Search
  • Follow NativePlanet
Share
» »దశ తిరగాలంటే ఈ దేవాలయాలకు వెళ్లాల్సిందే

దశ తిరగాలంటే ఈ దేవాలయాలకు వెళ్లాల్సిందే

తమిళనాడులోని నవగ్రహ దేవాలయాలు. నవగ్రహ దేవాలయాల దర్శనం వల్ల మేలు కలుగుతుంది. నవగ్రహ దేవాలయాలు కుంభకోణం చుట్టు పక్కల ఉన్నాయి.

By Kishore

హిందూ మతంలో నవగ్రహ పూజకు విశేష ప్రాధాన్యత ఉంది. ఈ నవగ్రహాల ప్రస్తావన పురాణాల్లో కూడా మనకు కనిపిస్తుంది. మన భవిష్యత్తు బాగుండాలంటే ఈ నవగ్రహాలను శాంతిపంజేయాలని ఇందు కోసం ప్రత్యేక పూజలు చేయాలని విశ్వసించేవారు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ నవగ్రహ శాంతి హోమం జరిపించి తమ జాతకం బాగుండాలని వేడుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా సాధారణంగా నవగ్రహాలన్నీ ఒకే చోట ఉంటాయి. అయితే కేవలం కొన్ని చోట్ల మాత్రమే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేక దేవాలయం కనిపిస్తుంది. అలా తొమ్మిది దేవాలయాలు ఒకే రాష్ట్రంలో అది కూడా అతి దగ్గర దగ్గరా ఉండటం చాలా అరుదైన విషయం. అటువంటి అరుదైన విషయానికి మన పొరుగున ఉన్న తమిళనాడు వేదికయ్యింది. ఈ తొమ్మిది దేవాలయాలు ప్రముఖ పుణ్యక్షేత్రానికి చుట్టు పక్కల ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో

శని వక్రదశలో ఉన్నప్పుడు ఇక్కడికి వెళితే...శని వక్రదశలో ఉన్నప్పుడు ఇక్కడికి వెళితే...

1. సూర్యదేవాలయం

1. సూర్యదేవాలయం

P.C:You Tube

సూర్యుడిని ఆరోగ్యానికి, సంపదకు ప్రతీకగా భావిస్తారు. ఈ సూర్య దేవాలయం కుంభకోణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి ఏడాది పంటలు చేతికి వచ్చే సమయంలో అంటే జనవరిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

2. కులుత్తోంగ చోళుడు

2. కులుత్తోంగ చోళుడు

P.C:You Tube

ఈ దేవాలయాలన్ని క్రీస్తు శకం 1100 ఏడాదిలో కులుత్తోంగ చోళ మహారాజు నిర్మించాడని స్థానికంగా దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది. తమిళంలో దీనిని స్యూర్యనాయర్ కోవెల్ అని కూడా పిలుస్తారు.

3. చంద్ర దేవాలయం

3. చంద్ర దేవాలయం

P.C:You Tube

చంద్రుడు సుఖాన్ని, దీర్ఘాయుస్సును ప్రసాదిస్తాడని చెబుతారు. చంద్రుడికి ప్రత్యేక ఆలయం చాలా అరుదు. అటువంటి ఆలయం తిరువైయార్ కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

4. చంద్రుడి కాంతి

4. చంద్రుడి కాంతి

P.C:You Tube

సెప్టెంబర్ అక్టోబర్ నెలల మధ్య వచ్చే పురుట్టాసి, మార్చి ఏప్రిల్ నెలల మధ్య వచ్చే ఫల్గుని నక్షత్ర సమయాల్లో చంద్ర కాంతి ఈ దేవాలయంలోని శివలింగం పై ప్రసురిస్తుంది. ఇందుకు గల కారాణాలు ఎవరూ రుజువు చేయలేపోతున్నారు.

5.అంగారక దేవాలయం

5.అంగారక దేవాలయం

P.C:You Tube

తిరువైయూర్ కు ఆరు కిలోమీటర్ల దూరంలోనే అంగారక దేవాలయం ఉంది. దీనికి వైధీశ్వరన్ కోవెల్ అని పేరు. ఈ ఆలయాన్ని దర్శిస్తే ఎటువంటి వ్యాధులైనా నయమవుతాయని చెబుతారు. ధైర్యానికి ప్రతీక అంగారకుడు.

6. వివాహం కానివారు

6. వివాహం కానివారు

P.C:You Tube

ఈ దేవాలయంలో జటాయువు, సూర్యుడు, అంగారకుడిని పూజించారని స్థల పురాణం చెబుతుంది. వివాహం ఆలస్యమైతే అంగారక క్షేత్రాన్ని దర్శిస్తే వెంటనే సత్ఫలితం ఉంటుందని స్థానికులు చెబుతుంటారు.

7.బుధాలయం

7.బుధాలయం

P.C:You Tube

అంగరక దేవాలయానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే బుధుని ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారిని స్వేతారన్యేశ్వరుడిగా కొలుస్తారు. అమ్మవారిని బ్రహ్మవిద్యాంబికా దేవి ఆలయం.

8. వాల్మీకి రామాయణంలో

8. వాల్మీకి రామాయణంలో

P.C:You Tube

వాల్మీకి రామాయణంలో ఈ గుడికి సంబంధించిన ప్రస్తావన ఉంది. అందువల్ల ఈ ఆలయం దాదాపు 3000 ఏళ్లనాటిదని చెబుతుంటారు. బుధుడు బుద్ధి, తెలివితేటలకు ప్రతీక.

9. గురుడుకీ దేవాలయం

9. గురుడుకీ దేవాలయం

P.C:You Tube

కుంభకోణానికి 18 కిలోమీటర్ల దూరంలో అలన్గుడిలో ఈ గురు దేవాలయం ఉంది. ఇక్కడ స్వామివారిని అరన్యేశ్వర లింగం అంటారు. ఇది స్వయంభు లింగం.

10. పార్వతి స్నానం చేసిన దేవాలయం

10. పార్వతి స్నానం చేసిన దేవాలయం

P.C:You Tube

దీనిని అబాత్స గయేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం లోపల ఉన్న పుష్కరిణిలో పార్వతిదేవి స్నానం చేశారని నమ్ముతారు. ఇక్కడే శివునిలో ఐక్యమైందని చెబుతారు.

11. శుక్రుడికి

11. శుక్రుడికి

P.C:You Tube

కంచనూర్లో ఉన్న సూర్యదేవాలయానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో శుక్ర గ్రహానికి ప్రత్యేక దేవాలయం ఉంది. ఈ దేవాలయాలన్ని పలాశ వనం, బ్రహ్మపరి, అగ్నిస్థలం అని కూడా పిలుస్తారు. తమ భార్యాలు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తూ భర్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు.

12. శనీశ్వరుడికి

12. శనీశ్వరుడికి

P.C:You Tube

తిరునల్లార్ లోని శని దేవాలయం ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది. కుంభకోణానికి 53 కిలోమీటర్ల దూరంలో, కరైకాల్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఇక్కడ పూజలు నిర్వహించడం కోసం దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు నిత్యం ఇక్కడికి వస్తుంటారు.

13. నలుడిని పీడించిన శని దేవుడు

13. నలుడిని పీడించిన శని దేవుడు

P.C:You Tube

ఇక్కడే శని దేవుడు నలుడిని బాగా పీడించారని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ ఆలయం నిర్మాణం వెనుక ఉన్న రహస్యం పై నాసా శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నారు. ఇక్కడి పుష్కరాన్నినలతీర్థం అని అంటారు. ఇందులో స్నానం చేస్తే అన్ని పాపాలు తొలిగిపోతాయని నమ్ముతారు.

14. రాహు దేవాలయం

14. రాహు దేవాలయం

P.C:You Tube

కుంభకోణానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే తిరునంగేశ్వరం ఉంది. ఇక్కడ శివుడిని నాగనాద స్వామి అని పిలుస్తారు. అమ్మవారిని గిరి గుంజాంబికా దేవిగా పేర్కొంటారు. శివుడికి ఉన్న ప్రధాన ఆలయం ప్రాంగణంలోనే రాహువుకు ప్రత్యేక దేవాలయం ఉంది.

15. కేతు దేవాలయం

15. కేతు దేవాలయం

P.C:You Tube

పూం పుహార్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో కీజ పేరుం పల్లం అనే గ్రామం వద్ద కేతు దేవాలయం ఉంది. కేతువును ప్రధానంగా అర్చిస్తారు. అంతేకాకుండా ఇక్కడ రాహువు, కేతువులు జంటగా కలిసి ఉంటాయి. ఇక్కడ ఈశ్వరుడికి కూడా ప్రత్యేక ఉపాలయం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X