• Follow NativePlanet
Share
» »అ (హో) బిలంలో ‘అనంత’సంపద ఉందా? రాబోయే తరం వారికి అది సొంతమా?

అ (హో) బిలంలో ‘అనంత’సంపద ఉందా? రాబోయే తరం వారికి అది సొంతమా?

Written By: Kishore

ఇక్కడ దయ్యాలు మీకు 'A' హెల్ప్ అయినా చేస్తాయి

తెలుగు నేలలో కూడా అనంత పద్మనాభ స్వామి

ఆ నిధి కోసమేనా ఇక్కడ అన్వేషణ? మీకు ప్రవేశం లేదు

అహోబిలం భారత దేశంలోని 108 వైష్ణవాలయాల్లో అత్యంత విశిష్టమైనది. నరసింహుడు స్వయంగా ఉద్భవించిన ఈ అహోబిలం క్షేతం  ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి బిలంలో కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయంలో దాగున్న నిధి నిక్షేపాల కంటే ఎక్కువ మొత్తంలో సంపద ఉందని చెబుతారు. ఇందుకు కారణం లేకపోలేదు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు ఇక్కడకు స్వామివారికి అనేక కానుకలుసమర్పించినట్లు తెలుస్తోంది. అటు పై అనేకమంది రాజులు ఈ మఠం అభివృద్ధి కోసం అపారమైన నిధులను అందజేశారు. అయితే అవి తురుష్కుల బారిన పడకుండా ఒక బిలంలో దాచారని సమాచారం.అక్కడి తాళపత్ర గ్రంథాల్లో ఆలయ గోడల పై శాసనాల్లో ఈ విషయంఉంది. అదే విధంగా ఆ సంపద నా తర్వాత 49 తరానికి చెందుతుందని రాసి ఉంది. అయితే ఎవరు రాశారు, వారి తర్వాత 49 ఏది అన్న విషయం నిగూడ రహస్యం. ఈ నేపథ్యంలో ఆ క్షేత్రం వివరాలతో పాటు ఆ సంపద వివరాలు మీ కోసం

1. కర్నూలు జిల్లాలో

1. కర్నూలు జిల్లాలో

Image Source:

అహోబిలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండంలో ఉంది. ఇది ఆళ్లగడ్డ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో నంద్యాల నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం నల్లమల అడవుల్లో సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉంటుంది.

2. అందువల్లే ఆ పేరు

2. అందువల్లే ఆ పేరు

Image Source:

హిరణ్య కసిపుడిని సంహరించడానికి నరసింహుడు ఉద్భవించిన ప్రదేశమే అహోబిలం. దీనిని అహోబలం
అని కూడా అంటారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందని
చెబుతారు. ఈ క్షేత్రాన్నిభక్తులు ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అనే పేరుతో పిలుస్తారు.

3.గుహాంతర్భాగంలో

3.గుహాంతర్భాగంలో

Image Source:

ఎగువ హోబిలంలో నారసింహుడు గుహలో స్వయంభువుగా వెలిశాడు. ఇక్కడే స్వామి వారికి ప్రధానంగా పూజాధిక
కార్యాలు నిర్వహించబడుతాయి. ఇక్కడ ఉన్న భవనాశిని తీర్థంలో తలనీలాలు సమర్పించి భక్తులు తమ మొక్కులను
చెల్లించుకొంటారు.

4. నవ నారసింహ క్షేత్రం

4. నవ నారసింహ క్షేత్రం

Image Source:

అహోబిలంలో నరసింహుడు తొమ్మిది విభిన్న రూపాల్లో మనకు దర్శనమిస్తాడు. అందువల్లే ఈ క్షేత్రాన్ని నవ నరసింహ
క్షేత్రం అని కూడా అంటారు. ఆ తొమ్మది రూపాలు వరుసగా జ్వాలా నరసింహ, బిల నరసింహ, మాలోల నరసింహ,
క్రోద నరసింహ, కారంజ నరసింహ, బార్గవ నరసింహ, యోగ నరసింహ, ఛత్రవట నరసింహ, పావన నరసింహ.

5. జ్వాల నరసింహ

5. జ్వాల నరసింహ

Image Source:

ఈ తొమ్మిది రూపాల్లో జ్వాల నరసింహ రూపం అతి ముఖ్యమైనది. ఈ రూపంలోని ఆలయం ఎగువ అహోబిలంలోని ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో అచలచయ మేరు అనే గుట్ట పై ఉంది. ఈ ప్రాంతాన్ని హిరణ్యకశిపుడి రాజప్రసాదంగా చెబుతారు.

6.మూడు విగ్రహాలు

6.మూడు విగ్రహాలు

Image Source:

ఇక్కడే నరసింహుడు స్తంభం నుంచి బయటికి వచ్చి క్రోధాగ్ని జ్వాలలతో ఊగిపోతు హిరణ్యకశిపుడిని సంహరించినట్లు
పురాణ కథనం. ఇక ఇక్కడ ఉన్న ఆలయంలో అష్టభుజ, చతుర్భుజ నరసింహ విగ్రహాలతో పాటు హిరణ్యకశిపుడిని వెంటాడుతున్నట్లు ఉన్న
మూడు విగ్రహాలను మనం చూడవచ్చు..

7. వేంకటేశ్వరుడు ప్రతిష్టించిన విగ్రహం

7. వేంకటేశ్వరుడు ప్రతిష్టించిన విగ్రహం

Image Source:

దిగువ అహోబిలంలో సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు దిగువ అహోబిలంలోని లక్ష్మీ నరసింహుడి విగ్రహాన్నిప్రతిష్టించినట్లు చెబుతారు. తన వివాహానికి ముందు ఈ క్షేత్రానికి వచ్చిన స్వామి వారు ఎగువ అహోబిలంలోఆ నరసింహుడిని దర్శించుకున్న తర్వాత దిగువ అహోబిలంలో స్వామి వారిని ప్రతిష్టించినట్లు స్థల పురాణం చెబుతుంది.

8.108 వైష్ణవాలయాల్లో ఒకటి

8.108 వైష్ణవాలయాల్లో ఒకటి

Image Source:

ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ దేవాలయాల్లో అహోబిలం కూడా ఒకటి. ఈ దేవాలయాన్నిఆరో శతాబ్డంలో నిర్మించినట్లు చారిత్రాత్మక ఆధారాలను అనుసరించి తెలుస్తోంది.

9.అనేక మంది

9.అనేక మంది

Image Source:

అప్పటి చక్రవర్తులైన ఆరవ విక్రమాదిత్యుడు, పశ్చిమ చాళుక్యులు, ప్రతాప రుద్రుడు తదితరులు స్వామివారిని దర్శించుకుని లక్షల కోట్ల విలువచేసే బంగారు వెండి ఆభరణాలను సమర్పించారు. ఈ వివరాలన్నీదేవాలయంలోని రాతి శాసనాల్లో ఉన్నాయి.

10. వాటితోనే అలంకరించేవారు

10. వాటితోనే అలంకరించేవారు

Image Source:

వాటిని స్వామివారికి అలంకరించేవారు. 13వ శాతాబ్డంలో ఈ విషయం తెలిసి అప్పటి ముస్లీం పాలకులు దేవాలయంలోని
సంపదను స్వాధీనం చేసుకోవడానికి సైనికులతో రావడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

11. సొత్తుతో సహా

11. సొత్తుతో సహా

Image Source:

ఈ విషయం తెలిసిన అప్పటి 6వ పీఠాధిపతి ఆ సంపదనంతటినీ కొండ పైన ఉన్న బిలంలోకి వేసి తాను కూడా
అందులోకి వెళ్లి జీవ సమాధి పొందాడు. ఆ బిలం నరసింహహస్వామి విగ్రహానికి ఆరు అడుగుల దూరంలో ఉంది. దీనిని మనం కూడా చూడవచ్చు.ఈ విషయాలననీ అక్కడ ఉన్న తాళపత్ర గ్రంధాల్లో ఉన్నాయి.

12. ప్రయత్నించారు కాని

12. ప్రయత్నించారు కాని

Image Source:

చాలా కాలం క్రితం కొంతమంది ఇంజనీర్లు ఆ బిలం పైన ఉన్న రాతి మూతకు రంధ్రాలు చేసే ప్రయత్నం చేశారు. అయితే అలా ప్రయత్నించిన వారు అనుకోని విపత్తులు ఎదురై మరణించారు. ఈ విషయం తెలిసిన తర్వాత మరెవ్వరూ ఈ క్షేత్రంలోని సంపదను వెలికి తీసే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది.

13.మరిన్ని క్షేత్రాల్లో

13.మరిన్ని క్షేత్రాల్లో

Image Source:

ఈ క్షేత్రంలో దొరికిన తాళపత్ర గ్రంధాల్లో అహోబిలంతో పాటు ఈ అడవుల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, తిరుపతిల్లో ఎక్కడెక్కడ ఎంత విలువ చేసే నిధి ఉందో రాయబడి ఉందని చెబుతారు. అయితే ఆ భాషను అర్థం చేసుకునే వారు ప్రస్తుతం ఎవరూ లేరని తెలుస్తోంది. ఆ భాష తెలిస్తే సదరు నిధిని వెలికి తీసి ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం సబబని ప్రజలు భావిస్తున్నారు.

14. ఉగ్ర స్తంభం

14. ఉగ్ర స్తంభం

Image Source:

అహోబిలం కేవలం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా ట్రెక్కింగ్ స్పాట్ గా కూడా ఇటీవల ప్రాచుర్యం పొందుతోంది. ఎగువ అహోబిలానికి సుమారు 8 కిలోమీర్ల దూరంలో ఉగ్ర స్తంభం అని పిలువ బడే ఒక గుట్ట ఉంది.

15. స్వామి పాదాలు

15. స్వామి పాదాలు

Image Source:

దూరం నుంచి చూస్తే ఈ గుట్ట ఒక పొడవైన రాతి స్తంభం మాదిరి కనిపిస్తుంది. ఇక్కడే అంతే కాకుండా ఈ గుట్ట రెండుగా చీలి ఉంటుంది.ఇక్కడే స్వామి వారు ఉద్భవించినట్లు చెబుతారు. ఈ గుట్ట పై నరసింహస్వామి పాదాలు కూడా ఉంటాయి. జ్వాలా నరసింహ, భవనాశిని ని దాటుకుంటూ ఇక్కడకు చేరుకోవాలి

17. ప్రహ్లాద బడి

17. ప్రహ్లాద బడి

Image Source:

ఇది చిన్న గుహ. ఇక్కడే ప్రహ్లాదుడు హరనామ స్మరణ చేశాడని చెబుతారు. ఈ గుహలోకి ఒకసారి ఐదు మంది మాత్రమే వెళ్లడానికి వీలవుతుంది. వర్షాకాలంలో గుహకు దగ్గరగా ఉన్న గుట్ట పై ఏర్పడే చిన్న జలపాతాలు చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక గుహ రాతి పై కొన్ని అక్షరాలు కూడా కనిపిస్తాయి. కాని భాష అర్థం కాదు.

18.మఠం

18.మఠం

Image Source:

ఇక్కడ ఉన్న అహోబిలం మఠం కూడా చూడాల్సిందే. ఇది చాలా ప్రసిద్ధి చెందిన మఠం. వైష్ణవ మత వ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ ఉన్నటు వంటి చిన్న లక్ష్మీ నరసింహ దేవాలయం చూడ ముచ్చటగా ఉంటుంది.

19. ఎలా వెళ్లాలి

19. ఎలా వెళ్లాలి

Image Source:

తిరుపతి నుంచి అహోబిలానికి చాగలమర్రి ముత్యాలపాడు, బాచేపల్లి మీదుగా రోడ్డు మార్గంలో అహోబిలం చేరుకోవచ్చు..
అదే విధంగా నంద్యాలు, కర్నూలు నుంచి ఇక్కడకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. అహోబిలానికి దగ్గర్లో నంద్యాల్లో రైల్వేస్టేషన్ ఉంది.అక్కడ నుంచి ప్రభుత్వ బస్సు సర్వీసులతో పాటు ట్యాక్సీల్లో మనం అహోబిలం చేరుకోవచ్చు..

20. వసతి

20. వసతి

Image Source:

అహోబిలంలో వసతి సౌకర్యాలు కొంచెంత తక్కువగానే ఉంటాయి. అహోబిలం దర్శనం తర్వాత దగ్గర్లోని ఆళ్లగడ్డ, లేదా నంద్యాలలో వసతి ఏర్పాటు చేసుకోవడం మంచిది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి