• Follow NativePlanet
Share
» »తిరుమలలో వున్న మహిమాన్వితమైన ఆకు...

తిరుమలలో వున్న మహిమాన్వితమైన ఆకు...

హథీరాంజీ క్రీ.శ 1500కాలంలో తిరుమలకు వచ్చిన భక్తుడు.ఇతడు స్వామివారితో పాచికలాడెంతసన్నిహిత భక్తుడని.పాచికలాడుతూ వేంకటేశ్వరుడు ఓడిపోయాడని ఆందుకే తిరుమలలో హథీరాంజీ ఆలయం తిరుమల ఆలయంకన్నా 100మీ ఎత్తులో వుంటుందని ఒక కధనం. కథ ప్రకారం ఇతని గురించి అర్చకులు రాజుకు పిర్యాదు చేసారు.అతనిని శిక్షించటానికి ముందు రాజు ఒక పరీక్షపెట్టాడు.ఒక బండెడు చెరుకు గడలు అతని గదిలో పెట్టి తాళంవేసారు. ఆ చెరుకుగడలను రాత్రికిరాత్రే తినగలిగితే అతనిని శ్రీవారి సన్నిహితునిగా అంగీకరిస్తామని రాజు అంటాడు. స్వామి ఏనుగురూపంలో వచ్చి చెరుకు గడలన్నీ తినేస్తాడు.

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

అప్పటినుండి బాబాజీని హథీరాం బాలాజీ అని పిలవసాగారు. హథీరాంజీతో పాచికలాడి స్వామి తిరుమలలోని తన ఆస్థులన్నిటినీ పందెంగా పెట్టి ఓడిపోయాడని అప్పటినుండి తిరుమల ఆలయం అతని వారసుల ఆధీనంలో వున్నదని కూడా ఒక కధనం వుంది.

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

ఈస్టిండియాకంపెనీవారు దేవాలయాల నిర్వహణలో జోక్యం కలగజేసుకోకూడదని నిర్ణయించుకున్న తర్వాత 1843లో ఆర్కాటుజిల్లా కలెక్టర్ సనద్ తో తిరుమల నిర్మాణం హథీరాంజీ మటం అధిపటికి అప్పగించారు. 1932లో తిరుమలతిరుపతి దేవస్థానచట్టం అమలులోకివచ్చింది.

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

అంతకుమునుపు మహంతుల ఆధీనంలో వుండేది. హథీరాంజీమటానికి పెద్దసంఖ్యలో లంబాడీలు దర్శనం చేసుకోటానికి వస్తారు. లంబాడీలు హథీరాంజీ తమ తెగకు చెందినవాడుగా చెప్పుకుంటారు. అందువలన తిరుమలలో దర్శనంఅయిన వెంటనే హథీరాంజీ ఆశీర్వాదం పొందటానికి మటానికి వస్తారు.

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

మటంలో లంబాడీలకు వుచితబస ఏర్పాటుసౌకర్యం వుంది. బాలాజీ మొదట్లో శ్రీవారి ప్రసాదాన్ని ఆహారంగా తీసుకునేవారు. అయితే ప్రతీరోజూ వూరికే ప్రసాదాలు ఇష్టంలేని ఆలయఅధికారులు హథీరాంజీ ని కట్టెలు కొడితేనే ప్రసాదాలని షరతులు విధించారు. హథీరాంజీఏనుగులా బలంగా వుండేవాడని పురాణాలు చెబుతున్నాయి.

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

శ్రీ వారి ప్రసాదాల కోసం కట్టెలు తెచ్చి వాటిని గొడ్డళ్ళతో హథీరాంజీ ముక్కలు చేసేవాడట. కొన్ని రోజుల తర్వాత బాబాజీకి బాధనిపించిందట. తన సమయమంతా దీనికి కేటాయిస్తున్నానేంటి అనుకునేవారట హథీరాంజీ.తిండి సంగతి దేవుడెరుగుముందు తపస్సు చేసుకుందామని నిర్ణయానికి వచ్చి శ్రీవారి ఆలయానికి దూరంగా పాపవినాసనంఅడవుల్లోకి వచ్చేసారు.

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

అతి సమీపంలోని అటవీప్రాంతంలో హథీరాంజీబాబాజీ తపస్సుకు కూర్చున్నాడు. ఆ సమయంలో ఆయనకు ఆకలివేసింది. ఆకలిని తట్టుకోలేక ఎదురుగా వున్న చిన్నచెట్టు ఆకులను తీసుకుని ఆరగించాడు.ఆ ఆకులు తియ్యగా వుండటంతో ఆవురావురమంటూ ఆ ఆకులన్నిటినీ ఆరగించాడు హథీరాంజీ. పక్కనే వున్న తీర్థంలో నీళ్ళు తాగాడు.ఆకలి తగ్గాక బాబాజీకి భయం వేసింది.

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

ఆకులవల్ల ఏమన్నా అవుతుందా అని ఆలోచించటం మొదలుపెట్టాడు.అయితే బాబాజీకి ఏమీకాలేదు.ఆకులు తిన్న తర్వాత అన్నంమాట మర్చిపోయి ఆకులుమాత్రమే తినటం ప్రారంభించాడు. అలా తన తపస్సును పూర్తిచేసాడు. 12ఏళ్ల పాటు తపస్సుచేసి ఆ బద్ధాకును తింటూ వచ్చాడు.

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

కొంత మంది ఈ ఆకులను రామబద్రం ఆకులని లేక రామపత్తి ఆకులని పిలుస్తూవుంటారు. గతంలో అన్ని చెట్లు వుండగా బాబాజీ ఈ ఆకులనే తినటం ఆశ్చర్యంగా వుందికదా. ఇదంతా శ్రీవారి మహిమేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ బద్ది చెట్టు శేషాచలంలోమాత్రమే విరివిగా పెరుగుతాయి.

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

ఇంకా ఎక్కడా కనిపించదు.పాపవినాశనం దగ్గరలో వేణుగోపాలస్వామి ఆలయందగ్గర హథీరాంజీబాబాజీ సమాధివుంది. అక్కడే ఆయన తపస్సు చేసారు.అక్కడికి వెళ్ళిన బద్దాకును ఇస్తూవుంటారు. ఈ ఆకు తియ్యగాపుల్లగా వుంటుంది.

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

తిరుమలలో ఈ ఆకు తింటే లక్ష్మి మీ వెంటే !

దీనిని ఎంతైనా తినోచ్చును.దీనిని తింటే సంపూర్ణఆరోగ్యం పొందటం ఖాయమట. ఇంకెందుకాలస్యం ఈ సారి తిరుమల వెళ్ళినప్పుడు ఈ ఆకులు ఆరగించండిమరి

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి