Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన నరసింహస్వామి క్షేత్రాలు !!

ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన నరసింహస్వామి క్షేత్రాలు !!

భగవంతుడు(విష్ణుమూర్తి) మానవునిగా మారడానికి ఏన్నో అవతారలను ఎత్తవలసి వచ్చింది. మొదటగా మత్స్యవతారం .. తరువాత కూర్మవతారం ... ఆ తరువాత నరసింహావతారం. ఈ నరసింహవతారంలో భగవంతుడు సగం నరుడు రూపం, మిగిలిన సగం సింహాం రూపం ధరించి ఉంటాడు.

ఎందుకు విష్ణువు సింహావతారం ఎత్త వలసి వచ్చింది ??

హిరణ్యకసిపుడు అనే రాక్షసుడు బ్రహ్మకై తప్పసు చేసి, తన మరణం మనిషి వలన కాని, జంతువు వలన కాని, మరేవిధమైన జీవి వలన కాని, పగలు కాని, రాత్రి కాని, ఇంట్లో కాని, బయట కాని, ఆకాశంలో కాని నేలమీద కాని, చేతితో కాని లేక మరేవిధమైన ఆయుధంతో కాని మరణం సంభవించకుడదని వరం కోరుకుంటాడు. ఆ వరాన్ని అనుసరించే ఈ నరసింహావతారం జరిగింది.

ఇది కూడా చదవండి : విజయనగరం - ఘన చరిత్రగల ప్రదేశం !

హిరణ్యకసిపుడు కోరుకున్నట్లు, శ్రీహరి మనిషి కాదు, మృగము అంతకంటే కాదు, రెండూ కలిసిన అవతారం. మరణం సంభవించింది పగలు కాదు రాత్రి కాదు, మధ్యహ్నం. ఇంట్లొ కాదు బయట కాదు, ఇంటి గుమ్మం మీద కుర్చోని, ఆకశంలో కాదు, నేలపై కాదు, తన కాలి తోడపై పెట్టుకోని, ఏ ఆయుధం ఉపయోగించాకుండ తన చేతి గోర్లతో, హిరణ్యకసిపుడి పోట్ట చిల్చి, పేగులు తీసి చంపాడు.

ఇది కూడా చదవండి : ద్రాక్షారామం - పురాణాల పుట్ట !

మన రాష్ట్రంలో నరసింహ స్వామి వెలిసిన క్షేత్రాలు అక్కడక్కడ కనిపిస్తాయి. ఇవి నిత్యం భక్తులతో, హరినామస్మరణలలతో, పూజలతో ఆధ్యాత్మిక భావనను రేకెత్తించే విధంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన నరసింహస్వామి క్షేత్రాలు అంటే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది అహోబిలం. ఇది రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనూ ప్రసిద్ధి చెందినది. అందుకే ఇక్కడికి దేశంలోని నలుమూలల నుండి పెద్ద పెద్ద ప్రముఖులు సైతం వస్తుంటారు. మన రాష్ట్రంలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ నరసింహ ఆలయాల విషయానికి వస్తే ...

ఇది కూడా చదవండి : ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడెక్కడ ఏమేమి తినాలి ??

అహోబిలం, కర్నూలు

అహోబిలం, కర్నూలు

అహోబిలం, దేశంలోని నరసింహ స్వామి క్షేత్రాలన్నింటిలోకి ప్రముఖమైనది. ఈ పుణ్య క్షేత్రం రాయలసీమ ప్రాంతంలో విస్తరించిన దట్టమైన నల్లమల అడవుల్లో కర్నూలు జిల్లాలో వెలిసింది. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అనబడే పర్వతాలను కలిగి ఉన్న ఈ క్షేత్రంలో దేవుడు 9 విగ్రహ రూపాలలో కనిపిస్తాడు.

ఇది కూడా చదవండి : అహోబిలం లో అంతుపట్టని ఆలయ రహస్యం !

చిత్ర కృప : Rengeshb

స్థంబాద్రి, ఖమ్మం

స్థంబాద్రి, ఖమ్మం

స్థంభాద్రి నరసింహ స్వామి ఆలయం, ఖమ్మం నగరం నడిబొడ్డున ఒక ఎత్తైన కొండమీద ఉన్న ఆలయం. ఇది తెలంగాణ లోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి. ప్రహ్లాదున్ని కాపాడేందుకు నరసింహ స్వామి వారు ఒక స్తంభం లో నుంచి బయటికి వచ్చారని కథనం. అటువంటి స్తంభాలున్న ప్రాంతం కాబట్టే స్తంభాద్రి అన్న పేరొచ్చింది.

ఇది కూడా చదవండి : ఖమ్మం లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : Pranayraj1985

యాదగిరిగుట్ట, నల్గొండ

యాదగిరిగుట్ట, నల్గొండ

యాదగిరిగుట్టలో వెలిసిన లక్ష్మి నరసింహ స్వామి ఆలయం, నల్గొండ జిల్లాలో ఎత్తైన గుట్టపై ఉన్న ఆలయం. ఈ పుణ్య క్షేత్రంలో రెండు నరసింహ స్వామి క్షేత్రాలు ఉన్నాయి. అవి పాత మరియు కొత్త లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రాలుగా చెప్పుకోవచ్చు. విష్ణుపుష్కరిణి, ఆంజనేయస్వామి ఆలయం, శివాలయం కూడా చూడవలసినదే.

ఇది కూడా చదవండి : యాదగిరి దర్శనం - వారాంతపు విహారం !

చిత్ర కృప : Reddy Bhagyaraj

కదిరి లక్ష్మినరసింహస్వామి ఆలయం, అనంతపురం

కదిరి లక్ష్మినరసింహస్వామి ఆలయం, అనంతపురం

అనంతపురం జిల్లా, కదిరిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నవ నరసింహ క్షేత్రలలో ఒకటి. ఇక్కడి విశిష్టత ఏమిటంటే, మరే నరసింహ క్షేత్రాల్లో లేని విధంగా స్వామి వారు ప్రహ్లాదుని సమేతంగా దర్శనం ఇస్తాడు. ప్రతి సంవత్సరం ఇక్కడ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.

ఇది కూడా చదవండి : గిన్నీస్ బుక్ ల అనంతపురం !

చిత్ర కృప : రహ్మానుద్దీన్

మంగళగిరి, గుంటూరు

మంగళగిరి, గుంటూరు

గుంటూరు జిల్లాలో ఉన్న మంగళగిరి నరసింహ స్వామి ఆలయానికి ప్రసిద్ది. కొండపైన నిర్మించిన ఈ ఆలయం, పూర్వం ఒక అగ్నిపర్వతంగా ఉండేది. రానురాను ఆ అగ్నిపర్వతం కనుమరుగపోయింది. ఇక్కడ పానకాన్ని మాత్రమే నైవేద్యంగా పెడతారు ఎందుకంటే అగ్నిపర్వతం రాకుండా ఉండటానికి రసాయనిక చర్యలో భాగంగా బెల్లం, చెక్కర, చెరకు లను వాడతారు. ఈ స్వామిని పానకాల స్వామి అని కూడా పిలుస్తారు.

ఇది కూడా చదవండి : గుంటూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : B B Susheel Kumar

వేదాద్రి, కృష్ణా జిల్లా

వేదాద్రి, కృష్ణా జిల్లా

కృష్ణానది ఒడ్డున ఉన్న వేదాద్రి లో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉన్నది. ఇక్కడ పంచ నరసింహ ప్రతిమలు ఉన్నాయి. ముఖ్య దేవాలయములో యోగానంద మరియు లక్ష్మీ నరసింహస్వామి, కొండపైన జ్వాలా నరసింహస్వామి, కృష్ణానది గర్భములో స్నాన ఘట్టమునకు సమీపములో బయటకు కనిపించే రూపం సాలగ్రామము, వేదాద్రికి సమీపములోని గరుడాచల కొండపై వీర నరసింహ స్వామి ఉన్నారు.

ఇది కూడా చదవండి : కృష్ణానది ఒడ్డున పవిత్ర పుణ్యక్షేత్రాలు !

చిత్ర కృప : Nagasrinivasarao

నరసింహ కొండ, నెల్లూరు

నరసింహ కొండ, నెల్లూరు

నెల్లూరు పట్టణానికి 13 కి.మీ. దూరంలో ప్రకృతి ఒడిలో ఉన్న నరసింహ స్వామి ఆలయాన్ని, వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం గా పిలుస్తారు. ఇక్కడ వెలసిన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం చాలా పురాతనమైనది. ఈ దేవాలయం ఇక్కడ ఉన్న చిన్న కొండపై ఉండుట వలన ఈ కొండను నరసింహకొండ అని అంటారు.

ఇది కూడా చదవండి : నెల్లూరు లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : VS Ramachandran

పెంచల కోన, నెల్లూరు

పెంచల కోన, నెల్లూరు

తూర్పు కనుమల మధ్య పర్వత ప్రాంతాలలో నెల్లూరు - కడప జిల్లాల మధ్యలో పెంచల కోన అనే వైష్ణవ క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామి వారిని పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి గా పిలుస్తారు. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి. పెంచల కోన నెల్లూరు పట్టణానికి 80 కి. మీ. దూరంలో ఉన్నది. కోనలోని గర్భగుడి సుమారుగా 700 సంవత్సరాల క్రితం కట్టించినట్లుగా చెబుతారు.

ఇది కూడా చదవండి : శ్రీకాళహస్తి ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Sriram Girivasan

వింజమూరు, నెల్లూరు

వింజమూరు, నెల్లూరు

నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలంలో ఉన్న నల్గొండ గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన పురాతన దేవాలయం. స్వామి వారి ఆలయాన్ని నల్లని రాతి బండ లున్న కొండ మీద నిర్మించారు. పురాణాల కథనం మేరకు, ప్రహ్లాదుని కోరిక మేరకు నరసింహ స్వామి వారు ఆర్చాబింబరూపమున భక్తులకు దర్శనమిస్తాడు.

ఇది కూడా చదవండి : భైరవ కోన - అద్భుతాల జలకోన !

చిత్ర కృప : YVSREDDY

అంతర్వేది, తూర్పుగోదావరి జిల్లా

అంతర్వేది, తూర్పుగోదావరి జిల్లా

అంతర్వేది, తూ.గో. జిల్లా సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం. పురాణాల కథనం ప్రకారం, శ్రీ మహావిష్ణువు వశిష్ట మహర్షిని ప్రార్థించగా ఆయన లక్ష్మి సమేతుడై గరుడ వాహనంపై వచ్చి రక్తవలోచనుని సంహరించడానికి వస్తాడు. అప్పుడు స్వామి వారు మాయాశక్తి ని ఉపయోగించి, సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. వశిష్ట మహర్షి కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గా వెలిశాడు.

ఇది కూడా చదవండి : ఆంధ్ర ప్రదేశ్ లోని 20 హెరిటేజ్ ప్రదేశాలు !

చిత్ర కృప : apasar

ద్వారకా తిరుమల, పశ్చిమ గోదావరి జిల్లా

ద్వారకా తిరుమల, పశ్చిమ గోదావరి జిల్లా

పశ్చిమ గోదావరి జిల్లా, ద్వారకా తిరుమల మండలంలో ఐ. ఎస్. జగన్నాథపురం - ఐ.ఎస్‌.రాఘవాపురంకు మధ్య "నృసింహగిరి" అనే కొండమీద నరసింహ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని స్వామి భూతనరసింహ స్వామి. నరసింహుని సరసన కనకవల్లి (మహాలక్ష్మి) అమ్మవారు ఉన్నారు. ఆలయం ఎదురుగా పంచముఖ ఆంజనేయ స్వామి, ప్రక్కన ఏకాక్షర గణపతి, వెనుక సర్ప శ్రీనివాసు లు దేవతలను ప్రతిష్టించారు.

ఇది కూడా చదవండి : ద్వారకా తిరుమల - భక్తులపాలిట కొంగుబంగారం !

చిత్ర కృప : కాసుబాబు

సింహాచలం, విశాఖపట్టణం

సింహాచలం, విశాఖపట్టణం

సింహాచలం, దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్య క్షేత్రాలలో ఒకటి. విశాఖ పరిసర ప్రాంతంలో ఉన్న సింహాచలంలో సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మి నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉన్నది. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది.

ఇది కూడా చదవండి : సింహాచలం - నరసింహస్వామి క్షేత్రం !

చిత్ర కృప : Praveen B

భీమునిపట్నం, విశాఖపట్టణం

భీమునిపట్నం, విశాఖపట్టణం

భీముని పట్నం, విశాఖ పట్టణానికి చెందిన మండలం. ఇక్కడ నరసింహ స్వామి కొండగా ప్రసిద్డికెక్కిన కొండ ఉన్నది. ఈ కొండ సముద్రమట్టానికి 150 మీటర్ల ఎత్తున ఉన్నది. ఈ కొండకు దిగువన తూర్పుదిశ కు నరసింహ స్వామి ఆలయం ఉన్నది.

ఇది కూడా చదవండి : అరకు లోయ - మరపురాని పర్యటన !

చిత్ర కృప : Adityamadhav83

మట్టపల్లి, నల్గొండ

మట్టపల్లి, నల్గొండ

మట్టపల్లి, నల్గొండ జిల్లాకు చెందిన హుజూర్ నగర్ సమీపంలో ఉన్న ఒక గ్రామం. ఇక్కడ కృష్ణా నది తీరం ఒడ్డున వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉన్నది. దీనిని పంచ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ క్షేత్రంలో స్వామి వారు లక్ష్మీసమేతుడై వెలిశాడు. భరధ్వాజ మహర్షి ఇక్కడి గుహలో తపస్సు చేయగా, స్వామివారి దర్శనం లభించిందని స్థల పురాణం తెలుపుతుంది.

ఇది కూడా చదవండి : నాగార్జున సాగర్ - శ్రీశైలం బోట్ ట్రిప్ జర్ని !

చిత్ర కృప : Ashwin9696

కేతవరం, గుంటూరు జిల్లా

కేతవరం, గుంటూరు జిల్లా

కేతవరంలోని కృష్ణా నది ఒడ్డున వెలసిన లక్ష్మి నరసింహ స్వామి ఆలయం గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందినది. సాధారణంగా స్వామివారు ఎక్కడ వెలసినా కొండ గుహల్లో, స్వయంభూ గా భక్తులు చేరుకోవడానికి కష్టమయ్యేవిధంగా వెలుస్తాడు. ఇక్కడ కూడా అంతే ..! స్వామి వారిని దర్శించుకోవాలంటే 600 మెట్లు ఎక్కాలి.

ఇది కూడా చదవండి : ఆంధ్ర ప్రదేశ్ ప్రముఖ ట్రెక్కింగ్ ప్రదేశాలు !

చిత్ర కృప : srinivasa_raov

వాడపల్లి, నల్గొండ

వాడపల్లి, నల్గొండ

నల్గొండ జిల్లా, మిర్యాలగూడ తాలూకా, దామరచర్ల మండలంలో ఉన్నది వాడపల్లి క్షేత్రం. శివకేశవులకు బేధంలేదని ఆగస్త్య మహాముని ఇక్కడ లక్ష్మి నరసింహ స్వామి వారిని ప్రతిష్టించాడు. దక్షిణ ముఖంగా వున్న స్వామివారి ఆలయం చిన్నదయినా, భక్తుల అభీష్టాలను నెరవేర్చే స్వామిగా ప్రఖ్యాతి చెందారు. స్వామి తొడ మీద అమ్మవారు కూర్చుని వున్నట్లు వుంటుంది. గర్భగుడి లో స్వామి ముఖం ఎదురుగా అదే ఎత్తులో ఒక దీపం, కింద ఇంకో దీపం వుంటాయి. కిందవున్న దీపం కదలదు కానీ పైన ఉన్న దీపం కదులుతుంది. దీనికి కారణం స్వామి వుఛ్ఛ్వాశ నిశ్వాసలని చెపుతారు.

ఇది కూడా చదవండి : హైదరాబాద్ చుట్టుప్రక్కల గల జలపాతాలు !

చిత్ర కృప : wikicommons

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more