సంవత్సరాల క్రితం నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది.

PC:rene boulay

20. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

20. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి

ప్రపంచంలోని పది ముఖ్యమైన దేవాలయాలలోనూ, 5 పవిత్ర మత పరమైన పుణ్యస్థలాలలో ఒకటిగా పుష్కర్‌కి, అక్కడి బ్రహ్మ ఆలయానికి పేరుంది.

PC:SoumavaKarmakar

21. ఎలా చేరాలి?

21. ఎలా చేరాలి?

ఒంగోలు నుండి హైదరాబాద్- అటు నుంచి అజ్మీర్ ఎక్స్‌ప్రెస్‌లో చేరుకోవచ్చు.

రూట్ మ్యాప్

pc:google maps

22. వాయుమార్గం

22. వాయుమార్గం

పుష్కర్ అతి సమీప విమానాశ్రయం జయపూర్ లోని సంగనర్ ఎయిర్ పోర్ట్. పుష్కర్‌కు 146 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం నుండి ఢిల్లీ, ముంబాయి, ఇండోర్, కొలకత్తా వంటి ప్రధాన నగరాలతో అనుసంధానించబడి విమానసేవలు పొందవచ్చు.

PC:Koshy Koshy

23. రోడ్డుమార్గం

23. రోడ్డుమార్గం

అజ్మీర్ ప్రధాన బస్టాండ్ నుండి పుష్కర్ 11 కిలోమీటర్లు ఉంటుంది. రాజస్థాన్ రహదారి మార్గం చాలా సౌకర్యవంతమైన బస్సులను నడుపుతుంటుంది. ఇక్కడ నుండి జయపూర్, అజ్మీర్, ఇండోర్, నగ్డా లకు ప్రతి 15 నిముషాలకు ఒక బస్సు నడుస్తూఉంటుంది.

PC:Koshy Koshy

24. రైలుమార్గం

24. రైలుమార్గం

పుష్కర్‌కు అతి సమీప రైలు స్టేషను అజ్మీరు రైలు స్టేషను. ఇక్కడ నుండి బ్రాడ్‌గేజ్ మార్గంలో దేశంలోని మహానగారాలైన న్యూఢిల్లీ, ముంబయి, కొలకత్తా, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, అహమ్మదాబాద్, ఇండోర్, కాన్పూర్, లక్నో పాట్నా, భోపాల్, ట్రివేండ్రమ్, కొస్చిన్ వంటి నగరాలకు రైళ్ళు నడుస్తుంటాయి. అజ్మీరు నుండి పుష్కర్‌కు బ్రాడ్‌గేజ్ రైలు మార్గంలో రైళ్ళు ఉన్నాయి.

PC:Mohitgoyal1128

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X