Search
  • Follow NativePlanet
Share
» »ఏపీ లో అంతుపట్టని ఆలయ రహస్యం !!

ఏపీ లో అంతుపట్టని ఆలయ రహస్యం !!

By Venkatakarunasri

గుంటూరు దక్షిణ భారత దేశంలో గల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక ప్రధాన నగరం. ఇది బంగాళాఖాతం సముద్రానికి సుమారుగా 60 కి. మీ. దూరంలో ఉన్నది. గుంటూరు ప్రాచీనమైన చరిత్రతో వర్ధిల్లుతుంది. కళా రంగంలోను, రాజకీయ రంగంలోను ఈ జిల్లా ప్రస్తుతం ఒక కేంద్రంగా మారిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఎంపీకకాబడ్డ అమరావతి ఈ జిల్లాలోనే కలదు. రాష్ట్రం లో అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటిగా గుర్తించబడిన ఈ నగరం లో ఎన్నో విద్యాసంస్థలు అలాగే పరిపాలనా సంస్థలు ఉన్నాయి. గుంటూరు ప్రముఖ విద్యా కేంద్రము మరియు వ్యాపార కేంద్రము. పత్తి, నూనె, ధాన్యం మిల్లులే కాక పొగాకును శుద్ధి చేసే బారనులు పట్టణము చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వర్జీనియా పొగాకుకు గుంటూరు ముఖ్య కేంద్రం. భారత పొగాకు నియంత్రణ బోర్డు కూడ గుంటూరులో కలదు. గుంటూరు నగరము లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉన్నది. ఇక ఇక్కడున్న కొన్ని ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలు మరియు దేవాలయాల విషయానికొస్తే ...

ఇడ్లీ - కారం

ఇడ్లీ - కారం

గుంటూరు అంటేనే ఠక్కున గుర్తొచ్చేది మిర్చి. ఇక్కడ ఇడ్లీలకు కారం తగిలిచ్చి తింటారు. మనలాగా బుడ్డల చట్నీ, పప్పుల చట్నీ అంటించుకొని తినరు . ఇక నాన్ వెజ్ ప్రియులకైతే చెప్పనవసరం లేదు ఎందుకంటే ఎందుకంటే ఉత్త ఇడ్లీకే కారం దంచి కొడుతుంటే ఇంక నాన్ వెజ్ గురించి మాట్లాడటం అనవసరం. అందుకే మీరు కారం తక్కువ తినేటట్లయితే ముందుగానే జాగ్రత్త పడాలి.

Photo Courtesy: guntur.com

కొండవీడు ఫోర్ట్

కొండవీడు ఫోర్ట్

గుంటూరు నగర గొప్ప చారిత్ర లో భాగం ఈ కొండవీడు ఫోర్ట్. నగరనికి 12 మైళ్ళ దూరం లోని శివార్లలో ఉన్న ఈ ప్రదేశానికి చక్కటి రోడ్డు మార్గాలు ఉన్నాయి. 14 వ శతాబ్దం లో రెడ్డి రాజుల పాలనలో ఈ చారిత్రిక కట్టడాన్ని నిర్మించారు. ఈ ఫోర్ట్ లో 21 నిర్మాణాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలు చాలా శాతం శిధిలం అయినప్పతికి ఈ కోట రహస్యాల గురించి చెప్పకనే చెపుతాయి. ఈ ఫోర్ట్ సుందర ప్రదేశ అందాలను చూసి ఆనందించటానికి చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. అంతే కాక ఈ ప్రదేశం ట్రెక్కింగ్ ఇంకా హైకింగ్ కి అనువుగా ఉంటుంది. గోపినాథ టెంపుల్ మరియు కతులబవే టెంపుల్ ఈ ఫోర్ట్ కి చాల ఈ దగ్గరగా ఉన్న దేవాలయాలు. ఈ కోట నివాస సౌధాలు ఇంకా ఇక్కడి పెద్ద హాలు కుడా ఈ ప్రదేశ చరిత్రకి సాక్షాలు గా అనిపిస్తాయి.

Photo Courtesy: Gireesh Reddy / guntur.co.in

కోటప్ప కొండ

కోటప్ప కొండ

కోటప్పకొండ.. దాదాపు ఈ పేరు చాలామందికి సుపరిచితం. గుంటూరు జిల్లా.. నరసారావుపేట, చిలకలూరిపేట పట్టణాలకు అతి సమీపంలో నైరుతి దిక్కున ఉన్నది కోటప్పకొండ. నరసరావుపెట కి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశానికి రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. ఈ క్షేత్రం మొదటి కొండపై ముసలి కోటయ్య గుడి ఉంది. ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉంది. రెండవది.. త్రికోటేశ్వరస్వామివారి దేవాలయము కలది. ఇక్కడ ఎర్రగా ఉండే కోతులు ఒక ప్రత్యేకత. గుడి పరిసరాలలో భక్తులు ఇచ్చే ప్రసాదాలను తీసుకొంటూ ఒక్కోసారి లాక్కుంటూ తిరుగుతూ సండడి చేస్తాయి. ఇక్కడ ఒక పెద్దపుట్ట, నవగ్రహాలయం, ధ్యాన మందిరం, దేవాలయ వెనుక బాగంలో రెస్ట్‌ రూం ఉన్నాయి. ఇక మూడవ భాగమైన కొండ క్రింద బొచ్చు కోటయ్యగారి మందిరం, కళ్యాణ కట్ట, సిద్ధి వినాయక మందిరాలున్నాయి. దక్షిణ కాశి లేదా కాశి అఫ్ సౌత్ గా పిలవబడే గుత్తికొండ పట్టణం ఈ కోటప్పకొండ కి చాల దగ్గరలో ఉన్నది. కోటప్పకొండకు దగ్గరలో ఉన్న నరసరావుపేట పాత బస్‌స్టాండ్‌, కొత్త బస్‌ స్టాండ్‌ల నుండి ప్రతి అరగంటకు ఇక్కడకు బస్సు సౌకర్యం ఉంది. ఇవేకాక జీపులు, ఆటోలు లాంటి ప్రైవేట్‌ వాహనాలు సైతం.. ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.

Photo Courtesy: guntur.co.in / T.sujatha

ప్రకాశం బారేజ్

ప్రకాశం బారేజ్

కృష్ణా నది పైన నిర్మించబడిన బ్రిడ్జి ఈ ప్రకాశం బారేజ్. 1223.5 మీటర్ల పొడవున్న ఈ నిర్మాణం గుంటూరు మరియు కృష్ణా జిల్లాలను కలపాలన్న ముఖ్య ఉద్దేశం తో జరిగింది. ఈ బారేజ్ చిన్న చెరువు పైన రోడ్ బ్రిడ్జి గా కూడా ఉపయోగపడుతుంది.ఈ బారేజ్ నుండి వచ్చే మూడు కాలువల వాళ్ళ విజయవాడ నగరం వెనిస్ నగరాన్ని తలపిస్తుంది. గుంటూరు, విజయవాడ అలాగే పరిసర ప్రాంతాల రైతుల పొలాలకి ప్రధాన నీటి పారుదల వనరు గా ఈ ప్రకాశం బారేజ్ ని పేర్కొనవచ్చు. ఈ బారేజ్ నిర్మాణం వల్ల ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏర్పడిన అందమైన సరస్సులు ఎంతో మంది పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తున్నాయి.

Photo Courtesy: Suresh Kumar

మంగళగిరి రహస్యం మీకు తెలుసా??

మంగళగిరి రహస్యం మీకు తెలుసా??

ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న గుంటూరు జిల్లాలో ఉన్న ఈ మంగళగిరి ఒక చిన్న గ్రామం. ఈ ప్రాంతం గుంటూరు అలాగే విజయవాడ ప్రాంతాల కి ఒక ప్రధాన పర్యాటక మజిలీ. 'మంగళగిరి' అంటే అర్ధం పవిత్రమైన కొండ. నూలు వస్త్రాలకి అలాగే ఎన్నో ఆలయాలకి ఈ మంగళగిరి ప్రాంతం ప్రసిద్ది. ప్రఖ్యాతమైన లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం ఈ గ్రామం లోనే ఉంది. ఏంతో మంది భక్తులు స్వామీ వారి దర్శనార్ధం ఈ ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు. ఒక కొండపైన ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ కొండ పూర్వం ఒక అగ్నిపర్వతంగా ఉండేది. రానురాను ఆ అగ్నిపర్వతం కనుమరుగపోయింది. ఇక్కడ పానకాన్ని మాత్రమే నైవేద్యంగా పెడతారు ఎందుకంటే అగ్నిపర్వతం రాకుండా ఉండటానికి రసాయనిక చర్యలో భాగంగా బెల్లం, చెక్కర, చెరకు లను వాడతారు. ఈ స్వామిని పానకాల స్వామి అని కూడా పిలుస్తారు.

Photo Courtesy: venkatasubbaraokolli / Durgarao Vuddanti

ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్

ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్

గుంటూరు నగర శివారు కి నాలుగు కిలోమీటర్ల దూరంలో దక్షిణ ప్రాంతంలో ఈ ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్ ఉంది. వాటర్ ట్యాంక్ ల కి ప్రసిద్ద మయిన ఈ ప్రాంతం ఎన్నో పెద్ద సంఖ్యలో వలస పక్షులని ఆకర్షిస్తోంది. అద్భుతమైన, అరుదైన అంతర్జాతీయ జాతులకి ఈ ప్రాంతం స్థావరం. స్పాట్ బిలేడ్ పెలికాన్స్ అలాగే పెయింటెడ్ స్తార్క్స్ వంటివి ఇక్కడ కనిపిస్తాయి. ఇంతకు పూర్వం ఈ ప్రాంతానికి దాదాపు 12000 పక్షులు సందర్శించేవి. ఇప్పుడు వాటి సంఖ్యా 7000 లకి పడిపోయింది. గ్లోబల్ వార్మింగ్ వంటి కొన్ని కారణాల వల్ల ఈ సంఖ్య తగ్గిపోయిందని భావించవచ్చు. అయినా, ప్రతి సంవత్సరానికి ఇక్కడికి విచ్చేసే పర్యాటకుల సంఖ్య్హ మాత్రం తగ్గలేదు. పక్షి ప్రేమికులు ఈ ప్రాంతంలో కనిపించే అరుదైన పక్షుల కోసం వస్తారు. మార్చ్ నుండి ఏప్రిల్ వరకు ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్ పార్క్ ని సందర్శించేందుకు అనువైన సమయం. ఎందుకంటే, ఈ సమయం లో నే అరుదైన వలస పక్షులు కనువిందు చేస్తాయి.

Photo Courtesy: guntur.co.in

ఉండవల్లి గుహలు

ఉండవల్లి గుహలు

ఉండవల్లి గుహాలయ పర్వత సముదాయం గుంటూరు జిల్లా మంగళగిరికి 5కీ.మీ.ల దూరంలో ఉంది. ఈ గుహాలయం ఒక పర్వత సముదాయం. పర్వతo ముందు భాగమునుండి లోపలికి తొలచుకుంటూ వెళ్ళడం చేసారు. మధ్యలో స్థంబాలు వాటిపై చెక్కిన అందమైన లతలు, గుహాంతర్భాగాలలో గోడలపై చెక్కిన దేవతా ప్రతిమలు మెదలైన వాటితో విశాలంగా ఉంటుంది. ఇవి క్రీ.శ. 4, 5 వ శతాబ్దానికి చెందినవని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక్కడ నాలుగు అంతస్తులలో ఆలయాలు నిర్మించారు. అందులో ఒక పెద్ద రాతిలో అనంత పద్మనాభ స్వామి శిల్పం చెక్కబడి ఉంది.ఈ గుహల నిర్మాణ శైలి బౌద్ధ విహారాల శైలిని పోలి ఉంది. ఈ గుహాలయాలు విష్ణుకుండినుల కాలానికి చెందినవి.

Photo Courtesy: Sekhar Korlapati / guntur.co.in

ఇస్కాన్ టెంపుల్ నమూనా చిత్రం

ఇస్కాన్ టెంపుల్ నమూనా చిత్రం

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఇది సుమారుగా 500 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ టెంపుల్ గనక పూర్తయితే దక్షిణ భారతదేశంలోనే బంగారంతో తయారుచేయబడ్డ ఆలయంగా ప్రసిద్ది చెందనుంది. ఈ దేవాలయ కాంప్లెక్స్ లో ఒక అంతర్జాతీయ స్కూల్, వేదిక పాఠశాల, కొండవీడు చరిత్రమీద ఒక మ్యూజియం మరియు ఒక మెడికల్ సెంటర్ ను నిర్మించ తలపెట్టినారు.

Photo Courtesy: iskon

గుంటూరుకు ఎలా చేరుకోవాలి?

గుంటూరుకు ఎలా చేరుకోవాలి?

వాయు మార్గం

గుంటూరు లో విమానాశ్రయం లేదు. స్థానిక ఎయిర్ పోర్ట్ విజయవాడ లో కలదు. ఇది 96 కి. మీ. ల దూరం ఇక్కడికి చేరువలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ విమానాశ్రయం. హైదరాబాద్ లో ఉన్న ఈ విమానాశ్రయం ఎన్నో ప్రధాన నగరాలకి అలాగే పట్టణాలకి చక్కగా అనుసంధానమై ఉండడమే కాకుండా అంతర్జాతీయంగా కూడా అనుసంధానమై ఉంది. ఇక్కడ నుండి ఒక ప్రైవేటు టాక్సీ ద్వారా గుంటూరు కి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి గుంటూరు కి చేరుకునేందుకు సుమారు నాలుగున్నర గంటల సమయం పడుతుంది.

రైలు మార్గం

గుంటూరులో ఉన్న రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన నగరాలకు అలాగే పట్టణాలకు చక్కగా అనుసంధానమై ఉండడానికి గల కారణం దక్షిణ రైల్వే శాఖ యొక్క నిర్వహణ. గుంటూరు లో ఢిల్లీ, బెంగుళూరు, ముంబై, చెన్నై, కోల్ కత్తా, హైదరాబాద్ ఇంకా విజయవాడ వంటి ఎన్నో పట్టణాల నుండి రోజువారి రైళ్ళ రాకపోకలు ఉన్నాయి. టాక్సీ , బస్సు లేదా ఆటో రిక్షాల సేవలు ఈ రైల్వే స్టేషన్ సమీపంలో లభిస్తాయి.

రోడ్డు మార్గం

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కి గుంటూరు నగరం ప్రధాన కేంద్రం. అందువల్ల, ఇక్కడ లభించే బస్సు సర్వీసులు అమోఘం. చెన్నై, కోల్ కత్తా అలాగే హైదరాబాద్ వంటి ఎన్నో జాతీయ రహదారులు ఈ గుంటూరు నగరానికి కలుస్తాయి. హైదరాబాద్ రహదారి ద్వారా ఢిల్లీ మరియు ముంబై నగరాలకు చేరుకోవచ్చు.

Photo Courtesy: Kishoresreenidhi

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more