Search
  • Follow NativePlanet
Share
» »హసనాంబ - వరాల జల్లుల... మహిమల ప్రదర్శన !

హసనాంబ - వరాల జల్లుల... మహిమల ప్రదర్శన !

హస్సన్ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది ? ఆ పట్టణం లో కల హసనాంబ మాత టెంపుల్ కారణంగా హస్సన్ కు ఆ పేరు వచ్చింది. ఈ టెంపుల్ హస్సన్ లో బెంగుళూరు కు 183 కి. మీ. ల దూరంలో కలదు. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే, ఎన్నో మహిమలు వివరంచాలి. ఈ మహిమలను భారతీయ సంస్కృతి లో భాగంగా మీరు నమ్మ గలరా ? నమ్మక పోయినా పరవాలేదు...ఈ వివరణ దేశ సంస్కృతిని ఆచరించే లా చేస్తుంది.

ఈ దేవత తన మహిమలలో ఒకటిగా, సంవత్సరానికి ఒకే సారి దర్శనం భక్తులకు ఇస్తుంది. హిందూ కేలండర్ మేరకు ఈ సమయం మారుతూ వుంటుంది. ప్రతి సంవత్సరం ఆశ్వ్వేయుజ మాసంలో అంటే సాధారణంగా అక్టోబర్ చివర - నవంబర్ మొదట్లో వచ్చే పౌర్ణమి గురువారం నాడు మాత్రమే ఈ టెంపుల్ తెరుస్తారు. ఈ టెంపుల్ కర్నాటక రాష్ట్రం యావత్తూ దీపావళి పండుగ జరుపుకొంటూ వుంటే, సరిగ్గా, దీపావళి మరుసటి రోజు అయిన బాలి పాడ్యమి నాడు మూసి వెయ బడుతుంది. అప్పటి నుండి మరల పైన చెప్పిన రోజుణ మాత్రమే దీనిని తెరుస్తారు. ఈ సంవత్సరం నవంబర్ 1వ తేదీ టెంపుల్ తెరుస్తున్నట్లు, నవంబర్ 1 నుండి నవంబర్ 15 వ తేదీ వరకూ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు టెంపుల్ యాజమాన్యం చేసిన ఒక ప్రకటనలో తెలుస్తోంది.

ఒకసారి, ఏడుగురు మాతృకలు అంటే, బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మరియు చాముండి దేవతలు ఒక పడవలో దక్షిణ భారత దేశానికి వచ్చినపుడు హస్సన్ పట్టణ అందాలకు ముగ్ధులై, ఆ ప్రదేశాన్ని తమకు నిరంతర నిలయంగా చేసుకోవాలని నిర్ణయించారు.

మహేశ్వరి, కౌమారి, వైష్ణవి లు టెంపుల్ లోని మూడు చీమల పుట్టలను తమ నివాసంగా చేసుకొన్నారు. బ్రాహ్మి కేంచమ్మ యొక్క హాస కోట లోను, ఇంద్రాణి, వారాహి మరియు చాముండి దేవిగేరే హోండా లోని మూడు బావులలోను నివాసం చేసుకున్నారు.

మహిమలు
గత సంవత్సరం టెంపుల్ మూసి వేసే రోజున మాతకు అర్పించిన పూవులు, వేలింగించిన దీపము సంవత్సరం తర్వాత టెంపుల్ తెరచిన రోజున అదే విధంగా భక్తులకు కనపడతాయి. మాత పై విస్వాశం పెట్టేందుకు ఇంతకంటే మహిమ ఏమి కావాలి ? హసనామ్బకు సంబంధించి మరొక కదా కూడా కలదు. ఇది మీరు డైలీ చూసే ఒక చిన్న టెలివిషన్ డ్రామా లా వుంటుంది. ఇది ప్రతి సంవత్సరం వేలాది సంఖ్యలో వచ్చి దర్సించుకొనే భక్తులకు ఆశ కల్పిస్తుంది.

టెంపుల్ సమీపంలో కల నివాసాలలో ఒక కోడలు టెంపుల్ కు వచ్చి హసనాంబ ను ప్రతి రోజూ దర్సిన్చుకోనేది. ఆమెకు గల గయ్యాళి అత్తగారు ...ఖచ్చితంగా గయ్యాళి ...ఒకరోజు కోడలు చేసే పని ఒర్చలేక ఒక గట్టి వస్తువు తో ఆమెను తలపై కొట్టింది. కారే రక్తం తో బాధ భరించలేని కోడలు, మాత హసనాంబ ను ఏడుస్తూ వేడుకొంది. వెంటనే మాత హసనాంబ ప్రత్యక్షమై తన భక్తురాల్ని తన టెంపుల్ లోనే ఒక రాయి గా మార్చి వేసింది. ఈ రాయి ప్రతి సంవత్సరం కొద్ది దూరం జరుగుతుందని చెపుతారు. ఇలా జరిగి జరిగి, చివరకు, బహుసా , కలియుగం అంతం అయ్యేనాటికి మాత పాదాలను తాక వచ్చు.

ఈ రకంగా, మాత హసనాంబ కు సంబంధించిన మహిమలను ఇక్కడి గ్రామీణులు ఎన్నో చెప్పుకుంటారు. ఒక సారి నలుగురు బందిపోట్లు ఆ గుడి ధనాన్ని దోచేందుకు ప్రయత్నించారు. హసనామ్బకు కోపం వచ్చి, వారిని రాలు గా మరమని శాపం పెట్టింది. ఆ కారణంగా ఈ టెంపుల్ ను కల్లప్పన గుడి (కళ్ళ అంటే కన్నడంలో దొంగ ) అని కూడా అంటారు. నమ్మండి, నమ్మక పొండి ...అందరూ ఆనందించే ఈ రకమైన మహిమలు మనదేశంలో ఎన్నో కలవు.

హసనాంబ టెంపుల్ కు ఎదురుగా ఒక శివుడి టెంపుల్ కలదు. దీనిని స్థానికులు సిద్దేశ్వర టెంపుల్ అంటారు. ఇది ఒక స్వయంభూ లింగం అని నమ్ముతారు. ఇక్కడే తొమ్మిది తలలు కల ఒక రావణ విగ్రహం వీణ వాయిస్తూ వుంటుంది. ఈ రావణ విగ్రహాన్ని ప్రతి పౌర్ణమి నాడు దర్సిన్చుకొంటారు. దీపావళి సమయంలో మూసివేసే రోజున హసనంబ టెంపుల్ రధోత్సవం జరుగుతుంది. హసనంబా టెంపుల్ కమిటీ వివిధ ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది.

హసనాంబ టెంపుల్ ఎలా చేరాలి ?
బెంగుళూరు నుండి హసన్ కు తరచుగా బస్సు లు, ట్రైన్ లు కలవు. హసనంబ టెంపుల్ దర్శించి మాత ఆశీర్వాదం తప్పక పొందుతారని ఆశిస్తూ...

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X