Search
  • Follow NativePlanet
Share
» »ఆ నిమ్మకాయను ఇంటిలో పెట్టుకొంటే ఒక్క నిమిషంలో

ఆ నిమ్మకాయను ఇంటిలో పెట్టుకొంటే ఒక్క నిమిషంలో

నిమిషాదేవి దేవాలయం గురించిన కథనం.

By Kishore

కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు కావేరీ నది జీవనాడి. ఈ రెండు రాష్ట్రాల తాగు, సాగు నీటి కోసం ఈ నది పైనే ఆధారపడుతారు. ఇదే నది ఒడ్డునే అనేక పుణ్యక్షేత్రాలు కూడా వెలిసాయి. అందులో కర్నాటకలో అత్యంత ప్రాచూర్యం పొందిన గంజం. ఇది శ్రీరంగ పట్టణానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఈ నది ఒడ్డునే ఉంది. ఇక్కడి అమ్మవారిని నిమిషాదేవి లేదా నిమిషాంబ పేరుతో కొలుస్తారు. అమ్మవారికి ముడుపుగా ఇచ్చిన నిమ్మకాయను తిరిగి ఇంటికి తీసుకువస్తారు. అలా తీసుకురావడం వల్ల మనం అనుకొన్న కోరికలు వెంటనే తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక ఈ క్షేత్రం వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం

నక్కలు సాధు జంతువులై ప్రసాదం తినే చోటు...సందర్శనతోనక్కలు సాధు జంతువులై ప్రసాదం తినే చోటు...సందర్శనతో

1. పురాణ కథనాన్ని అనుసరించి

1. పురాణ కథనాన్ని అనుసరించి

P.C: YouTube

పురాణ కథనం ప్రకారం కావేరీ నది తీరంలోని శ్రీరంగ పట్టణానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంజం ఉండేది. పూర్వం ఇక్కడ ముక్తకుడనే బుుషి ఉండేవాడు. ఆయన గొప్ప శివ భక్తుడు.

2. ముక్తకుడు అనే రాజు

2. ముక్తకుడు అనే రాజు

P.C: YouTube

లోక కళ్యాణం కోసం ముక్తకుడు ఒక గొప్ప యాగాన్ని తలపెట్టాడు. అయితే యాగం వల్ల తమకు చావు తప్పదని భావించిన రాక్షసులు తీవ్ర అడ్డంకులు స`ష్టించేవారు.

3. యాగ కుండం నుంచి

3. యాగ కుండం నుంచి

P.C: YouTube

బుుషి ఎంతగా ప్రయత్నించినా ఆ రాక్షసులను అడ్డకోవడం వీలుకలుగలేదు. దీంతో ఆయన తన ఆరాధ్యదైవమైన ఆ పరమశివుడిని వేడుకొన్నాడు. దీంతో శివుడి ఆదేశాలను అనుసరించి పార్వతి దేవి యాగ కుండం నుంచి ఆయుధాలను ధరించి బయటికి వచ్చింది.

4. అందువల్లే ఆ పేరు వచ్చింది.

4. అందువల్లే ఆ పేరు వచ్చింది.

P.C: YouTube

అంతే కాకుండా ఒక్క నిమిషంలోఆ రాక్షసులందరినీ సంహరించింది. అందువల్లే ఇక్కడ వెలిసిన దేవతను నిమిషాదేవి లేదా నిమిషాంబగా కొలుస్తారు. ఇక దేవి ఆలయం పక్కనే ఉన్న ఈశ్వరుడిని ముక్తేశ్వరుడిగా కొలుస్తారు.

5. ఒడయార్లు నిర్మించారు.

5. ఒడయార్లు నిర్మించారు.

P.C: YouTube

ఒకప్పుడు శ్రీరంగం పట్టణం కర్నాటకకు రాజధానిగా ఉండేది. దీనిని రాజధానిగా చేసుకొని ఒడయార్లు రాజ్యపాలన చేసే వారు. ఈ క్రమంలోనే దాదాపు 400 ఏళ్ల క్రితం క`ష్ణరాజ ఒడయార్ ఈ నిమిషాంబకు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారు.

7. మరోవిశేషం

7. మరోవిశేషం

P.C: YouTube

ఇక ఇక్కడ దేవాతకు భక్తులు గాజులు, నిమ్మకాలను ముడుపులుగా చెల్లిస్తుంటారు. అమ్మవారి పూజ తర్వాత తిరిగి నిమ్మకాయను తీసుకొంటారు. ఇలా తీసుకొన్న నిమ్మకాయను ఇంట్లో పెట్టుకొంటే అతి త్వరలో మన కోరికలు తీరుతాయని చెబుతారు.అందువల్లే చాలా దూరం నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయంలో మరో విశేషం కనిపిస్తుంది. ఈ ఆలయం పూజారులు రోజూ అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత దగ్గర్లోని ఓ వేదిక వద్దకు దానిని తీసుకువస్తారు.

8. బలి భోజనం

8. బలి భోజనం

P.C: YouTube

అటు పై దేవాలయం లోని గంటను మోగిస్తారు. దీంతో చుట్టు పక్కల కాకులు ఇక్కడికి వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తాయి. దీనినే బలి భోజనం అంటారు. ఈ బలి భోజనం విధానం చాలా ఏళ్లుగా వస్తున్న ఆచారం.

9. ఆలయాలు చాల చోట్ల ఉన్నా కూడా

9. ఆలయాలు చాల చోట్ల ఉన్నా కూడా

P.C: YouTube

ఇదిలా ఉండగా నిమిషాంబ పేరుతో భారత దేశంలో చాలా చోట్ల ఆలయాలు ఉన్నాయి. అయితే పార్వతి దేవి రాక్షసులను సంహరించింది మాత్రం శ్రీరంగ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలోని గంజంలోనే అని చాలా మంది నమ్ముతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X