Search
  • Follow NativePlanet
Share
» »నమ్మ మెట్రో గురించి తెలుసుకోవలసిన 18 ఆసక్తికర విషయాలు !

నమ్మ మెట్రో గురించి తెలుసుకోవలసిన 18 ఆసక్తికర విషయాలు !

By Mohammad

'నమ్మ మెట్రో' బెంగళూరు మహానగరానికి ఒక గొప్ప ఆకర్షణ. ఆల్రెడీ అభివృద్ధి చెందిన మహానగరంలో రైల్వే ట్రాక్ లను నిర్మించడం కాస్త కష్టమైన పనే ..! అయినా ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని, ట్రాఫిక్ ను తగ్గించటానికి, గమ్యస్థానాలకు వేగంగా, సులభంగా, శబ్ద కాలుష్యం లేకుండా సుఖవంతంగా ప్రయాణించ టానికి మెట్రో రైలు ప్రవేశపెట్టారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేత లాంఛనంగా ప్రారంబించబడ్డ ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ తన పనులను 24 జూన్ 2006 లో మొదలు పెట్టింది.

ఇది కూడా చదవండి : మోనో రైల్ వింతలు ... విశేషాలు !

ప్రస్తుతం ఫెస్ 1 అయిపోగోట్టుకొని పట్టాల మీద మెట్రో కూతపెడుతున్నది. నమ్మ మెట్రో గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను గమనిస్తే .. ! మోన్నీ మధ్యనే బెంగళూరు అండర్ గ్రౌండ్ మెట్రో కారిడార్ దక్షిణ భారతేశంలోనే మొట్టమొదటి అండర్ గ్రౌండ్ మెట్రో రైలు ను నడపటానికి ప్రణాళిక లు సిద్ధం చేసుకున్నారు .. ఆల్రెడీ పనులు కూడా మొదలయ్యాయి ..! దీని వల్ల దశాబ్ద కాలంగా ట్రాఫిక్ తో, వాయు కాలుష్యం తో నానా అవస్థలు పడుతున్న పట్టణ ప్రజానీకానికి కాసింత బాధలు తప్పనున్నాయి.

నమ్మ మెట్రో

నమ్మ మెట్రో

'నమ్మ' అంటే కన్నడలో అర్థం 'మా/ మా యొక్క' అని . 'మా మెట్రో' అని అర్థం వచ్చే ఈ సందేశం, యావత్ బెంగళూరు ప్రజల నోళ్ళలో కొన్ని సంవత్శరాల నుంచి నానుతూ వచ్చింది. నమ్మ మెట్రో ను 'బెంగళూరు మెట్రో' అని కూడా పిలుస్తారు.

చిత్ర కృప : Arjun Shekar

సంయుక్త అధ్వర్యంలో ..

సంయుక్త అధ్వర్యంలో ..

బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (బి ఎం ఆర్ సి ఎల్) ఒక ఎజెన్సీ. ఇది మెట్రో రైలు పనులను చేపట్టుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ మెట్రో రైలు కు కాలవసిన అనుమతులను, నిధులను సమకూరుస్తున్నది.

చిత్ర కృప : Ramnath Bhat

సౌత్ ఇండియాలో మొదటి అండర్ గ్రౌండ్ మెట్రో

సౌత్ ఇండియాలో మొదటి అండర్ గ్రౌండ్ మెట్రో

ట్రాఫిక్ సమస్యల నుంచి బయట పడేందుకు వీలుగా బెంగళూరు మెట్రో మరో ముందడుగు వేసింది. అదే భూగర్భ రైలు (అండర్ గ్రౌండ్ రైలు). అంటే రాతిని తొలిచి రైల్వే ట్రాక్ లను నిర్మించి భూగర్భంలో రైళ్ళను లగెత్తిస్తారన్న మాట ! ఏప్రిల్ 30 న పనులు ప్రారంభించారు.

చిత్ర కృప : Ashwin Kumar

భూగర్భ రైలు ఎక్కడెక్కడ ?

భూగర్భ రైలు ఎక్కడెక్కడ ?

42 కి. మి. ల లైన్ లో 5 కిలోమీటర్ల పొడవు భూగర్భంలో విధాన సౌధ తో పాటు బెంగళూరు లోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ ఊదారంగు లైన్ కొనసాగుతుంది. మైసూర్ రోడ్ నుంచి బైప్పనహళ్లి వరకు 18 కిలోమీటర్ల ప్రయాణం, 33 నిమిషాల సమయం పడుతుంది.

చిత్ర కృప : Her Kaleidoscope

ఏ ఏ సమయాల్లో !

ఏ ఏ సమయాల్లో !

భూగర్భ రైళ్ళు ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 వరకు ప్రతి 10 నిమిషాలకు ఒకటి ట్రాక్ ల మీదకు వస్తాయి.

చిత్ర కృప : likhidev

ఉదా మరియు ఆకుపచ్చ లైన్

ఉదా మరియు ఆకుపచ్చ లైన్

బెంగళూరు మెట్రో రెండు లైన్ లుగా కనెక్ట్ చేయబడ్డది. అందులో ఒకటేమో ఊదా లైన్ మరియు ఆకుపచ్చ లైన్. ఊదా లైన్ బెంగళూరు తూర్పు - పశ్చిమానికి కనెక్ట్ చేయబడింది మరియు ఉత్తర దక్షిణ కారిడార్ లను కలిపే లైన్ ను ఆకుపచ్చ లైన్ గా పిలుస్తారు.

చిత్ర కృప : SANTHOSH Kumar . N

ఫేస్ బై ఫేస్

ఫేస్ బై ఫేస్

బెంగళూరు మెట్రో ను మొత్తం మూడు దశల్లో పూర్తి చేస్తారు. ప్రస్తుతం ఫేస్ 1 పూర్తయ్యింది .. కూత కూడా మొదలుపెట్టింది. మిగితా ఫేస్ లు నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఒక్కో ఫేస్ ను నాలుగు గమ్యస్థానాలుగా రెండు అండర్ గ్రౌండ్ సెక్షన్ లతో విభజిస్తారు.

చిత్ర కృప : R E B E L TM®

పూర్తయిన ఊదా లైన్ (మొదటి దశ)

పూర్తయిన ఊదా లైన్ (మొదటి దశ)

అక్టోబర్ 20, 2011 న 6.7 కిలోమీటర్ల ఊదా లైన్ మొదటిసారిగా బెంగళూరు ప్రజల ముందుకువచ్చింది. మొదటి రూట్ బైప్పనహళ్లి నుండి ఎం జి రోడ్ వరకు. ఆతరువాత, మైసూర్ రోడ్ నుండి మగడి వరకు గల రూట్ ని 2015 లో ప్రారంభించారు. చివరగా మొదటి అండర్ గ్రౌండ్ కారిడార్ కబ్బన్ పార్క్ నుండి బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ వరకు 2016 లో ప్రారంభమైంది. ఊదా లైన్ ను 18. 22 కి. మి. వరకు విస్తరిస్తున్నారు.

చిత్ర కృప : Omshivaprakash H L

ఆకుపచ్చ లైన్

ఆకుపచ్చ లైన్

ఫేస్ 1 లోని గ్రీన్ లైన్ ను 3,3A, 3B, 4 మరియు 4A లుగా విభజించారు. మంత్రి స్క్వేర్ మాల్ నుండి నాగసంద్ర వరకు ట్రైల్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ నాటికి మెజెస్టిక్ తర్వాత ఉన్న దక్షిణ భాగంలోని రూట్లు పూర్తయ్యి ప్రజల అందుబాటులోకి వస్తాయని ప్రాజెక్ట్ అధికారుల ధీమా..!

చిత్ర కృప : Anil Wadghule

భూగర్భ కారిడార్లు

భూగర్భ కారిడార్లు

బెంగళూరు మెట్రో రెండు అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ లకు నడుం బిగించింది. అందులో భాగంగా మొదట 4. 8 కిలోమీటర్ల వరకు తూర్పు - పడమర కారిడార్ పనులను చేపట్టింది. గ్రీన్ లైన్ లో ఉన్న రెండవ భూగర్భ కారిడార్ పనులు (మెజిస్టిక్ - కె. ఆర్. మార్కెట్) 2016 డిసెంబర్ చివర ప్రారంభిస్తారు.

చిత్ర కృప : Rameshng

ఫేస్ 2

ఫేస్ 2

ఆల్రెడీ నిర్మాణం పూర్తి చేసుకున్న ట్రైల్స్ కు ఫేస్ 2 పొడగింపు. 72 కి. మీ ల పొడవుతో, 12 భూగర్భ టన్నెల్ లతో కూడిన ఫేస్ 2 ప్రాజెక్ట్ ఇప్పటికే పనులు ప్రారంభించింది.

చిత్ర కృప : Chris Hand

ఫేస్ 3 కు కాస్త బ్రేక్

ఫేస్ 3 కు కాస్త బ్రేక్

ఇది కాస్త లేట్ అవుతుంది. ఫేస్ 3 బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు మరియు నగరానికి అనుసంధానించబడి ఉంటుంది(40 కి.మీ) దీని పనులు మొదలు పెట్టాలంటే ముందు ఫేస్ 2 పనులు పూర్తవ్వాలి. అతరువాతే దీని పనుల మొదలవుతాయి.

చిత్ర కృప : John Roberts

నిలబడటానికి మొదటి ప్రాధాన్యత

నిలబడటానికి మొదటి ప్రాధాన్యత

ప్రస్తుతం బెంగళూరు మెట్రో రైళ్ళలో స్టాండ్ గేజ్ లను ఉపయోగిస్తున్నారు. ఈ రైళ్ళలో నిల్చోవటానికి స్థలం ఎక్కవగా మరియు కూర్చోవటానికి సీట్లు తక్కువగా (ఎదురెదురుగా) ఉంటాయి.

చిత్ర కృప : Parshotam Lal Tandon

ఉచిత వైఫై సౌకర్యం

ఉచిత వైఫై సౌకర్యం

నమ్మ మెట్రో రైళ్ళలో ప్రయాణం చేసే మొబైల్ వినియోగదారులు ఇది శుభవార్తే ..! బి ఎం ఆర్ సి ఎల్ ఇప్పుడు మెట్రో రైళ్ళలో, స్టేషన్ లలో, అండర్ గ్రౌండ్ టన్నెల్ లలో వై ఫై సౌకర్యాన్ని మరియు మొబైల్ కనెక్టివిటి ని అందిస్తున్నది.

చిత్ర కృప : Arjuna Rao Chavala

నీటి వినియోగం పై చొరవ

నీటి వినియోగం పై చొరవ

వర్షపు నీటి వినియోగం పై నమ్మ మెట్రో ప్రత్యేకమైన దృషి సారించింది. మెట్రో లైన్ లలో నీటిని సమీప మొక్కలకు, స్టేషన్ వద్ద నాటిన మొక్కలకు, సమీప గార్డెన్ , పార్క్ లకు వినియోగిస్తున్నది.

చిత్ర కృప : Arjuna Rao Chavala

నమ్మ మెట్రో టికెట్ లు

నమ్మ మెట్రో టికెట్ లు

నమ్మ మెట్రో లో ఆటోమేటెడ్ మిషెన్ ల ద్వారా టికెట్ లను జారీ చేస్తారు. టికెట్ అంటే ఏదో మన బస్సులో ప్రయాణిస్తే ఇస్తారు చూడు అలా అనుకొనేరు ..! టికెట్ లను టోకన్ ల రూపంలో మరియు కార్డు రూపంలో ఇస్తారు. టోకన్ టికెట్ ను ఒక్క ప్రయాణానికి, కార్డు టికెట్ ను ఎన్ని ప్రయాణాలకైనా ఉపయోగించవచ్చు.

చిత్ర కృప : shreyas91

మెట్రో వేగం

మెట్రో వేగం

నమ్మ మెట్రో స్పీడ్ గంటకి అత్యధికంగా 80 కిలోమీటర్లు. కానీ ఇవి గంటకి 65 కిలోమీటర్లసగటు వేగంతో పరుగులు పెడతాయి.

చిత్ర కృప : Roxtec Group

వికలాంగుల కొరకు సౌకర్యాలు

వికలాంగుల కొరకు సౌకర్యాలు

మెట్రో రైలు వికలాంగుల కొరకు, వృద్ధుల కొరకు కొన్ని సౌకర్యాలను అందుబాటులో తెచ్చాయి. అధునాతన రాంప్ లు మరియు లిఫ్ట్ లు వారికోసమై ప్రత్యేకంగా కేటాయించింది. వీల్ చైర్ ను కూడా కొన్ని సందర్భాల్లో అమలు పరుస్తున్నారు.

చిత్ర కృప : Rameshng

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X