Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలోనే అతిపెద్ద మెట్ల బావి చూశారా ?

ప్రపంచంలోనే అతిపెద్ద మెట్ల బావి చూశారా ?

ప్రపంచములోనే అతి పెద్ద మెట్ల బావి అభనేరి. వేల సంవత్సరాల క్రితం కట్టిన ఈ మెట్ల బావి, ఇప్పటికీ చెక్కు చెదరకుండా పర్యాటకులను ఆకర్షిస్తుంది.

By Mohammad

ప్రపంచములోనే అతి పెద్ద మెట్ల బావి అభనేరి. వేల సంవత్సరాల క్రితం కట్టిన ఈ మెట్ల బావి, ఇప్పటికీ చెక్కు చెదరకుండా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది నాటి ఇంజనీర్ల గొప్పతనానికి నిలువెత్తు తార్కాణం. ప్రపంచములోనే ఇంతటి అపూర్వ కట్టడం మరెక్కడా లేదు. దీని ప్రాచీనతే దీనిని ప్రపంచ వారసత్వ సంపద జాబితా లో చేర్చే విధంగా చేసింది. మరి అంతటి గొప్ప కట్టడం గురించి తెలుసుకుందాం పదండి !!

ఇది కూడా చదవండి : హల్దీరాం ఆలూ భుజియా ఎక్కడ పుట్టిందో తెలుసా ?

అభనేరి రాజస్ధాన్ లోని దౌసా జిల్లాలో జైపూర్ - ఆగ్రా రోడ్డు పై జైపూర్ కు 95 కి.మీ.ల దూరంలో కల ఒక గ్రామం. ఇక్కడ చాంద్ బవోరి అనే ఒక పెద్ద మెట్ల బావి తో ఈ ప్రదేశం బాగా ప్రసిద్ధి గాంచినది. ఇండియాలోని మెట్లబావులన్నింటికంటే కూడా ఈ మెట్లబావి ఎంతో అందమైనది. అభనేరి గ్రామాన్ని గుర్జార్ ప్రతిహార్ రాజు సామ్రాట్ మిహిర్ భోజ్ స్ధాపించినట్లు తెలుస్తోంది.

చాంద్ బవోరి

చాంద్ బవోరి

అభనేరి మెట్ల బావులు లేదా దిగుడు బావులకు ప్రసిద్ధి. వీటిలో వర్షపు నీరు వేసవి ఉపయోగార్ధం నిలువ చేసుకుంటారు. ఇక్కడ కల దిగుడు బావులన్నింటిలోను చాంద్ బవోరి చాలా ప్రసిద్ధి చెందినది.

చిత్రకృప : brando.n

శిల్ప శైలి

శిల్ప శైలి

చాంద్ బవోరి అందమైన శిల్ప శైలి కూడా కలిగి ఉంది. ప్రపంచంలోనే అతి పెద్దది, ఇండియాలోనే ఇది అతి పెద్దది మరియు లోతైన దిగుడు బావి.

చిత్రకృప : Teogomez

13 అంతస్తులలో ..

13 అంతస్తులలో ..

నలుచదరంగా నిర్మించిన ఈ మెట్ల బావి లోతు సుమారు 100 అడుగులుంటుంది. దీనికి ఇరుకైన 3,500 మెట్లు 13 అంతస్తులలో నిర్మించారు. దీనిని క్రీ.శ.9 వ శతాబ్దంలో రాజు రాజాచంద్ నిర్మించారు.

చిత్రకృప : pupilinblow

మంటపాలు

మంటపాలు

ఈ బావికి మూడు వైపులనుండి మెట్లు కలవు. నాలుగవ వైపు ఒకదానిపై మరొకటిగా మంటపాలను నిర్మించారు. ఈ మంటపాలలో అందమైన శిల్పాలు, చెక్కడాలు నిర్మించారు.

చిత్రకృప : chetan

ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా

ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా

ఇక్కడే ఒక స్టేజి మరియు కొన్ని గదులు కూడా కలదు. దీనిలో రాజు మరియు రాణి తమ కళలను ప్రదర్శించేవారు. చాంద్ బవోరిని ప్రస్తుతం ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది.

చిత్రకృప : Doron

సినిమాలలో కూడా

సినిమాలలో కూడా

ఈ చారిత్రక కట్టడాన్ని దర్శించేందుకు ఎటుంవంటి ప్రవేశ రుసుము లేదు. ఈ "ది ఫాల్" మరియు "ది డార్క్ నైట్ రైసెస్" వంటి చిత్రాలలో చూడవచ్చు.

చిత్రకృప : Arpita Roy08

హర్షత్ మాత దేవాలయం

హర్షత్ మాత దేవాలయం

చాంద్ బవోరి ఎదురుగా హర్షత్ మాత దేవాలయం కలదు. ఈ దేవాలయాన్ని 8వ లేదా 9వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది. మధ్య యుగం నాటి భారతదేశ శిల్ప సంపదలో కల హర్షత్ మెహతా దేవాలయం కూడా పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది.

చిత్రకృప : Pablo Nicolás Taibi Cicare

జాతర

జాతర

ఈ దేవాలయంలో దేవత హర్షత్ మెహతా. ఈ దేవత సంతోష ఆనందాల దేవతగా చెపుతారు. ప్రతి సంవత్సరం హర్షత్ మాత దేవాలయంలో మూడు రోజులపాటు జాతర నిర్వహిస్తారు.

చిత్రకృప : pupilinblow

జానపద నృత్యాల గ్రామం

జానపద నృత్యాల గ్రామం

అభనేరి గ్రామం జానపదుల నృత్యాలకు ప్రసిద్ధి గాంచింది. ఘూమర్, కలబెలియా, భవాయ్, వంటివి ప్రసిద్ధి చెందిన నాట్యాలు. అభనేరి తో పాటు జైపూర్ లో వసతి పొందవచ్చు.

చిత్రకృప : Piyush Kumar

అభనేరి ఎలా చేరుకోవాలి ?

అభనేరి ఎలా చేరుకోవాలి ?

రోడ్డు ప్రయాణం

అభనేరి జాతీయ రహదారి 11 పై ఉండి ఆగ్రా, జైపూర్, అకు తేలికగా ప్రయాణించేలాగుంది.

రైలు ప్రయాణం

దౌసా రైలు స్టేషన్ 35 కి. మీ. ల దూరంలో, 95 కి.మీ.ల దూరంలో జైపూర్ రైల్వే స్టేషన్ సమీప రైలు స్టేషన్. ఇక్కడనుండి ఇండియాలోని అన్ని పట్టణాలకు తేలికగా చేరవచ్చు.

విమాన ప్రయాణం

అభనేరికి సుమారు 95 కి.మీ. ల దూరంలో కల సంగనేర్ విమానాశ్రయం జైపూర్ పట్టణంలో కలదు. ఈ విమానాశ్రయం నుండి అభనేరికి టాక్సీలు, క్యాబ్ లు లభిస్తాయి.

చిత్రకృప : pupilinblow

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X