» »ఐ ఆర్ సి టి సి తో వేసవి కూల్ ..కూల్ గా !

ఐ ఆర్ సి టి సి తో వేసవి కూల్ ..కూల్ గా !

Posted By: Super Admin

LATEST: సర్పరూపంలో శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చేఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

కాశ్మీర్ లో అందాలే కాదు అద్భుతాలు.. దాగున్నాయి !

ఇంకా మే నెల రానేలేదు ... అప్పుడే భానుడు భగ భగ మంటూ ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక ఈ సమయాన ఎవ్వరైనా ఆలోచించేది టూర్ లకి పోదామని ..! ఇప్పుడైతే పిల్లలకి పరీక్షల సమయం కాబట్టి, పరీక్షలకు అయిపోయిన తరువాత వేసవి సెలవులను గడపటానికి ఏదైనా హిల్ స్టేషన్ లేదా చల్లని ప్రదేశాల వైపు ఆసక్తిని చూపిస్తుంటారు కుటుంబసభ్యులు. ఇందుకోసమై ఐ ఆర్ సి టి సి ఒక సరికొత్త ప్రణాళికతో మీ ముందుకొచ్చింది.

ఇది కూడా చదవండి : ఉల్లాస పరిచే ఊటీ రైలు ప్రయాణం !

ఐ ఆర్ సి టి సి (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్) వేసవి సెలవులలో చల్లటి ప్రదేశాలలో సేద తీరాలనుకుంటున్న వారికి కొన్ని టూర్ ప్యాకేజీ లను ప్రకటించింది. ఇవి అందరికీ అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజీ యాత్రలన్నీ ఉత్తర భారత దేశానికి సంభంధించినది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రారంభమయ్యే ఈ టూర్ ఎలా ఉంటుందో .. ఎన్ని రోజులు గడపాలో .. ఏమేమి చూడవచ్చో ...
అనే వివరాల్లో కి వెళితే ...

ఇది కూడా చదవండి : నిండు గోదావరి లా ... గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం !

ట్రిప్ ఎలా సాగుతుంది ?

ట్రిప్ ఎలా సాగుతుంది ?

ఐ ఆర్ సి టి సి ప్రటించిన టూర్ ప్యాకేజీలన్ని జమ్మూ, శ్రీనగర్, న్యూ జల్ పాయ్ గురి మరియు సిమ్లా ల నుండి ప్రారంభమవుతాయి.

చిత్ర కృప : Maharajas' Express

టికెట్ తీసుకోవాలా ?

టికెట్ తీసుకోవాలా ?

సికింద్రాబాద్ నుండి మీరు ఎక్కడైతే పర్యటన ప్రారంభిస్తారో అక్కడి వరకు రైలు /విమాన/ బస్సు టికెట్ ను ప్రయాణీకులే/ పర్యాటకులే భరించాల్సి ఉంటుంది. టూర్ మొదలైతే, జేబు నుండి డబ్బులు తీయాల్సిన అవసరం లేదు.

చిత్ర కృప : Simon Pielow

ఏ రైళ్లు ఉండబోతున్నాయి ??

ఏ రైళ్లు ఉండబోతున్నాయి ??

పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకై ఐఆర్ సిటిసి ప్రత్యేకమైన రైళ్లను ప్రవేశపెట్టింది. విలాసవంతమైన ఢిల్లీ నుండి సాగే 'మహారాజా ఎక్స్‌ప్రెస్' రైలు యాత్రనూ ప్యాకేజీలో భాగంగా అందుబాటులో తీసుకువచ్చింది.

ఇది కూడా చదవండి : జీవితంలో ఒక్కసారైనా ఎక్కలనుకొనే రైలు ... మహారాజా ఎక్స్‌ప్రెస్ !

చిత్ర కృప : Maharajas' Express

యాత్రల వివరాలు

యాత్రల వివరాలు

ఐఆర్ సిటిసి మొత్తం 5 యాత్రలను ప్రకటించింది. అవి ఇలా ఉన్నాయి.

జమ్మూ నుంచి ఒక టూర్ ప్యాకేజీ

శ్రీనగర్ నుంచి రెండు టూర్ ప్యాకేజీలు

న్యూ జల్ పాయ్ గురి/ బాగ్దోగ్రా నుంచి ఒక టూర్ ప్యాకేజీ

సిమ్లా నుండి ఒక టూర్ ప్యాకేజీ

చిత్ర కృప : Peter

జమ్మూ నుంచి యాత్ర

జమ్మూ నుంచి యాత్ర

జమ్మూ నుంచి మొదలయ్యి ... కట్రా, శ్రీనగర్, గుల్‌మార్గ్ వరకు చేరుకోవటం. ఆతరువాత సోనామార్గ్, పహల్గామ్ సందర్శన అనంతరం తిరిగి జమ్మూ చేరుకోవటం.

ప్రయాణ రోజులు : 9 రోజులు

టూర్ ప్యాకేజీ ఖర్చు : 9 రోజుల యాత్రకు ఒక్కొక్క యాత్రికుడు రూ. 15, 890 లు చెల్లించాలి. అదే 8 రోజుల టూర్ ప్యాకేజీకి రూ. 15, 020 లు చెల్లించినా సరిపోతుంది.

ఇది కూడా చదవండి : కాశ్మీర్ సందర్శనలో అద్భుత ప్రదేశాలు !

చిత్ర కృప : Vinayaraj

శ్రీనగర్ నుంచి మొదలయ్యే యాత్ర

శ్రీనగర్ నుంచి మొదలయ్యే యాత్ర

మొదటిది

శ్రీనగర్ - గుల్‌మార్గ్- సోనామార్గ్ - పహల్గామ్ - శ్రీనగర్ - కట్రా - జమ్మూ ప్రాంతాలను కలుపుతూ సాగే యాత్ర

ప్రయాణ రోజులు : 8 రోజులు

ప్రయాణ ఖర్చు : 8 రోజుల ఈ యాత్రకు ఒక్కొక్క పర్యాటకుడుకి అయ్యే ఖర్చు రూ. 14, 480 లు

ఇది కూడా చదవండి : మంత్రముగ్ధులను చేసే పహాల్గాం పర్యటన !

చిత్ర కృప : Rambonp love's all creatures of Universe.

శ్రీనగర్ నుంచి మొదలయ్యే యాత్ర

శ్రీనగర్ నుంచి మొదలయ్యే యాత్ర

రెండవది

శ్రీనగర్ - గుల్‌మార్గ్ - పహల్గామ్ - సోనామార్గ్ - శ్రీనగర్ ప్రాంతాలను కలుపుతూ సాగే రైలు యాత్ర

ప్రయాణ రోజులు : 6 రోజులు

ప్రయాణ ఖర్చు : 6 రోజుల పాటు సాగే ఈ రైలు యాత్రకు వెచ్చించవలసిన రొక్కము అక్షరాలా పదివేల తొమ్మిది వందల పది రూపాయలు మాత్రమే.

ఇది కూడా చదవండి : సోనామార్గ్ - కాశ్మీర్ రాష్ట్రానికి ద్వారం లాంటిది !

చిత్ర కృప : Saad Akhtar

న్యూ జల్ పాయ్ గురి నుంచి మొదలయ్యే యాత్ర

న్యూ జల్ పాయ్ గురి నుంచి మొదలయ్యే యాత్ర

న్యూ జల్ పాయ్ గురి / బాగ్దోగ్రా - డార్జిల్లింగ్ - పెల్లింగ్ - గాంగ్‌టక్ - కలింపాంగ్ ప్రాంతాలను కలుపుతూ సాగే ఈశాన్య భారతదేశ యాత్ర

ప్రయాణ రోజులు : 7 రోజులు

ప్రయాణ ఖర్చు : 7 రోజుల యాత్రకైతే రూ. 20, 217 లు చెల్లించినా సరిపోతుంది. ఇదే మార్గంలో 6 రోజుల యాత్రకైతే రూ. 16, 001 చెల్లించాల్సి వస్తుంది.

ఇది కూడా చదవండి : అపురూప అందాల హిల్ స్టేషన్ - డార్జీలింగ్ !

చిత్ర కృప : RM Photography

సిమ్లా నుంచి సాగే యాత్ర

సిమ్లా నుంచి సాగే యాత్ర

సిమ్లా - కుఫ్రీ- కుల్లు - మనాలి - రోహతాంగ్ మరియు పాస్ - చండీఘడ్ ప్రాంతాలను కలుపుతూ సాగే రైలు యాత్ర

ప్రయాణ రోజులు : 9 రోజులు

ప్రయాణ ఖర్చు : 9 రోజుల పాటు సాగే సిమ్లా యాత్ర కు ఒక్కొక్కరికి అయ్యే ఖర్చు రూ. 11, 740 లు.

ఇది కూడా చదవండి : కుఫ్రీ - చూడవలసిన ఒక ప్రదేశం !

చిత్ర కృప : vikas koshti

పూర్తి వివరాలకై సంప్రదించండి

పూర్తి వివరాలకై సంప్రదించండి

ప్రత్యేక యాత్రలతో పాటుగా స్టేషన్ లలో విశ్రాంతి గదులు, ఇతర సదుపాయాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ . ఐ ఆర్ సి టి సి టూరిజం. కామ్ వెబ్‌సైట్ ను చూడవచ్చు. హైదరాబాద్ ఐఆర్ సి టి సి జోనల్ కార్యాలయ ఫోన్ నెంబర్ 040 - 27702407 కు కాల్ చేసి సమాచారాన్ని పొందవచ్చు కూడా .. !

చిత్ర కృప : Bharadwaj Chandramouli

కర్నాటక సంపర్కర్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు

కర్నాటక సంపర్కర్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు

బెంగళూరు నుంచి ఢిల్లీ పర్యటన వరకు సాగే కర్నాటక సంపర్కర్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు పర్యటన ఎలా ఉంటుందో క్రింది ఆర్టికల్ చదవండి

బెంగళూరు టు ఢిల్లీ ... కే. కే. ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం

చిత్ర కృప : Sriram SN