» »ఇస్కాన్ దేవాలయాలలో కనిపించే అద్భుతదృశ్యాలు

ఇస్కాన్ దేవాలయాలలో కనిపించే అద్భుతదృశ్యాలు

Written By: Venkatakarunasri

ఇస్కాన్ దీనికి హరేకృష్ణ ఉద్యమం అనికూడా అంటారు. ఇస్కాన్ అనునది అంతర్జాతీయ కృష్ణ సమాజం. వీరు అంతర్జాతీయంగా భగవద్గీతా ప్రచారం, కృష్ణ తత్వములను భక్తి యోగములను ప్రచారము చేస్తుంటారు. భారతదేశమునందున ప్రతి ప్రధాన నగరములందున వీరి కృష్ణ మందిరములు కలవు. ఇస్కాన్ సంస్థ అనేక నగరాలలో రాధాకృష్ణ మందిరాలు నిర్మిస్తున్నది.

అధునాత, సంప్రదాయ శైలుల మేళవింపుతో నిర్మించిన ఈ ఆలయాలు చక్కని నిర్వహణతో ఆ వూళ్ళలో భక్తులకు, పర్యాటకులకు సందర్శనా స్థలాలుగా గుర్తింపు పొందుతున్నాయి. ప్రపంచ దేశాలతో పాటుగా మనదేశంలో కూడా ఇస్కాన్ సంస్థ వారు దాదాపు అన్ని ముఖ్య నగరాలలో ఇస్కాన్ ఆలయాలను నిర్మించారు. అంతే కాక రెండవ రకం నగరాలలో కూడా నిర్మాణాలు చేపట్టుతున్నారు. ఈ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి విశేషాలెంటి అనే విషయానికివస్తే...

హరే రామ హరే కృష్ణ.. హరే రామ హరే కృష్ణ...' శ్రీకృష్ణుని భక్తి ప్రపత్తులలో ఓలలాడుతున్న భక్తజనం అంతటా కనిపిస్తారు. భక్తి భావనలో బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయిన తులసిమాల ధారులు గీతాకారుని లీలలను కొనియాడే క్రమంలో ఆడుతూ, పాడుతూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతుంటారు. ఇది అంతర్జాతీయ కృష్ణ తత్వ సమాఖ్య దేవాలయం అదేనండి .. ఇస్కాన్ దేవాలయంలో కనిపించే అద్భుత దృశ్యమిది.

ఇస్కాన్ దేవాలయములు

ఇస్కాన్ దేవాలయములు

ముంబై

ఇక్కడ ఇస్కాన్ దేవాలయములు రెండు చోట్ల ఉన్నవి. ఒకటి జూహూ ప్రాంతములో సముద్ర తీరమునకు దగ్గరలో. మరొక దేవాలయము గిర్‌గావ్ సముద్ర తీరము దగ్గర (మరైన్ డ్రైవ్‌కు దగ్గరలో). ముంబాయి లోకల్ రైల్వే స్టేషన్లలో ఇస్కాన్ కార్యకర్తలు వారు ప్రచురించిన కృష్ణ సాహిత్యాన్ని అమ్ముతూ తరచూ కనిపిస్తూ ఉంటారు.

ఇస్కాన్ దేవాలయములు

ఇస్కాన్ దేవాలయములు

బృందావనం

బృందావనం లోని ఇస్కాన్ ఆలయాన్ని కృష్ణ బలరామ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం సరిగ్గా శ్రీకృష్ణుడు తన తోటి పిల్లలతో ఎక్కడైతే ఆడుకున్నాడో అక్కడే ఉంది. ఈ ప్రదేశం ఆధ్యాత్మికత భావంతో నిండి ఉంటుంది. ఈ ఆలయంలో భక్తులు భగవద్గీత మరియు ఇతర పురాణాలను చదువుతుంటారు.

ఇస్కాన్ దేవాలయములు

ఇస్కాన్ దేవాలయములు

మాయాపూర్

మాయాపూర్ లో ఇస్కాన్ ఆలయం వివిధ శైలులు, అవతారాలు, భంగిమలతో కూడిన విగ్రహాలు కలిగి ఉంది. ఈ పెద్ద ప్రాంగణంలో అనేక ఆలయాలు ఉన్నాయి. ఒక పెద్ద తామర జలపాత విగ్రహం, ప్రధాన ఆలయాలలో ఒకదాని ప్రవేశద్వారాన్ని అలంకరించింది. ఈ ఆలయ ప్రాంగణ మధ్యలో ఉన్న పెద్ద తోట ఉంది.

ఇస్కాన్ దేవాలయములు

ఇస్కాన్ దేవాలయములు

ఢిల్లీ

ఇస్కాన్ దేవాలయం, శ్రీ రాధా పార్థసారథి మందిరంగా కూడ పిలిచే న్యూఢిల్లీ లోని రాధాకృష్ణుల ప్రసిద్ధ ఆలయం. తూర్పు న్యూడిల్లి కైలాష్ ప్రాంతంలోని అందమైన పచ్చని హరే కృష్ణ కొండల పైన ఉన్న ఈ దేవాలయాన్ని స్థాపించారు. దేశంలోని అతి పెద్ద దేవాలయ ప్రాంగణాలలో ఈ ప్రత్యేక మందిరం ఒకటి. ఢిల్లీ లోని ఏ ప్రాంతం నుండైన సులువుగా చేరగలిగే ఈ దేవాలయం ప్రతి రోజు ఉదయం 4.30 నుండి రాత్రి 9.15 వరకు తెరిచి ఉంటుంది.

ఇస్కాన్ దేవాలయములు

ఇస్కాన్ దేవాలయములు

హైదరాబాదు

హైదరాబాదు లో ఇస్కాన్ దేవాలయం అబిడ్స్ కూడలి నుండి, నాంపల్లి స్టేషనుకు వెళ్ళే దారిలో ఉన్నది. హైదరాబాదు ముఖ్య తపాలా కార్యాలయము నకు అతి చేరువలో, వీధిలో కనిపిస్తుంది. ఆలయము కట్టుటకు, స్థలమును ప్రముఖ స్వీట్ దుకాణం పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డి దానం చేశారు. నిత్యం శ్రీకృష్ణుని కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతూ ఉంటుంది.

ఇస్కాన్ దేవాలయములు

ఇస్కాన్ దేవాలయములు

రాజమండ్రి

ఇస్కాన్ శ్రీ కృష్ణ దేవాలయం గోదావరీ నదీతీరములో జీవిత సభ్యుల సభ్యత్వరుసుములతో మరియు భక్తుల నుండి విరాళాలతో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇస్కాన్ వారు రాజమండ్రి లో ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. చాలా అందంగా ఉంటుంది. నగరంలోని దర్శనీయ ప్రదేశాలలో ఇది ఒకటి.

ఇస్కాన్ దేవాలయములు

ఇస్కాన్ దేవాలయములు

బెంగుళూరు

బెంగుళూరు లోని ఇస్కాన్ 1987 సెప్టెంబర్లో ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమయినది. పదకొండు ఎకరాల స్థలంలో 1990 - 1997 సంవత్సరాల మధ్య గుడి నిర్మాణం జరిగింది.ఇక్కడ బంగారు పూతతో ఉన్న ద్వజస్థంభం, 56 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తయినది. అంతేకాక 36 x 18 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన బంగారు పూత కలిగిన గోపురం ప్రపంచంలోనే అతి పెద్దది.

ఇస్కాన్ దేవాలయములు

ఇస్కాన్ దేవాలయములు

తిరుపతి

తిరుపతి పుణ్య క్షేత్రములో, కపిలతిర్థమ్ జలపాతం ఉన్న ప్రాంతమునకు దగ్గరలో ఇస్కాన్ కృష్ణ దేవాలయము ఉన్నది. ఇక్కడ ఈ ఆలయము ఇస్కాన్ ఆలయముగా ప్రసిద్ధి చెందినది. ఆలయము చుట్టూ పచ్చిక బయళ్ళు తయారు చేసి సందర్శకులకు చూడచక్కని ప్రదేశముగా తయారు చేశారు. తిరుపతి రైల్వే స్టేషను నుండి ఆటోలో ఈ దేవాలయమునకు వెళ్ళవచ్చును. తిరుమల తిరుపతి దేవస్థానము వారు ప్రతి రోజూ ఆలయ దర్శనము యాత్రలో ఈ అలయాన్ని చూపిస్తారు.

ఇస్కాన్ దేవాలయములు

ఇస్కాన్ దేవాలయములు

పెనుకొండ

పెనుకొండ కొండపై ఇస్కాన్‌ టెంపుల్‌ సంస్థ ఆధ్వర్యంలో రూ.100కోట్ల వ్యయంతో బంగారు ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయం సుమారుగా 150 ఎకరాల పైనే కడుతున్నారు. బెంగళూరుకు చెందిన అరోరా ఇంటిగ్రేటెడ్‌ సిస్టమ్‌ కంపెనీ వారు దీని నిర్మాణానికి నడుంబిగించారు. ఇది గనక పూర్తయితే ఆ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మికంవైపు పరుగులు పెడుతుంది. అంతే కాకా ఆ ప్రాంతమూ అభివృద్ది చెందుతుంది.

ఇస్కాన్ దేవాలయములు

ఇస్కాన్ దేవాలయములు

అహమ్మదాబాద్‌

గుజరాత్‌ లోని అహమ్మదాబాద్‌ లో సర్ఖేజ్ గాంధీ నగర్ హైవే భోపాల్ క్రాసింగ్ వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్.

ఇస్కాన్ దేవాలయములు

ఇస్కాన్ దేవాలయములు

భువనేశ్వర్

ఒడిషా లోని భువనేశ్వర్ ఐ ఆర్ సి వద్ద ఉన్న శ్రీకృష్ణ బలరామ్ టెంపుల్ ఇస్కాన్.

ఇస్కాన్ దేవాలయములు

ఇస్కాన్ దేవాలయములు

చెన్నై

తమిళ నాడు లోని చెన్నై లోని చోళింగ నల్లూరు ఈస్ట్ కోస్ట్ రోడ్ లో ఉన్న భక్తి వేదాంత స్వామి రోడ్.

ఇస్కాన్ దేవాలయములు

ఇస్కాన్ దేవాలయములు

సూరత్

గుజరాత్ గంగాపుర్ సూరత్ - బర్దోలి రోడ్ వద్ద భక్తి వేదాంత రాజవిద్యాలయ ఇస్కాన్ ఆలయం.

ఇస్కాన్ దేవాలయములు

ఇస్కాన్ దేవాలయములు

గౌహతి

అస్సామ్ రాష్ట్రం గౌహతి ఉలూబారి చరాలి వద్ద ఉన్న ఇస్కాన్.