Search
  • Follow NativePlanet
Share
» »కల్ప - గొప్ప వారసత్వ సంపద !

కల్ప - గొప్ప వారసత్వ సంపద !

By Mohammad

కల్ప, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కన్నార్ జిల్లలో కలదు. సముద్ర మట్టానికి 2500 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ గ్రామం. సాహసికులు, యాత్రికులు అందమైన వ్యూ పాయింట్ లను, లోయలను, ఎత్తైన మంచు శిఖరాలను, రాతి గుండా ప్రవహించే సట్లేజ్ నది దృశ్యాలను తిలకించవచ్చు .

ఇది కూడా చదవండి : నరకంద - హరితవనాల అద్భుతం !

కిన్నార్ కైలాష్ పర్వతం కల్ప యొక్క ప్రధాన ఆకర్షణ. ఈ పర్వతం పై 70 మీటర్ల పొడవైన శివలింగం ఉంటుంది. దేశంలోని పర్యాటకులు ఈ లింగాన్ని దర్శించు కోవటానికి వస్తుంటారు. షాపింగ్ చేసుకోవటానికి, చక్కటి వ్యూ పాయింట్ లలో ఫోటోలు దిగటానికి ఈ గ్రామం అనువైనది. సంప్రదాయానికి ఈ గ్రామం పేరుగాంచినది.

సూసైడ్ పాయింట్

సూసైడ్ పాయింట్

చిత్ర కృప : Bharat Bhagat

సందర్శించు స్థలాలు

సూసైడ్ పాయింట్ (ఆత్మహత్యల ప్రదేశం)

ప్రసిద్ధ ఆపిల్ తోటల నుండి కేవలం 10 నిమిషాలలో చేరుకొనేంత దూరంలో ఉంటుంది ఈ సూసైడ్ పాయింట్. ఇది కల్ప లో ప్రముఖ దర్శనీయ స్థలాలలో ఒకటి. ప్రమాదకరమైన కందకం, నిలువు వాలు ప్రదేశాలు ఈ ప్రాంతం యొక్క ప్రత్యేక ఆకర్షణలు.

కిన్నార్ కైలాష్ పర్వతం

కిన్నార్ కైలాష్ పర్వతం సముద్ర మట్టానికి 6000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది కల్ప లో ప్రముఖ పర్వత శిఖరం. ఈ శిఖరం పైన 70 మీటర్ల పొడవైన శివలింగం పర్యాటకులను మరియు యాత్రికులను ఆకర్షిస్తున్నది. బౌద్ధు లకి కూడా ఈ పర్వతం మతపరమైన విశిష్టత ను కలిగి ఉన్నది.

కిన్నార్ కైలాష్ పర్వతం

కిన్నార్ కైలాష్ పర్వతం

చిత్ర కృప : telugu native planet

సంగ్లా లోయ

సంగ్లా లోయ అందమైన వంకలు తిరిగే వాగుల మధ్య భాష్ప నది ఒడ్డున ఉన్నది. సముద్ర మట్టానికి 8900 అడుగుల ఎత్తులో ఉంటుంది. మంచు చే కప్పబడిన పర్వతాలు మరియు అందమైన పచ్చిక బయళ్ళు ఈ ప్రదేశ అందాలని మరింత పెంచుతున్నాయి. లోయకు దగ్గరగా ఉన్న పర్యాటక ఆకర్షనలలో కొన్ని కమరు కోట, కిల్బ, సప్ని, రక్చం మరియు నాగ ఆలయం.

సంగ్లా లోయ

సంగ్లా లోయ

చిత్ర కృప : telugu native planet

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్, కల్ప లో అత్యంత పాచుర్యం పొందిన సాహస క్రీడ. రెకాంగ్ పియొ ట్రెక్కింగ్ కు అనువైనది. అక్కడి నుండి సమీప పట్టణాలకు, లోయలకు, పర్వతాలకు ట్రెక్కింగ్ చేయవచ్చు. ట్రెక్కింగ్ లో నదీ ప్రవాహాలు, అందమైన దేవదారు, పైన్ చెట్లు, యాపిల్ తోటలు గమనించవచ్చు.

చక

చక, కల్ప సమీపంలోని పర్వత శిఖరం. ఇది సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులోనే ఉంటుంది కాబట్టి ట్రెక్కింగ్ కు సూచించదగింది. కొండ పై కి చేరుకోవటానికి 2-3 గంటల సమయం మరియు కింద కు చేరుకోవటానికి 2 గంటల సమయం పడుతుంది. పర్యాటకులు ఈ ప్రాంతం యొక్క సహజ అందాలను అనుభవించాలంటే ఉదయం పూట బయలుదేరాలి.

చక పర్వత శిఖరం

చక పర్వత శిఖరం

చిత్ర కృప : manisha manisha

కల్ప ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

సిమ్లా విమానాశ్రయం కల్ప కు 250 కి. మీ ల దూరంలో కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి కల్ప చేరుకోవచ్చు

రైలు మార్గం

కల్ప కు సమీపాన సిమ్లా రైల్వే స్టేషన్ కలదు. ఢిల్లీ, చండీఘర్, గోరఖ్పూర్, లక్నో ల నుండి ఇక్కడికి రైళ్ళు వస్తుంటాయి. స్టేషన్ బయట క్యాబ్ వీలైతే బస్సు లో ఎక్కి గమ్య స్థానానికి చేరుకోవచ్చు

బస్సు / రోడ్డు మార్గం

సిమ్లా మరియు రాంపూర్ వంటి సమీపంలోని నగరాలు నుండి కల్పకు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ బస్సులు, లభ్యమవుతాయి. పర్యాటకులకు వేసవి కాలంలో మాత్రమే తెరవబడే రోహతంగ్ కనుమ నుండి కూడా బస్సులు లభిస్తాయి.

రెకాంగ్ పియొ, కల్ప

రెకాంగ్ పియొ, కల్ప

చిత్ర కృప : telugu native planet

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X