» »భారతదేశంలో గుండె దడ పుట్టించే అతి భయంకరమైన ప్రదేశాలు !

భారతదేశంలో గుండె దడ పుట్టించే అతి భయంకరమైన ప్రదేశాలు !

Written By: Venkatakarunasri

ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు వున్నాయి. అరుదైన అందమైన ప్రదేశాలు కొన్నయితే వెన్నులో ఒణుకు పుట్టించే భయానక ప్రదేశాలు కొన్ని. స్వయాన మనభారతదేశంలోనే చెప్పలేని గుండె దడ పుట్టించే అతి భయంకరమైన ప్రదేశాలున్నాయి. ఇటువంటి హాంటెడ్ ప్రదేశాలు గ్రామాలు లేదా నిర్జీవప్రాంతాలలో మాత్రమే వుంటాయని భావిస్తున్నారా . అయితే మీరు పొరాపడినట్లే.

భారతదేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగుళూర్,కొలకత్తా వంటి నగరాలలో కూడా హాంటెడ్ ప్రదేశాలున్నాయి. భారతదేశంలో ఆ ప్రదేశం యొక్క చరిత్ర మరియు కొన్ని సంఘటనలుకారణంగా వాటిని హాంటెడ్ ప్రదేశాలుగా లెక్కిస్తారు. నిపుణులు కూడా భారతదేశంలో కొన్ని హాంటెడ్ ప్రదేశాలున్నాయని అంగీకరించారు.

నగరాలలో వుండే ప్రజలుకూడా ప్రతిసారీ దిగ్భ్రాంతి కలిగించే మరియు భయానకంగా వుండే అతీంద్రీయ చర్యలకు సంబంధించిన కేసులు ఎన్నో నమోదయ్యాయని అవే నగరాలలో వున్న హాంటెడ్ ప్రదేశాలకు సాక్ష్యులుగా వున్నాయి. భారతదేశంలో టాప్ హాంటెడ్ ప్రదేశాలేంటో ఈ వ్యాసంద్వారా తెలుసుకుందాం.

భారతదేశంలో గుండె దడ పుట్టించే అతి భయంకరమైన ప్రదేశాలు !

ఢిల్లీలోని కంటోన్మెంట్

ఢిల్లీలోని కంటోన్మెంట్

మొదటిది ఢిల్లీలోని కంటోన్మెంట్. అత్యంత హాంటెడ్ ప్రదేశాలలో ఒకటి. దట్టమైన అడవిలో చూట్టానికి ఎంతో భయంకరంగా వుంటుంది. అక్కడ చనిపోయిన అనేకమంది స్త్రీలు తెలుపుచీర కట్టుకుని లిఫ్ట్ కోరుతూవుంటారు.మీరు ఆమెకు లిఫ్ట్ అందించకపోతే ఆమె మీ వెనక నడుస్తూవచ్చి మిమ్మల్ని అధిగమిస్తుందని అక్కడికి వచ్చినవారు చెప్తారు.

PC:youtube

రాజస్థాన్ లోని భాంగ్రా ఫోర్ట్

రాజస్థాన్ లోని భాంగ్రా ఫోర్ట్

రెండవది రాజస్థాన్ లోని భాంగ్రా ఫోర్ట్. హాంటెడ్ ప్రదేశాలను సందర్శించాలని అనుకునేవారు భాంగ్రా గురించి తెలుసుకోవలసిందే. భారతదేశంలో అత్యంత హాంటెడ్ ప్రదేశాలలో భాంగ్రా ఒకటి. ఇది రాజస్థాన్ లో ఆళ్వార్ జిల్లాలో వున్నది. రాజస్థాన్ లో ఈ ప్యాలెస్ కు సంబంధించిన అనేక కథలు వున్నాయి. ఇది రాష్ట్రంలో అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటిగా వుంది. అయితే భాంగ్రా ఇప్పుడు శిథిలావస్థలో వున్న నాశనమైన సామ్రాజ్యం. ప్రభుత్వం సమస్యలను నివారించటం కోసం ప్రవేశద్వారం వద్ద ఒక హెచ్చరిక బోర్డును వుంచింది.

PC:youtube

హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ

హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ

మూడవది హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ. ఇది భారతదేశంలోనే టాప్ హాంటెడ్ ప్రదేశాలలో ఒకటిగా వుంటుంది. ఈ ఫిల్మ్ సిటీని నిజాంల యుద్ధ మైదానంలో నిర్మించారు. అసాధారణంగా చనిపోయిన సైనికులు ఇప్పటికీ అక్కడే సంచరిస్తారని నమ్ముతారు. హోటల్ సమీపంలో అతీంద్రీయ కార్యకలాపాలు జరుగుతాయని కూడా అంటూవుంటారు.

PC:youtube

గుజరాత్ లోని డ్యుమాస్ బీచ్

గుజరాత్ లోని డ్యుమాస్ బీచ్

నాల్గవది గుజరాత్ లోని డ్యుమాస్ బీచ్. వేడిగా వుండే ఈ పర్యాటకప్రదేశం కూడా హాంటెడ్ ప్రదేశంగా ప్రకటించబడుతుంది. సూర్యాస్తమయం తరువాత ముఖ్యంగా రాత్రి పూట ప్రజలు ఈ బీచ్ ను సందర్శించటానికి వీలు లేదు.ఎందుకంటే ఇక్కడ అనేక మిస్సింగ్ కధనాలు ప్రచారంలో వున్నాయి. అందువలన ఎవరినీ నైట్ టైం లో అనుమతించరు. బీచ్ ముందున్న ప్రదేశాన్ని మృతదేహాలు కాల్చటానికి వుపయోగిస్తారు.

PC:youtube

పశ్చిమ బెంగాల్ లోని కుర్గియాన్ లోని డౌహిల్

పశ్చిమ బెంగాల్ లోని కుర్గియాన్ లోని డౌహిల్

పశ్చిమ బెంగాల్ లోని కుర్గియాన్ లోని డౌహిల్ దగ్గరవున్న పాఠశాల మరియు అడవిని కూడా ఒక హాంటెడ్ ప్రదేశంగా భావించబడుతుంది.అక్కడికి వెళ్ళినవారు చాలా మంది హత్యలు చేయబడ్డారు మరియు అక్కడ జరిగే భయానక అతీంద్రీయ కార్యకలాపాలు ఒక వింత అనుభూతిని కలిగిస్తాయి.

PC:youtube

బెంగుళూరులోని సెయింట్ మార్క్స్ రోడ్ వద్ద ఒక హాంటెడ్ హౌస్

బెంగుళూరులోని సెయింట్ మార్క్స్ రోడ్ వద్ద ఒక హాంటెడ్ హౌస్

ఆరవది బెంగుళూరులోని సెయింట్ మార్క్స్ రోడ్ వద్ద ఒక హాంటెడ్ హౌస్. ఇది భారతదేశంలో అత్యంత హాంటెడ్ ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. బెంగుళూరులో ఒక ఇంటి వద్ద ఒక మహిళను అనుమాస్పదంగా హత్యచేయటం వల్ల ఆ ఆత్మ ఇంకా అక్కడే వుందని అనేక కథనాలు ప్రచారంలో వున్నాయి.అక్కడ ఇప్పటికీ అతీంద్రీయ కార్యకలాపాలు జరుగుతూవున్నాయని చాలామంది అంటూ వుంటారు.

PC:youtube

పూణేలోని శనివార్ వాడా ఫోర్ట్

పూణేలోని శనివార్ వాడా ఫోర్ట్

ఏడవది పూణేలోని శనివార్ వాడా ఫోర్ట్ వద్ద రాత్రిసమయాలలో అక్కడ ఒక బాలుడుచేసే అరుపుల్లాంటి శబ్దాలు వినిపిస్తాయి. కొన్ని కధనాల ప్రకారం ఈ కోటలో కిరాతకంగా జరిగిన బంధువుల హత్యలు ఒక 13ఏళ్ల ప్రిన్స్ ని వెంటాడతాయని అందుకే అక్కడ బాలుడి కేకలు విన్పిస్తాయని చెప్తారు. అక్కడ పౌర్ణమి రోజుల రాత్రులు భయంకరంగా వుంటుందని చెప్తారు.

PC:youtube

బెంగుళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయం

బెంగుళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయం

ఎనిమిదవది బెంగుళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బిజి ప్రదేశంలో వున్న హాంటెడ్ ప్రదేశం అంటారు. ఎందుకంటే బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో సిబ్బంది మరియు ప్రయాణికులు కొన్ని పరానార్మల్ కార్యకలాపాలను చూసామని తరచూ చెపుతూవుంటారు.

PC:youtube