Search
  • Follow NativePlanet
Share
» »హుబ్లీ - కర్నాటక టూరిస్ట్ కేంద్రం !!

హుబ్లీ - కర్నాటక టూరిస్ట్ కేంద్రం !!

హుబ్లీ అనే పదం హుబ్బళి నుండి వచ్చింది. కన్నడ భాషలో హుబ్బళి అంటే పూల తీగ అని అర్ధం. ఇది ఒక చారిత్రక నగరం. చాళుక్యుల కాలం నాటిది.

By Mohammad

పర్యాటక ప్రదేశం : హుబ్లీ లేదా హుబ్బళ్ళి

రాష్ట్రం : కర్ణాటక

సందర్శనీయ ప్రదేశాలు : ఉంకాల్ సరస్సు, వాటర్ పార్క్, ఇస్కాన్ ఆలయం, గాయత్రి తపోవన్, మఠాలు, ఉద్యానవనాలు

అనుకూలం : అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు

నిక్ నేమ్స్ : చోటా ముంబై, జంటనగరాలు, హుబ్బళ్ళి - ధార్వాడా

హుబ్లీ నే హుబ్బళ్ళి అని కూడా పిలుస్తారు. ఇది కర్నాటక లో రెండవ అతి పెద్ద పట్టణం మరియు ఉత్తర కర్నాటక కు ప్రధాన రవాణా కూడలి. బెంగళూరు, గోవా, ముంబై ఇలా ఏ ప్రాంతం నుండి వచ్చేవారైనా సరే హుబ్లీ మీద పడే రావాలి. అంతెందుకు హైదరాబాద్ నుండి గోవా పోవాలన్నా వయా హుబ్లీ నే టచ్ కావాలి.

దక్షిణ భారతదేశంలో హుబ్లీ ఒక ప్రధాన నగరం. ధార్వాడ్ తో కలిపి జంటనగరాలుగా వ్యవహరిస్తారు. ఉత్తర కర్నాటకలో వాణిజ్య, పారిశ్రామిక, ఆటోమోబైల్, విద్యా మొదలగు రంగాలలో బెంగుళూరు తర్వాత ఎంతో పురోగతి సాధించింది. ఈ పట్టణం మలెనాడు మరియు దక్కన్ పీఠ భూమి మధ్యలో కలదు.

<strong>హస్సన్ - కర్ణాటక కు శిల్ప రాజధాని !!</strong>హస్సన్ - కర్ణాటక కు శిల్ప రాజధాని !!

హుబ్లీ అనే పదం హుబ్బళి నుండి వచ్చింది. కన్నడ భాషలో హుబ్బళి అంటే పూల తీగ అని అర్ధం. ఇది ఒక చారిత్రక నగరం. చాళుక్యుల కాలం నాటిది. గతంలో దీనిని రాయర హుబ్లీ లేదా ఎలియ పురవడ హళ్ళి మరియు పురబల్లి అనేవారు. విజయనగర రాయ కాలంలో రాయర హుబ్లీ వ్యాపార కేంద్రం అయింది.

ఉంకాళ్ లేక్

ఉంకాళ్ లేక్

ఉంకాళ్ లేక్ 110 సంవత్సరాల ప్రాచీన సరస్సు. ఎంతో ప్రశాంతంగా, అందమైన పర్యావరణం కల ఈ సరస్సును పర్యాటకులు తప్పక చూడాలి. సాయంకాలలో సూర్యాస్తమయం ఇక్కడనుండి చూస్తే ఎంతో బాగుంటుంది. ఈ సరస్సులో బోటింగ్ కూడా చేసి ఆనందించవచ్చు.

చిత్రకృప : GuruAngadi

బండ్ గార్డెన్

బండ్ గార్డెన్

ఉంకాళ్ లేక్ చేరేముందు పర్యాటకులు బండ్ గార్డెన్ తప్పక చూడాలి. పచ్చటి ప్రదేశాలు, ఆహ్లాదం కలిగిస్తాయి. హుబ్లీకి 4 కి.మీ.ల దూరంలో కలదు. వాస్తవానికి ఈ ప్రదేశం ఉంకాళ్ సరస్సు క్రిందకే చేరుతుంది. పర్యాటకులు ప్రశాంత వాతావరణం పొందవచ్చు.

చిత్రకృప : Manjunath Doddamani Gajendragad

గాయత్రి తపోవన్

గాయత్రి తపోవన్

హుబ్లీ పర్యాటకులు గాయత్రి తపోవన్ ఆద్యాత్మిక కేంద్రాన్ని తప్పక చూడాలి. మొదట్లో దీనిని నవకళ్యాణ మఠం అనేవారు. తర్వాతి కాలంలో ఇది తపోవనంగా మారింది.

చిత్రకృప : Aditisharmangel

గ్లాస్ హౌస్ గార్డెన్

గ్లాస్ హౌస్ గార్డెన్

ప్రసిద్ధి గాంచిన ఫ్లవర్ షో చూడాలంటే, పర్యాటకులు ఇందిరా గ్లాస్ హౌస్ గార్డెన్ సందర్శించాల్సిందే. దీనిని భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరుపై స్ధాపించారు. ఈ ప్రదేశం బెంగుళూరు లోని లాల్ బాగ్ ను పోలిఉంటుంది. ఇక్కడే ఒక స్కేటింగ్ గ్రౌండ్ మరియు పచ్చటి లాన్లు కూడా కలవు.

చిత్రకృప : Manjunath Doddamani Gajendragad

శ్రీ క్రిష్ణ బలరామ దేవాలయం

శ్రీ క్రిష్ణ బలరామ దేవాలయం

పర్యాటకులు హుబ్లీపర్యటనలో రాయపూర్ లోని శ్రీ క్రిష్ణ బలరామ దేవాలయాన్ని తప్పక చూడాలి. ఈ దేవాలయాన్ని ఇస్కాన్ లేదా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ క్రిష్ణ కాన్షస్ నెస్ నిర్మించింది. ఈ దేవాలయం బెంగుళూరు లోని ఇస్కాన్ దేవాలయాన్ని పోలి ఉంటుంది.

చిత్రకృప : Anil Chudasama

నృపతుంగ బెట్ట

నృపతుంగ బెట్ట

పర్యాటకులు నృపతుంగ బెట్ట ను తప్పక దర్శించాలి. ఇది ఉంకాళ్ హిల్స్ లో కలదు. ఇక్కడనుండి హుబ్లీ మరియు ధారవాడ నగరాలను చూడవచ్చు. దేవీ దేవాలయం నృపతుంగ బెట్ట పై కలదు. నృపతుంగ బెట్ట నగర జీవితంనుండి ప్రశాంతతను ఇస్తుంది. ఎంట్రీ ఫీజు రూ. 10 పెద్దలకు రూ.5 పిల్లలకు ఉంటుంది.

చిత్రకృప : Chetuln

నుగ్గికెరి హనుమాన్ దేవాలయం

నుగ్గికెరి హనుమాన్ దేవాలయం

హుబ్లీ నగర సందర్శనలో పర్యాటకులు నుగ్గికెరి హనుమాన్ దేవాలయం తప్పక చూడాలి. ఈ ప్రాంతంలో ఈ దేవాలయం ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ ప్రఖ్యాత సెయింట్ శ్రీ వ్యాసరాజు ప్రతిష్టించిన ఒక పురాతన దైవ విగ్రహం కూడా చూడవచ్చు.

చిత్రకృప : Drdlkoti

వాటర్ పార్క్

వాటర్ పార్క్

హుబ్లీ పర్యాటకులు హుబ్లీలోని రెండు వాటర్ పార్క్ లను దర్శించి ఎంతో ఆనందించవచ్చు. అవి ఒకటి మారుతి వాటర్ పార్క్ కాగా మరొకటి వాటర్ వరల్డ్. ఈ వాటర్ పార్క్ లో వాటర్ గేమ్స్ కూడా కలవు. ఇక్కడకల అనేక నీటి సంబంధిత ఆటలకు పిల్లలు బాగా ఆకర్షితులవుతారు.

సిద్ధారూఢ మఠం

సిద్ధారూఢ మఠం

హుబ్లీ నగరంలోని సిద్ధారూఢ మఠం ప్రసిద్ధి గాంచినది. ఈ మఠం శ్రీ సిద్ధారూఢ స్వామి పేరుతో స్ధాపించారు. సిద్ధారూఢ మఠం ఒక మతపర సంస్ధ. ఈ కేంద్రం నుండి స్వామి సిద్ధారూఢ బోధనలైన అద్వైత ఫిలాసఫీ వెలువడుతుంది. స్వామి భక్తులు చాలామంది రధోత్సవం, మహా శివరాత్రి వేడుకలలో ఇక్కడకు వస్తారు.

చిత్రకృప : Goudar

టూరిస్టులు హుబ్లీలో ఏం చూడాలి?

టూరిస్టులు హుబ్లీలో ఏం చూడాలి?

హుబ్లీ నుండి ధార్వాడ్, నవిల్ తీర్ధ, సత్తోడా, సోగళ్ళ మరియు మధోడా జలపాతాలు, సైక్స్ పాయింట్ మరియు ఉలావియా లకు పర్యాటకులు వెళ్ళవచ్చు. బీజపూర్, బీదర్, బాదామి, ఐమోళే, పటడకాల్, హంపి లకు వినోద యాత్రలు చేయవచ్చు.

చిత్రకృప : Moindll

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

రోడ్డు ప్రయాణం
హుబ్లీ మంగుళూరు, పూనే, మైసూరు, బెంగుళూరు, గోవా, ముంబై మొదలగు నగరాలతో రోడ్డు మార్గంలో సౌకర్యవంతంగా కలుపబడింది. ఓల్వో, ప్రయివేటు, లేదా ప్రభుత్వ బస్సులు తరచుగా అన్ని నగరాలనుండి హుబ్లీకి నడుస్తాయి.

రైలు మార్గం
హుబ్లీలో రైలు స్టేషన్ కలదు. సిటీ కి సుమారు 4 కి.మీ. దూరం. ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలకు కలుపబడింది.

విమాన మార్గం
హుబ్లీ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు కలుపబడి ఉంది. సిటీ కేంద్రం నుండి 7 కి.మీ.ల దూరం. గోవాలోని డబోలిం విమానాశ్రయం అతి సమీప అంతర్జాతీయ విమానాశ్రయం. 186 కి.మీ.ల దూరంలో కలదు.

చిత్రకృప : Goudar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X