Search
  • Follow NativePlanet
Share
» »కాశీ సందర్శనం కంటే ఇక్కడ గురివిందంత పుణ్యం ఎక్కువ...నిదర్శనం ఇదిగో

కాశీ సందర్శనం కంటే ఇక్కడ గురివిందంత పుణ్యం ఎక్కువ...నిదర్శనం ఇదిగో

కర్నాటకలోని మైసూరుకు దగ్గర్లో ఉన్న టీ. నరసీపుర గుంజ నరసింహస్వామి దేవాలయం గురించిన కథనం.

By Kishore

జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్లి అక్కడి విశ్వేశ్వరుడిని, అన్నపూర్ణ దేవిని సందర్శించుకోవాలని ప్రతి హిందువూ కోరుకొంటాడు. ప్రళయ కాలంలో కూడా చెక్కుచెదరని ఈ కాశీ పుణ్యక్షేత్రం దర్శనం వల్ల అప్పటి వరకూ తాము చేసిన పాపాలన్నీ పోయి పుణ్యం లభిస్తుందని హిందువులు భావిస్తూ ఉంటారు. అందుకోసమే ఎంత కష్టసాధ్యమైనా కూడా ఈ పుణ్యక్షేత్రానికి వెళ్లి అక్కడి దేవదేవుడిని సందర్శించుకొంటూ ఉంటారు.

అయితే కాశీ పుణ్యక్షేత్రం సందర్శనం వల్ల ఎంత పుణ్యం లభిస్తుందో అంతకంటే ఎక్కువ పుణ్యం ఈ క్షేత్ర సందర్శనం వల్ల కలుగుతుంది. అయితే శైవ క్షేత్రం కాదు. కేశవ, మాధవ క్షేత్రం అంటే ఇక్కడ హరి, హరులు ఇద్దరూ కొలువై ఉన్నారు.

విష్ణువు లక్ష్మీ నరసింహుడి రూపంలో భక్తుల చేత నీరాజనాలు అందుకొంటూ ఉండగా శివుడు లింగ రూపంలో పూజలు అందుకొంటూ ఉన్నాడు. అదే కర్నాటకలోని టీ. నరసీపుర. అంటే తిరుమ కూడల నరసీపుర అని అర్థం. ఇక్కడ కపిల, కావేరి, స్ఫటిక సరోవరం సంగమిస్తాయి. అందువల్ల దీనిని సంగమ క్షేత్రం అని కూడా అంటారు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ క్షేత్రం విశేషాలు మీ కోసం...

శుచిగా, శుభ్రంగా లేకపోతే ఈ క్షేత్రంలో తేనెటీగలు మీకు శత్రువులుశుచిగా, శుభ్రంగా లేకపోతే ఈ క్షేత్రంలో తేనెటీగలు మీకు శత్రువులు

చర్మవాధులను దూరం చేసి...సంతాన ప్రాప్తిని కలిగించే 'ఆది'రంగడుచర్మవాధులను దూరం చేసి...సంతాన ప్రాప్తిని కలిగించే 'ఆది'రంగడు

ఊటిలో మీరు ఈ ప్రాంతాలను ఖచ్చితంగా చూసి ఉండరుఊటిలో మీరు ఈ ప్రాంతాలను ఖచ్చితంగా చూసి ఉండరు

1.చాకలికి దొరికాడు

1.చాకలికి దొరికాడు

P.C: You Tube

ప్రస్తుతం ఆలయానికి ఎదురుగా ఉన్న కపిల నదిలో ప్రతి రోజూ ఒక చాకలి బట్టలు ఉతికే వాడు. ఒకరోజు ఆయన కలలో విష్ణువు కనిపించి నీవు బట్టలు ఉతికే రాయి కింద తాను కొలువై ఉన్నానని చెప్పాడు. అంతే కాకుండా ఆ రాయిని బయటికి తీసి దేవాలయం కూడా నిర్మించమని ఆదేశించాడు. అయితే చాకలివాడు తాను పేదవాడినని తమకు ఆలయం ఎలా నిర్మింపజేయాలని అంతటి ఆర్థిక శక్తి తనకు లేదని స్వామి వారికి తన అసక్తిని తెలియజేశాడు.

2.బంగారు నాణ్యాలు

2.బంగారు నాణ్యాలు

P.C: You Tube

దీంతో ఆ రాతి విగ్రహం కిందే బంగారు నాణ్యాలు ఉన్నాయని వాటిని వినియోగించి ఆలయం నిర్మించాలని స్వామి వారు సూచించారు. ఇందుకు సమ్మతించిన చాకలివాడు ఆలయం నిర్మాణం పూరైన తర్వాత తాను కాశీకి వెలుతానని కూడా దేవుడికి చెబుతాడు. అయితే స్వామివారు దేవాలయంలో తన విగ్రహం ప్రతిష్టించిన తర్వాత దానికి పూజలు చేస్తే కాశీ పుణ్యక్షేత్రం దర్శించిన దానికంటే ఒక గురివింద గింజంత ఎక్కువ పుణ్యమే వస్తుందని చెబుతాడు.

3. ఒక గురువిందతోపాటు ఆ చెట్టు ఆకులు కూడా

3. ఒక గురువిందతోపాటు ఆ చెట్టు ఆకులు కూడా

P.C: You Tube

అందుకు తగ్గట్టుగానే ఇక్కడ నరసింహస్వామి చేతిలో ఒక గురువిందతోపాటు ఆ చెట్టు ఆకులను కూడా మనం చూడవచ్చు. ఇక చాకలివాడు కూడా తన కాశీ ప్రయాణాన్ని మానుకొని స్వామిని సేవిస్తూ ఇక్కడే ఉండిపోయాడని స్థలపురాణం చెబుతుంది. అప్పటి నుంచి ఈ నరసింహుడిని గులగుంజి (గురువింద గింజను కన్నడలో గులగంజి అని అంటారు) నరసింహస్వామి అనే వారు కాలక్రమంలో ఆ పేరు గుంజి నరసింహస్వామిగా మారిపోయింది.

4. శైవ క్షేత్రం కూడా

4. శైవ క్షేత్రం కూడా

P.C: You Tube

ఈ నదికి ఆవల వైపున అగస్త్యుడు ప్రతిష్టించిన శివలింగాన్ని మనం చూడవచ్చు. ఇందుకు సంబంధించి స్థానికంగా ఒక కథనం ప్రచారంలో ఉంది. ఒకసారి అగస్త్య మహాముని దేశ సంచారం చేస్తూ ఇక్కడికి వస్తాడు. ఇక్కడి అందాలకు పరవశించి చాలా కాలం తపస్సు చేసుకొంటూ ఉండిపోతాడు. అటు పై ఈ ప్రాంతాన్ని వదిలి వేరేచోటికి వెళ్లే సమయంలో ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించాలని భావిస్తాడు.

5.శివలింగం పై భాగాన్ని

5.శివలింగం పై భాగాన్ని

P.C: You Tube

ఇందుకు హనుమంతుడి సహాయం కోరుతాడు. కాశీకి వెళ్లి ఒక శివలింగాన్ని తీసుకుని రావాల్సిందిగా కోరుతాడు. శివలింగం తీసుకురావడానికి వెళ్లిన హనుమంతుడు సమయం మించిపోతున్నా తిరిగిరాడు. దీంతో అగస్తుడు అప్పటికప్పుడు నదీ తీరంలోని ఇసుకతో ఒక లింగాన్ని రూపొందించి దానిని ప్రతిష్టిస్తాడు. అయితే ఈ కార్యక్రమం ముగిసిన కొద్ది సేపటి తర్వాత తిరిగి వచ్చిన హనుమంతుడు కోపంతో అగస్తుడు ప్రతిష్టించిన శివలింగం పై భాగాన్ని నరికివేస్తాడు.

6. హనుమాన్ లింగంగా

6. హనుమాన్ లింగంగా

P.C: You Tube

ఆ నరికిన పై భాగం నుంచి ఇప్పటికీ నీరు ఉబికి వస్తూ ఉంటుంది. దీనిని ప్రజలకు తీర్థంగా అందజేస్తారు. అటు పై హనుమంతుడిని శాంతిపజేసి ఆయన తెచ్చిన శివలింగాన్ని కూడా ఇక్కడ ప్రతిష్టింప జేస్తారు. కాగా, అగస్తుడు ప్రతిష్టించిన లింగాన్ని అగస్తేశ్వరుడిగా భక్తులు పూజిస్తున్నారు. ఇక హనుమంతుడు తెచ్చిన లింగాన్ని హనుమాన్ లింగంగా పూజిస్తున్నారు.

7. దాదాపు 1500 ఏళ్ల క్రితం నిర్మించింది

7. దాదాపు 1500 ఏళ్ల క్రితం నిర్మించింది

P.C: You Tube

దాదాపు 1500 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో లోపలి ప్రాకారం చుట్టూ అనేక శివలింగాలు ప్రతిష్టించబడ్డాయి. ఇక ఇక్కడ మూడు ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళకు దేశం నలుమూలల నుంచి సాధువులు వస్తారు. ఇందులో అఘోరాలు కూడా ఉండటం విశేషం.

8. ఎలా చేరుకోవాలి

8. ఎలా చేరుకోవాలి

P.C: You Tube

మైసూరుకు దాదాపు 29 కిలోమీటర్ల దూరంలోని టీ. నరసీపురలో ఈ క్షేత్రం ఉంది. బెంగళూరు నుంచి 130 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. బెంగళూరు, మైసూరు నుంచి నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X