Search
  • Follow NativePlanet
Share
» »గుల్మార్గ్: జమ్ము అండ్ కాశ్మీర్ లో అదో కలల లోకం, భూలోక స్వర్గం..!!

గుల్మార్గ్: జమ్ము అండ్ కాశ్మీర్ లో అదో కలల లోకం, భూలోక స్వర్గం..!!

గుల్మార్గ్..జమ్ము అండ్ కాశ్మీర్ లో అదో కలల లోకం, భూలోక స్వర్గం. మంచు పర్వతాలు, పచ్చిక బయళ్లు, ఉద్యానవనాలు, సరస్సులు వంటి సహజ సుందర దృశ్యాలతో ఆకర్షించే అద్భుత ప్రదేశం. కశ్మీర్‌లో ఉన్న ఈ ప్రాంతం అందాలను ఎన్ని రకాలుగా చెప్పినా తనివితీరదు. అందుకే.. ప్రకృతి ప్రేమికులంతా ఒక్కసారైనా చూడాలనుకునే చోటిది. చూసేందుకు.. ఈ సీజనే సరైన సమయం.

గుల్మార్గ్‌ అంటే పూలదారి అని అర్థం. గుల్మార్గ్‌లో లభించే పువ్వుల వైవిధ్యం మనకు మరెక్కడా కనిపించదు. పూలరంగులలో, రూపాలలో మహాద్భుతం ఇక్కడ తాండవిస్తుంది. అందుకేనేమో ఇక్కడికి వచ్చిన సందర్శకులెవ్వరూ రంగురంగుల పువ్వులను సేకరించకుండా ఉండలేరు. జహంగీర్‌ చక్రవర్తి తన బహు భార్యలకు బహుమతులుగా పువ్వులను ఇచ్చేందుకు గుల్మార్గ్‌కి వచ్చా డట. ఒక్కొక్క భార్యకు ఒక ప్రత్యేక పువ్వును ఇచ్చేందుకు సేకరించగా, ఇంకా అనేక రకాల పూల జాతులు మిగిలిపోయాయట. అలా ఈ ప్రాంతానికి గుల్మార్గ్ అనే పేరు వచ్చింది.

కాశ్మీర్‌లోని అందమైన ప్రాంతాల్లో ఇదీ ఒకటి.

కాశ్మీర్‌లోని అందమైన ప్రాంతాల్లో ఇదీ ఒకటి.

శీతా కాలంలో మాత్రం ఈ ప్రాంతంలోని దారులన్నీ మంచుతో నిండి ఉంటాయి. ఇళ్లపైకప్పులపైకి పాకిన తీగలు పూలతో కనువిందు చేస్తాయి. ఆ చోటులలో కూడా మంచు తిష్టవేస్తుంది. ఆరుబయట, ఆపిల్‌ తోట అంతటా మంచే! అక్కడున్న వాళ్ల సంగతేమో కానీ, ఈ ముచ్చటను చూసేందుకు పర్యాటకులు గుల్మార్గ్‌ బాట పడతారు. కాశ్మీర్‌లోని అందమైన ప్రాంతాల్లో ఇదీ ఒకటి. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్‌లో ప్రతీ ఏడాది ఈ వింటర్ సీజన్లో పర్యాటకు తాకిడి ఎక్కువగా ఉంటుంది.

ఇక్కడ కేవలం సందర్శించాల్సిన ప్రదేశాలు మాత్రమే

ఇక్కడ కేవలం సందర్శించాల్సిన ప్రదేశాలు మాత్రమే

ఇక్కడ కేవలం సందర్శించాల్సిన ప్రదేశాలు మాత్రమే కాదు.. స్కేటింగ్‌, స్కీయింగ్‌ ఆటలు కూడా ఉంటాయి. జారుడు పలకలపై కూర్చుని దూసుకుపోయే స్లెడ్జింగ్‌ విన్యాసాలు పర్యాటకులకు క్షణం తీరిక లేకుండా చేస్తాయి.అంతే కాదు గుల్మార్గ్ లో చూడవల్సిన అద్భుతమైన ప్రదేశాలెన్నో ఉన్నాయి. అవి..

స్ట్రాబెర్రీ లోయలు:

స్ట్రాబెర్రీ లోయలు:

స్ట్రాబెర్రీ తోటలతో గుల్మార్గ్ లోయల్లో దాగున్న ఓ అద్భుతమైన ప్రదేశం. పండ్లు కోసే సమయం వేసవి సీజన్లో తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఇది. స్ట్రాబెర్రీ తోటల్లో షికారు చేయడానికి మరియు తాజా పండ్లను రుచి చూడటానికి తోట యజమానులు అనుమతిస్తుంటారు. అంతే కాదు వయస్సైన వారు ఇష్టంగా తిరుగాడవల్సిన ప్రదేశం కూడా. ఈ ప్రదేశం బాలీవుడ్ సినామాల్లో మీరు చూడవచ్చు.

గుల్మార్గ్ బయో స్పియర్ రిజర్వులు

గుల్మార్గ్ బయో స్పియర్ రిజర్వులు

గుల్మార్గ్ బయో స్పియర్ రిజర్వులు వాటి పచ్చదనానికి వన్య జీవులకు ప్రసిద్ధి. ఇవి సుమారు 180 చ. కి.మీ. లలో విస్తరించి సముద్ర మట్టానికి 2400 నుండి 4300 మీటర్ల ఎత్తున కలవు. ఈ రక్షిత అడవి అరుదైన పక్షులకు నిలయం. పక్షుల పట్ల ఆసక్తి కలవారు ఇక్కడ వివిధ రకాల పక్షులను చూడవచ్చు. ఈ రక్షిత అడవిలో పక్షులే కాక చిన్న మరియు మధ్య తరహా జంతువులు లేడి, దుప్పి, మేక, చిరుత పులి వంటి వాటిని కూడా చూడవచ్చు.

 గుల్మార్గ్ గోల్ఫ్ కోర్స్

గుల్మార్గ్ గోల్ఫ్ కోర్స్

గుల్మార్గ్ గోల్ఫ్ కోర్స్ ను 1904 లో బ్రిటిష్ పాలకులు నిర్మించారు. మొదటి టోర్నమెంట్ ఈ ప్రాంతం లో 1922 లో నిర్వహించారు. బ్రిటిష్ పాలకులు క్లబ్ గ్రౌండ్ లోని పచ్చటి ప్రదేశం లో గోల్ఫ్ ఆట ఆడే వారు. సముద్ర మట్టానికి సుమారు 2650 మీటర్ల ఎత్తున కల ఈ ప్రదేశం ప్రపంచం లోనే అత్యధిక ఎత్తైన గోల్ఫ్ కోర్స్ గా చెపుతారు

మహారాణి టెంపుల్:

మహారాణి టెంపుల్:

మహారాణి టెంపుల్ నే రాణి టెంపుల్ అని కూడా అంటారు. ఇది గుల్మార్గ్ హిల్ స్టేషన్ మధ్యలో కలదు. ఈ టెంపుల్ ను 1915 లో కాశ్మీర్ లో రాజ పాలన చివరి లోని మహారాజ హరి సింగ్ భార్య మోహిని బై సిసోదియా నిర్మించారు. ఈ టెంపుల్ ను మొహినేశ్వర్ శివాలయం గా పునరుద్ధరించి గుల్మార్గ్ లోని అన్ని మూలల నుండి కనపడేలా చేసారు. ఈ టెంపుల్ లో శివ , మాత పార్వతి వుంటారు. అన్ని సీజన్ల లోను భక్తులు వస్తారు. ఇక్కడ కల ప్రశాంత వాతావరణం లో భక్తులు ధ్యానాన్ని కూడా చేస్తారు.

ఔటర్ సర్కిల్ వాక్

ఔటర్ సర్కిల్ వాక్

ఔటర్ సర్కిల్ వాక్ అంటే కాశ్మీర్ వాలీ చుట్టూ సుమారు 11 కి. మీ.ల నడక. గుల్మార్గ్ వెళ్ళే వారికి దీనిని తప్పక సిఫార్సు చేయాలి. ఈ నడకలో లోయ లోని అందమైన పైన్ చెట్లు, పచ్చటి ప్రదేశాలు, సుందరమైన దృశ్యాలు చూడవచ్చు.

కొంగడోర్:

కొంగడోర్:

కాంగ్డోర్ లేదా కాంగ్డోరి అనేది గుల్మార్గ్ కు సమీపంలో ఉన్న మరో అద్భుతమైన వాలీ. స్కింగ్ డెస్టినేషన్ కు ప్రసిద్ది చెందినది.

స్కింగ్ డెస్టినేషన్ :

స్కింగ్ డెస్టినేషన్ :

ఆసియాలోనే 7వ ఉత్తమ స్కింగ్ డెస్టినేషన్ గుల్మార్గ్ . అడ్వెంచర్ స్కైయర్ లవర్స్ కు ఈ ప్రదేశం అంటే చాలా ఇష్టం.

ఫోటోగ్రఫీ ప్యారడైజ్ :

ఫోటోగ్రఫీ ప్యారడైజ్ :

గుల్మార్గ్ ఆకుపచ్చ పచ్చికభూములు మరియు పువ్వులతో నిండి ఉంటుంది; ఇది ఫోటోగ్రాఫర్స్ కు స్వర్గం వంటిది.

 స్నోమాన్

స్నోమాన్

గుల్మార్గ్ లో మంచు: మంచుతో ఏమైనా చేయవచ్చు అనడానికి ఇది ఒక నిదర్శనం. స్నోమాన్ భలే ఉంది కాదా..!

గుల్మార్గ్ పిర్ పంజాల్ రేంజ్

గుల్మార్గ్ పిర్ పంజాల్ రేంజ్

గుల్మార్గ్ పిర్ పంజాల్ రేంజ్ లో ఉంది, ఇది హిమాలయ శ్రేణిల్లో ఒక్కటి, ఇది హిమాచల్ ప్రదేశ్ అంతటా జమ్మూ కాశ్మీర్ వరకు విస్తరించి ఉంది.

ఆఫర్వాట్‌ పర్వత శిఖరం

ఆఫర్వాట్‌ పర్వత శిఖరం

గుల్మార్గ్‌ నుంచి ఆఫర్వాట్‌ పర్వత శిఖరంపైకి కేబుల్‌ కారులో చేరుకోవచ్చు. మంచుతెరలను తోసుకుంటూ అయిదు కిలోమీటర్లు సాగే కేబుల్‌ కారు ప్రయాణం హిమాలయాల సౌందర్యం కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది.

వింటర్‌స్పోర్ట్స్‌ స్పాట్‌

వింటర్‌స్పోర్ట్స్‌ స్పాట్‌

హాలిడే స్పాట్‌గా ఖ్యాతి గాంచిన ఈ గుల్మార్గ్‌ రిసార్ట్స్‌... ఎప్పుడు చూసినా యాత్రికులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఇక్కడి కేబుల్‌ కార్‌ విహారం చక్కటి అనుభూతినిస్తుంది. ప్రపంచం లోనే అత్యంత ఎత్తులో ఉండే గోల్ఫ్‌ క్రీడా మైదా నం ఇక్కడే ఉండటం విశేషం. అలాగే స్కైయింగ్‌ క్రీడకు గుల్మార్గ్‌ని ప్రత్యేక విడిదిగా చెప్పుకోవచ్చు. చలికాలపు ఆటల విడిదిగా కూడా గుల్మార్గ్‌కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. Photo Courtesy : Archit Ratan

గుల్‌మార్గ్ కి ఎలా చేరుకోవచ్చు

గుల్‌మార్గ్ కి ఎలా చేరుకోవచ్చు

విమాన ప్రయాణం గుల్మార్గ్ కు శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ సమీపం. సుమారు 56 కి. మీ. ల దూరంలో వుంటుంది. ఎయిర్ పోర్ట్ నుండి జీపులు, టాక్సీలలో చేరవచ్చు. శ్రీనగర్ నుండి దేశం లోని ముంబై పూనే చండీగర్ వంటి అనేక ప్రధాన నగరాలకు విమానాలు కలవు. రైలు ప్రయాణం గుల్మార్గ్ కు జమ్మూ తావి రైలు స్టేషన్ సమీపం. ఇండియా లోని నార్త్ నగరాల వారు ట్రైన్ లో నేరుగా జమ్మూ చేరవచ్చు. జమ్మూ రైలు స్టేషన్ ఇండియాలోని ముంబై, పూణే చండీగర్ వంటి పట్టణాలకు చక్కగా కలుపబడి వుంది. రోడ్ ప్రయాణం గుల్మార్గ్ పట్టణం జమ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రధాన పట్టణాలకు రోడ్ మార్గం తో కలుపబడి వుంది. పర్యాటకులు ప్రభుత్వ , ప్రైవేటు బస్సు లను ఉపయోగించవచ్చు, స్వంత కార్ల పై ప్రయాణించాలనుకునే వారు శ్రీనగర్ నుండి చేరవచ్చు.

Photo Courtesy: williewonker

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X