Search
  • Follow NativePlanet
Share
» »తిరుమలలో బంగారు బావి !

తిరుమలలో బంగారు బావి !

By Venkatakarunasri

శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవేంకటేశ్వరుడు లీలామానుష రూపుడై శ్రీ వైకుంఠం నుంచి వచ్చి భోలోకవైకుంఠం అయిన శ్రీవేంకటాచలక్షేత్రంలో సంచరిస్తూవున్న సమయంలో శ్రీవారి వంట కోసం శ్రీమహాలక్ష్మి ఒక తీర్ధాన్ని ఏర్పరచింది.అదే శ్రీతీర్థం అనీ, లక్ష్మీ అని పేరు గాంచింది. అలాగే భూదేవి కూడా ఒక తీర్థాన్ని ఏర్పాటుచేయగా అది భూతీర్థంగా పేరొందింది. కాలాంతరంలో ఈ తీర్థాలు రెండూ అదృశ్యములై నిక్షిప్తంగా వుండివున్నాయి.

మళ్ళీ అనంతరకాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వైఖానసాగమన శాస్త్రోప్తంగా అర్చిస్తూవున్న గోపీనాధుడనే అర్చకునకు సహాయంగా రంగదాసు అనే సేవకుడు తిరుమల చేరుకున్నాడు.

శ్రీ స్వామివారి ఆరాధన కోసం అవసరమయ్యే పుష్పాల కోసం తోటను పెంచటానికి రెండుబావులు నిర్మించినాడు.

అదే స్థలంలో ఎప్పుడో నిక్షిప్తములైన శ్రీతీర్థ,భూతీర్థాలు మళ్ళీ దైవికంగా బహిర్గాతాలైనాయి. అనంతరం ఆ రంగదాసు మరణించగా మళ్ళీ ఆ రెండు బావులు శిథిలమైనాయి.శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తోటలు పెంచి పుష్పాలు సమర్పించి సేవచేసిన ఫలితంగా ఆ రంగదాసు అనంతరకాలంలో తొండమాన్ చక్రవర్తిగా జన్మించి మళ్ళీ శ్రీస్వామి వారిని చేరుకున్నాడు.

తిరుమలలో బంగారు బావి !

ఆలయ ప్రాంగణం

ఆలయ ప్రాంగణం

మళ్ళీ ఈ జన్మలో కూడా పెక్కువిధాలుగా సేవిస్తున్న తొండమానునితో స్వామి వారు అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియచేసి తాను వుండటానికి ఒక ఆలయాన్ని నిర్మించి దానిపై బంగారుతొడుగుతో ఒక బంగారు విమానాన్ని ఏర్పాటుచేయించవలసిందని ఆలయ ప్రాంగణంలో పూర్వజన్మలో నిర్మించిన శ్రీతీర్ధం,భూ తీర్థాలను మళ్ళీ పునరుద్దరించాల్సిందిగా ఆజ్ఞాపించాడు.

PC:youtube

తొండమాన్ చక్రవర్తి

తొండమాన్ చక్రవర్తి

తన పూర్వజన్మ వృత్తాంతానికి ఆశ్చర్యపడిన తొండమాన్ చక్రవర్తి శ్రీతీర్థాన్ని ఉద్దరించి దాని చుట్టూరా రాతి తీర్థాన్ని ఏర్పాటుచేసి దానికి బంగారు రేకును తాపించినాడు. అదే అప్పటినుండి బంగారుబావిగా పేరుపొందింది.

PC:youtube

పూలబావి

పూలబావి

అలాగే భూతీర్థాన్ని దిగుడుబావిగా మెట్లతో నిర్మించినాడు. అదే పూలబావిగా ప్రసిద్దిపొందింది. కాలాంతరంలో ఆ శ్రీతీర్థం అంటే బంగారు బావి శ్రీ వారి వంట శాలకు, అర్చనారాధనకు ఉపయోగపడుతూ ప్రముఖస్థానాన్ని పొందింది.

PC:youtube

బంగారుబావి

బంగారుబావి

ఈ బంగారుబావి శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని బంగారువాకిలి నుండి వెలుపలికి వచ్చినతరువాత ఎదురుగా వున్న వంటశాలకు వెళ్ళే మార్గంలో అంటే వకుళాదేవిని దర్శించుకొనటానికి వెళ్ళేమార్గంలో వంటశాల మెట్లకు ఆనుకునిపక్కనే వుంటుంది.

PC:youtube

శ్రీ తీర్థం

శ్రీ తీర్థం

ఈ బావికి చుట్టూ భూమిమట్టం నుండి చెక్కడపురాళ్ళతో నిర్మించబడివుంటుంది. ఈ రాతి కట్టడం మీద బంగారుమలాం చేయబడిన రాగిరేకులు తాపడంవుండటం వలన ఇది బంగారుబావి అని ప్రసిద్ధిపొందింది. ఈ బంగారు బావికే శ్రీ తీర్థం అనీసుందరస్వామి బావీ అని పేర్లు వున్నాయి.

PC:youtube

శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్ మూర్తి

శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్ మూర్తి

తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్ మూర్తికి ప్రతిశుక్రవారం నాడు అభిషేకం జరపబడుతుంది. ఈ అభిషేకం గాను తిరుమలనంబి 11వ శతాబ్దంలో పాపవినాశన తీర్ధంనుండి రోజూ ఆ పవిత్ర జలాన్ని తెచ్చేవారు.

PC:youtube

తిరుమలనంబి

తిరుమలనంబి

ఈ తిరుమలనంబి భగవద్రామానుజులకు గురువుమాత్రమే కాక మేనమామకూడా.ఇలా అభిషేక జలాన్ని,సమర్పిస్తూ సేవిస్తూవున్న కాలంలో తిరుమలనంబి గురువుగారైన యామనాచార్యులవారు తిరుమలకు వేంచేసి శ్రీనివాసప్రభువుల వారిని దర్శించారట.

PC:youtube

అభిషేకజలం

అభిషేకజలం

ఆ సమయంలో ఎడతెరిపిలేని కుంభవృష్టిపడుతుండగా తిరుమల నంబి పాపవినాశనం నుండి అభిషేకజలం తెచ్చుటకు ఆటంకం ఏర్పడినది.అప్పుడు శ్రీస్వామి వారి అభిషేకానికి ఎలాంటి విఘ్నం కలగకుండా వుండటానికి శ్రీ మహాలక్ష్మిని ఇలా ప్రార్ధించారట.

PC:youtube

శ్రీ తీర్థజలం సర్వశ్రేష్టం

శ్రీ తీర్థజలం సర్వశ్రేష్టం

శ్రీనివాసుని అభిషేకానికి ఇతర తీర్ధముల కంటే నీవు వెలయింపచేసిన శ్రీ తీర్థజలం సర్వశ్రేష్టం. అందువలన ఈ జలాలు ఇక మీదట శ్రీవారి అభిషేకయోగ్యములై వుండుకాక సాక్షాత్తూ బంగారుబావి సుందరమైన భగవంతుని రూపమేనంటూ దానికి సుందరమైన స్వామికూపం అని నామకరణంచేసినారు.

PC:youtube

మూడు బావులు

మూడు బావులు

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు బావులున్నాయి. మొదటిది సంపంగి ప్రదక్షణలో రామానుజ కూటం,యామునై తురై ఎదురుగా ఉన్న బావి.రెండొవది పూల బావి. మూడోవది బంగారు బావి.తిరుమామణి మండపం ఎదురుగా కనిపించే బావి బంగారు బావి.

PC:youtube

బంగారు బావి

బంగారు బావి

శ్రీవారి దర్శనం చేసుకొనే బయట అడుగు పెట్టెచోట ఎదురుగా కనిపించే బావి ఇదే.ఈ బావికి బంగారు రేకుల తాపడం వల్ల బంగారు బావి అని విఖ్యాతి. స్వామివారి పూజలకు ,నైవేద్యములకు అవసరమైన నీరు అందించే బావి ఈ బావి.శ్రీదేవి భూదేవి సౌకర్యం నిమిత్తం ఈ బావిని నిర్మించినట్లు ప్రతీతి.

PC:youtube

తొండమాన్ చక్రవర్తి

తొండమాన్ చక్రవర్తి

ఈ బావిని రంగదాసు నిర్మించినట్లు పురాణగాధ అతడు పూర్వజన్మలో తొండమాన్ చక్రవర్తి ఈ బావి కింద విరజానది ప్రవహిస్తుందని పెద్దల విశ్వాసం.శ్రీ వెంకటచల ఇతిహాసాలలో బంగారు బావి ప్రసక్తి కనిపిస్తుంది.

PC:youtube

వకుళమాత

వకుళమాత

ఈ బావి నుండి నీరు తోడే పద్ధతి విజయనగర రాజుల కాలంలో హంపిలో నీరు తోడే పద్దతిని పోలివుందని చారిత్రుకులు బావిస్తున్నారు.శ్రీవారి అభిషేకానికి బంగారు బావి నీళ్లు ఉపయోగిస్తారు. వకుళమాత కొలువైన పోటు (వంటశాల) పక్కనే బంగారు బావి ఉంది.

PC:youtube

గర్భాలయంలోని మూలమూర్తి

గర్భాలయంలోని మూలమూర్తి

స్వామి దర్శనం చేసుకుని బంగారు వాకిలి వెలుపల వచ్చిన భక్తులకు ఎదురుగానే ఈ బంగారు బావి దర్శనమిస్తుంది. గర్భాలయంలోని మూలమూర్తికి ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేకానికి ఇందులోని జలాన్నే వాడుతారు.

PC:youtube

రాగి రేకులు

రాగి రేకులు

బావికి చుట్టూ భూ ఉపరితలానికి చెక్కడపు రాళ్లతో వర నిర్మించారు. దీనికి బంగారు తాపడం చేసిన రాగి రేకులు అమర్చడం వల్ల బంగారు బావిగా ప్రసిద్ధి పొందింది. దీనినే శ్రీ తీర్థం, సుందర తీర్థం, లక్ష్మి తీర్థం అని కూడా పిలుస్తుంటారు.

PC:youtube

పురాణాలు

పురాణాలు

వైకుంఠం నుంచి వేంకటాచలానికి వచ్చిన శ్రీమన్నారాయణునికి వంట కోసం మహా లక్ష్మి ఈ తీర్థాన్ని ఏర్పాటు చేశారని పురాణాలు చెబుతున్నాయి.

PC:youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

హైదరాబాద్ నుండి తిరుమలకు కారులో వెళ్ళినట్లయితే 10గంటల50నిలు పడుతుంది. విమానమార్గం ద్వారా 1గంట ప్రయాణం. రోడ్డుమార్గం ద్వారా కావలి, నెల్లూరు మీదుగా తిరుమల చేరుకోవచ్చును.

PC: google maps

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more