» »రాజుల భూమిగా పేరుగాంచిన నమక్కల్ లో ఇవి చూశారా !

రాజుల భూమిగా పేరుగాంచిన నమక్కల్ లో ఇవి చూశారా !

Posted By: Venkata Karunasri Nalluru

నమక్కల్ తమిళనాడులోని కొంగునాడులో ఒక భాగంగా వుండేది. ఈ పట్టణం అడియమాన్ తెగకు చెందిన గుణశీలచే పాలించబడింది. ఇక్కడ అనేక చారిత్రక అవశేషాలు కలవు. రంగనాథ స్వామి టెంపుల్ మరియు నరసింహస్వామి టెంపుల్ లను గుణశీల రాజు నిర్మించాడు. ఆయనకు పల్లవ వంశీకులతో గల వివాహ సంబంధాలు శిల్పశైలిని ప్రభావించాయి.

తర్వాత ఈ రాజ్యం చోళుల ఆధీనంలోకి మరియు తర్వాత 14వ శతాబ్దం వరకూ హోయసలుల పాలనలోకి వచ్చింది. వీరి తర్వాత విజయనగర రాజులు, మదురై నాయకులు, బీజాపూర్ సుల్తాన్ లు, గోల్కొండ మైసూరు రాజులు, మరాఠాలు, హైదర్ అలీ మరియు చివరకు బ్రిటిష్ వారు ఈ నగరాన్ని పాలించారు. ప్రాంత సంస్కృతిపై ప్రతి పాలకుడు తనదైన ముద్ర వేసాడు.

1. నమక్కల్ ఎలా చేరుకోవాలి

1. నమక్కల్ ఎలా చేరుకోవాలి

సమీప ఎయిర్ పోర్ట్ : తిరుచిరప్పల్లి - 74 కి.మీ.
సమీప రైల్వే స్టేషన్లు : సేలం మరియు కరూర్ రైల్వే స్టేషన్లు
బస్సు మార్గం : చెన్నై, సేలం, కరూర్ నుండి నమక్కల్ కు బస్సులు తిరుగుతాయి.
pc : Rsrikanth05

2. నైనా మలై

2. నైనా మలై

నైనా మలై నమక్కల్ సిటీ కి 10 కి.మీ.ల దూరంలో కల ఒక చిన్న కొండ. తిరుమలై పట్టి గ్రామానికి సమీపంగా వుంటుంది. నైనా మలై కొండపై వెంకట చలపతి టెంపుల్ కలదు. దీనిని చేరాలంటే , 2500 మెట్లు ఎక్కాలి. అయినప్పటికీ భక్తులు శనివారాలు ఇతర పండుగ దినాలలో అధిక సంఖ్యలో ఈ టెంపుల్ దర్శిస్తారు.
pc : kurumban

3. ముతుగాపట్టి పెరియ స్వామి టెంపుల్

3. ముతుగాపట్టి పెరియ స్వామి టెంపుల్

ముతుగాపట్టి పెరియ స్వామి టెంపుల్ కొల్లి కొండల దిగువ భాగంలో కలదు. ఈ ప్రాంతంలో ఈ టెంపుల్ ప్రసిద్ధి. ఈ టెంపుల్ ను రైతుల దేముడుకి అంకితం చేసారు. ఇక్కడి దేముడి విగ్రహం బహిరంగంగా ఒక మర్రి చెట్టు కింద వుంటుంది. చాలా మంది భక్తులు ఈ టెంపుల్ కు ఆదివారాలు వస్తారు.
pc : kurumban

4. కూలిప్పటి మురుగన్ టెంపుల్

4. కూలిప్పటి మురుగన్ టెంపుల్

కూలిప్పటి మురుగన్ టెంపుల్ నమక్కల్ నుండి 3 కి.మీ.ల దూరంలో కలదు. ఇది తురయార్ మార్గం లో కలదు. ఒక కొండ పై కల ఈ ప్రదేశం స్థానికులకు పర్యాటకులకు ఒక ప్రసిద్ధ ఆకర్షణ. పురాతన ఈ టెంపుల్ కు తప్పక వెళ్ళ వలసినదే.
pc : kurumban

5. నమక్కల్ రాక్ ఫోర్ట్

5. నమక్కల్ రాక్ ఫోర్ట్

రాక్ ఫోర్ట్ ఒక కొండపై వుంటుంది. దీనికి చేరాలంటే కష్టపడి ఒక అరగంట పాటు కొండ ఎక్కాలి. ఈ కోట ప్రసిద్ధి చెందినది, మరియు దేశం లోని కోటలు అన్నిటిలోకి సురక్షితమైనది. సుమారు 75 మీటర్ల ఎత్తున కలదు. ఈ కోటను 9 వ శతాబ్దంలో నిర్మించారు.
pc : Thamizhpparithi Maari

6. నామగిరి లక్ష్మి నరసింహ టెంపుల్

6. నామగిరి లక్ష్మి నరసింహ టెంపుల్

శ్రీ నరసింహ టెంపుల్ కొండ దిగువ భాగంలో కలదు. ఇది పురాతన టెంపుల్. దీనిని అడియామన్ తెగ రాజు గుణశీల నిర్మించాడు. ఇక్కడ నరసింహ విగ్రహం రాతితో చేయబడినది. శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ నరసింహ టెంపుల్ కు అనేక మంది భక్తులు వచ్చి ఆశీస్సులు పొందుతారు. ఇది ఒక వైష్ణవ క్షేత్రం.
pc : Balajijagadesh

7. నమక్కల్ ఆంజనేయ టెంపుల్

7. నమక్కల్ ఆంజనేయ టెంపుల్

యాత్రికులకు, పర్యాటకులకు ఇక్కడ కల ఆంజనేయ టెంపుల్ తప్పక చూడవలసిన ప్రదేశం. ఈ టెంపుల్ సుమారు 1500 ఏళ్ల నాటిది. నమక్కల్ కోట దిగువ భాగంలో కలదు. నరసింహ టెంపుల్ కు సుమారు వంద మీటర్ల ఎదురుగా కలదు. ఈ టెంపుల్ లో ప్రధాన ఆకర్షణ ఆంజనేయ విగ్రహం. ఇది 13 అడుగుల ఎత్తు కలది. ఆంజనేయ విగ్రహం లార్డ్ నరసింహకు అభిముఖంగా వుంటుంది.
pc :Chitrinee

8. తిరుచెంగోడు అర్ధనారీస్వర్ టెంపుల్

8. తిరుచెంగోడు అర్ధనారీస్వర్ టెంపుల్

తిరుచెంగోడు అర్ధనారేశ్వర టెంపుల్ నమక్కల్ లో ఒక ప్రసిద్ధ ఆకర్షణ. ఇది ఒక శివ టెంపుల్. సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తున కలదు. అర్ధనారేశ్వర్ విగ్రహం లో శివ మరియు పార్వతి లు కలవు. విగ్రహం సగం పురుష మరియు సగం మహిళగా కనపడుతుంది.
pc : Ravindraboopathi

9. నమక్కల్ దుర్గం కోట

9. నమక్కల్ దుర్గం కోట

నమక్కల్ దుర్గం కోటను 16 వ శతాబ్దంలో రామచంద్ర నాయకర్ నిర్మించారు. ఇది నామగిరి కొండలపై కలదు. ఈ కోట ఇపుడు పురాతన విష్ణు టెంపుల్ శిధిలాలు కలిగి వుంది. నామ గిరి హిల్స్ కు ఇరువైపులా నరసింహస్వామి మరియు రంగనాథ స్వామిల కొండ గుహ టెంపుల్స్ కలవు.
pc : Ravindraboopathi

10. తాతగిరి మురుగన్ టెంపుల్

10. తాతగిరి మురుగన్ టెంపుల్

తాతగిరి మురుగన్ టెంపుల్ నమక్కల్ నుండి ముతూగాపట్టి వెళ్ళే మార్గంలో 10 కి.మీ.ల దూరంలో కలదు. దీనిని ఒక చిన్న కొండపై నిర్మించారు. మహర్షి కిరుపానంద వారియర్ ఈ టెంపుల్ ను ప్రశాంతత కొరకు తరచుగా దర్శించేవాడని చెపుతారు.
pc : yoursloving.sunil59